నువ్వన్నట్టు ‘ఐ లవ్ యూ! యూ కంప్లీట్ మీ! ప్లీజ్ ప్లీజ్ ప్లీజని…’ ఈ మంత్రం మరవని రోజు మాత్రం ఉందా? అటువంటి రాత్రిని మాత్రం నిదురపోనిచ్చానా?
విత్ బొమ్మ యు అర్ కంప్లీట్ …విథౌత్ బొమ్మ యు ఆర్ ఇంకంప్లీట్.
అందుకే అది/ అవి అడుగుతూ ఉంటాయి! కంప్లీట్ మీ అని! చి న
మీ విశ్లేషణ ఆసక్తి కరంగా ఉన్నదండీ. దీని వల్ల రచయితలకు గానీ వ్యాఖ్యాతలకు గానీ ఈ పత్రిక సంపాదకులకు గానీ ఏమైనా ప్రయోజనం సమకూరుతుంది ఏమో నాకు తట్టడం లేదు గానీ ఒక ట్రెండ్ ని పరిశీలించడానికి తద్వారా సమాజ గమనంలో ఒక కోణాన్ని చూడ్డానికి ఇది ఉపయోగ పడుతుందని నేను అనుకుంటున్నాను.
పిల్లల కోసం చిత్ర ఆవేదన అర్థం ఆయ్యింది. పిల్లలు కలగకపోయినా ఫరవాలేదన్న గిరిని కూడా అర్థం చేసుకోవచ్చు. సున్నితమైన సమస్యని ఇంకా సున్నితంగా చెప్పి ఉండవచ్చనిపించింది.
కథనానికి ఇబ్బందిలేకుండా ఇంగ్లిష్ లోని ఆ నాలుగక్షరాల పదాన్ని వాడకుండా కూడా అక్కడ వాక్యం రాయవచ్చు. అవసరంలేనిచోట కూడా అటువంటి పదాలు వాడటం వల్ల ఆ పదాల ప్రభావం తగ్గిపోతుంది. అడ్డమైనదానికి awesome అన్నట్టుగా!
ఈ పదాలు ఒకసారి సరిచూసుకుని ఉంటే బాగుండేది. కంప్లికేట్, ఆక్యుపైడ్, సాఫయింది.
కథ కంటే క్రాఫ్టే కొట్టచ్చినట్టు కనిపిస్తోంది – టి.వి. సీరియళ్లలో బాక్ గ్రౌండ్ మ్యూసిక్ లాగ.
పిల్లలు లేకపోవడం అనేది అంతో, ఇంతో సంస్కారం ఉన్న కుటుంబాలలో మాత్రం ఇలా మాత్రం జరగదు. అదొక “సమస్య”గా ఎవరూ పరిగణించరు – there is dignity in that pain, and people understand that. (This story missed that point). అందుకని, ఈ విషయాలు ఫామిలీ గెట్ టుగెదర్లలో, ఫేస్ బుక్ చర్చల్లా ఎవరూ బాహాటంగా బయటపడి సలహాలు నెత్తిన పడెయ్యరు. పెద్దవాళ్లు కూడా ఎంతో సున్నితంగా, గంభీరంగా చెప్తారు. భార్యా భర్తల మధ్య కూడా, ఆఫీసుల్లో డిజైన్ డిస్కషన్లలా వాడిగా వేడిగా చర్చలు, యుద్ధాలు జరగవు – లోపం ఎవరిలో ఉన్నా సరే. మాటల కంటే మౌనమే ఎక్కువ ఉంటుంది. మరోవిషయం – ఇలాంటి విషయాలలో దేవుడి దగ్గరకి వెళ్లడం, తీర్థయాత్రలు చేసేది ఎంతో పూనికతో, ఇష్టంతో చేస్తారు. అక్కడకి వెళ్తే కోరిక నెరవేరిపోతుందని ఆశతో కాదు – it is a silent acknowledgement that certain things are beyond our control. ప్రపంచం అంతా ఇంకా ఫేస్బుక్ గుంపుల్లా అయిపోలేదు – నిండుతనాలు, పెద్దరికాలు ఇంకా ఉన్నాయి.
ఈ రోజుల్లో బాబాల కంటే “infertility clinics” ఎక్కువ సొమ్ము చేసుకుంటున్నాయి – అక్కడ జరిగే మోసాలు, దగా మరోరకం. దత్తత తీసుకోవడం గురించీ చిన్నవాళ్ల కంటే పెద్దవాళ్లే ఎక్కువగా చెప్తున్నారు కూడా, అందుకని, కొత్తగొంతులో చెప్పినా ఇది పాతికేళ్లనాటి పాతకథే.
