మాన్యమిత్రులు శ్రీ కామేశ్వరరావు గారు ఎప్పటివలెనే ఒక అందమైన పద్యాన్ని పరిచయం చేసి ఈ వ్యాసంతో మరొక మంచి కవికి మరికొంతకాలం స్మరణీయతను కల్పించటం అభినందనీయమైన విషయం. వ్యాఖ్యానరీతితోపాటు వారి పద్యరథ్యాప్రయాణకథనం కూడా క్రమపరిగతితో ఆసక్తికరంగా సాగిపోయింది. తత్ప్రశంసానైపథ్యంతోనే రెండు మూడు ప్రాస్తావికాంశాలను ప్రస్తావిస్తున్నాను:
మొదటిది: మీరు పేర్కొన్నది కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రహంలో స్వీకరించిన పాఠం. అంతకు మునుపు సకలనీతిసమ్మతములో మడికి సింగన నీతిభూషణములోనిదిగా ఉదాహరించినప్పటి పాఠమూ ఇదే. రెండూ సరిగా లేవు.
శ్రీరామచంద్రుడు శరసంధానం చేసినప్పుడు సముద్రం ఘూర్ణిల్లినదే కాని, ఇంకిపోలేదు. ఇంకినట్లయితే సేతుబంధనమహాకార్యం సంభవించేదే కాదు. “రాఘవు” అన్న షష్ఠీ విభక్తి మూలాన “శరాగ్రమునందు” అన్నదానికి భావార్థకప్రత్యయాంతములైన శోషణ సంహార ధాతువులు రెండింటితోనూ అన్వయం సాధ్యం కాదు. అందువల్ల ఇది అపపాఠం. 1929 నాటి భైరవుని శ్రీరంగమహత్త్వము పీఠికలో శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు ఉదాహరించినట్లు
అన్నదే సరైన పాఠం. లంకానగరికి దారినివ్వలేదని ఆగ్రహించి, శరసంధానం చేసిన శ్రీరామచంద్రుని ఆ శరాగ్రమునందు (శరాగ్రమునందు – అన్నదానికి ‘శరాగ్రముచే’ అని తృతీయార్థకం చెప్పబడుతున్నది) సముద్రము (ఆకులవృత్తిన్=) వ్యాకులత్వాన్ని పొంది, తన క్షోభమును మాని, సర్వవస్తువులను తన గర్భంలోనికి విలీనం చేసికొనే స్వభావాన్ని మాని, గడ్డిపోచ కొసనున్న నీటిచుక్క వలె నిలిచిపోవటం; శరాగ్రముచే (అన్నది ఈ రెండు క్రియలతోనూ అన్వయిస్తుంది కనుక) రావణుడు మృతిచెందటం – వాల్మీకి గారే చెప్పకపోతే వట్టి మిథ్య కదా! అని సార్థకమైన క్రమాన్వయం.
ఇది శ్రీ రామకృష్ణకవిగారు సరిచేసిన పాఠమో, లేక వేరొక చోట ఈ విధంగా ఉదాహరింపబడినదో నాకు తెలియరాలేదు. ఏ తెలుగు పద్యాన్ని ఉదాహరింపవలసివచ్చినా విమర్శకులు ప్రామాణికస్థితి లేక స్వయంగా పాఠపరిష్కారం చేసికోవలసి ఉండటం మన సాహిత్యానికి పట్టిన శోచనీయమైన దుఃస్థితి.
