పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. రామచంద్ర పుత్ర! రామభద్ర! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/12/2017 11:46 am

    మాన్యులు శ్రీ వాసుదేవరావు గారికి
    నమస్కృతులతో,

    విపులమైన జీవితానుభవాన్ని, సఫలమైన సారస్వతానుభవాన్ని రంగరించి శతకరచనకు ఉపక్రమించారు. అంత నేను చేసినదేమీ లేకపోయినా, అంతగా పేర్కొనటం మీ సౌజన్యానికి నిదర్శనం.

    అతిభవ్యామృతభావనాప్రకటమై, యాంధ్రావళీ సంతత
    స్తుతిగీరౌపయికంబునై, మహితవాచోయుక్తినిర్ణిక్తమై
    సత మింపారెడుఁ గావుతన్ సుకవిసంసత్కందళం బౌ భవ
    త్కృతి సాహిత్యసహృన్మనోఽభ్రసపదిప్రేంఖత్సుధాంభోదమై.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  2. దేహి గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:

    05/12/2017 7:08 am

    ఒక విధమైన నిఘూడ భావన వ్యక్తం చేశారు..

  3. ఆవలి తీరం గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:

    05/12/2017 7:02 am

    ఒక ఉహాతీత భావన… విశేష వర్ణన.. కలగల్పిన అనుభుతి

  4. రామరసాయనము గురించి తః తః అభిప్రాయం:

    05/11/2017 12:04 am

    “అందచందమన్న అంతలంతలు ప్రీతి
    భోగమన్న నాకు భూరి వలపె;
    తెలివితేటలన్న తీరనంతటి భ్రాంతి,
    కాని, కరుణ కేను కరము మోడ్తు.”
    Hats off Dr Yerneni : This stanza of yours ,a wonderful poem by itself,brings to my mind one of my very most favourite passages I ever read – the prologue of Bertrand Russell to his autobiography ,quoted here in appriciation of your ,let me say it again , wonderful poem !

    “What I Have Lived For”

    “Three passions, simple but overwhelmingly strong, have governed my life: the longing for love, the search for knowledge, and unbearable pity for the suffering of mankind. These passions, like great winds, have blown me hither and thither, in a wayward course, over a great ocean of anguish, reaching to the very verge of despair.
    I have sought love, first, because it brings ecstasy – ecstasy so great that I would often have sacrificed all the rest of life for a few hours of this joy. I have sought it, next, because it relieves loneliness–that terrible loneliness in which one shivering consciousness looks over the rim of the world into the cold unfathomable lifeless abyss. I have sought it finally, because in the union of love I have seen, in a mystic miniature, the prefiguring vision of the heaven that saints and poets have imagined. This is what I sought, and though it might seem too good for human life, this is what–at last–I have found.

    With equal passion I have sought knowledge. I have wished to understand the hearts of men. I have wished to know why the stars shine. And I have tried to apprehend the Pythagorean power by which number holds sway above the flux. A little of this, but not much, I have achieved.

    Love and knowledge, so far as they were possible, led upward toward the heavens. But always pity brought me back to earth. Echoes of cries of pain reverberate in my heart. Children in famine, victims tortured by oppressors, helpless old people a burden to their sons, and the whole world of loneliness, poverty, and pain make a mockery of what human life should be. I long to alleviate this evil, but I cannot, and I too suffer.

    This has been my life. I have found it worth living, and would gladly live it again if the chance were offered me.”

    (I know this is a place is to write only on the poem,”రామరసాయనము” – my apologies to Sri Parimi )
    నమస్కారాల తో
    తః తః

  5. రామరసాయనము గురించి lyla yerneni అభిప్రాయం:

    05/10/2017 3:02 pm

    In response to above poetry, which is still not totally understood by me;
    అందచందమన్న అంతలంతలు ప్రీతి
    భోగమన్న నాకు భూరి వలపె;
    తెలివితేటలన్న తీరనంతటి భ్రాంతి,
    కాని, కరుణ కేను కరము మోడ్తు.

