పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు – అన్యభాషల ప్రభావం గురించి పసుపులేటి చరణ్ రాజ్ అభిప్రాయం:

    10/02/2017 2:03 am

    ఈ వ్యాసం విస్తారమైనదే కాక లోతైనది కూడా. ఇటువంటి పరిశోధక వ్యాసాలు తెలుగు సమకాలీన, భవిష్యత్ సమస్యల పరిష్కారానికి పాటుపడగలవు. మీ కృషికి కృతజ్ఞతాభినందనలు. మరిన్ని పరిశోధనలు కొనసాగించగలరు.

  2. గడి నుడి -12 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    10/02/2017 1:19 am

    గడి ముగింపు తేదీ సెప్టెంబరు 25 అని ఉంది. అక్టోబరు 25 అని మార్చండి.
    (సవరించామండీ. తప్పును ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు – సం.)

  3. ℞: మారేజ్ గురించి nagamurali అభిప్రాయం:

    10/01/2017 10:26 pm

    This thought has been bothering me for some years and your story hits me on the same spot.

    It feel that life was much simpler and easier in my father’s generation. Their jobs appear easy. Marriage and having children looked routine matters. There were quite a few people around who did not have jobs. But they still got married, had children and made a living. People did not have money or opportunities then, but still their life appears easy to me now.

    We now have better money and opportunities. But I see constant insecurity and anxiety. Job, marriage, children, guests and relations are not routine matters anymore. They are often the sources of the anxiety.

    I sometimes wonder – shouldn’t economic prosperity make our lives easier? Why should life get this difficult? Or, is my perception wrong about my father’s generation? Were many of them also as anxious as we are today? Were the supposedly ‘natural and routine’ things always this complicated? I don’t know.

  4. కొత్త కథకులు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    10/01/2017 10:19 pm

    ” సాంత్వన చీమలమర్రి గారి మీద మనం ఆశలు పెట్టుకోవచ్చు ” అన్న
    అమరేంద్రగారూ థేంక్యూ. తెలుగు సాహిత్యంలో సరికొత్త చైతన్యం పింగళి చైతన్య మీదా పాఠకులం అలాగే ఆశ పెట్టుకుంటున్నాము.

    కడప జిల్లాలోని దేవమాస పల్లెకు చెందిన బీద దళిత యువకుడు, “బుడ్డగిత్త రంకె” కధ రాసిన పుట్టా పెంచల్దాస్ మీదా నా కలాంటి ఆశే.

    ఉణుదుర్తి సుధాకర్ గారు త్రిపుర గారి అల్లుడు అని తలుచుకోకుండా ఉండలేను.

    జిందగి, చౌరస్తా, కిమో కధలు రాసిన వంశన్న ( డా. వంశీధర రెడ్డి ),
    “సోల్ సర్కస్” కథ వెంకట్ సిద్దారెడ్డి, చందు తులసి, త్రిపుర గారికీ నచ్చిన “వాంగ్మూలం” కధ రాసిన స్వాతి తల్లి ( స్వాతి కుమారి బండ్లమూడి ), ప్రముఖ తమిళ కధలను అద్భుతంగా అనుసృజిస్తున్న ఆవినేని భాస్కర్, మూలా సుబ్రహ్మణ్యం, రాధా మండువ ఇలా ఎందరెందరో. పైగా వీళ్లందరూ సీనియర్ కధా రచయిత గొరుసన్న ( గొరుసు జగదీశ్వర రెడ్డి గారి ) మన్ననలు పొందిన వాళ్లు.

    పి. సత్యవతి అక్కయ్య గారు, చోరనగుడి జాన్సన్ గారు, గొరుసు జగదీశ్వర రెడ్డి అన్న, పూడూరి రాజిరెడ్డి, మహిత కధ సామాన్య, మెహర్ ల రచనలు చూస్తే కడుపు నిండిపోతున్నది. వోల్టేర్ నవల “కాండీడ్” ను, ప్రముఖ చిత్రకారుడు విన్సెట్ వాంగో జీవిత చరిత్ర ‘జీవలాలస’ ను మనకు ఇచ్చిన పి.మోహన్ గారి గురించి విడిగా, మరింత విపులంగా తలుచుకోవాలనుకుంటా.

  5. కొత్త కథకులు గురించి amarendra dasari అభిప్రాయం:

    10/01/2017 1:58 pm

    నరసింగ గారూ, కృతజ్ఞతలు.

    వేణు గారూ , ఈ విషయాల్లొ కారా గారి కథాకథనం నాకు Manifesto.

    కృష్ణవేణి గారూ, జీవితాన్ని ఛూసే పద్ధతీ, జీవితానుభవం – వ్యాకరణం కన్నా ముఖ్యమని మీరు నిరూపించారు కదా.

  6. ℞: మారేజ్ గురించి Sujata అభిప్రాయం:

    10/01/2017 1:21 pm

    వావ్ వావ్… వెరీ గుడ్ పూర్ణిమ.

  7. కొత్త కథకులు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    10/01/2017 11:58 am

    అమరేంద్రగారూ, మీరు పేర్కొన్న ఈ కథ నా మొదటిది. అప్పటికి తెలుగులో వాక్యనిర్మాణం అవీ అస్సలు తెలియని కాలం అది. ఆయినప్పటికీ, దీన్నీ పేర్కొన్నందుకు థేంక్యూ.

  8. కొత్త కథకులు గురించి Venu అభిప్రాయం:

    10/01/2017 11:39 am

    బాగుంది, విషయపరంగా, మాలాంటి కొత్తకథకులకి ఒక దిక్సూచిగా. అయితే కథని ఎలా మొదలు పెట్టాలి ముగించాలి ఎలాంటి వ్యాకరణం వాడాలి లాంటి మౌలిక సూచనలు ఇవ్వగలరా నాకు?

  9. కొత్త కథకులు గురించి నరసింగ అభిప్రాయం:

    10/01/2017 11:14 am

    ‘ఈ వ్యాసం సమగ్రం అన్న భ్రమ నాకు లేదు. కొత్త కథకులను ఒక పద్ధతిలో పరిశీలించినపుడు నాకు కలిగిన మహా సంతోషాన్ని పంచుకోవాలన్న కోరికే ఈ వ్యాసానికి మూలం. ఎన్నో విషయాలు చెప్పలేకపోయాను. మరికొంతమంది ముఖ్యమైన కొత్త కథకులను నా పరిజ్ఞాన లేమి వల్ల స్పృశించలేకపోయానని నా ఆరోజ్ఞానం చెపుతోంది.’-

    పై వాక్యాలు రాసి వ్యాసానికి వన్నె తెచ్చారు సార్ . కంగ్రాట్స్.

  10. మరికొన్ని అరుదైన పాటలు గురించి నరసింగ అభిప్రాయం:

    10/01/2017 11:05 am

    అసమాన అనసూయ అనే ఆమె స్వీయచరిత్ర లో ‘ మధూదయంలో’ పాట ప్రస్తావన చదివినట్టు గుర్తు ..ఒకసారి చూడండి.