పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. శ్యామలాదండకపు ఛందస్సు గురించి తః తః అభిప్రాయం:

    09/03/2018 1:50 am

    నమస్కారాలు శ్రీ మోహన : త గణం తో దండక నిర్మాణం గురించి :
    ఇక్కడ నుంచి చూస్తే అన్నీ త గణాలే “_కళ్యాణ _సంధాత్రి, _గాంధర్వ _విద్యాక _ళాకంఠ
    నాళాం,త్రి _ వేదీవ _ళీంసార _సాహిత్య _నిర్వర్తి _త ప్రోల్ల_సద్దృక్త ,…..
    …_.విద్యామ _యీంత్వాంభ _జే” గురువు తో అంతమౌతూ .
    ప్రతి చరణమూ మొదలు కొంత వదిలేస్తే ఇలా గే కనిపిస్తుంది .
    తః తః

  2. కె. రాణి పాడిన కొన్ని పాటలు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    09/03/2018 1:19 am

    మొక్కజొన్న తోటలో (కొనకళ్ల వెంకటరత్నం రచన, పిఠాపురంతో కలిసి పాడినది) Quite strange! No trace of vulgarity in the female voice.No cheap gyrations!Need not be prejudiced aganist this rendition !

  3. మూడు షరతులు గురించి సతీష్ బాబు సి అభిప్రాయం:

    09/02/2018 1:15 pm

    కథ బాగుంది. చదివిన వెంటనే తేలిగ్గా జీర్ణం కాదు. నెమరు వేయాలి. లోతైన ఆలోచనలను ప్రోది చేస్తూ సాగే కథనం. సంక్లిష్టత అనాలా? ఏమో? విభిన్నమైన శైలి. కొన్ని ధోరణులపట్ల నిశ్శబ్ధంగా ప్రకటించే తిరుగుబాటు.

  4. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సుకు ఆహ్వానం గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    09/02/2018 12:36 pm

    ఉపన్యాసకుల పేర్లన్నీ మన పద్ధతి ప్రకారం ఇంటిపేరుతో మొదలుపెట్టి వ్రాయడం బాగుంది. అమెరికాలో స్థిరపడినప్పటికీ మనలోమనం ఇలాగే వ్యవహరించుకోవాలని విన్నపం.

  5. శ్యామలాదండకపు ఛందస్సు గురించి తః తః అభిప్రాయం:

    09/02/2018 9:54 am

    శ్రీ మోహన :
    చాలా సంవత్సరాల క్రితం ‘భోగినీ దండకం -కామ బాణం ‘ ప్రతి దొరికితే చదివాను. అందులో ముందుమాట లో దండకం త గణము తోనే నిర్మిస్తారని గురువు తో ముగిస్తే అది కామ బాణమని చదివినట్టు గుర్తు .మీ వ్యాసం చాలా వివరాలను తెలిపింది.
    నమస్కారాల తో
    తః తః

  6. శ్యామలాదండకపు ఛందస్సు గురించి desikachary అభిప్రాయం:

    09/02/2018 9:13 am

    మోహనరావుగారి వ్యాసము బాగున్నది. గణపవరపు వేంకటకవికృతిలో గాక, ఇంకేదో కావ్యంలో ‘దండకవృత్తం’ చూచినట్లుగా నాకు గుర్తు వస్తూవుంది గాని, ఎక్కడ చూచినానో చెప్పలేకపోతున్నాను. నేను వ్రాసిన’జక్కనచరిత్ర’ మహాకావ్యంలో రాణియగు శాన్తలాదేవిని మేల్కొలుపు వైతాళకగీతులలో భాగంగా ప్రాసరహితమైన అర్ణవదండకపాదాలుగల ఈక్రింది ‘దండకవృత్తం’ వ్రాసినాను. ఇందులో ప్రతిపాదంలో రెండు నగణములు, 8 రగణములు ఉన్నవి.
    జయము! జయము! శాంతలా! శ్రీప్రభాచంద్ర కా
    రుణ్య సంపాదితాశేషనృత్యాది విద్యానిధీ!
    యదుకులమణి విష్ణుభూపాలచేతోఽనురాగాబ్ధి సం
    వర్ధకోదారరాకేందులేఖా మనోజ్ఞాకృతీ!
    నవరసరచితోరుచిత్రాయమానాస్యవిన్యాస, ర
    మ్యాంగవిక్షేపసంయుక్త లాస్యామరీజిత్వరీ!
    అగణితగుణనీరధీ! భారతీ భార్గవీ పార్వతీ
    పార్శ్వనాథాంఘ్రిరాజీవ లీలాభ్రమత్ షట్పదీ!

  7. ప్రచ్ఛన్నపరిణయము గురించి Cherla Sastry అభిప్రాయం:

    09/02/2018 8:50 am

    Kudos and Congratulations to the author Dr Desikachary for giving us this beautiful musical Drama . His writing style and story telling is of the highest order- like Shakespeare and Kalidasa. Excellent singing by Mrs Ratna Cherla.

  8. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి buchi reddy gangula అభిప్రాయం:

    09/02/2018 8:47 am

    రంగనాయకమ్మగారి సమీక్ష చదివాను- మూడునాలుగుసార్లు.
    వారి సమీక్షను సమర్థిస్తాను.
    బాగుంది.

    ========================

    రెడ్ది..

  9. మూడు షరతులు గురించి VarmA అభిప్రాయం:

    09/02/2018 12:11 am

    బాగుంది సార్.

  10. శ్యామలాదండకపు ఛందస్సు గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    09/01/2018 6:51 pm

    వ్యాసం బావుంది.

    శ్రీనాధుని దండకం అచ్చులో పదాల మధ్య ఖాళీలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కలిపి ఇచ్చారెందుకు?

    జయజయ జనయిత్రి, కల్యాణసంధాత్రి, గాంధర్వవిద్యాకళా కంఠనాళాం,
    త్రివేదీవళీం సారసాహిత్య నిర్వర్తిత ప్రోల్లసద్దృక్తరంగాం,

    అదే ఈ క్రింది విధంగా ఉంటే చదవడానికి సులభంగా ఉంటుంది.

    జయ జయ జనయిత్రి, కల్యాణ సంధాత్రి, గాంధర్వ విద్యాకళా కంఠనాళాం,
    త్రివేదీవళీం సార సాహిత్య నిర్వర్తిత ప్రోల్లస ద్దృక్తరంగాం

    – సాయి బ్రహ్మానందం గొర్తి