    If you have the time, Read the following writing on రాముడు, who in my eyes is just a human being. Thanks.
    *
    While many events in Ramayana hold my interest, to me Ayodhya Kanda appears to be most dramatic.
    It all hinges solely on one night, one night so powerful that changes the fate of an individual and thereby of several others’. In fact it could be that one dramatic night that set the tone to the entire epic and then the epic might have set a whole nation’s behavioral patterns for hundreds of years to come.
    A seventeen year old Rama, the eldest son of a king is about to be the crown prince, which means he will be the future king of Ayodhya.
    ఆ రాత్రి, తెల్లవారితే పట్టాభిషేకం. తండ్రి దశరథుడు – నాకు అశుభచిహ్నాలు చిహ్నాలు కనిపిస్తున్నాయి. నాకు ప్రాణాపాయం కలగొచ్చు. నేను బాగున్నప్పుడే నిన్ను యువరాజుగా చూడనియ్. – అని రాముడికి చెప్పి వసిష్ఠుడి ద్వారా సీతా రాములను ఆ రాత్రి ఉపవాసం చెయ్యమని నిర్దేశించుతాడు. నగరమంతా ఒక్క రాత్రిలో అలంకరించుకుని, జనులంతా ఎప్పుడు తెల్లవారుతుంది! ఎప్పుడు రామ పట్టాభిషేకం! అని ఎదురు చూస్తూ ఉంటారు. ఉత్సవాలకు కారణం కనుక్కున్నమంధర భగ్గున మండిపడి, కైకేయికి విషపు మాటలు చెప్పి మనసు విరుస్తుంది. రానున్న రామ పట్టాభిషేకం, ముందు శుభవార్తగా తీసుకుని మంధర మీదికి రత్నహారం విసిరిన కైక, మెల్లగా మంధర బోధనకు లొంగుతుంది. కోపగృహం చేరుతుంది. దశరధుడు కైకేయి మందిరానికి వెడతాడు. కైక అతనిని గుండె పగిలే వరాలడుగుతుంది.
    ఒక్క క్షణంలో అంతా తారుమారు. రాజు కావలసిన రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చెయ్యవలసి రావటం. సుమంత్రుడు రాముడిని కైకేయి మందిరానికి తీసుకొని వస్తే దశరథుడు అతని వంకైనా చూడకుండా తలదించుకుని ఏడుస్తుంటే కైక రాముడు ఏం చెయ్యాలో చెపుతుంది.
    ఎంతో విపులంగా వర్ణించబడిన ఈ ఘట్టం నాకిలా తోస్తుంది.
    రాముడు అందరిచేతా ప్రేమించబడినవాడు. అతనికి ఆదరించబడటమే తెలుసు. పరుషపు మాటలు, దండన తెలిసినవాడు కాదు. అనుకోని కైక నిరాదరణ, స్వార్థం అతణ్ని గాయపరుస్తుంది. అతడు రాజ్యం కావాలనుకున్నవాడు కాదు. తలిదండ్రుల ఆనందం కోసం అతని విలువిద్యలు, చదువులు ప్రదర్శించి మెప్పించే చిన్నవాడతను. రాజకీయం మీద మోజు కలవాడు కాదు. వాత్సల్యానికి బద్ధుడు. తండ్రి నాకోసం నువ్వు రేపటికి రేపు యువరాజువు కావాలి అంటే సరే అన్నాడు. అది ఒక పెద్ద బరువు. ఎవరికి కావాలి ఆ వయసులో ఆ తగలాటం? తెల్లవారుతూనే మళ్లీ కైకేయి మందిరానికి రమ్మని తండ్రి పిలుపు. తీరా వెడితే, తల్లి కైకేయి- అబ్బే సింహాసనం కాదు, ఇప్పుడు నీకు నగర బహిష్కారం అంటే – ఇలాటి తల్లి తండ్రుల తలతిక్కల ఆలోచనలకు ఏ పిల్లవాని మనసు ముక్కలు కాదు?
    Rama the favored son is repulsed by the sudden rejection by Kaika. He is repulsed by the fickleness of love. He is turned off by the sight of an old man who is controlled by a young wife. A man who could not even look his son in the face and tell him what happened. It is doubly hard for him to hear the insulting command -expulsion from the country- from Kaika instead of hearing it from his father. Kaika who says, she wants to use all the grand preparations done for his crowning, now for another son!
    Rama all thru, speaks like a broken hearted youngster.
    “Why are you sad father? Are you angry with me? Why would you not look at me? Have I done something wrong to displease you? Tell me what you want. I will do anything to please my father and mother.”
    These are words of a broken hearted kid. What kind of a son will not be heartbroken if a parent turns against him and wishes him out of his sight and asks him to leave his house and not to return for fourteen years? He will simply do what is asked of him, out of deep hurt.
    Rama then has to go to Kausalya and give her the shocking news. He then has to go tell his wife Sita who is preparing to be the future queen that he is no longer going to ascend the throne. Instead he is expelled from the country. He is quite embarrassed to give such humiliating news to his wife, who comes running to greet him as a future king. From prince to pauper in minutes. To shed all pomp and glory. To leave in shame and humiliation at the command of a step mother, to dwell in forests. Lakshmana who witnesses all, wants Ram to rebel and snatch the kingdom. But Rama won’t. He talks about Dharma, respecting his father’s command, his father’s obligation to keep his word. This and that moral and duty.
    To me, all of it appears as a big show on part of Rama, who is really broken hearted by the totally unanticipated, sudden loss of affection, and horrid hostility from parents.
    To me Ayodhya Kanda represents one of the great tragic life turning moments. That rejection of a parent, that broken heart of a child, that departure of Ram, Sita and Lakshman from Ayodhya – which in turn leads to the death of king Dasaradha and long miserable widowhood of repentant Kaika and other queens – is supreme pathos.
    “ఎవరి మహా ప్రలోభము మంగళ తోరణములు తెగిపోయినవయ్యో!
    ఆశామయ రాగాలాపనలే అంధకారమై పోయెనుగాదా! రఘురామా! రాఘవా!”
    It is this young Rama, who had gripped my heart to begin with.

