పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. మరికొన్ని అరుదైన పాటలు గురించి lyla yerneni అభిప్రాయం:

    10/22/2017 3:58 pm

    About these rare Telugu songs:

    గాయకుడెవరో గాని – కౌసల్యా సుప్రజా రామా! – అంటూ శ్రీరాముడిని నిద్ర లేపే విశ్వామిత్రుడి శ్లోకం చక్కగా పాడారు. కంఠం, గంభీరమూ, శ్రావ్యమూ ఐ ఉంది. పాడిన పద్ధతి అర్థవంతంగా, మధురంగా ఉంది. తల్లిదండ్రుల నుండి, మెత్తని పరుపులనుండి, వేరు చేసి తీసుకు వచ్చి, సరయూ నది ఒడ్డున, నేలపై పడుకోబెట్టిన ఇద్దరు రాకుమారులను పొద్దున్నే గురువు నిద్ర లేపాలి. ఆ రోజు వారికి దైవం నియమించిన పనులు చేయటానికి వారిని ప్రోత్సహించాలి.

    తల్లి పేరు పలుకుతూ ఆ పిల్లలను నిద్రలేపటం, ఎంతో కరుణ కలిగినది గురువు హృదయం అని తెలుపుతూనే ఉంది. ఐనా, కంఠంలో, శిష్యులకు విషాదం వినిపించనీయడు. రాముడికి తన తల్లి పేరు, లక్ష్మణుడికి రాముడి పేరూ, వినిపిస్తూ – ఏదో ఎత్తునుండి దూరంలోకి చూస్తూ, విస్తరిస్తున్న ప్రభాత సంధ్యను దర్శిస్తూ పలుకుతున్నాడు. దూరం నుంచే పలుకుతున్నాడు. గురువు చైతన్యశీలి. కార్యశాలి. అది ఒక కొత్త రోజు. కొత్త పనులు. రామలక్ష్మణులు చిన్నవాళ్లైనా వారితో పెద్ద పనులు చేయించటానికే విశ్వామిత్రుడు తీసుకు వచ్చింది. అతని గొంతు ధృడత్వం, ఆదరం, మర్యాదతో కూడి ఉండాలి. అతడి గొంతు శాసించగలిగీ ఉండాలి. ఉన్నది.

    ఈ శ్లోకం ఇంతా అంతా అందమైనదా! వినటానికి మనసు తపించి పోతుంటుంది. ఎన్నాళ్లో కొన్నాళ్లకు దూరంగా ఎక్కడి నుండో గాలిలో తేలివచ్చి పొద్దున్నే చెవుల బడితే, చాలు, దైవమా! అనిపిస్తుంది. ఈ శ్లోకం సంపూర్ణ రామాయణం సినిమాలో ఉంది. పాడినదెవరో నాకు తెలియదు. శ్రీ కృష్ణాంజయనేయ యుద్ధం సినిమా లో ఘంటసాల పాడగా వింటాము. ఇంకా, వెంకటేశ్వర సుప్రభాతం లో, మొదటి శ్లోకంగా కూడా, వేర్వేరు గొంతులలో నేను విన్నాను. ఎన్ని విధాల విన్నాగాని, మన మనసులో చూసే దృశ్యం, వినిపించే ధ్వనికి, న్యాయం జరగలేదనే అనిపిస్తుంది.

