పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16470

  1. రెక్కిటికీ గురించి ns murty అభిప్రాయం:

    04/18/2016 3:50 pm

    వాసుదేవరావు గారూ,
    “కులుకులకు కుచ్చిళ్ళు సర్దుతూ”

    “కంద దురదా కత్తిపీట దురదా
    కలిపి కళ్ళకద్దుకుని
    నాలుకకు రాసుకున్న వాణ్ణి”
    ….

    ఇలాంటి సరదా కవితలకి ధ్వని, చమత్కారం, క్లుప్తత అలంకారం. మీ కవితకి ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి. అభివాదములతో

  2. చరమరాత్రి గురించి కొల్లి సనత్ కుమార్ అభిప్రాయం:

    04/17/2016 9:03 am

    చాలా బాగుంది

  3. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి mallika అభిప్రాయం:

    04/15/2016 6:11 am

    Muppu ghatinchi veeni kulamun, kalimin kabalinchi dehamun
    pippi yonarchu nee bharataveeruni paadamu kandakunda
    cheppulu gutti jeevanamu seyunu gaani niraakarinpale
    deppudu appuvaddadi sumee bahrataavani veeni sevakun

    Gurram Jashua

    I was reading a poem by Jashuagaru. I can understand the poem perfectly beginning from the word “paadamu kandakunda cheppulu kutti”, and till the end of the poem.

    But can someone summarize the first two lines. I can make out the meaning of the first two lines to an extent. I will be very thankful if someone can help.

  4. నాన్నా తెలుసా గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:

    04/13/2016 11:29 pm

    ఇంత మంచి, సున్నిత మైన కవిత చూడలేదండి . చాలా బాగుంది.

  5. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి trinath అభిప్రాయం:

    04/12/2016 6:49 am

    దయచెసి పదవ తరగతిలొ ఆ పాఠం పేరు చెప్పగలరు. @ aravind garu

  6. నిప్పులు గురించి జగదీష్ కొచ్చెర్లకోట అభిప్రాయం:

    04/11/2016 3:09 pm

    వాటంతటవే ఆరపోతాయి నిప్పులు….అద్భుతం.

  7. ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    04/11/2016 12:24 pm

    చారులత పూర్తి సినిమాని Youtube లో ఇక్కడ చూడవచ్చు!

    https://www.youtube.com/watch?v=EtpivRiw1W8

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  8. నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి lyla yerneni అభిప్రాయం:

    04/10/2016 1:34 pm

    “కలకంఠీ అంటే N. of sev. birds. అని ఆంధ్రభారతి సంస్కృత నిఘంటువులో ఉన్నది.”
    “ఇందులో మరుత్కుమారుడు అంటే పిల్లగాలి అని నేను అర్థము చేసికొన్నాను.” – మోహన

    I guess ‘పిల్లగాలి’లో పిల్ల does not mean girl. I guess, పిల్లగాలి simply means breeze as opposed to a tornado, or typhoon. అలాటి విసురుగాలి ఐతే అక్కడ ఆ వసురాజు తోటలో పూలూ, ఆకులూ, చెట్లు, మహా వృక్షాలు కూడా ఉండవు.

    కలకంఠి అంటే కల నాదములు చేయునది. మధుర స్వనములు చేయునది. అవ్యక్త మధుర స్వరము కలిగినది – ఇలాటి అర్ధములు చెప్పబడినవి. అని. స్త్రీ పరంగా ఎక్కువ వాడినా అందరు ఆడవాళ్ళూ కలకంఠులు కారు. కఠోర కంఠులుంటారు. కవి కలకంఠీ! అని వాడితే ఆ ఆడుది మృదుమధురంగా మాట్లాడుతుందని. అట్టి కలకంఠులను మీరు ఏ తోటలోనూ, వసంత సమయంలో కలిసి యుండలేదా? 

    అలాగే పక్షులన్నీ కలకంఠులు కావు. Singing birds ను సేకరించే వ్యాపారస్తులున్నారు. వారి వద్ద కొనుక్కుని, తమ తోటల్లో పెంచుకునే వారున్నారు. వెదురు గొట్టాలు, వీణలు, గంటలు ఇవి అన్నీ కలకంఠులుగా మారొచ్చు, గాలి తాకులకైనా, సంగీతకారుడు వాడినా.

