నిజంగా నిధులే !
ముఖ్యంగా ఆకులో ఆకునై గీతాన్ని ఎలా పాడారని ఆసక్తితో విన్నాను. సినిమా బాణీకి భిన్నంగా ఉన్నా త్రిశ్ర గతి మాత్రం తప్పలేదు. కవి దీన్ని ఖండగతి లో రచించాడు. అలాగే పాడుకోవాలని ఊహించాడు. ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చంటే పదాల పోహళింపు ద్వారా! ఆకులో /ఆకునై / పూవులో/ పూవునై..అని ఖచ్చితంగా ఐదు మాత్రలకు పదాలు తెగడం అటుంచి దీర్ఘం తీయాల్సిన చోట కూడా “ఈయడవె”/ దాగిపో/నా… అని పదాన్ని హ్రస్వాంతం చేశాడు. పై పాటలో లేదు గానీ గలగలని / పొంగె చిరు / గాలిలో కెరటమై .. అనే చరణం (అచ్చులో చూస్తే స్పష్టమౌతుంది ) లో ఈ విషయం ఇంకా స్ఫుటంగా కనిపిస్తుంది.
పరుచూరి గారికీ భట్టు గారికీ కృతజ్ఞతలు
This story was taken up for discussion by Vedika Hyderabad in their monthly meeting on 10 Oct ’20. About 12 people discussed over 100 minits and tried to unfold the many layered story..
ఎక్కడో మీరు చందమామ చిత్రారులు చిత్ర గురించి రాసిన వ్యాసం చదివాను.
వారు బొమ్మలు వేసేటప్పుడు మీరు ఎన్నో సార్లు అతని పక్కనే కూర్చుని బొమ్మలు వేయటం చూసారని రాశారు.
నేను చిత్ర గారి బొమ్మలకు వీరాభిమానిని…వారు బొమ్మలు వేసే విధానం మీకు తెలిసింది వివరంగా చెబితే తెలుసుకోవాలని వుంది…అదేవిధంగా వారి వారసుల (కుటుంబ సభ్యుల) వివరాలు తెలుసుకోవాలని వుంది. దయచేసి మీకు చిత్ర గారికి సంబంధించి మీకు తెలిసిన జ్ఞాపకాలు తెలుపగలని ఒక అభిమానిగా కోరుకుంటున్నాను.
చాలా బాగా రాసావు సుధ! పాత్రల మనస్తత్వ చిత్రీకరణ అద్బుతం. ప్రతి సగటు మనిషి అను character తో easy గా connect అవుతారు. Climax లో అను కి realization కలిగించిన తీరు బావుంది.
ముఖ్యంగా ఈ కధ పాఠకులకు వారి వారి విశ్లేషణ ఎంత వరకు వెళ్లగలదో అంత దూరం వెళ్లే scope ఇస్తుంది…
I expect many more of these from your pen 😊
పతంజలి శాస్త్రి గారి ” రామేశ్వరం కాకులు” కధలోని నిర్భాగ్యురాలు పద్మ లాగా ( మోసంచెయ్యబడి, వ్యభిచార కూపం లోకి నెట్టివెయ్యబడి చివరికి ఇక యీపనిచెయ్యని అంటూ బేబి వ్యభిచార కంపెనీ వదిలి… పెద్దలకు పిండాలు పెడతారు, అందరి ఆత్మలు అక్కడికి వచ్చి వెళతాయి అని విన్న రామేశ్వరం వెళ్లి సముద్రం లోకి నడుచుకుంటూ వెళ్లిన పద్మ లాగా )
కనిగిరి కె. భాస్కర్ మాస్టారు గారు రాసిన “అవ్యాజం” కధలోని వీరిగాడి పెళ్లాం లాగా ( పదహారేళ్ల వయసులో వీరిగాడి రెండోపెళ్లాంగా పల్లెటూర్లోకి అడుగుపెట్టి… రోజూ తాగొచ్చి బండబూతులు తిట్టి, మూలనున్న కర్రతో గొట్టే ఆ మొగుడు ఆరునెలలకే చస్తే… వాడవదినగా మారి ఊర్లో సగంమంది కుర్రాళ్లకు పడకమీద తొలి అనుభవాన్నే కాక… బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, బతకగలననే ధైర్యాన్ని ఇచ్చినా … చివరకు ఊరబావిలో శవమై తన జీవితం కడతేర్చుకున్న వీరిగాడి పెళ్లాం లాగా )
‘అక్కకున్న అప్పులన్నీ తీర్చేసి కన్యకా స్త్రీ అయిపోతాను, లేదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అనే నెమ్మదస్తురాలు, మెత్తని మాట తీరు రోహిణి… పరువుని అమ్ముకుని జీవనం సాగిస్తున్న రోహిణి వల్ల తనకు గనేరియా రోగం అంటుకున్నదని ఓ మొరటు అడ్డగాడిద కొట్టి, బూతులు తిట్టడంతో బాగా నొచ్చుకుని వాడు వెళ్ళగానే రైలు పట్టాలు చూసుకుని… ఆర్పేసిన కొవ్వొత్తిలా చనిపోయిన రోహిణి కూడా పాఠకుల హృదయాల్లో నిలిచిపోయే ఉదాత్త పాత్ర.