    ఇప్పుడు ఇక్కడ ఉంచిన శ్లోకం నాకు బాగుంది. గాయకుడు మరి ఎవరో! పూర్వా సంధ్యా అన్న దగ్గర పూర్వా సంధ్వా అన్నట్టుగా వినిపిస్తున్నది. అలా ఎందుకు పలికారో మరి. ‘సంధ్వా’ అని పలకటం తప్పు. ‘సంధ్య’ అనాలి, అసలు ‘సంధ్వ’ అన్న మాట లేనే లేదు, మాట సరీగా అనకపోతే నేను వినలేను అనవచ్చు కొంతమంది. అది నిజమే. ఐనా, మాటలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయనీ, ఉంటాయనీ; కొత్తమాటల పుట్టుకకు ఒక కారణం ఎక్కువమంది ఒక మాటను తప్పుగా పలకటమేననీ, బూదరాజు రాధాకృష్ణ ‘ భాషా శాస్త్ర వ్యాసాలు’ పుస్తకంలో అంటారు. అదీ నిజమేగా. సీతా, సీతా అని లవకుశ సినిమాలో, N.T.R లా పలవరించే తెలుగు వాళ్లు, ‘సీతే’ అని మరో భాషలో అంటే లేచి వెళ్లిపోతారు, అందులో ఏ తప్పూ లేకపోయినా. ఏ భాష వారికి ఆ భాష బంగారం కాబోలు.

    ఈ కౌసల్యా సుప్రజా రామా అన్న మేలుకొలుపు తప్పించి, మిగతా వేవీ నాకు నచ్చలేదు. నాకు, సీత, అనసూయలు, సూర్యకుమారి గొంతులు, పాటలు ఏం బాగులేవు. గాత్ర సంగీతం లో ముందు నచ్చవలసినది ఏమిటి? మనిషి గొంతే. అలా తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. గోపాలరత్నం కొన్నిసార్లు వేరే అనేకానేకమైన స్త్రీ గొంతుల్లో కలిసిపోతుంది. గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.

    ఈ తెలుగు పాటలు, పాడింది తెలుగు వాళ్లు అని వింటమే తప్ప, వినదగిందిగా ఏదీ లేదు. తెలుగును ఉబ్బేస్తే, ఆ కవిత్వం బాగున్నట్టే నని, దైవం పేరు పాటికి పన్నెండు సార్లు తీసుకొస్తే, ఆ కవితలను భక్తి గీతాలుగా భావించాలని, డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.

    I am Sorry! విశ్వామిత్రుడికి కూడా ఉన్నట్టు లేవు. ఉంటే పనిగట్టుకుని, నలుగురు సోదరులలో, రామలక్ష్మణులను మాత్రమే తన వెంట తీసుకువెళ్లటమెందుకు? వారిద్దరిలోనూ కూడా రాముడికే -బల, అతిబల అన్న మంత్రాలు ఉపదేశించి “సౌందర్యం, సామర్ధ్యం, జ్ఞానం, బుద్ధి నిశ్చయం, ప్రత్యుత్తరం” అన్న ఐదు విషయాల్లో రాముడిని అధికుడుగా చెయ్యటమెందుకు!
    Lyla

  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 7 గురించి Prasad Indraganti అభిప్రాయం:

    10/19/2017 11:30 pm

    గళ్లు నింపినందుకు సంబరంగా ఉంది.

  3. అక్కరలేనితనం గురించి వాజపేయయాజుల వెంకట రమణారావు అభిప్రాయం:

    10/19/2017 8:16 am

    నాదెళ్ళ అనురాధగారు చాలా మంచి రచయిత్రి. ఆమె రచనలు చాలా బాగుంటాయి. ఈ మధ్య మరియొక రచన “రెండు కూడా వంటరి అంకె ” (Edit if not correct)

  4. పవిత్ర గురించి Ravichandra Enaganti అభిప్రాయం:

    10/19/2017 1:36 am

    చివరి దాకా ఆపకుంటా చదివింపజేసింది భాస్కర్ గారూ…ప్రతి కథలో చివర్లో ఒక థ్రిల్ లేదా ఆశ్చర్యం ఉంటే ఆ కథ నాకు చాలా రోజులు అలాగే గుర్తుండి పోతుంది. ఈ కథ అలాంటిదే.

  5. ఉత్తమాయిల్లాలు గురించి చంద్రం అభిప్రాయం:

    10/14/2017 1:25 pm

    నిజానికి, నేను అనుకున్నదానికంటే మీరు ఎక్కువే చదివేరు అందులో.

    Lovely interaction. Also excellent debate on review etc.

