Tried to purchase one in Telugu or English versions but available nowhere. Can somebody guide me?
[‘భిత్తి’కి తెలుగు అనువాదం ఇంకా రాలేదు. ఆంగ్లానువాదం, బెంగుళూరులోని పుస్తకాల అంగళ్ళలో దొరకవచ్చును. – సం.]
పద్మవ్యూహం
గురించి చిట్టత్తూరుమునిగోపాల్ అభిప్రాయం:
10/28/2025
8:58 am
మహాభారత కాలంలోకి… సుభద్ర గర్భశోకంలోకి… తీసుకువెళ్లి పడేసి ఊపిరి ఆడకుండా చేసి… నిజంగా కథ ముగిసినా ఇంకా వెలుపలికి రాలేకపోతున్నాను. జయమోహన్ గారి తమిళ మూలం ఎలా ఉందో కానీ- భాస్కర్ గారూ, మీ శైలి… ధర్మ సూత్రాలలోని డొల్లతనాన్ని ఎండగట్టి, సుభద్ర దుఃఖాన్ని గుండెలో కుప్పపోసింది. గ్రేట్…!
వ్యాసులవారు దుఃఖపడటం అనేది వింతమాట. మూలంలో వ్యాసులవారు స్వయంగా తన తల్లి సత్యవతీమహాదేవితో గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్, కులనాశనం కళ్ళతో చూడవలసిన దుర్యోగం నీకెందుకు వానప్రస్థం చేయమని చెప్పారు. ఆయనకు మనకున్న సకలశోకమోహాదివికారాలనూ అంటించటం అసహ్యం.
ఆ బహుభర్తృత్వం అనే ఆచారం ఏదో భారతకాలం తరువాత వచ్చి ఉంటుంది.
కుంతి చేసిన ఆలోచన అన్నమాట మూలభారతవిరుధ్ధం. కేవలం రచయిత కల్పన.
కల్పన అనేది కథకూ పాత్రలకూ స్వభావవిరుద్ధమైన వికారాలను అంటించి ఆనందించడానికి కాదు. ఈధోరణి తప్పు. అసహ్యం.
ఈవాముపక్ష జీలకర్రపక్ష మేతావులు భారతీయ వాంగ్మూలాన్ని అగౌరవపరచటనికి చేసె ఈచండాలాలను ఖండించవలసిందే.
స్త్రీ అందరికీ వుమ్మడి అనడంలో రచయిత అహంకారం ఏమీలేదు. ఇప్పటికి ఉత్తరభారతంలో ఘడ్వాల్ ప్రాంతంలో ఆ సంప్రదాయం కొనసాగుతూనే వున్నది. స్త్రీమూర్తి ప్రకృతిపరంగా శారీరకంగా మానసికంగా అనేకమందిని (పాండవులలాగా) హ్యాండిల్ చేయగలదు. అప్పటి పరిస్థితుల్లో అన్నదమ్ములను కలిపివుంచడానికి కుంతీ చేసిన ఆలోచన అది. ఏ విషమ స్థితికైనా స్త్రీ మరియు ధనం కారణమవుతాయని వ్యాసులవారు కూడా గ్రహించి వుంటారు. భీముల వారికి వున్న నాసొత్తు అన్న అహంకారం మిగతావారికి అట్టే లేకపోవడం గమనించతగ్గది.
పర్వ తెలుగు ట్రాన్సలేషన్ యెంతో బాగా చేశారు. మొదలుపెడితే ఒక పట్టాన వదలలేము. వ్యాసులవారి దుఃఖం (పుత్రుడు శుకుడి వలన) మనమే అనుభవించి చాలా వ్యధ పొందుతాం. చిన్న హెచ్చరిక పుస్తకం కొనేముందు పేజీలు తిరగవేయండి. ఒక పబ్లిషర్ వేసిన ప్రింట్ లో పేజీకి ఏభయి అక్షర దోషాలు వున్నాయి. తస్మాద్ జాగృత.
మీకు నమస్కృతులు. గొప్ప సాహిత్య౦ గల కన్నడ భాష నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకాలు చదివినపుడు గొప్ప సంతోషం కలుగుతుంది. అనువాదకుల పాత్ర చాలా రుచితో వున్నది. అందువలననే కాబోలు కన్నడ భాష ఎక్కువ సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకొన్నది. శ్రీనివాస్ గారికీ ఈమాట సంపాదకులకు కృతజ్ఞతలు.
