ఇప్పుదు కూడా గుల్భము అని పూరిస్తెనె ఆకుపచ్చ వెలుగుతుంది మరి!!
భవదీయుడు
రామారావు ఆళ్ళ.
[సాఫ్ట్‌వేర్ లో ఒక గడిలో ఒకటే సమాధానం మాత్రమే ఇవ్వగలము, కాబట్టి ఒక్క సమాధానానికి మాత్రమే అది ఆకుపచ్చ చూపిస్తుంది. కానీ, విజేతలను ప్రకటించేటప్పుడు సాఫ్ట్‌వేర్ ఆకుపచ్చ చూపకపోయినా గుల్ఫము అని రాసిన వారి సమాధానాలు కూడా సరైనదిగానే పరిగణించామని మరోసారి విన్నవించుకొంటున్నాము. — సం. ]
1) నా మొదటి సమాధానంలో “గుల్ఫము” అని పూరించి పంపి యున్నను
2) ఇప్పుదు కూడా గుల్భము అని పూరిస్తెనె ఆకుపచ్చ వెలుగుతుంది
భవదీయుడు
రామారావు ఆళ్ళ.
[మీ మొదటి సమాధానంలో గుల్ఫము సరైనదిగానే పరిగణించినా, మీరు పంపిన సమాధానాల్లో ఇంకో తప్పు, ఇంకో ఖాళీ గడి ఉండడం వల్ల మిమ్ముల్ని విజేతగా ప్రకటించలేకపోయాము. — సం. ]
కాగా, మరి తమరు ‘”గుల్భము” మాత్రమే సరైన సమాధానముగా గుర్తించుటకు కారణము తెలుపగలరని కోరుచున్నాను
విధేయుడు
రామారావు ఆళ్ళ
[మేము గుల్ఫము కూడా సరైన సమాధానంగానే పరిగణించాము. మిగిలిన సమాధానాలు సరైనవైతే, ఇటువంటి పదవ్యత్యయాలను (word-variations) సరైన సమాధానాలుగానే పరిగణిస్తూ వచ్చాము — సం. ]
సమవుజ్జీ
గురించి chandramouli kalyanachakravarthy అభిప్రాయం:
నాకు రెండు సందేహాలు నివృత్తి చేయగలరు. 1.వరుడు వఫువు నుదుటిపై వధువు శిరస్సు వెనకనుండి కుడిచేతి ద్వారా బొట్టు పెడతాడు. దీని అర్థం ఏమిటి? 2.వరుడు మంగళసూత్రం కట్టే సమయములో బాజాభజంత్రి గట్టిగా కొట్టమని గట్టిగా కొట్టిస్తారు ఎందుకని
నేను కెనడా వాస్తవ్యుడిని. ఇక్కడికి అందరూ రావడమే కానీ ఇమ్మిగ్రేషన్ వారు కానీ, యూనివర్సిటీ వారు కానీ జాగ్రత్తలు చెప్పగా నేను చూడలేదు, వినలేదు. నాకు మాత్రం ఈ కథ చాలా సహజంగా, వున్నతంగా అనిపించింది. ముగింపు ఇంకా బాగా నచ్చింది – ఎందుకంటే అలాంటి స్వఛ్ఛమయిన పల్లెటూర్లు ఇంకా ఇండియాలో వున్నయ్యో లేవో కానీ ఈ అతి నాగరిక కెనడాని వదిలేసి నా చిన్నప్పటి అమాయకపు గ్రామానికి వెళ్ళి, ఆ బాల్యానికి వెళ్ళి ఆ నక్షత్రాలని చూస్తూ, ఆ గ్రహాలని చూస్తూ మా నాన్న , మా అమ్మ చెప్పే కథలను వింటూ వింటూ హాయిగా బజ్జోవాలని వుంది. హ్మ్!
కథ ముందు సోదిగా అనిపించినా తరువాత బాగనిపించింది. నా వుద్దేశ్యం ఏమిటంటే అంత ఎక్కువగా మీ పుస్తక పరిజ్ఞానం ఈ కథలో వెల్లాడించాల్సింది కాదు – ఒక ప్రత్యేక వ్యాసం వ్రాస్తే బావుండేది. తెలుగు రచయిత్రులు ఈమాత్రం ధైర్యమయిన కథావస్తువు తీసుకుని వ్రాయగలుగుతున్నారా అని చకితుడిని అయ్యాను. ఆభినందనలు. ముగింపు కూడా క్లుప్తంగా, చక్కగా వుంది. ఎక్కడ ఎంతలో ఆపాలో అలా కథని ముగించారు.