సంపాదకులకి: కథల్లో, వ్యాసాల్లో ఇంగ్లీషు వాక్యాలు అవసరమనుకుంటే, వాటిని ఇంగ్లీషు లిపిలో రాస్తేనే చదువుకోవటానికి సులువుగా ఉంటుంది కదా?
పూర్వం ఏథెన్స్ నగరంలో నార్సిసస్ అనే గొప్ప అందగాడు ఉండేవాడు. వాడికి తన మీద తనకే గొప్ప వ్యామోహం. తన అందం మీద తనకే పిచ్చి ప్రేమ. ఎల్ల వేళలా తనని తాను ప్రేమించుకోవడం తనని తాను చూసుకోవడం తప్ప వేరే వ్యాపకం లేని వాడు. ఒకరోజు ఒక కొలను గట్టున కూర్చుని యధాలాపంగా నీటిలోకి తొంగి చూసాడు. నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో తన ప్రతిబంబం. చూసి మురిసి పోయాడు. తన అందానికి తానే ముగ్ధుడైపోయాడు. మైమరచి పోయాడు. వెర్రి వ్యామోహంతో ఆ ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకోవడానికి కొలను మీదకు వంగాడు. అలా తన ప్రతిబింబాన్ని తానే ముద్దు పెట్టుకునే ప్రయత్నంలో నీటి కొలనులో పడి మరణించాడు. అప్పటి నుండి తనని తాను విపరీతంగా ఇష్టపడే వారిని తనని తాను విపరీతంగా ప్రేమించుకునే వారిని నార్సిసస్ గా పిలవడం మొదలెట్టారు. ఈ రకమైన కాంప్లెక్స్‌ని నార్సిసిస్ కాంప్లెక్స్ (Narcissus complex) అంటారు.
ఈ రెండు వ్యాఖ్యల చివర ద. హా., చి న, అనే అక్షరాలు కనపడ్డాయి. వీటి అర్థం తెలీలేదు.
ద హ అంటే దరహాసం
చి న అంటే చిరు నవ్వు.
జాలంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ‘ఎమోటికాన్’ లున్నాయి. వాటికి బదులుగా తెలుగు లో ఈ ‘ద హా’ లు, ‘చి హ’ లని ఆలమూరు సౌమ్య తన బ్లాగు మాయ శశిరేఖలో పొట్టి నవ్వులు అని ప్రచురించారు. ఆ బ్లాగు టపాలో ఈ చి న , ద హ లు, మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఉన్నవి. అసక్తి ఉన్నవారు అక్కడ చూసుకోవచ్చు: మాయ శశిరేఖ — పొట్టి నవ్వులు
అనిల్ గారూ నమస్తే. యువతకి తెలుసనీ తెలియదనీ అనడం లేదు. కథలో యువతి కోణాన్ని మాత్రమే తెలిపే ప్రయత్నం చేశాను. ఆమె పరిస్థితినీ ఆందోళననీ ఆశతో కూడిన వూహనీ అల్లిన ప్రయత్నమే. ప్రశంసకు ధన్యవాదాలు. పోతే ఖదీర్ గారి పుస్తకం ఇంకా చదవలేదు. కథారచనకు పనికొచ్చే పలు అంశాల్లో ఇదీ ఒకటి కాబట్టి ఇలాటిదే అయి వుండచ్చు. వైవాహిక బంధాలు విఫలమవడమూ బాధాకరమూ రచనాపరంగా ఆసక్తి కరమైన అంశమే.
సిలబస్: 5. బొమ్మ ఎందుకు? గురించి Anil అట్లూరి అభిప్రాయం:
07/16/2018 8:38 pm
నువ్వన్నట్టు ‘ఐ లవ్ యూ! యూ కంప్లీట్ మీ! ప్లీజ్ ప్లీజ్ ప్లీజని…’ ఈ మంత్రం మరవని రోజు మాత్రం ఉందా? అటువంటి రాత్రిని మాత్రం నిదురపోనిచ్చానా?
విత్ బొమ్మ యు అర్ కంప్లీట్ …విథౌత్ బొమ్మ యు ఆర్ ఇంకంప్లీట్.