    తెలుగులో ఈమాత్రం నాణ్యత దొరకడమే అదృష్టం. అందునా, ఈ రచయిత్రి వినయం అమోఘం. మల్లాది వారు ఆంగ్లంలో రాయడంతో ఆయన రాసిన విషయం ప్రాముఖ్యత తగ్గిందా అనిపించింది. లైలా గారి కళ్ళజోడు అమ్మితే కొనే సామర్ధ్యం ఈజన్మలో నాకు రాదేమో.

    చిన్నప్పుడు నిడదవోలులో కొంతకాలం ఉండటంచేత ఈ రచయిత్రి ఇంటిపేరుచే ఆకర్షింపబడ్డ మాట వాస్తవం.

    Not bad at all for the time spent on this story. Am better equipped about short stories.

  6. రాగలహరి: మోహనం గురించి janardhana sharma అభిప్రాయం:

    10/14/2017 5:00 am

    నాకు సంగీతము అంతంతగా మాత్రమె తెలుసు. అందుకే ఈ వ్యాసము చాలా ఉపయోగకరముగా ఉంది. ధన్యవాదాలు.

    మోహన రాగము గురించిన వ్యాసములో మాయాబజార్ లోని లాహిరి లాహిరి పాటను వివరించారు. కానీ ఇచ్చిన ఉదాహరణలో అక్కడక్కడా స్వరాలు సరిపోలేదు. ముఖ్యముగా ఊగెనుగా తూగెనుగా అన్నప్పుడు దానికి సరిపోయే స్వరము ఇలా ఇచ్చారు

    ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా తూగెనుగా
    గాదప గగరిస సారిగరీ గారిగసా గారిగసా

    కానీ, ఊగెనుగా ‘ఆ’ తూగెనుగా అని పలుకుతారు. అక్కడ ‘ఆ’ అక్షరానికి స్వరము ఇవ్వనేలేదు. అలాగే ఊగెనుగా లో నిజానికి స్వరము “గ అ రి గ స ఆ” కలిపితే, గారిగసా అవుతుంది.

    [జగమే… లో చూడండి. జగమే మూడు అక్షరాలైనా, నాలుగు స్వరాలున్నాయి గగరిస. [జగమెఎ] మె ను రిషభములోను, ఎ ను షడ్జమములోను పలుకుతారు.]

    ఇలాంటివి అక్కడక్కడా సందేహాలు ఉన్నాయి.

  7. A Poem at the Right Moment: An Introduction గురించి indrsprssad అభిప్రాయం:

    10/13/2017 2:43 am

    what a wonderful introduction? cATu poetry has an important place in Indian poetic tradition!

  8. శిక్ష గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    10/12/2017 8:13 pm

    ప్రియమైన శ్రీ దాట్ల దేవదానం రాజుగారండి, మీరు పూనుకుంటే కథాలోకం చేత జేకొట్టించుకున్న మా రామిండ్రి సిన్నయ్యగోరు (శ్రీమతి దాట్ల లలిత గారు), సారంగలో తమ యీదేసిన గోదారి కధలతో కధాలోకాన్ని అబ్బురపరచిన సిన్నయ్యగోరు, మళ్లీ తమ కలాన్ని ఝళిపిస్తానరి మా ఆశ.

  9. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి vvadi అభిప్రాయం:

    10/10/2017 1:11 pm

    Suresh Garu,

    DD Kosambi has proposed in his book (Myth and Reality, studies in the formation of Indian culture) the peaceful syncretic assimilation of mother Goddesses (Amma Devathalu) and their offspring from various native cultures. He also traces the timeline of the anthropological changes ( from pastoral to agrarian, assimilation of native matriarchy with patriarchy etc).

  10. శిక్ష గురించి amarendra dasari అభిప్రాయం:

    10/09/2017 3:43 pm

    what a narrative! ఒక ప్రపంచాన్నీ అక్కడి మనుషులనూ ప్రాణం పోసి కళ్ళముందు నిలబెట్టారు. కంగ్రాట్స్ వర్మ గారూ! we demand more!