పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఎవరు చూడొచ్చేరు? గురించి haritha అభిప్రాయం:

    07/08/2016 3:50 am

    ఈ కవిత నాకు చాల నచ్చింది.

  2. కాగితపు అద్దం గురించి మోహన అభిప్రాయం:

    07/07/2016 9:45 am

    కవిత బావుంది. శీర్షికను కాగితపు”ట”ద్దము అని ఉంచితే బాగుంటుందేమో?
    విధేయుడు – మోహన

  3. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి రాజా పిడూరి అభిప్రాయం:

    07/06/2016 10:37 pm

    1) “అప్పుడప్పుడు, అక్కడక్కడ ఏ రామానుజన్ లాంటి వ్యక్తి అయినా తారసపడితే
    వారి ప్రతిభకి ఒక నమస్కారం పెట్టండి.”

    వేమూరి వారు ఎంత super-ultra ఆప్టిమిస్టో అనిపిస్తుంది పై వాక్యాలు చదివితే.
    ఎవరికైనా అప్పుడప్పుడు, అక్కడక్కడా ఏ రామానుజన్ లాంటి వ్యక్తో తారసపడడానికి –
    should one not live at least a few centuries ?

    2) ‘చంద్రశాఖా న్యాయం’ అంటే దురన్వయం వస్తుందేమో !
    శాఖాచంద్ర న్యాయం (చంద్రుడెక్కడ ఉన్నాడు అని అడిగితే కొమ్మల మధ్య ఉన్నాడు
    అని చెప్పేసి “ఓ రకమైన దారి చూపినట్లుగా”) అనేది సరైనది అనుకుంటాను.

    ఇంత తపన తో అమూల్యమైన విషయదానం చేస్తున్న వేమూరి వారికి కృతజ్ఞతలు.
    నమస్కారాలు.
    రాజా పిడూరి

  4. చిరుదీపం గురించి Subbaraju Sagiraju అభిప్రాయం:

    07/06/2016 3:11 pm

    చాలా బాగా వ్రాసారు, this is how the life of future parents in other countries

  5. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి A S Murthy అభిప్రాయం:

    07/06/2016 7:45 am

    వేమూరి వారికి నమస్సుమాంజలి,

    ఒకప్పుడు Early 90’s లో నాకెంతో ఇష్టమైన/కష్టమైన టాపిక్ చాలా సులభంగా ఒక వ్యాసం లాగా రాసినందుకు అభినందనలు, కొంతకాలం నేనూ కుస్తీ పడదామని ప్రయత్నించి వదిలేసేను, రాత్రుళ్ళు చాలా వృధా అయ్యేయి, మళ్ళీ కాస్సేపు పృఅయత్నిద్దాం అని ఆశ. ఇంతలో వైల్స్ గురించి తెల్సి హమ్మయ్య అని అనిపించింది, కాని మీరు ఆఖర్లో 7.4 లో అన్నట్టు ఫెర్మా ఉద్దేశ్యంలో ఇంకా సులభమైన ఋజువు ఉందేమోని నాకనిపిస్తోంది.

    ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి
    బెంగళూరు

  6. ముగ్గురు సాధువులు గురించి బి. పవన్ కుమార్ అభిప్రాయం:

    07/06/2016 7:39 am

    నేను ఈ కథను భమిడిపాటి కామేశ్వరరావు గారి అనూవాదమును రంగనాయకమ్మ గారి “టాలుస్టాయి జీవితం,సాహిత్యం” అనే పుస్తకంలో చదివాను.మీ అనువాదము కూడా బాగుంది. భక్తుడనేవాడు తనమనసులో తనకు తొచినట్టు ప్రార్థించుకుంటే చాలు, దానికి గురువులు అక్కరలేదనేది టాలుస్టాయి ఉద్దేశ్యం.

  7. పుస్తక పరిచయం: The Simpsons and Their Mathematical Secrets (2013) గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/05/2016 7:55 pm

    శ్రీనివాస్ గారూ,

    ఇక్కడ ఒకరు “మూ” మరొకరు “లూ” – వే’మూ’రి

  8. కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/05/2016 4:59 pm

    మాలవికాగ్నిమిత్రమ్‌ చదివేముందు, ముందుగా కథ తెలుసుకుందామని, “అమరచిత్రకథ” లో బొమ్మల కథని చదివి చూసేను. ఇతివృత్తం చాల క్లిష్టంగా ఉందనిపించి నా ప్రయత్నం మానుకున్నాను. కాని, ఇక్కడ శ్రీ భుజంగరాయశర్మ గారి ప్రసంగం విన్న తరువాత ఈ నాటకం చదవాలన్న కోరిక మళ్లా పుట్టింది. తరువాత రేడియో నాటిక విన్న తరువాత ఈ కోరిక ఇనుమడించింది.
    పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు!
    వేమూరి వేంకటేశ్వరరావు

  9. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/05/2016 9:31 am

    ధన్యవాదాలు. చివరి అధ్యాయం (అనగా వైల్స్ ఫెర్మా శిష్టాభిప్రాయాన్ని ఎలా ఋజువు చేసేరన్న విషయం) అర్థం చేసుకోవడం చాల కష్టం. అయినా, ఆ అధ్యాయాన్ని మరమ్మత్తు చేసి తిరగ రాస్తున్నాను. వైల్స్ కి ఏడేళ్లు పట్టింది! – వేమూరి

  10. కాగితపు అద్దం గురించి మధురశ్రీ అనంతపురము ఎ పి అభిప్రాయం:

    07/05/2016 6:08 am

    Jyotshna madam.

    అక్షరాల నీలి ఆకుల చుట్టూ మెత్తని పాటలు కడతావు. అన్న పదబంధం మీ ఉహ లో చాలా బాగా మెరిసింది మంచి కవితను రాసారు ధన్యవాదాలు సార్ ను మిమ్మల్ని ఇప్పుడు గుర్తు చేసుకొంటున్నాము.

    మధురశ్రీ అనంతపురము ఎ పి