అందుకే అది/ అవి అడుగుతూ ఉంటాయి! కంప్లీట్ మీ అని! చి న
ఈమాటలో వ్యాఖ్యలపై ఒక పరిశీలన గురించి S. Narayanaswamy అభిప్రాయం:
07/16/2018 6:54 pm
మీ విశ్లేషణ ఆసక్తి కరంగా ఉన్నదండీ. దీని వల్ల రచయితలకు గానీ వ్యాఖ్యాతలకు గానీ ఈ పత్రిక సంపాదకులకు గానీ ఏమైనా ప్రయోజనం సమకూరుతుంది ఏమో నాకు తట్టడం లేదు గానీ ఒక ట్రెండ్ ని పరిశీలించడానికి తద్వారా సమాజ గమనంలో ఒక కోణాన్ని చూడ్డానికి ఇది ఉపయోగ పడుతుందని నేను అనుకుంటున్నాను.
1 + 1 గురించి Anil అట్లూరి అభిప్రాయం:
07/16/2018 8:57 am
పిల్లల కోసం చిత్ర ఆవేదన అర్థం ఆయ్యింది. పిల్లలు కలగకపోయినా ఫరవాలేదన్న గిరిని కూడా అర్థం చేసుకోవచ్చు. సున్నితమైన సమస్యని ఇంకా సున్నితంగా చెప్పి ఉండవచ్చనిపించింది.
కథనానికి ఇబ్బందిలేకుండా ఇంగ్లిష్ లోని ఆ నాలుగక్షరాల పదాన్ని వాడకుండా కూడా అక్కడ వాక్యం రాయవచ్చు. అవసరంలేనిచోట కూడా అటువంటి పదాలు వాడటం వల్ల ఆ పదాల ప్రభావం తగ్గిపోతుంది. అడ్డమైనదానికి awesome అన్నట్టుగా!
ఈ పదాలు ఒకసారి సరిచూసుకుని ఉంటే బాగుండేది.
కంప్లికేట్, ఆక్యుపైడ్, సాఫయింది.
1 + 1 గురించి nagaraju pappu అభిప్రాయం:
07/15/2018 12:38 am
కథ కంటే క్రాఫ్టే కొట్టచ్చినట్టు కనిపిస్తోంది – టి.వి. సీరియళ్లలో బాక్ గ్రౌండ్ మ్యూసిక్ లాగ.
పిల్లలు లేకపోవడం అనేది అంతో, ఇంతో సంస్కారం ఉన్న కుటుంబాలలో మాత్రం ఇలా మాత్రం జరగదు. అదొక “సమస్య”గా ఎవరూ పరిగణించరు – there is dignity in that pain, and people understand that. (This story missed that point). అందుకని, ఈ విషయాలు ఫామిలీ గెట్ టుగెదర్లలో, ఫేస్ బుక్ చర్చల్లా ఎవరూ బాహాటంగా బయటపడి సలహాలు నెత్తిన పడెయ్యరు. పెద్దవాళ్లు కూడా ఎంతో సున్నితంగా, గంభీరంగా చెప్తారు. భార్యా భర్తల మధ్య కూడా, ఆఫీసుల్లో డిజైన్ డిస్కషన్లలా వాడిగా వేడిగా చర్చలు, యుద్ధాలు జరగవు – లోపం ఎవరిలో ఉన్నా సరే. మాటల కంటే మౌనమే ఎక్కువ ఉంటుంది. మరోవిషయం – ఇలాంటి విషయాలలో దేవుడి దగ్గరకి వెళ్లడం, తీర్థయాత్రలు చేసేది ఎంతో పూనికతో, ఇష్టంతో చేస్తారు. అక్కడకి వెళ్తే కోరిక నెరవేరిపోతుందని ఆశతో కాదు – it is a silent acknowledgement that certain things are beyond our control. ప్రపంచం అంతా ఇంకా ఫేస్బుక్ గుంపుల్లా అయిపోలేదు – నిండుతనాలు, పెద్దరికాలు ఇంకా ఉన్నాయి.
ఈ రోజుల్లో బాబాల కంటే “infertility clinics” ఎక్కువ సొమ్ము చేసుకుంటున్నాయి – అక్కడ జరిగే మోసాలు, దగా మరోరకం. దత్తత తీసుకోవడం గురించీ చిన్నవాళ్ల కంటే పెద్దవాళ్లే ఎక్కువగా చెప్తున్నారు కూడా, అందుకని, కొత్తగొంతులో చెప్పినా ఇది పాతికేళ్లనాటి పాతకథే.
