పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/01/2018 3:10 pm

    “రచయితలు ఇప్పటికీ పాతకాలపు సాహిత్య భావనలనే పట్టుకుని వేలాడడం, విమర్శకులు సాహిత్యరూపలక్షణ పరిమితీపరిణామాలపై చర్చ విస్తృతంగా జరపకపోవడం ఇందుకు కారణాలు. ఈ స్థితిని సంస్కరించే దిశగా నేటి సాహిత్యకారులు అడుగువేస్తారని, రేపటితరంలో వారి వారసత్వంగా చక్కటి సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించడం ఎండమావి చందమే అయినా అది ఎప్పటికీ అత్యాశ కాకూడదనే మా ఆశ.”

    పత్రిక మాసపత్రికగా మారింది, ఇండియా, ఔట్ ఆఫ్ ఇండియా రచయితలు పెరిగారు కామోసు! ఈ ఇంటర్నేషనల్ తెలుగు పత్రిక అమ్మయ్య! ఇక కక్కుర్తి నివాళి ఆచారం మాని, నిక్కపు సాహిత్య పత్రికగా మారుతుందని. అని నేనూ, మీలానే ఆశ పడినానేమో, No chance. పాత సంస్కారపు గ్రహచారం వదలదు. మూడు పువ్వులు, ఆరు కాయలు కాలేదు సరికదా, ఇప్పుడు One wedding and thousand funerals.

    కొందరు సప్లైదారు రచయితలు- వారి అభిమాన సాహితీవేత్తల చావుకు ముందే ఆర్టికల్ రెడీ చేసి ఉంచుకుని మేక్సిమమ్ ఎఫెక్ట్ కోసం టైమ్డ్ రిలీజ్ చేస్తారో, మరి కొందరి సాహితీ-సంగీత వేత్తల చక్కని రచనలు సేకరించినా, వాటిని దొరికిన వెంటనే ప్రచురించకుండా వారు చనిపోయిన తరుణంలో వాటిని రిలీజ్ చేసి ఘనంగా ధాంధూంగా సాగనంపుదామని, ఫేమిలీ కాని, సప్లైదారులు గాని, రచనలను తొక్కిపట్టి ఆపి ఉంచుతారో తెలియదు.

    ఇంతకన్నా అత్యాచారం సాహిత్యం పట్ల ఘోరాపచారం ఒక సాహితీజీవి పట్ల ఇంకోటి ఉంటుందా?

    దయచేసి మీ సమాధానమివ్వండి. తప్పక మీ ఉద్దేశమేమిటో చెప్పండి.

    Lyla

    [As much as you hate to see it, we do believe it is better to celebrate than to ignore the life and works of one when departed. And, please get used to it because we are not changing any time soon about this. ఏదీ తొక్కిపట్టుకుని ఎవరుపోతారా అని ఏ “సప్లయ్ దారులూ” చూడరు. అలా ఒకరిని నిందించటం మీకు తగదు. When we celebrate, some may come and mourn.That’s their prerogative. చచ్చిపోయినవారిని తలచుకోడం మీకు అత్యాచారం ఎలా అనిపిస్తుందో అలా అది వారి ఇష్టం. బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు. – సం.]

  2. చిత్రపటం గురించి ప్రశాంతి అభిప్రాయం:

    06/01/2018 2:22 pm

    చాలా బాగుంది సాంఘిక గారు మీ కవిత. చిత్రపటం.

  3. కలలు ఇచ్చిన బలిమి గురించి B.V.S.Bhanusree అభిప్రాయం:

    06/01/2018 1:14 pm

    చాలా చక్కటి విశ్లేషణ. ఆమె తన దారిలో తాను రాసుకుపోయేరు కాని, ఎవరితోనూ పోటీ పడలేదు. అవసరమైన వివరణలు ఇచ్చుకోలేదు. చాలా డిగ్నిఫైడ్‌గా ఆమె మార్గంలో ఆమె నడిచి పోయేరు!

  4. నాకు నచ్సిన పద్యం: గౌతమీకోకిల వేదుల గురించి Vasu (Srinivasa Nyayapati) అభిప్రాయం:

    06/01/2018 12:32 pm

    అంతా బాగుంది గానీ “భావకవులవలె ఎవరికి(కీ) తెలియని ఏవో పాటలు పాడాలోయ్” అన్న పాట (పెళ్ళి చేసుకుని ఇల్లుచూసుకుని…) పింగళి రాసినది కాదు, శ్రీశ్రీది.

    -వాసు-

    [మీరు పొరబడ్డారు. అది రాసినది పింగళి. ఎక్కడా, చివరికి సినిమా టైటిల్స్‌లో కూడా శ్రీశ్రీ పేరు లేదు. ఇది రాసింది శ్రీశ్రీ అని మీదగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపగలరు – సం.]