నేనెప్పుడు మార్తాస్ వైన్‌ల్యాండ్ వెళతానో ఏమో. అప్పుడు తప్పకుండా మీ కథ నాకు గుర్తుకు వస్తుందనుకుంటా 🙂
ఒకే కథ రకరకాల తేడాలతో వివిధ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కనిపించడం మనకు కొత్తకాదు కదా! ఇది కూడా అంతే. నేను సంస్కృత హరివంశం చదవలేదు కానీ సోమన ఉత్తరహరివంశంలో ఉన్నట్టుగానే (ఈ వ్యాసంలో పేర్కొన్నట్టు), ఎర్రన హరివంశంలోనూ ఉంది. కాబట్టి బహుశా సంస్కృత హరివంశ భాగవతాల్లోనే ఈ తేడాలు ఉండి ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆయా కాలాలలో ప్రసిద్ధమైన తత్త్వ దర్శనాలకు అనుగుణంగా యీ మార్పులు జరిగి ఉండవచ్చునని అనిపిస్తుంది. భాగవత కథలో చివరకు వైకుంఠంలో నారాయణుడు దర్శనమిస్తే, హరివంశ కథలో ఒక మహా కాంతి మాత్రమే కనిపిస్తుంది. అందులోకి కృష్ణుడు మాత్రమే ప్రవేశిస్తాడు. అది సాంఖ్యులు, యోగులు చెప్పే పరమపురుషుని స్వరూపంగా అభివర్ణింపబడింది! (భాగవత కథలో కొన్ని పొసగని అంశాలున్నట్టు నాకనిపించింది, అది వేరే విషయం)
ఇక ఒకే కథను ఇద్దరు కవులు ఎలా నిర్వహిస్తారో పరిశీలిస్తే, అసలు కవిత్వం ఎక్కడ ఉంటుందో, అందులో కవి వ్యక్తిత్వం ఎలా ప్రతిఫలిస్తుందో చక్కగా తెలుస్తుంది. అందుకు ఎర్రన హరివంశం, సోమన ఉత్తరహరివంశం మంచి అవకాశాన్ని యిస్తాయి. ఈ విప్ర బాలకుల కథనే తీసుకుంటే, సోమన రచనలోని వక్రత (అదే అతని కవిత్వంలోని ప్రత్యేకత) స్పష్టంగా కనిపిస్తుంది.
కథ మొదలుపెట్టినప్పుడు, కృష్ణుడు యాగదీక్షుతుడు కావడం అనే అంశాన్ని ఎర్రన రెండు మూడు పద్యాలలో వివరంగా వివరిస్తాడు. “పశువులు యూపసంబద్ధంబులై యొప్ప” అంటూ యజ్ఞాన్ని పెద్ద సీసపద్యంలో వర్ణిస్తాడు.
అని అర పద్యంలో అదే విషయాన్ని టూకీగా చెప్తాడు. పైగా ‘ఒక’ అన్న పదం అన్ని సార్లు వాడడంలో ఆ చేసే యజ్ఞానికి కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేదు సుమా అన్న వ్యంగ్యం ఉంది. ఒకరోజు ఏదో ఒక శాస్త్రంలో చెప్పబడిన ఒక క్రతువు చెయ్యడానికి కూర్చున్నాడు – అనడంలో అది స్పష్టంగా తెలుస్తోంది. బహుశా ఎర్రన హరివంశంలో ఆ క్రతువు గురించి అంత పెద్ద వర్ణన చదివి, ఈ కథతో నేరుగా సంబంధం లేని దాన్ని గురించి అంతలేసి వర్ణన అనవసరం అనిపించి, దాన్ని ఎత్తిపొడవడానికే ఈ పద్యం నాచన సోమన రచించాడేమోనని నాకు అనిపిస్తుంది!
గడినుడి – 24 గురించి Rama Rao Alla అభిప్రాయం:
10/30/2018 8:07 am
ఆర్యా
ఇప్పుదు కూడా గుల్భము అని పూరిస్తెనె ఆకుపచ్చ వెలుగుతుంది మరి!!
భవదీయుడు
రామారావు ఆళ్ళ.