రెండవ సంగతి: ఈ పద్యానికి మూలమైన బిల్హణుని విక్రమాంకదేవ చరిత్రలోని శ్లోకద్వయిని ముమ్మొదట జల్హణుడు తన సూక్తిముక్తావళిలో చేర్చుకొన్నాడు. బిల్హణుని రచనలను తొలిసారిగా శ్రీనాథుడు తన కృతులలోనూ, చాటువులలోనూ సమర్థంగా అనువదించుకొన్నాడు. అంతకు మునుపు తెలుగు కవులు తత్ప్రభావితులైనట్లు కనబడదు. చాటుకవులైతే సాధారణంగా సంధానగ్రంథాలలో నుంచి స్ఫూర్తిని పొందటం కనబడుతుంది. ఇదే భావంతో సంధానగ్రంథాలలో లభిస్తున్న బిల్హణుని శ్లోకాలను పోలిన మరికొన్నింటిని కూడా పరిశీలించి తెలుగు కవి తన పాఠాన్ని రూపొందించుకొని ఉండటం భావ్యమే. జల్హణుడిచ్చిన బిల్హణుని శ్లోకపాఠం ఇది:
లఙ్కాపతేః సఙ్కుచితం యశో యద్యత్కీర్తిపాత్రం రఘురాజపుత్రః
స సర్వ ఏవాదికవేః ప్రభావో న కోపనీయాః కవయః క్షితీన్ద్రైః.
పృథ్వీ(మహీ)పతేః సన్తి న యస్య పార్శ్వే కవీశ్వరా స్తస్య కుతో యశాంసి?
భూపాః కియన్తో న బభూవు రుర్వ్యా నామాపి జానాతి న కోఽపి యేషామ్.
మూడవ సంగతి: విక్రమాంకదేవ చరిత్రను తెలుగులో అనువాదం చేసినది శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, శ్రీ మాదిరాజు విశ్వనాథరావు గారలు. గొప్ప జంటకవులు. వీరి అనువాదం మొదట చిన్ని చిన్ని సంచికలుగా వనపర్తి సంస్థానం వారిచే ప్రకటింపబడింది. నా చిన్ననాడు వాటిని చదివాను. వాటిలో చాలా విలువైన సమాచారం ఉండింది. అది నేటి గ్రంథంలో లేదు. ఆ ప్రతులను సైతం ఎవరైనా సంపాదింపగలిగితే బాగుంటుంది. ఇప్పుడు అంతర్జాలంలో ఉంపబడిన 1974 నాటి ఆంధ్ర విక్రమాంకదేవ చరితములో పుటల క్రమం అవకతవకగా ఉన్నది. ఎవరైనా దయతో ఆ పుటల వరుసను సరిచేసి మళ్ళీ అందుబాటులోకి తేగలిగితే పాఠకులకు ఎంతో మేలు చేసినవారవుతారని విన్నపం.
శ్రీ మానవల్లి వారు ‘నీతిభూషణము’ను గురించి వ్రాసిన ప్రస్తావనలన్నీ జాగ్రత్తగా పరిశోధింపదగినవి. అది వేరే కథ.
ఈ కథ బాగుంది. కథనం కొంచెం పాకానపడే సరికి మనకు విషయం చూచాయగా అర్థం కావటం జరుగుతుంది. నవ్యత కారణంగా బాగుంది. భాషాపరంగా సరళంగానూ ఉంది.ఐతే కథానేపథ్యం కారణంగా అనివార్యంగా ఆంగ్లంలో హెచ్చు పదాలు పడ్డాయి కథలో – ఐనా అది ఇబ్బంది కాదిక్కడ. ఒక విమానప్రయాణంగా వర్ణించటం మాత్రం కొంచెం ఆశ్చర్యం కలిగించిది. ఐనా నా దృష్టిలో అది నూటికి నూరుశాతమూ నప్పినదని అనిపించలేదు. అదీ పెద్ద ఇబ్బంది లేదు కథనశైలి కారణంగా. మొత్తానికి మంచి కథ. రచయితకు అభినందనలు.
కామేశ్వరరావుగారు: చాలా బాగా రాసారు!!
విషయం, మీరిచ్చిన ఉదాహరణలు అన్నీ బాగా తెలిసినవే కానీ, మీరు తేలికైన భాషలో చెప్పిన విధానం చాలా బాగుంది. If time permits I’ll post a longish note later. You may like to check: Velcheru & Shulman’s “A Poem at the right moment” (1998) for an extensive discussion on this very subject. They also translated the verse: ఆకులవృత్తి రాఘవు …Also VNR had a close look at Madiki Singana’s “sakala niiti sammatam” in many of his papers/books. On a side note, recently there was a conference on “విక్రమాంకదేవచరిత్ర” and some of the papers were published in a leading journal. At last, the poem attributed to Horace is a very popular one, like our chaaTu verse :-). Just give the first 2-3 words from it in any search engine and see what kind of results you get :). But I really liked your reference to Grassman’s book, a good one. It was not an easy read for me 10-12 years ago, but at one time I was trying to read such works (Terry Eagleton’s How to Read a Poem, and Edward Hirsch’s similar titled work) hoping to get a better understanding and appreciation of poetry.