  5. కలలు ఇచ్చిన బలిమి గురించి Srinivasa Rao m అభిప్రాయం:

    06/01/2018 11:43 am

    మీ వీశ్లేషణ చాల గొప్పగా ఊంది. ఆవిడ రచనలలో పెళ్ళి పిల్లలు జీవితం, అందులొని నివేదిత చాలా ఉన్నతమైన పాత్ర. మౌనపోరాటం నవల కూడ భిన్నమైనదే. తల్లితండ్రుల ఏకైక సంతానం, గారబంగా పెరిగిన మేధ వాళ్ళని వ్యతిరేకించి పెళ్ళి చేసుకుంటుంది. చదువుతున్న MBBS మాని మరీ. తర్వాత ఆ భర్త సన్యాసులలో చేరడం, స్నేహితుడి సహాయంతో జీవితపోరాటం. మళ్ళా భర్త తిరిగి వచ్చినప్పటికి అతనిని స్వీకరించక పోవడం. సుకుమారి, ఈజీవితం నాది, ప్రేమదీపిక (తెలుగులో కాంచన గంగ సినిమా) కూడా అద్భుతమైనవే.

  6. కలలు ఇచ్చిన బలిమి గురించి Nageswara Rao అభిప్రాయం:

    06/01/2018 11:41 am

    ఆ మహారచయిత్రికి గొప్ప నివాళి మీ వ్యాసం. ఆవిడ తెలుగు నవలా ప్రపంచానికి రారాణి. నిజజీవితంలోకూడా రారాణిలాగే ఎంతో హుందాగా జీవించారు. ఆవిడ రచనలన్నీ ఆవిడలాగే హుందాతనంతో, పాజిటివ్ దృక్పథంతో నిండి ఉంటాయి.

    వారి రచనల వలననే నేను తెలుగు సాహిత్యం చదవడం అలవాటు చేసుకొన్నాను. ఆ కారణజన్మురాలికి నా కన్నీటి నివాళి.

  7. కలలు ఇచ్చిన బలిమి గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    06/01/2018 8:40 am

    చాలా బాగా విశ్లేషించారు. ముగ్గురు ఆడపిల్లల తండ్రి నవల “జీవన సౌరభం” అప్పుల తాకిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పాత్ర తండ్రిది. తమిళంలో అనువాదం చేశాను. “Idhaya Geetham” అన్న పేరిట వచ్చింది.
    స్త్రీ పురుషులలో ఎవరూ ఎక్కువ తక్కువ కారని, అర్ధనారీశ్వర తత్వం అలవరచుకుంటే జీవితం సాఫీగా, ఒడిదుడుకులు లేకుండా గడిచి పోతుందని తన రచనల ద్వారా చెబుతూ వచ్చారు. ఆవిడ రచనలను తమిళ పాఠకులకు అందించగలిగాను అన్న తృప్తి నాకు. ఇంకా ఆవిడ నవలలు అనువాదం చెయ్యవలసినవి మిగిలి పోయాయి. వాటిని కూడా అనువదించ గలిగే అవకాశం దొరుకుతుందని ఎదురుచూస్తున్నాను.

  8. కలలు ఇచ్చిన బలిమి గురించి subhadra అభిప్రాయం:

    06/01/2018 8:24 am

    ఎంత బాగా రాశారో!! నవలాసుమాలనన్ని ఒక దగ్గర గుచ్చి అల్లిన కదంబమాల. ఆమె అభిమానులందరికీ గొప్ప కానుక మీ వ్యాసం. అభినందనలు..

  9. కలలు ఇచ్చిన బలిమి గురించి సురేష్ వెంకట్ అభిప్రాయం:

    06/01/2018 7:02 am

    ఎంత బాగా చెప్పారు!!. ఈ వ్యాసం యద్దనపూడి గారి అభిమానులకి లభించిన గొప్ప కానుక. Thank you so much 💐💐💐

  10. రవీంద్రధనుస్సు గురించి GARIMELLA PARAMESWARA RAO అభిప్రాయం:

    05/31/2018 11:12 pm

    ఈ వ్యాసం మరియు అందులో ఇమడ్చబడిన ఠాగూర్ గీతిక మూల అనువాదాలవల్ల కొంతవరకు, వ్యాస రచయిత స్వీయ అనుకరణవల్ల మరింతమేరకు మూలగీత భావాన్ని ఆస్వాదించగల్గాను.

    చరిత్రపుటల్లోనున్న ఆణిముత్యాలను ఆనాడు అన్యభాషలలో (ఇంచుమించుగా) యథాతథంగా చూపించుట భాషరూపేణా ఒక కళ అయితే ఆ ఆణిముత్యాన్ని కేవలం ఆస్వాదించేందుకైకాకుండా నిజ జీవితంలో కొంతలోకొంతవరకైనా అన్వయించేందుకై ప్రేరేపించేటటువంటి నేటి అనుకరణలు ఆ మూల భావాన్ని వ్యవహారికంగా జీవింపచేయగల్గుతాయి అనంటే అతిశయోక్తికాదేమో.

    వేణు దశిగి గారికి హృదయపూర్వక అభినందనలు.