“భార్యను చెరచడానికి వచ్చినవాణ్ణి చంపిపారేయడమనే ప్రాథమిక ప్రవృత్తి మనందరికీ లేదా? పాశ్చాత్య పురుషులకూ లేదా? ఈ సార్వకాలికమైన, సార్వత్రికమైన పురుషభావం, లేదా, పురుష అహంకారం, పురుష యాజమాన్యం సాహిత్యానికి చెందిన సత్య వస్తువు కాదా?!”
ఏమి చిత్రమైన మాటలు?
మీ చేతిసంచీనో మెడలోని గొలుసుతో ఎవరో గుంజుకుపోవ చూస్తే మీరు ప్రతిఘటించరా? వీలైతే నాలుగు వడ్డించరా?
ఇందులో “సార్వకాలికమైన, సార్వత్రికమైన పురుషభావం, లేదా, పురుష అహంకారం, పురుష యాజమాన్యం సాహిత్యానికి చెందిన సత్య వస్తువు” ఏమైనా ఉందా?
అంతెందుకు అసహజత్వం ఏమైనా ఉందా?
ఆ తస్కరుడు ఒక మగవారిని ఎత్తుకుపోవ చూస్తే వాడిని ఎదిరించటంలో పురుషాహంకారం ఏమిటీ? అహంకారం వదిలి హమ్మయ్య అని వాడికో దండం పెట్టాలంటారా భైరప్ప గారు? అసలు పురుషయజమాన్యం మాట ఎందుకు వచ్చిందండీ? స్త్రీ అనేది అందరికీ ఉమ్మడిసొత్తు తప్ప ఒక్కడికే భార్య కావటం ఏమిటీ తప్పు అనా భైరప్ప గారి భీకరసిధ్ధాంతం?
ఈప్రతిఘటన ప్రాథమిక ప్రవృత్తి అంటూనే అదేదో పురుషుల అహంకారం మాత్రమే అన్నట్లు పిచ్చి మాటలు బాగోలేవు.
ఈయన గొప్ప రచయిత కావచ్చు. దానికేం. కాని తప్పుడు మాటలు తప్పుడు మాటలే.
లోయ అంచుల్లో… గురించి రమణమూర్తి అభిప్రాయం:
11/02/2025 1:00 am
(ఈ వాక్యం కథను పక్కదోవ పట్టించగలదనుకుంటున్నాను. దీనికి బదులు – ఎందుకలా రాగలిగాను? ఏ ఉద్దేశంతో? – అని చేర్చ వచ్చేమో. బందా)
కథలో ఎడిటర్ల వ్యాఖ్యని ఎడిట్ చేయడం మర్చిపోయారా? 🙂
[ఈ పొరపాటును మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. – సం.]
భైరప్పగారి ఆత్మకథ ‘భిత్తి’ గురించి T subrahmanyam అభిప్రాయం:
10/30/2025 7:48 am
Tried to purchase one in Telugu or English versions but available nowhere. Can somebody guide me?
[‘భిత్తి’కి తెలుగు అనువాదం ఇంకా రాలేదు. ఆంగ్లానువాదం, బెంగుళూరులోని పుస్తకాల అంగళ్ళలో దొరకవచ్చును. – సం.]
పద్మవ్యూహం గురించి చిట్టత్తూరుమునిగోపాల్ అభిప్రాయం:
10/28/2025 8:58 am
మహాభారత కాలంలోకి… సుభద్ర గర్భశోకంలోకి… తీసుకువెళ్లి పడేసి ఊపిరి ఆడకుండా చేసి… నిజంగా కథ ముగిసినా ఇంకా వెలుపలికి రాలేకపోతున్నాను. జయమోహన్ గారి తమిళ మూలం ఎలా ఉందో కానీ- భాస్కర్ గారూ, మీ శైలి… ధర్మ సూత్రాలలోని డొల్లతనాన్ని ఎండగట్టి, సుభద్ర దుఃఖాన్ని గుండెలో కుప్పపోసింది. గ్రేట్…!
