పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. రాగమాలిక గురించి amarendra dasari అభిప్రాయం:

    08/02/2018 10:38 pm

    dear ఉష అనిల్ సురేశ్ , మీకు మూడు కోట్ల థాంకూలూ…మీ, టూరేంద్రుదు

  2. దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో గురించి సూర్యనారాయణ మూర్తి ఆకెళ్ళ అభిప్రాయం:

    08/02/2018 5:41 pm

    భారతీయ అస్తిత్వానికి శాంతియుత జీవనం అవసరం అని పరిశీలనలో ఎక్కడ వెల్లడయ్యిందో కనిపించలేదు

  3. దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో గురించి సూర్యనారాయణ మూర్తి ఆకెళ్ళ అభిప్రాయం:

    08/02/2018 5:36 pm

    ఇంటర్వ్యూ చాలా బావుంది, భాష కోసం ఆయన కృషి అభినందనీయం

  4. రాగమాలిక గురించి కాజ సురేశ్ అభిప్రాయం:

    08/02/2018 4:39 pm

    భలే సరదాగానూ నొస్టాల్జిక్ గానూ ఉంది మీ ప్రయాణం. హాయిగా ఉంది మీ కథనం. మరో విధముగా భావించకపోతే మీకు ‘టూరేంద్రుడు’ అనే బిరుదు నివ్వాలని నాకు చాలా కోరికగా ఉంది. ఇచ్చేసాను కూడా 🙂

    ఇంకో విషయము – ఆ రైలు ప్లాట్ఫారమ్ వివరణ అది నాకు ఎందుకో ఇజాజత్ సినిమాలోని మొదటి సీను గుర్తుకొచ్చింది.

  5. నేహల: చారిత్రక నవల గురించి మోహన అభిప్రాయం:

    08/02/2018 1:01 pm

    గొర్తిగారు, నేను చెప్పిందల్లా నేహల రాణివాసానికి వెళ్లితే తాను మళ్లీ తనవాళ్లను చూడడానికి వీలవుతుందో లేదో అనే విషయములోని సామ్యమును గురించి మాత్రమే. ఈ విషయము నేహలకు ముందే తెలుసు, మల్లీశ్వరికి అక్కడికి వెళ్లిన తరువాత తెలుస్తుంది. ఇకపోతే, మల్లీశ్వరి విషయానికి వస్తే మల్లీశ్వరికి (నేహలలా) కృష్ణదేవరాయలను పెళ్లాడాలని ఉండి ఉండకపోవచ్చును. చిత్రములో అలా చూపకపోయినా, కృష్ణదేవరాయలకు అలాటి ఊహ ఎందుకు తరువాత కలుగకూడదు? ముగ్గురు రాణులు, ఎనిమిదిమంది భార్యలు, లెక్కకులేనన్ని ఇతర స్త్రీలు అప్పటి ఆ రాజులకు రివాజు అని చదివియున్నాను. మీ స్పష్టమైన వివరణకు ధన్యవాదములు. – విధేయుడు – మోహన

  6. సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి Sri అభిప్రాయం:

    08/02/2018 12:29 pm

    చాలా బావుంది. thank for writing

  7. ఆగస్ట్ 2018 గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    08/02/2018 11:26 am

    అవసరమైన అర్ధవంతమైన సంపాదకీయం.

  8. ఒక సంస్కారవంతమైన కథ గురించి aparna అభిప్రాయం:

    08/02/2018 11:04 am

    యేదీ..ఇంకా వేరే కామెంట్స్ రావట్లేదే!

    🙂 బోల్డన్ని హగ్స్ పూర్ణీమా!

  9. పరీక్ష గురించి gsrammohan అభిప్రాయం:

    08/02/2018 10:30 am

    good one

  10. నేహల: చారిత్రక నవల గురించి Gorti Brahmanandam అభిప్రాయం:

    08/02/2018 10:10 am

    మోహన రావు గారూ:

    మీరు పుస్తకం చదివి మీ అభిప్రాయాలు సమీక్ష రూపంలో అందరితో పంచుకోవడం సంతోషం. ధన్యవాదాలు.

    ఒక చిన్న వివరణ ఇవ్వాలనిపించింది.

    ఈ సమీక్షలో ఒక చోట – బహుశా ఈ కథ మల్లీశ్వరి సినిమాకథకు కూడ ఒక స్ఫూర్తియేమో! – అని రాసారు.

    నేహలకీ, మల్లీశ్వరికీ చాలా తేడాలు ఉన్నాయి.

    మల్లీశ్వరి సినిమాకి బుచ్చిబాబు రాసిన ఒక నాటకం ప్రేరణ. అందులో మల్లీశ్వరిని కృష్ణ దేవరాయలు పెళ్ళాడాలని అనుకోడు. కేవలం రాణివాసంలో సఖిగానే వెళుతుంది మల్లీశ్వరి.

    నా దృష్టిలో ఇది కల్పిత కథ. ముఖ్యంగా కృష్ణ దేవరాయల్ని మరో మెట్టు పైకెక్కించే ప్రయత్నంలో రాసింది. ఇక్కడ కృష్ణ దేవరాయలు మల్లీశ్వరిని వివాహం చేసుకోవాలని కోరుకోడు.

    నేహల కథకి వస్తే దేవరాయలు ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అక్కడ కథ అడ్డం తిరుగుతుంది. ఇంకోటి ఈ మొత్తం కథలో నేహల ముద్గల్ దాటి విజయనగరం ఛాయలక్కూడా వెళ్ళదు. ఆమె ప్రయాణం అంతా ఉత్తరాన ఉన్న గుల్బర్గా, రాయచూరు వైపే.

    ఇంకోటి – నేహల దేవరాయల్ని ఎప్పుడూ కలుసుకోలేదు.

    రెండూ వేర్వేరు కథలు.
    నేహల చరిత్రలో భాగం.
    మల్లీశ్వరి ఒక కల్పిత కథ.

    -సాయి బ్రహ్మానందం