సంపాదకులకి: కథల్లో, వ్యాసాల్లో ఇంగ్లీషు వాక్యాలు అవసరమనుకుంటే, వాటిని ఇంగ్లీషు లిపిలో రాస్తేనే చదువుకోవటానికి సులువుగా ఉంటుంది కదా?
అనంతకవితాకాంచి గురించి సంతోష్ అభిప్రాయం:
07/13/2018 10:20 pm
బావుంది. కొత్తగా అనిపించింది. తిలక్ గారి ద్వైతం కవిత గుర్తొచ్చింది. ఇలాంటి ప్రక్రియ చూడటం ఇదే మొదటిసారి. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
ప్రారంభం గురించి Sasikala అభిప్రాయం:
07/13/2018 12:45 am
ఏమి కథా ప్రక్రియ! చాలా బాగుంది.👌
అదీ నేనే… గురించి జి.ఎస్.శ్రీకాంతు అభిప్రాయం:
07/12/2018 11:12 am
పూర్వం ఏథెన్స్ నగరంలో నార్సిసస్ అనే గొప్ప అందగాడు ఉండేవాడు. వాడికి తన మీద తనకే గొప్ప వ్యామోహం. తన అందం మీద తనకే పిచ్చి ప్రేమ. ఎల్ల వేళలా తనని తాను ప్రేమించుకోవడం తనని తాను చూసుకోవడం తప్ప వేరే వ్యాపకం లేని వాడు. ఒకరోజు ఒక కొలను గట్టున కూర్చుని యధాలాపంగా నీటిలోకి తొంగి చూసాడు. నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో తన ప్రతిబంబం. చూసి మురిసి పోయాడు. తన అందానికి తానే ముగ్ధుడైపోయాడు. మైమరచి పోయాడు. వెర్రి వ్యామోహంతో ఆ ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకోవడానికి కొలను మీదకు వంగాడు. అలా తన ప్రతిబింబాన్ని తానే ముద్దు పెట్టుకునే ప్రయత్నంలో నీటి కొలనులో పడి మరణించాడు. అప్పటి నుండి తనని తాను విపరీతంగా ఇష్టపడే వారిని తనని తాను విపరీతంగా ప్రేమించుకునే వారిని నార్సిసస్ గా పిలవడం మొదలెట్టారు. ఈ రకమైన కాంప్లెక్స్‌ని నార్సిసిస్ కాంప్లెక్స్ (Narcissus complex) అంటారు.
ఈమాటలో వ్యాఖ్యలపై ఒక పరిశీలన గురించి Anil అట్లూరి అభిప్రాయం:
07/11/2018 6:36 am
ద హ అంటే దరహాసం
చి న అంటే చిరు నవ్వు.
జాలంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ‘ఎమోటికాన్’ లున్నాయి. వాటికి బదులుగా తెలుగు లో ఈ ‘ద హా’ లు, ‘చి హ’ లని ఆలమూరు సౌమ్య తన బ్లాగు మాయ శశిరేఖలో పొట్టి నవ్వులు అని ప్రచురించారు. ఆ బ్లాగు టపాలో ఈ చి న , ద హ లు, మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఉన్నవి. అసక్తి ఉన్నవారు అక్కడ చూసుకోవచ్చు: మాయ శశిరేఖ — పొట్టి నవ్వులు
పది నిముషాలు గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:
07/09/2018 6:52 am
అనిల్ గారూ నమస్తే. యువతకి తెలుసనీ తెలియదనీ అనడం లేదు. కథలో యువతి కోణాన్ని మాత్రమే తెలిపే ప్రయత్నం చేశాను. ఆమె పరిస్థితినీ ఆందోళననీ ఆశతో కూడిన వూహనీ అల్లిన ప్రయత్నమే. ప్రశంసకు ధన్యవాదాలు. పోతే ఖదీర్ గారి పుస్తకం ఇంకా చదవలేదు. కథారచనకు పనికొచ్చే పలు అంశాల్లో ఇదీ ఒకటి కాబట్టి ఇలాటిదే అయి వుండచ్చు. వైవాహిక బంధాలు విఫలమవడమూ బాధాకరమూ రచనాపరంగా ఆసక్తి కరమైన అంశమే.
నటనకు గీటురాయి గురించి K.V.Giridhararao అభిప్రాయం:
07/06/2018 5:14 pm
Nice introduction to the book. Congrats.