    ఇక్కడ చర్చిస్తున్న పద్యంలో -అది వసురాజు తోట. అది వసంత వర్ణనం. వసుచరిత్రలోని అక్కడి పద్యాలలో, కవి వసంతుడికీ, గాలికీ ఉండే సంబంధాలు మారుస్తూనే ఉన్నాడు. కలకంఠి ప్రయోగం లోని అర్థాలు కూడా మారుస్తున్నాడు.
    నేనూ ఆంధ్ర భారతి చదువుతున్నాను. ‘చంద్రికా పరిణయము’ ఒక పీఠిక అక్కడ చదువుతున్నాను. అందులో చంద్రికా పరిణయం నుండి కొన్ని పద్యాలు, వసుచరిత్ర లో పద్యాలు కొన్ని, చాలా దగ్గర పోలికలున్నవి ఇచ్చారు. ఎవరు బాగా రాసారు అనేది పాఠకులనే తేల్చుకోమని. ఇచ్చిన పద్యాల వరకే చూసినా, నాకు ‘వసుచరిత్ర’ గెలిచినట్టనిపించింది. ఇక, ఈ మాట గ్రంథాలయంలో – దేశికాచారి గారుంచిన మరో పీఠిక, ‘చంద్రికా పరిణయం’ చదవాలి. అప్పుడు వసుచరిత్ర నాకింకొంచెం అర్థమవుతుంది.

    ఆంధ్ర భారతికి వెళ్లినా, ఈ పద్యం కోసం, మరుత్తులు ఏడుగురు, అందులో ఏడు లోకాల్లో విహరించే మరుత్తుల లో ఏ మరుత్తు ఇక్కడ విహరిస్తున్నాడని ఏ పురాణ కథ లోకో వెళ్లి నేను వెదకలేదు. చర్చలోని ఈ పద్యంలో, కవి పిల్లగాలి, మంద మారుతం అని ఉండొచ్చు. అనలేదు. అని ఉంటే మనం పువ్వులు, ఆకులు, గాలి – అంటూ gender-less, age non-specific interaction చూస్తాము. కాని కవి అలా అనలేదు. The poet attributes masculinity to the wind here. మరుత్కుమారుడు అన్నాడు.

    ఆ పవన కుమారు డొస్తే (హనుమంతుడు కాదు), వసంతుడితో పాటు తోటల్లో ఆడే స్నేహితుడు, పవనుడొస్తే –ఉయ్యాలూపుతున్నారు ఆ స్త్రీలంతా అని, కవి భావన. తేనెలు తాపినా, తేనెల్లో ముంచినా, పువ్వుల్లో పొదిగినా, ఆకుల్లో ఊపినా, ఉయ్యాల పాటలు పాడినా అన్నీ -చెట్లు, మొక్కలు, తీవెలు, పొదల సొంత మర్యాదలే, సయ్యాటలే. రసం శృంగారం. సలిపేవి వసంత సమయపు శృంగార క్రీడలు.

    అడివి బాపిరాజు ‘అడివి శాంతి శ్రీ’ లో వసంత సమయం వేడుకలు ఎంత చక్కగా రచించాడు! అందులో, రాజకుమారుడిని, వసంతుడుగా (సంగీతం పోటీ పరీక్షలో గెలిచినందుకు) అక్కడివారు ఎన్నుకుంటే, అతడు మలయ పవన దేవుడిని, భృంగ దేవుడిని ఎన్నుకుంటాడు. ‘వనరమ’ గా ఒక రాకుమారిని ఎన్నుకుంటాడు.

    జోల అంటే ఉయ్యాల. ఉయ్యాల పాటలన్నీ పసిపిల్లలకూ, వారిని నిద్ర పుచ్చటానికీ కాదు. Individual gardens లోనూ, పూర్వీకుల/ ఇప్పటి వారి ఇళ్ల లోనూ, బల్ల ఉయ్యాలలు adults కోసం ఉండవూ? What about those nice big hammocks in country houses and beach resorts? వసంత సమయంలో ఉయ్యాలలలో కృష్ణుడు, ఇతర వనితలు వర్ణ చిత్రాలెన్నో ఉన్నాయి. రాముడి కోసం బాలుడిగా ఉన్నప్పుడు పాడే జోలపాటలూ, రాజయ్యాక పాడే మేలుకొలుపు, శయనింపు పాటలు ఒకే లాగా ఉండవు కదా.’ జో! అచ్యుతానంద’ చిన్న పిల్లలకు పాడటం తెలుగు వాళ్లకు అలవాటై, అది పరమాత్ముడికి ఒక కవి రాసిన పాట అనే తలపు మరుపున పడి పోయి ఉండొచ్చు.