[సాఫ్ట్‌వేర్ లో ఒక గడిలో ఒకటే సమాధానం మాత్రమే ఇవ్వగలము, కాబట్టి ఒక్క సమాధానానికి మాత్రమే అది ఆకుపచ్చ చూపిస్తుంది. కానీ, విజేతలను ప్రకటించేటప్పుడు సాఫ్ట్‌వేర్ ఆకుపచ్చ చూపకపోయినా గుల్ఫము అని రాసిన వారి సమాధానాలు కూడా సరైనదిగానే పరిగణించామని మరోసారి విన్నవించుకొంటున్నాము. — సం. ]
సమవుజ్జీ గురించి VarmA అభిప్రాయం:
10/30/2018 7:31 am
అందరికీ ధన్యవాదాలు.
గడినుడి – 24 గురించి Rama Rao Alla అభిప్రాయం:
10/30/2018 4:29 am
ఆర్యా
1) నా మొదటి సమాధానంలో “గుల్ఫము” అని పూరించి పంపి యున్నను
2) ఇప్పుదు కూడా గుల్భము అని పూరిస్తెనె ఆకుపచ్చ వెలుగుతుంది
భవదీయుడు
రామారావు ఆళ్ళ.
[మీ మొదటి సమాధానంలో గుల్ఫము సరైనదిగానే పరిగణించినా, మీరు పంపిన సమాధానాల్లో ఇంకో తప్పు, ఇంకో ఖాళీ గడి ఉండడం వల్ల మిమ్ముల్ని విజేతగా ప్రకటించలేకపోయాము. — సం. ]
గడినుడి – 24 గురించి Rama Rao Alla అభిప్రాయం:
10/29/2018 6:43 am
అర్యా
గుల్ఫము = చీలమండ
గుల్భము = చీలమండ
కాగా, మరి తమరు ‘”గుల్భము” మాత్రమే సరైన సమాధానముగా గుర్తించుటకు కారణము తెలుపగలరని కోరుచున్నాను
విధేయుడు
రామారావు ఆళ్ళ
[మేము గుల్ఫము కూడా సరైన సమాధానంగానే పరిగణించాము. మిగిలిన సమాధానాలు సరైనవైతే, ఇటువంటి పదవ్యత్యయాలను (word-variations) సరైన సమాధానాలుగానే పరిగణిస్తూ వచ్చాము — సం. ]
సమవుజ్జీ గురించి chandramouli kalyanachakravarthy అభిప్రాయం:
10/24/2018 8:49 am
ఇది కత కాదెహె… చినెమా!
ది సర్జ్ గురించి తః తః అభిప్రాయం:
10/24/2018 5:33 am
ఆహా! వచనం మేల్కొలిపిన వివేకంతో పొయట్రీ రాస్తే? ఒక vivacious circle!
తః తః
వివాహాలూ తతంగాలూ గురించి త్యాగరాజన్ రవీంద్రనాధ్ అభిప్రాయం:
10/23/2018 11:30 pm
నాకు రెండు సందేహాలు నివృత్తి చేయగలరు. 1.వరుడు వఫువు నుదుటిపై వధువు శిరస్సు వెనకనుండి కుడిచేతి ద్వారా బొట్టు పెడతాడు. దీని అర్థం ఏమిటి? 2.వరుడు మంగళసూత్రం కట్టే సమయములో బాజాభజంత్రి గట్టిగా కొట్టమని గట్టిగా కొట్టిస్తారు ఎందుకని
బలిసిన మేకను పట్టుకుంటాను గురించి శరత్ కాలమ్ అభిప్రాయం:
10/23/2018 9:48 pm
నేను కెనడా వాస్తవ్యుడిని. ఇక్కడికి అందరూ రావడమే కానీ ఇమ్మిగ్రేషన్ వారు కానీ, యూనివర్సిటీ వారు కానీ జాగ్రత్తలు చెప్పగా నేను చూడలేదు, వినలేదు. నాకు మాత్రం ఈ కథ చాలా సహజంగా, వున్నతంగా అనిపించింది. ముగింపు ఇంకా బాగా నచ్చింది – ఎందుకంటే అలాంటి స్వఛ్ఛమయిన పల్లెటూర్లు ఇంకా ఇండియాలో వున్నయ్యో లేవో కానీ ఈ అతి నాగరిక కెనడాని వదిలేసి నా చిన్నప్పటి అమాయకపు గ్రామానికి వెళ్ళి, ఆ బాల్యానికి వెళ్ళి ఆ నక్షత్రాలని చూస్తూ, ఆ గ్రహాలని చూస్తూ మా నాన్న , మా అమ్మ చెప్పే కథలను వింటూ వింటూ హాయిగా బజ్జోవాలని వుంది. హ్మ్!