Regards,
Sreenivas
లలిత గారు: దిబ్బరొట్టి అబ్బాయి అన్నది Ginger Bread Boy అన్న ఒక పాశ్చాత్య కథ ఆధారంగా శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు – పిల్లలకోసం – రూపొందించిన ఒక మంచి సంగీత రూపకం. నేను గతంలో శ్రీ వంశీ మాగంటికి పంపితే ఆయన తమ వెబ్ సైటులో అందరికీ అందుబాటులో వుంచారు. అక్కడ చూడండి.
ఉదాహరణములు – 1 గురించి పాలూరి వెంకట రామారావు అభిప్రాయం:
03/11/2017 2:56 pm
మీ పరిశోధనకు, విపులాసక్తికి, అవతరణా పటిమకూ 🙏
ఒకటి నుంచి పదిల దాకా… గురించి zilebi అభిప్రాయం:
03/11/2017 12:37 am
ఒకటికి రెండును మూడిం
టికి నాల్గైదులను కలిపిరిట స్యూసుకథ
ల్కిక బుజ్జిజింకలాదర
ణ కలుగ జేసిరి గదా మన లలిత బాలా !
జిలేబి
నాకు నచ్చిన పద్యం: రాజు – కవి – కావ్యం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
03/10/2017 12:17 pm
మాన్యమిత్రులు శ్రీ కామేశ్వరరావు గారు ఎప్పటివలెనే ఒక అందమైన పద్యాన్ని పరిచయం చేసి ఈ వ్యాసంతో మరొక మంచి కవికి మరికొంతకాలం స్మరణీయతను కల్పించటం అభినందనీయమైన విషయం. వ్యాఖ్యానరీతితోపాటు వారి పద్యరథ్యాప్రయాణకథనం కూడా క్రమపరిగతితో ఆసక్తికరంగా సాగిపోయింది. తత్ప్రశంసానైపథ్యంతోనే రెండు మూడు ప్రాస్తావికాంశాలను ప్రస్తావిస్తున్నాను:
మొదటిది: మీరు పేర్కొన్నది కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రహంలో స్వీకరించిన పాఠం. అంతకు మునుపు సకలనీతిసమ్మతములో మడికి సింగన నీతిభూషణములోనిదిగా ఉదాహరించినప్పటి పాఠమూ ఇదే. రెండూ సరిగా లేవు.
శ్రీరామచంద్రుడు శరసంధానం చేసినప్పుడు సముద్రం ఘూర్ణిల్లినదే కాని, ఇంకిపోలేదు. ఇంకినట్లయితే సేతుబంధనమహాకార్యం సంభవించేదే కాదు. “రాఘవు” అన్న షష్ఠీ విభక్తి మూలాన “శరాగ్రమునందు” అన్నదానికి భావార్థకప్రత్యయాంతములైన శోషణ సంహార ధాతువులు రెండింటితోనూ అన్వయం సాధ్యం కాదు. అందువల్ల ఇది అపపాఠం. 1929 నాటి భైరవుని శ్రీరంగమహత్త్వము పీఠికలో శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు ఉదాహరించినట్లు
ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందుఁ దృణాగ్రలగ్ననీ
రాకృతి వార్ధి నిల్చుట, దశాననుఁ డీల్గుట – మిథ్య గాదె వా
ల్మీకులు చెప్పకున్నఁ; గృతిలేని నరేశ్వరవర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్.
