మామూలుగా హార్మోనియం మీద పలికే గమకాలన్నీ కీబోర్డు మీద కూడా పలికించవచ్చు. మోడల్ ని బట్టి కీబోర్డులో పియానో, వయొలిన్ మొదలైన ఎన్నో ధ్వనులు పలుకుతాయి కనక వీలును బట్టి ఏదో వాటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఇవికాక కొన్ని మోడల్స్ లో పిచ్ బెండర్ సదుపాయం ఉంటుంది. స్ప్రింగ్ లోడెడ్ పద్ధతిలో పనిచేసే ఈ మీటను ఉపయోగించి కుడిచేత్తో వాయిస్తున్న స్వరానికి అటూ ఇటూ ఉండే స్వరాలను సాగదీసినట్టుగా పలికించవచ్చు. దీన్ని ఉపయోగించి కీబోర్డు మీద కొందరు నిపుణులు వీణ, నాదస్వరం వగైరా పద్ధతుల్లో అద్భుతమైన కర్ణాటక గమకాలను పలికించగలరు. దీనికి ఎంతో అభ్యాసం కావాలి. కీబోర్డు ధ్వనులన్నీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో సృష్టి అవుతున్నవే కనక గమకాల ‘భ్రమ’ను కలిగించడం కూడా సాధ్యమవుతుంది.
పాశ్చాత్య సంగీతంలో ఎడమచేతిని సామాన్యంగా బేస్ (మంద్ర) స్వరాల కోసమో, కార్డ్ ప్రోగ్రెషన్స్ (స, గ, ప మొదలైన స్వరాల కాంబినేషన్) కోసమో ఉపయోగిస్తారు. ఇటువంటివి మన శాస్త్రీయసంగీతంలో అవసరం కావు. పాశ్చాత్య సంగీతంలో పోలీఫోనీ (ఒకేసారిగా పలు స్వరాలు మోగడం) ఉంటుంది. మనది మోనోఫోనీ. ఎటొచ్చీ కీబోర్డు మీద మన దేశపు సినిమా పాటలు వాయిస్తున్నప్పుడు రెండో చేతిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అయితే కుడి చేత్తో పాట వాయిస్తున్నప్పుడు తక్కిన ఎఫెక్ట్స్ కోసమని ఎడమచేతిని ఉపయోగించడమూ కద్దు.
The editors have acknowledged the mistake. Unlike the print versions, the web allows us to correct mistakes.
It is only fair that the two should be published as two separate pieces. Sowmya Balakrishna clearly mentioned she was introducing Roy as writer and she did a good job of that.
Rohiniprasad is a scholar, perfectly capable of writing an article introducing Roy as film-maker.
Eemaata is a reputable magazine. I am sure they don’t want to carry this down history and archive it for posterity.
ఈమాట సంపాదకులకు,
ఇంతకాలంగా ఇంటర్నెట్ చూస్తున్నా ‘ఈమాట’ వెబ్ పత్రికను ఎప్పుడూ గమనించలేదు. అల్లసాని పెద్దన, అన్నమాచార్య మరెవరైనా సరే ఇప్పుడుండి ఉంటే మీ కృషికి జోహారులర్పించటమే కాదు, ఆ గండపెండేరాలు, ఆ సువర్ణమణిమయ భూషణాలు అన్నీ మీకు తొడిగి ఉండేవారు – మన తెలుగును ఈ విధంగా బ్రతికిస్తున్నందుకు. ఆంధ్రభాష మనుగడ పుట్టినగడ్డలో ప్రశ్నార్ధకంగా మారినా, మెట్టనగడ్డలో్ ఈ విధంగా మెరుగులీనుతున్నందుకు ఏ తెలుగు హృదయం మాత్రం పులకించదు? – మేడేపల్లి శేషు, న్యూఢిల్లీ.
జీవితమైనా , కవిత్వమైనా ఒక అరణ్యం అనుకుంటే అందులోని అసలు సారాన్ని (నీటి జాడ) గ్రహించలేక , అందరం ఒకానొక దశలో దారి తప్పి తిరిగే వాళ్ళమే. ఐతే ఆ నీటి జాడని కనుగొన్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో వ్యక్తం చెయ్యలేం. ఆ ఆనందం కోసం ఎన్ని సార్లైనా అడవిలో తప్పిపోవాలనిపిస్తుంది. అదే మొదటి కవిత.
కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను. ఐనా మీ విమర్శ వల్ల తప్పలేదు. మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని, ఇదే కోణంలో మిగతా కవితల్లోని నీటి జాడ కోసం వెతుక్కునే సత్తా మీకు ఉందనే నమ్ముతాను.
“నమిలి మింగిన పిప్పి” లాంటి పదాలు వాడే ముందు, ఇలాంటి కవితలు ఇంతకు ముందు ఏ కవి ఎలా వ్యక్తపరిచాడో చెప్పి ఉంటే మీ విమర్శలో కాస్త పస ఉండేది. మాబోటి కవులకి కాస్త ఉపయోగపడేది.
కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
09/06/2007 4:58 am

భూషణీయం గురించి mohanraokotari అభిప్రాయం:
09/06/2007 4:53 am
గొప్ప విషయాలు ఎంతో గొప్పగా అనుభవించి పలవరిస్తే, మమ్ములను మీ మనసులొకి తీసికెళ్తే, అనుభవాన్ని చూపు ముందు నిలిపి తాదత్మ్య పరిస్తే , చెప్పేదేముంది.
రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి Wyer2 అభిప్రాయం:
09/06/2007 4:48 am
The editors have acknowledged the mistake. Unlike the print versions, the web allows us to correct mistakes.
It is only fair that the two should be published as two separate pieces. Sowmya Balakrishna clearly mentioned she was introducing Roy as writer and she did a good job of that.
Rohiniprasad is a scholar, perfectly capable of writing an article introducing Roy as film-maker.
Eemaata is a reputable magazine. I am sure they don’t want to carry this down history and archive it for posterity.
Wyer Govin
ఈమాట గురించి గురించి Seshu Medepalli అభిప్రాయం:
09/06/2007 3:53 am
ఈమాట సంపాదకులకు,
ఇంతకాలంగా ఇంటర్నెట్ చూస్తున్నా ‘ఈమాట’ వెబ్ పత్రికను ఎప్పుడూ గమనించలేదు. అల్లసాని పెద్దన, అన్నమాచార్య మరెవరైనా సరే ఇప్పుడుండి ఉంటే మీ కృషికి జోహారులర్పించటమే కాదు, ఆ గండపెండేరాలు, ఆ సువర్ణమణిమయ భూషణాలు అన్నీ మీకు తొడిగి ఉండేవారు – మన తెలుగును ఈ విధంగా బ్రతికిస్తున్నందుకు. ఆంధ్రభాష మనుగడ పుట్టినగడ్డలో ప్రశ్నార్ధకంగా మారినా, మెట్టనగడ్డలో్ ఈ విధంగా మెరుగులీనుతున్నందుకు ఏ తెలుగు హృదయం మాత్రం పులకించదు? – మేడేపల్లి శేషు, న్యూఢిల్లీ.
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి ప్రసాదం అభిప్రాయం:
09/06/2007 12:47 am
చాలా బాగా వివరించారు. మీ అనుభవాలు చాలా బావున్నాయి.
వాన-పాట గురించి Alok అభిప్రాయం:
09/06/2007 12:46 am
ఇందులో అద్భుతమైన చిత్రాలేవీ కనపడ్డంలేదు. “నీ పాట కూడా అంతే” అన్న చోటనే కవిత ఆగిపోయింది.
కీబోర్డ్ మీద రాగాలు గురించి తెలుగుఅభిమాని అభిప్రాయం:
09/05/2007 11:24 pm
సర్, కీ బోర్డు పైన గమకాలు పలుకుతాయా? అలాగే పాశ్చాత్య సంగీతానికిమల్లే రెండు చేతులు ఉపయోగించి కర్ణాటక సంగీతం కూడా వాయించవచ్చా?