పర్వ మున్నుడి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
10/25/2025 2:23 am
వ్యాసులవారు దుఃఖపడటం అనేది వింతమాట. మూలంలో వ్యాసులవారు స్వయంగా తన తల్లి సత్యవతీమహాదేవితో గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్, కులనాశనం కళ్ళతో చూడవలసిన దుర్యోగం నీకెందుకు వానప్రస్థం చేయమని చెప్పారు. ఆయనకు మనకున్న సకలశోకమోహాదివికారాలనూ అంటించటం అసహ్యం.
ఆ బహుభర్తృత్వం అనే ఆచారం ఏదో భారతకాలం తరువాత వచ్చి ఉంటుంది.
కుంతి చేసిన ఆలోచన అన్నమాట మూలభారతవిరుధ్ధం. కేవలం రచయిత కల్పన.
కల్పన అనేది కథకూ పాత్రలకూ స్వభావవిరుద్ధమైన వికారాలను అంటించి ఆనందించడానికి కాదు. ఈధోరణి తప్పు. అసహ్యం.
ఈవాముపక్ష జీలకర్రపక్ష మేతావులు భారతీయ వాంగ్మూలాన్ని అగౌరవపరచటనికి చేసె ఈచండాలాలను ఖండించవలసిందే.
పర్వ మున్నుడి గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:
10/23/2025 5:24 am
స్త్రీ అందరికీ వుమ్మడి అనడంలో రచయిత అహంకారం ఏమీలేదు. ఇప్పటికి ఉత్తరభారతంలో ఘడ్వాల్ ప్రాంతంలో ఆ సంప్రదాయం కొనసాగుతూనే వున్నది. స్త్రీమూర్తి ప్రకృతిపరంగా శారీరకంగా మానసికంగా అనేకమందిని (పాండవులలాగా) హ్యాండిల్ చేయగలదు. అప్పటి పరిస్థితుల్లో అన్నదమ్ములను కలిపివుంచడానికి కుంతీ చేసిన ఆలోచన అది. ఏ విషమ స్థితికైనా స్త్రీ మరియు ధనం కారణమవుతాయని వ్యాసులవారు కూడా గ్రహించి వుంటారు. భీముల వారికి వున్న నాసొత్తు అన్న అహంకారం మిగతావారికి అట్టే లేకపోవడం గమనించతగ్గది.
పర్వ మున్నుడి గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:
10/23/2025 5:01 am
పర్వ తెలుగు ట్రాన్సలేషన్ యెంతో బాగా చేశారు. మొదలుపెడితే ఒక పట్టాన వదలలేము. వ్యాసులవారి దుఃఖం (పుత్రుడు శుకుడి వలన) మనమే అనుభవించి చాలా వ్యధ పొందుతాం. చిన్న హెచ్చరిక పుస్తకం కొనేముందు పేజీలు తిరగవేయండి. ఒక పబ్లిషర్ వేసిన ప్రింట్ లో పేజీకి ఏభయి అక్షర దోషాలు వున్నాయి. తస్మాద్ జాగృత.
భైరప్ప నవలలు — భారతీయ దర్శనాలు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:
10/23/2025 4:38 am
మీకు నమస్కృతులు. గొప్ప సాహిత్య౦ గల కన్నడ భాష నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకాలు చదివినపుడు గొప్ప సంతోషం కలుగుతుంది. అనువాదకుల పాత్ర చాలా రుచితో వున్నది. అందువలననే కాబోలు కన్నడ భాష ఎక్కువ సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకొన్నది. శ్రీనివాస్ గారికీ ఈమాట సంపాదకులకు కృతజ్ఞతలు.
కంప్యూటర్ చిప్ కథ – 6: రసాయనాన్ని విద్యుత్తుతో సంధించిన హంఫ్రీ డేవీ ప్రయోగాలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
10/22/2025 1:26 am
ఇంత గొప్ప వ్యాసపరంపరను పుస్తకరూపంలో భద్రపరచటం అత్యవసరం అని నా అభిప్రాయం. ఈమాటవారి పుస్తకభాడారంలో దానిని ఉంచితే బాగుంటుంది.
అచ్చువేయించి తెలుగుదేశపు పాఠశాలలో అందుబాటులోనికి తేగలిగితే విద్యార్థులను శాస్త్రపరిశోధనారంగం వైపు నడిపించగలదని ఆశించవచ్చు.
పద్మవ్యూహం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
10/21/2025 8:53 am
బాగోలేదు.
పర్వ మున్నుడి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
10/21/2025 8:25 am