అన్నదే సరైన పాఠం. లంకానగరికి దారినివ్వలేదని ఆగ్రహించి, శరసంధానం చేసిన శ్రీరామచంద్రుని ఆ శరాగ్రమునందు (శరాగ్రమునందు – అన్నదానికి ‘శరాగ్రముచే’ అని తృతీయార్థకం చెప్పబడుతున్నది) సముద్రము (ఆకులవృత్తిన్=) వ్యాకులత్వాన్ని పొంది, తన క్షోభమును మాని, సర్వవస్తువులను తన గర్భంలోనికి విలీనం చేసికొనే స్వభావాన్ని మాని, గడ్డిపోచ కొసనున్న నీటిచుక్క వలె నిలిచిపోవటం; శరాగ్రముచే (అన్నది ఈ రెండు క్రియలతోనూ అన్వయిస్తుంది కనుక) రావణుడు మృతిచెందటం – వాల్మీకి గారే చెప్పకపోతే వట్టి మిథ్య కదా! అని సార్థకమైన క్రమాన్వయం.
ఇది శ్రీ రామకృష్ణకవిగారు సరిచేసిన పాఠమో, లేక వేరొక చోట ఈ విధంగా ఉదాహరింపబడినదో నాకు తెలియరాలేదు. ఏ తెలుగు పద్యాన్ని ఉదాహరింపవలసివచ్చినా విమర్శకులు ప్రామాణికస్థితి లేక స్వయంగా పాఠపరిష్కారం చేసికోవలసి ఉండటం మన సాహిత్యానికి పట్టిన శోచనీయమైన దుఃస్థితి.
రెండవ సంగతి: ఈ పద్యానికి మూలమైన బిల్హణుని విక్రమాంకదేవ చరిత్రలోని శ్లోకద్వయిని ముమ్మొదట జల్హణుడు తన సూక్తిముక్తావళిలో చేర్చుకొన్నాడు. బిల్హణుని రచనలను తొలిసారిగా శ్రీనాథుడు తన కృతులలోనూ, చాటువులలోనూ సమర్థంగా అనువదించుకొన్నాడు. అంతకు మునుపు తెలుగు కవులు తత్ప్రభావితులైనట్లు కనబడదు. చాటుకవులైతే సాధారణంగా సంధానగ్రంథాలలో నుంచి స్ఫూర్తిని పొందటం కనబడుతుంది. ఇదే భావంతో సంధానగ్రంథాలలో లభిస్తున్న బిల్హణుని శ్లోకాలను పోలిన మరికొన్నింటిని కూడా పరిశీలించి తెలుగు కవి తన పాఠాన్ని రూపొందించుకొని ఉండటం భావ్యమే. జల్హణుడిచ్చిన బిల్హణుని శ్లోకపాఠం ఇది:
లఙ్కాపతేః సఙ్కుచితం యశో యద్యత్కీర్తిపాత్రం రఘురాజపుత్రః
స సర్వ ఏవాదికవేః ప్రభావో న కోపనీయాః కవయః క్షితీన్ద్రైః.
పృథ్వీ(మహీ)పతేః సన్తి న యస్య పార్శ్వే కవీశ్వరా స్తస్య కుతో యశాంసి?
భూపాః కియన్తో న బభూవు రుర్వ్యా నామాపి జానాతి న కోఽపి యేషామ్.
మూడవ సంగతి: విక్రమాంకదేవ చరిత్రను తెలుగులో అనువాదం చేసినది శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, శ్రీ మాదిరాజు విశ్వనాథరావు గారలు. గొప్ప జంటకవులు. వీరి అనువాదం మొదట చిన్ని చిన్ని సంచికలుగా వనపర్తి సంస్థానం వారిచే ప్రకటింపబడింది. నా చిన్ననాడు వాటిని చదివాను. వాటిలో చాలా విలువైన సమాచారం ఉండింది. అది నేటి గ్రంథంలో లేదు. ఆ ప్రతులను సైతం ఎవరైనా సంపాదింపగలిగితే బాగుంటుంది. ఇప్పుడు అంతర్జాలంలో ఉంపబడిన 1974 నాటి ఆంధ్ర విక్రమాంకదేవ చరితములో పుటల క్రమం అవకతవకగా ఉన్నది. ఎవరైనా దయతో ఆ పుటల వరుసను సరిచేసి మళ్ళీ అందుబాటులోకి తేగలిగితే పాఠకులకు ఎంతో మేలు చేసినవారవుతారని విన్నపం.