అరణ్య కవితలు గురించి Alok అభిప్రాయం:
09/05/2007 11:09 pm
ఇంక్విలాబు జిందాబాదు, నేను మాదిగనురా బాపనోడా అని పొలికేకలెట్టడవే కవిత్వమా కృష్ణాజీ? అక్కడెక్కడో కట్టే డాము మీద, ఫ్లై వోవర్ మీదా రాసే జాగ్రఫీనా కవిత్వం? తమ కడుపులో చల్ల కదలకండా వుంచుకొని ఫుట్ పాత్ జీవుల గురించి పేజీలెక్కన, కేజీలెక్కన మోజుకొద్దీ రాయడమేనా కదిలించే కవిత?
గుంటూరు శేషేంద్ర శర్మ గారి అభిప్రాయం రాసారు. బానే వుంది. మరి మిగతా కవులు మరీ ముఖ్యంగా ఇస్మాయిలు గారు ఏం చెప్పారో చదవలేదా? చదవకపొతే చదవండి.
జయప్రభగారి పబ్ ఆఫ్ వైజాగపట్నమ్ చదివారా? చదవకపోతే ఎంటనే చదవండి. గుత్తొంకాయ ఎలా వొండాలి, తద్దినాలప్పుడు ఏమేం తినొచ్చు అన్నీ తెలుస్తాయి. అట్లా తెల్సుకొని తెలుగు భాషని కవిత్వాన్ని పొయ్యిల్లోకి, గుండిగల్లోకి తోసి సంతోషిద్దాం.
కవిత్వం మాథమేటిక్సు గాదు లాజికల్ గా ఆలోచించి చదువర్లని అలోచింపచేడానికి. కవిత్వం పొలికేకలు గాదు. కవిత్వం జాగ్రఫీ, తిండియావ గాదు.
కవిత్వం గురించి చదవండని పక్కవాళ్ళకి సలహా ఇచ్చేముందు మనమెంత చదవేసామో చూసుకోవడం మంచిది.
అరణ్య కవితలు గురించి chavakiran అభిప్రాయం:
09/05/2007 9:29 pm
ఆర్యా!
కృష్ణాజీ,
ఓ నాలుగు మంచి కవితలు చెపితే చదివి ఆనందించాలనుంది.
ఇహ పోతే (ఎవరు అని అడగరు అని ఆశిస్తూ 🙂 )
నాకు ఈ కవిత చదవగానే అర్జంటుగా అడవిలో తప్పిపోవాలనిపించింది (ఇంతకు ముందు చాలా సార్లు అలా జరిగిందిలేండి)
అందుకనే నచ్చినది.
అందుకు కాకపొయినా ఈ కవితలో పాజిటివ్ నెస్ చాలా ఎక్కువ ఉన్నది. ఆశావాదం వైపు నడిపిస్తుంది.
—
మీ విమర్శ బాగుంది, ఇలాగే కొనసాగించండి మీ దాడి.
అరణ్య కవితలు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:
09/05/2007 9:07 pm
కృష్ణ గారు…
జీవితమైనా , కవిత్వమైనా ఒక అరణ్యం అనుకుంటే అందులోని అసలు సారాన్ని (నీటి జాడ) గ్రహించలేక , అందరం ఒకానొక దశలో దారి తప్పి తిరిగే వాళ్ళమే. ఐతే ఆ నీటి జాడని కనుగొన్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో వ్యక్తం చెయ్యలేం. ఆ ఆనందం కోసం ఎన్ని సార్లైనా అడవిలో తప్పిపోవాలనిపిస్తుంది. అదే మొదటి కవిత.
కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను. ఐనా మీ విమర్శ వల్ల తప్పలేదు. మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని, ఇదే కోణంలో మిగతా కవితల్లోని నీటి జాడ కోసం వెతుక్కునే సత్తా మీకు ఉందనే నమ్ముతాను.
“నమిలి మింగిన పిప్పి” లాంటి పదాలు వాడే ముందు, ఇలాంటి కవితలు ఇంతకు ముందు ఏ కవి ఎలా వ్యక్తపరిచాడో చెప్పి ఉంటే మీ విమర్శలో కాస్త పస ఉండేది. మాబోటి కవులకి కాస్త ఉపయోగపడేది.
ఏమైనా మీ విమర్శ కి ధన్యవాదాలు.
శెలవు.