    ఇంతకు ముందు నేనీ పద్యం గురించి రాసినప్పుడు, పాఠకులు ఒకరిద్దరు జోలపాటలని ఇక్కడా ఏవో సినిమా పాటలు వినిపించినట్టున్నారు. అన్నా చెల్లెళ్ల ఏడుప్పాటలు, పిల్లల జోల పాటలట!

    ఆ సినిమా పాటల్లో సావిత్రులు, న్. టి. రామారావులు -ఇద్దరూ తెలుగులో, తమిళులో, అక్కడొకరూ ఇక్కడొకరూ చెరో చంటి పిల్లని భుజాన్ని వేసుకుని దబిడీ దిబిడీ చిచ్చి కొడుతూ, ‘చందురుని మించి అందమొలికించు చిట్టిపాపాయివే’ అని ఏడుపు పాటలు పాడితే, అవి జోలపాటలవుతాయా? How Sad! ఆ ఏడుపు స్వరం పిల్లలకు ఎంత వేదన కలిగిస్తుంది. ఆ అమ్మా నాన్నల కన్నీళ్లు పిల్లల మీదే కారి పడుతున్నయి. ఆ ఏడుపేదో అవతలికి పోయి ఏడ్చుకుని, ఆ పిల్లలకు ఆనందపు స్వరంతో, పిల్లల పాటలు పాడి, వారితో ఆటలాడే వారిని ఏర్పాటు చెయ్యటం మంచిది అనిపించింది.

    తెలుగు సినిమాల్లో ఒక ఆనంద సమయంలో పాటనే, మరో విషాద సమయంలో టెంపో స్లో చేసి, ఏడుపు గొంతులతో పాడారు. అసహ్యకరమైన పని. పాటలకేదో కరువొచ్చినట్టు. Emotions, events, mess up చెయ్యటం. ఒక్క పాటనీ హాయిగా పాడుకోనివ్వరు. I really didn’t want to get in there. I don’t want to end my note on that kind of note. Leaves a bad taste in my mouth. అందుకని మధురంగా థ్వనించే పద్యాలున్న వసుచరిత్ర లోకే మళ్లీ వెళ్లి, ఇంకొన్ని పేజీలు తిప్పి వసురాజు వచ్చినపుడు ఆ తోట చేసిన మర్యాద ఎంత రమణీయంగా ఉన్నదో, ఇంకోసారి చదువుకుంటాను. ఎన్నో తెలివైన, అందమైన రచవలున్నయ్యి. ప్రపంచంలో ఇంకా చూడని సుందరత ఎంతైనా ఉంది. I am so eager to go get it.

    A beautiful year to all!

    Lyla

  9. రాగలహరి: శివరంజని గురించి తః తః అభిప్రాయం:

    04/09/2016 3:05 am

    “కనీసం ఈ రెండు వాక్యాల్లో, పై తెలుగు వాక్యాలలోలా పదానికొక అచ్చుతప్పు లేదు కదండీ? – సం’
    కన్నమ్మ కట్టు బట్టలు విప్పేసి పక్కింటమ్మకు పట్టుబట్టలు పెట్టినట్టుగా ఉన్న అభిప్రాయం మీద మీ వ్యాఖ్య చాలా సౌమ్యంగా ఉందండి . ఉత్తర అమెరికనులు ఇంగ్లిష్ ను చితకబాద లేదా . ఊత్తర అమెరికా రాజ్యాంగ అయిదవ సవరణ తరవాత ప్రచారంలోకి వచ్చిన , ‘The fifth’ ఇంగ్లిష్ ఇడియమా ,’The’ అన్న ఆర్టికిల్ ను దాని ముందు ఉంచినా తుంచినా ఆ మాట నాకు జిబరిషే .
    తః తః

  10. రాగలహరి: కల్యాణి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    04/06/2016 7:33 am

    తప్పుగా విరాజ్ జోషీ అని చెప్పాను!

    This clip is making the rounds as Bhimsen Joshi’s grandson’s. It’s actually Anubhab Khumaru a young amazing singer.

    https://www.youtube.com/watch?v=L_L2JGt0iQg

    విష్ణుభొట్ల లక్ష్మన్న