అమూల్యమైన, వైవిధ్యభరితమైన తమిళ కధాసాహిత్య అనుసృజనలతో తెలుగు పాఠకులను పరామర్శిస్తున్న అవినేని భాస్కర్ కు నెనర్లు.
కృష్ణగీతాంజలి గురించి Suryam Ganti అభిప్రాయం:
10/16/2020 6:05 pm
అందించిన వారందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు
కృష్ణగీతాంజలి గురించి Dr. I.Pinakapani అభిప్రాయం:
10/16/2020 1:02 am
నిజంగా నిధులే !
ముఖ్యంగా ఆకులో ఆకునై గీతాన్ని ఎలా పాడారని ఆసక్తితో విన్నాను. సినిమా బాణీకి భిన్నంగా ఉన్నా త్రిశ్ర గతి మాత్రం తప్పలేదు. కవి దీన్ని ఖండగతి లో రచించాడు. అలాగే పాడుకోవాలని ఊహించాడు. ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చంటే పదాల పోహళింపు ద్వారా! ఆకులో /ఆకునై / పూవులో/ పూవునై..అని ఖచ్చితంగా ఐదు మాత్రలకు పదాలు తెగడం అటుంచి దీర్ఘం తీయాల్సిన చోట కూడా “ఈయడవె”/ దాగిపో/నా… అని పదాన్ని హ్రస్వాంతం చేశాడు. పై పాటలో లేదు గానీ గలగలని / పొంగె చిరు / గాలిలో కెరటమై .. అనే చరణం (అచ్చులో చూస్తే స్పష్టమౌతుంది ) లో ఈ విషయం ఇంకా స్ఫుటంగా కనిపిస్తుంది.
పరుచూరి గారికీ భట్టు గారికీ కృతజ్ఞతలు
పరామర్శ గురించి Srinivas Bandaa అభిప్రాయం:
10/15/2020 11:19 pm
“ఉన్నట్టుండి ఊది ఆర్పేసిన కొవ్వొత్తిలా..
“ఇంకెందులో మాత్రం అర్థం ఉందనీ?..”
మనసుని విలక్షణంగా పొడిచిన భావాలు.
చాలాయేళ్ల తర్వాత, అనువాదం అనిపించని రచన చదివిన తృప్తి కలిగిందండి!
Pages with Mani గురించి sudha అభిప్రాయం:
10/14/2020 11:45 am
ఈ కథని ప్రచురించిన ఈ మాట ఎడిటర్స్ కి, వేదికవాళ్లకి ధన్యవాదలు
Pages with Mani గురించి Amarendra Dasari అభిప్రాయం:
10/12/2020 9:39 pm
This story was taken up for discussion by Vedika Hyderabad in their monthly meeting on 10 Oct ’20. About 12 people discussed over 100 minits and tried to unfold the many layered story..
కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి A.Mohan Kumar అభిప్రాయం:
10/12/2020 1:41 am
సర్ నమస్కారం!
ఎక్కడో మీరు చందమామ చిత్రారులు చిత్ర గురించి రాసిన వ్యాసం చదివాను.
వారు బొమ్మలు వేసేటప్పుడు మీరు ఎన్నో సార్లు అతని పక్కనే కూర్చుని బొమ్మలు వేయటం చూసారని రాశారు.
నేను చిత్ర గారి బొమ్మలకు వీరాభిమానిని…వారు బొమ్మలు వేసే విధానం మీకు తెలిసింది వివరంగా చెబితే తెలుసుకోవాలని వుంది…అదేవిధంగా వారి వారసుల (కుటుంబ సభ్యుల) వివరాలు తెలుసుకోవాలని వుంది. దయచేసి మీకు చిత్ర గారికి సంబంధించి మీకు తెలిసిన జ్ఞాపకాలు తెలుపగలని ఒక అభిమానిగా కోరుకుంటున్నాను.
Pages with Mani గురించి sudha అభిప్రాయం:
10/11/2020 9:15 pm
Thank you Srinivas garu and Usha .
Pages with Mani గురించి ఉష అభిప్రాయం:
10/11/2020 6:40 pm
చాలా బాగా రాసావు సుధ! పాత్రల మనస్తత్వ చిత్రీకరణ అద్బుతం. ప్రతి సగటు మనిషి అను character తో easy గా connect అవుతారు. Climax లో అను కి realization కలిగించిన తీరు బావుంది.
ముఖ్యంగా ఈ కధ పాఠకులకు వారి వారి విశ్లేషణ ఎంత వరకు వెళ్లగలదో అంత దూరం వెళ్లే scope ఇస్తుంది…
I expect many more of these from your pen 😊
Pages with Mani గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
10/11/2020 1:28 am
తెరచి చూడనంతవరకూ మనుషులందరూ మూసివున్న పుస్తకాలే. రెండు పుస్తకాలు ఒకదాన్నొకటి చదువుకున్న వైనాన్ని అతి చక్కగా చెప్పారు. చాలా బాగుంది.
పరామర్శ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/10/2020 10:38 am