ది సర్జ్ గురించి శరత్ కాలమ్ అభిప్రాయం:
10/23/2018 9:10 pm
కథ ముందు సోదిగా అనిపించినా తరువాత బాగనిపించింది. నా వుద్దేశ్యం ఏమిటంటే అంత ఎక్కువగా మీ పుస్తక పరిజ్ఞానం ఈ కథలో వెల్లాడించాల్సింది కాదు – ఒక ప్రత్యేక వ్యాసం వ్రాస్తే బావుండేది. తెలుగు రచయిత్రులు ఈమాత్రం ధైర్యమయిన కథావస్తువు తీసుకుని వ్రాయగలుగుతున్నారా అని చకితుడిని అయ్యాను. ఆభినందనలు. ముగింపు కూడా క్లుప్తంగా, చక్కగా వుంది. ఎక్కడ ఎంతలో ఆపాలో అలా కథని ముగించారు.
నేనెప్పుడు మార్తాస్ వైన్‌ల్యాండ్ వెళతానో ఏమో. అప్పుడు తప్పకుండా మీ కథ నాకు గుర్తుకు వస్తుందనుకుంటా 🙂
నాకు నచ్చిన పద్యం: సోమన తెలుగు జాతీయాల సొబగు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
10/21/2018 5:35 am
ఒకే కథ రకరకాల తేడాలతో వివిధ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కనిపించడం మనకు కొత్తకాదు కదా! ఇది కూడా అంతే. నేను సంస్కృత హరివంశం చదవలేదు కానీ సోమన ఉత్తరహరివంశంలో ఉన్నట్టుగానే (ఈ వ్యాసంలో పేర్కొన్నట్టు), ఎర్రన హరివంశంలోనూ ఉంది. కాబట్టి బహుశా సంస్కృత హరివంశ భాగవతాల్లోనే ఈ తేడాలు ఉండి ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆయా కాలాలలో ప్రసిద్ధమైన తత్త్వ దర్శనాలకు అనుగుణంగా యీ మార్పులు జరిగి ఉండవచ్చునని అనిపిస్తుంది. భాగవత కథలో చివరకు వైకుంఠంలో నారాయణుడు దర్శనమిస్తే, హరివంశ కథలో ఒక మహా కాంతి మాత్రమే కనిపిస్తుంది. అందులోకి కృష్ణుడు మాత్రమే ప్రవేశిస్తాడు. అది సాంఖ్యులు, యోగులు చెప్పే పరమపురుషుని స్వరూపంగా అభివర్ణింపబడింది! (భాగవత కథలో కొన్ని పొసగని అంశాలున్నట్టు నాకనిపించింది, అది వేరే విషయం)
ఇక ఒకే కథను ఇద్దరు కవులు ఎలా నిర్వహిస్తారో పరిశీలిస్తే, అసలు కవిత్వం ఎక్కడ ఉంటుందో, అందులో కవి వ్యక్తిత్వం ఎలా ప్రతిఫలిస్తుందో చక్కగా తెలుస్తుంది. అందుకు ఎర్రన హరివంశం, సోమన ఉత్తరహరివంశం మంచి అవకాశాన్ని యిస్తాయి. ఈ విప్ర బాలకుల కథనే తీసుకుంటే, సోమన రచనలోని వక్రత (అదే అతని కవిత్వంలోని ప్రత్యేకత) స్పష్టంగా కనిపిస్తుంది.
కథ మొదలుపెట్టినప్పుడు, కృష్ణుడు యాగదీక్షుతుడు కావడం అనే అంశాన్ని ఎర్రన రెండు మూడు పద్యాలలో వివరంగా వివరిస్తాడు. “పశువులు యూపసంబద్ధంబులై యొప్ప” అంటూ యజ్ఞాన్ని పెద్ద సీసపద్యంలో వర్ణిస్తాడు.
అదే సోమన అయితే:
ఒకనా డొక శాస్త్రములో
నొక క్రతు వొకనాటి దీక్ష కొనరిన గని ధా
ర్మికు డా హరి యది గైకొని
యొకచో నుండంగ విప్రు డొక డేతెంచెన్