    Lyla
    P.s: The above excerpt is typed from my writing in Racchabanda – Yahoo groups dated Nov 7, 2006. These writings are done in RTS, as ground work for development of Telugu software, and to keep in touch with Telugu literature. Perhaps because of the mixed medium and upgrading of yahoo, a few writings are more unintelligible than before. Mission accomplished.

  6. ఒక పాట – రెండు బాణీలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/10/2017 7:27 am

    “ఆగుమా జాబిలి…” పాట చాలా సార్లు విన్న తరవాత ఈ వ్యాఖ్య రాయకుండా ఉండలేకపోతున్నా!

    ఈ పాటకి బాణీ ఇచ్చినవారు ఎవరో తెలియదు కానీ, “బేహాగ్” అన్న రాగంలో చాలా అందమైన బాణీ ఇది.

    జయభేరి సినిమా లో “యమునా తీరమునా, సంధ్యా సమయమున..” అన్నపాట బేహాగ్‌లో బాణీ కట్టబడింది.

    https://www.youtube.com/watch?v=C4fsDSxgOU0

    అలాగే ” తెరే సుర్ ఔర్ మేరే గీత్ ” అన్న ప్రముఖ హిందీ పాట కూడా బేహాగ్ రాగంలోనే కట్టడింది.

    https://www.youtube.com/watch?v=ljG6atDKyxo

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  7. ఒక పాట – రెండు బాణీలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/09/2017 1:35 pm

    శ్రీనివాస్:

    ఆద్భుతమైన లలితగీతాలు ఇవి! నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా బి. వరహాలు పాడిన “ఆగుమా జాబిలీ…” పాట ఒక 100 సార్లు విన్నాను. ఎంత చక్కని గొంతు ఈమెది? కొంచెం దగ్గర దగ్గరగా శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతులా అనిపించింది.

    ఈ వ్యాసం టైటిల్ సరిగా లేదనిపించింది. ఇందులో కొన్ని పాటల్లో “ఒక పాట – రెండు బాణీలు” వినపడలేదు.

    1, 3 & 4 బాణీలు ఒకేలాగా ఉన్నాయి. మిగిలిన పాటలు కూడా జాగ్రత్తగా వినాలి.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  8. రామరసాయనము గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    05/09/2017 10:46 am

    శృంగార, కరుణ, రౌద్ర, అద్భుత, వీర, భయానక, హాస్య, భీభత్స,శాంత రసాదుల వరసలో భక్తి వాహిని ప్రవహించి నేత్రానందం కలిగించిందని భావిస్తున్నాను.

    పండితులైన వారి వ్యాఖ్య చూసి తెలుసుకుంటాను.

  9. సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    05/09/2017 12:47 am

    కథాభేదాల గురించి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుల వారి” ప్రాకృతభాషావాఙ్మయచరిత్ర” లో కొంత చదువుకున్నాక మరింతగా కథా ఆఖ్యాయికల గురించిన చర్చ సంతృప్తిని కలిగించింది.
    వ్యాసరచయిత గారి శోధనావిస్తృతినీ, రచనాసామర్థ్యాన్నీ గురించి వ్యాఖ్యానించడం నా విషయంలో చిన్ననోట పెద్దమాట అవుతుంది.
    వాసవదత్తా కథ దాక్షిణాత్య పాఠంలో (మలయానిల వర్ణన) కానరాని “కర్ణాట” విశేషణం ఔత్తరాహుల పాఠంలో కనిపించడం విశేషం. అది ప్రాంత ప్రస్తావన కాకపోవచ్చునేమోనన్న సందేహం కలిగింది.

  10. రిటర్న్ పాలసీ గురించి Amar అభిప్రాయం:

    05/08/2017 3:44 am

    Return policy at hospitals……. 🙂 much needed…. 🙂 Nice story. Nice translation. Great job, as always, Bhaskar garu!