శ్రీ మానవల్లి వారు ‘నీతిభూషణము’ను గురించి వ్రాసిన ప్రస్తావనలన్నీ జాగ్రత్తగా పరిశోధింపదగినవి. అది వేరే కథ.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఒక ప్రయాణం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/10/2017 10:40 am
ఈ కథ బాగుంది. కథనం కొంచెం పాకానపడే సరికి మనకు విషయం చూచాయగా అర్థం కావటం జరుగుతుంది. నవ్యత కారణంగా బాగుంది. భాషాపరంగా సరళంగానూ ఉంది.ఐతే కథానేపథ్యం కారణంగా అనివార్యంగా ఆంగ్లంలో హెచ్చు పదాలు పడ్డాయి కథలో – ఐనా అది ఇబ్బంది కాదిక్కడ. ఒక విమానప్రయాణంగా వర్ణించటం మాత్రం కొంచెం ఆశ్చర్యం కలిగించిది. ఐనా నా దృష్టిలో అది నూటికి నూరుశాతమూ నప్పినదని అనిపించలేదు. అదీ పెద్ద ఇబ్బంది లేదు కథనశైలి కారణంగా. మొత్తానికి మంచి కథ. రచయితకు అభినందనలు.
అతిథి గురించి mala అభిప్రాయం:
03/09/2017 7:11 am
బాగుందండి.
ఒకటి నుంచి పదిల దాకా… గురించి mala అభిప్రాయం:
03/09/2017 6:54 am
మీ కవిత చదివాను. విన్నాను. చాలా బాగుంది. అభినందనలు.
నాకు నచ్చిన పద్యం: రాజు – కవి – కావ్యం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
03/08/2017 3:11 pm
కామేశ్వరరావుగారు: చాలా బాగా రాసారు!!
విషయం, మీరిచ్చిన ఉదాహరణలు అన్నీ బాగా తెలిసినవే కానీ, మీరు తేలికైన భాషలో చెప్పిన విధానం చాలా బాగుంది. If time permits I’ll post a longish note later. You may like to check: Velcheru & Shulman’s “A Poem at the right moment” (1998) for an extensive discussion on this very subject. They also translated the verse: ఆకులవృత్తి రాఘవు …Also VNR had a close look at Madiki Singana’s “sakala niiti sammatam” in many of his papers/books. On a side note, recently there was a conference on “విక్రమాంకదేవచరిత్ర” and some of the papers were published in a leading journal. At last, the poem attributed to Horace is a very popular one, like our chaaTu verse :-). Just give the first 2-3 words from it in any search engine and see what kind of results you get :). But I really liked your reference to Grassman’s book, a good one. It was not an easy read for me 10-12 years ago, but at one time I was trying to read such works (Terry Eagleton’s How to Read a Poem, and Edward Hirsch’s similar titled work) hoping to get a better understanding and appreciation of poetry.
Regards,
Sreenivas
ఒకటి నుంచి పదిల దాకా… గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
03/08/2017 2:45 pm
లలిత గారు: దిబ్బరొట్టి అబ్బాయి అన్నది Ginger Bread Boy అన్న ఒక పాశ్చాత్య కథ ఆధారంగా శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు – పిల్లలకోసం – రూపొందించిన ఒక మంచి సంగీత రూపకం. నేను గతంలో శ్రీ వంశీ మాగంటికి పంపితే ఆయన తమ వెబ్ సైటులో అందరికీ అందుబాటులో వుంచారు. అక్కడ చూడండి.
శ్రీనివాస్
…..ఉరకకురా పడేవు గురించి Sainath Reddy అభిప్రాయం:
03/08/2017 12:06 pm
ఎంతా బాధాకరం గుండెకు హత్తుకునెలాగా రాశారండి
మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
అనురాగ దగ్ధ సమాధి గురించి Sainath Reddy అభిప్రాయం:
03/08/2017 11:44 am
ఆహా మహాద్భుతంగా రాసారండి. గౌరవనీయులైన శ్రీమతి రేవతీదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాధాలు.