మొదటిగా –
ఏ పత్రికకయినా వారి వారి అభిరుచుల్ని బట్టి కొన్ని నియమాలుంటాయి. ప్రమాణాలు ఉండచ్చు. దాన్ని బట్టే ఆ పత్రిక నాణ్యత ఉంటుంది. కాబట్టి కథల ఎంపిక విషయంలో అది వారిష్టం. ఒక పత్రిక తిరిగి పంపిన కథకి, ఇంకో పత్రిక బహుమతి ఇవ్వచ్చు. కథలని ప్రచురణకి ముందు, సమీక్ష చేయడం ఈమాట వారి ప్రమాణం కావచ్చు. ఇదికూడా ఆయా సమీక్షకుల అభిరుచిని బట్టీ, వారు వెలుబుచ్చే అభిప్రాయాలబట్టీ ఉంటుంది. ఒక్కోసారి సమీక్షకులు బాగా చేయచ్చు. లేదా బాగోలేదనీ సంపాదకులకు చెప్పచ్చు. ప్రచురణ విషయంలో అక్కడ సంపాదకుల విచక్షణకి ఆయా రచన పరిమితం అవుతుంది. కాబట్టి ఇవి నచ్చినప్పుడే రచయితలూ రాయడం జరుగుతుంది. మీరు రాసివ్వండి, మేము కళ్ళు మూసుకొని వేసేస్తాం అన్న ధోరణి తో అనేక పత్రికలు నడుస్తున్నాయి. ప్రమాణాలు ఎప్పుడూ సాపేక్షమే!
ఇహ రెండోది.
“అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.” అన్న విషయంతో నేను ఏకభవించను. ఒక రచయిత తన రచనని ప్రజల ముందు వదిలాక అది బాగుందీ, బాగోలేదూ అన్నది పాఠకుల అభీష్టం. రచయితకెలా రాసే హక్కు ఉందో, పాఠకులకీ విమర్శించే హక్కు ఉంది. ఇక్కడ సహృదయత ఆశంచడం ఎంత వరకు సబబు? రాసిన ప్రతీ రచన్నీ మెచ్చుకోవాలని ఆశించడం సహృదయతా? లేక నొప్పించకుండా పరవాలేదు అని చెప్పడం సహృయదతా?
అందరికీ అన్నీ నచ్చాలని లేదు. విషయ పరంగా నచ్చకపోయినా వస్తుపరంగా విమర్శ ఉంటే అది స్వీకరించడానికి రచయితలు సిద్ధంగా ఉండరు అన్నదే నా పాయింటు.
వెబ్ లో అనేక పత్రికలున్నాయి. ఎన్ని పత్రికలు ఇలా చర్చలకి ఆహ్వానం పలుకుతున్నాయి? ఈ మాట సంపాదక వర్గమూ కొన్ని అభిప్రాయాలని కత్తిరించిన సందర్భాలున్నాయి. కాదనను. ఇదీ విమర్శకులూ, రచయితలూ హద్దు మీరినప్పుడే! కొన్ని పత్రికలయితే కేవలం “ఆహా, ఓహో” అనే పొగడ్తలనే రాస్తాయి. తెగడ్తలని తుంచి పారేస్తాయి. ఇండియాలో పత్రికలయితే సరేసరి. స్థలా భావం సాకు ఎలాగూ ఉంది.
కాకపోతే మనకి అమెరికన్లలాగ నొప్పించకుండా చెప్పడం రాదు. చెత్త ప్రశ్నని కూడా “చాలా మంచి ప్రశ్న” అని మొదలెట్టి, చివరికి చెత్తలో చేర్చడం మనకలవాటులేదని నా అభిప్రాయం.
చివరగా, ఒక్కసారి ఈ అభిప్రాయాల శీర్షిక లేదనుకోండి. మనం ఇలా ఇన్ స్టంట్ గా చర్చించుకునే వాళ్ళమా, చెప్పండి?
హరీశ్ గారూ, ధన్యవాదాలు. న్యూమరాలజీ తోనూ, హస్త సాముద్రికం తోనూ నాకున్న పరిచయం తక్కువ. అందుచేత జ్యోతిషాన్ని విశ్లేషించినంతగా వాటి గురించి విశ్లేషించి వ్రాయలేను. అయితే ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్న విషయాలు కొన్ని వాటికి కూడా అన్వయించుకోవచ్చు.
ప్రిడిక్షన్సు చెప్పడానికి ఇవి మూడే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటాను. టారట్ కార్డులు, శకునాలు, స్వప్నాలు, స్ఫటికాల్లోకి తొంగి చూడ్డాలు, అంజనం వెయ్యడాలు, వాస్తు గట్రా, గట్రా. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీటిలో మనకి బాగా పరిచయమై,మన సంస్కృతిలో భాగమైనవాటిని మనం తేలిగ్గా నమ్ముతాం. మిగతావి అంత తేలిగ్గా నమ్మం. సంస్కృతి, సామాజిక శాస్త్రం, సైకాలజీ మొదలైన కోణాల్లోంచి చూస్తే వీటి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలే తెలుస్తాయి. అయితే ప్రస్తుతానికి అంత విస్తృత పరిధిలో నేను వ్రాయడం లేదు.
నాదొక చిన్న సూచన:
1. ఈ మాట “లోగో”కి “మొదటి పేజ్”(Home page) లింకు ఇవ్వండి
(ఇప్పుడు చాల వెబ్ సైట్లు హోమ్ పేజీ లింకు బదులు లోగోకి లింకు ఇస్తున్నాయి).
2: సెర్చ్ బటన్ మీద ఇంగ్లీష్ బదులు “వెతుకు లేదా వెతకండి అని ఉంచండి.
3.ఈ మాట లోగోలో ఉన్న మొదటి పెద్ద ఈ అక్షరములో ఉన్న పెన్ను అనుకుంటా సరిగా లేదు.
4. లోగో క్రింద ఉన్న ఆకుపచ్చ గీత క్రింద ప్రసుతం చూస్తున్న పేజీ తో పాటు వెనకటి పేజీల లింకులు ఇస్తే చాల ఉపయోగకరంగా ఉంటుంది.
నేను చూసిన చాల తెలుగు (ఇంగ్లీష్ కూడా) వెబ్ పత్రికలు ఇంత విపులంగా, ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దలేదు.ప్రకటనలు ఏమి లేకుండా ఇంత అందంగా పత్రికను నడుపుతున్నందుకు మీకు మరొక్క సారి అభినందనలు.
మీరు బూదరాజు రాధాకృష్ణ గారి వాక్యాలు అర్థం కాలేదన్నారు. సందర్భం అవసరం కావచ్చు. ఆ వ్యాసం అందుబాటులో ఉన్న “తెలుగు సంగతులు” అన్న పుస్తకంలో ఉంది. ఆయన రచనలన్నీ చదవదగ్గవి.
మీ కవితకు వ్యాఖ్య రాసేటంతటి అర్హత లేకపోయినా అభిప్రాయము తెలియజేయాలనే ఆత్రుతతో రాసే రెండు మాటలు…
మీ లోతైన ఆలోచనా శక్తి కి జోహార్లు. ముఖ్యముగా ఆఖరి నాలుగు lines చాలా బాగున్నాయి.
హనుమంతరావు గారూ, నాకు రాధాకృష్ణగారి వ్యాక్యాలు అర్థం కాలేదు కానీ, మీరు చెప్పింది – రచయితలు పాఠకులవిమర్శలని సహృదయతతో స్వీకరించి ఆలోచించుకోవావి అన్నది అర్థం అయింది. ఒప్పుకుంటాను. రచయితలందరితరఫునా నేను వాదించడంలేదు కానీ, నామటుకు నేను నారచయితమిత్రులతో సంప్రదించి మార్పులు చేసుకున్న సందర్బాలున్నాయి.
బ్రహ్మానందం గారు వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలు – రచయితలు తామేదో పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారు అనీ, ఈమాటవారు తమకి వచ్చిన విమర్శనలన్నిటినీ నిష్పక్షపాతంగా ప్రచురిస్తున్నారు అనీ.
ఈమాట వారు విమర్శలని ప్రచురిస్తారు కానీ కథలకి అలా కాదు. తమ కొలమానాలకి నప్పితేనే వేసుకుంటారు. అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.
ఇలాటికథలు రాయకండి అని రచయితలకీ, ఇలాటివి వేసుకోకండి అని సంపాదకులకీ చెప్పడం సమంజసమే అనుకునే పాఠకులు తాము పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారేమోనని అనుకోడానికి అవకాశం వుంది కదా,
Thanks to the Author & to Eemaata for giving one more informative, interesting piece of article to all music enthu people and students. Links are interesting and enjoyable.
I wish, before publishing, Editors should filter off unwanted, and useless comments. It would save us [readers’] our time.
Shaaradaagaru , did I write your point well?
లింకన్ తో ఓ రాత్రి గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
05/19/2008 8:56 am
మాలతి గారూ,

జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి నాగమురళి అభిప్రాయం:
05/19/2008 8:39 am
సుధాకర్ గారూ, ధన్యవాదాలు.
హరీశ్ గారూ, ధన్యవాదాలు. న్యూమరాలజీ తోనూ, హస్త సాముద్రికం తోనూ నాకున్న పరిచయం తక్కువ. అందుచేత జ్యోతిషాన్ని విశ్లేషించినంతగా వాటి గురించి విశ్లేషించి వ్రాయలేను. అయితే ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్న విషయాలు కొన్ని వాటికి కూడా అన్వయించుకోవచ్చు.
ప్రిడిక్షన్సు చెప్పడానికి ఇవి మూడే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటాను. టారట్ కార్డులు, శకునాలు, స్వప్నాలు, స్ఫటికాల్లోకి తొంగి చూడ్డాలు, అంజనం వెయ్యడాలు, వాస్తు గట్రా, గట్రా. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీటిలో మనకి బాగా పరిచయమై,మన సంస్కృతిలో భాగమైనవాటిని మనం తేలిగ్గా నమ్ముతాం. మిగతావి అంత తేలిగ్గా నమ్మం. సంస్కృతి, సామాజిక శాస్త్రం, సైకాలజీ మొదలైన కోణాల్లోంచి చూస్తే వీటి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలే తెలుస్తాయి. అయితే ప్రస్తుతానికి అంత విస్తృత పరిధిలో నేను వ్రాయడం లేదు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి Venkata Satish Babu Samudrala అభిప్రాయం:
05/19/2008 8:21 am
Hi Sir,
I am following all of your essays, which gives you very good information for the people who really want to know how computers are invented.
Thank you very much for your great effort.
I’m waiting for your next episode.
నీటి అద్దాలు గురించి giri అభిప్రాయం:
05/19/2008 6:48 am
చల్లా గారు,
బాగా రాసారు. సంతోషం.
గిరి
డాలర్ దేహాన్నొదిలి గురించి Ramesh అభిప్రాయం:
05/18/2008 11:05 pm
చాలా బాగుంది
ఈమాట మే 2008 సంచిక విడుదల గురించి వాసు.బొజ్జ అభిప్రాయం:
05/18/2008 10:57 pm
నాదొక చిన్న సూచన:
1. ఈ మాట “లోగో”కి “మొదటి పేజ్”(Home page) లింకు ఇవ్వండి
(ఇప్పుడు చాల వెబ్ సైట్లు హోమ్ పేజీ లింకు బదులు లోగోకి లింకు ఇస్తున్నాయి).
2: సెర్చ్ బటన్ మీద ఇంగ్లీష్ బదులు “వెతుకు లేదా వెతకండి అని ఉంచండి.
3.ఈ మాట లోగోలో ఉన్న మొదటి పెద్ద ఈ అక్షరములో ఉన్న పెన్ను అనుకుంటా సరిగా లేదు.
4. లోగో క్రింద ఉన్న ఆకుపచ్చ గీత క్రింద ప్రసుతం చూస్తున్న పేజీ తో పాటు వెనకటి పేజీల లింకులు ఇస్తే చాల ఉపయోగకరంగా ఉంటుంది.
నేను చూసిన చాల తెలుగు (ఇంగ్లీష్ కూడా) వెబ్ పత్రికలు ఇంత విపులంగా, ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దలేదు.ప్రకటనలు ఏమి లేకుండా ఇంత అందంగా పత్రికను నడుపుతున్నందుకు మీకు మరొక్క సారి అభినందనలు.
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/18/2008 8:13 pm
“తెలుగు సంగతులు”
మాలతి గారూ,
మీరు బూదరాజు రాధాకృష్ణ గారి వాక్యాలు అర్థం కాలేదన్నారు. సందర్భం అవసరం కావచ్చు. ఆ వ్యాసం అందుబాటులో ఉన్న “తెలుగు సంగతులు” అన్న పుస్తకంలో ఉంది. ఆయన రచనలన్నీ చదవదగ్గవి.
కొడవళ్ళ హనుమంతరావు
ఒక్క ప్రశ్న గురించి Raghu అభిప్రాయం:
05/18/2008 1:33 pm
మీ కవితకు వ్యాఖ్య రాసేటంతటి అర్హత లేకపోయినా అభిప్రాయము తెలియజేయాలనే ఆత్రుతతో రాసే రెండు మాటలు…
మీ లోతైన ఆలోచనా శక్తి కి జోహార్లు. ముఖ్యముగా ఆఖరి నాలుగు lines చాలా బాగున్నాయి.
లింకన్ తో ఓ రాత్రి గురించి malathi అభిప్రాయం:
05/18/2008 7:17 am
హనుమంతరావు గారూ, నాకు రాధాకృష్ణగారి వ్యాక్యాలు అర్థం కాలేదు కానీ, మీరు చెప్పింది – రచయితలు పాఠకులవిమర్శలని సహృదయతతో స్వీకరించి ఆలోచించుకోవావి అన్నది అర్థం అయింది. ఒప్పుకుంటాను. రచయితలందరితరఫునా నేను వాదించడంలేదు కానీ, నామటుకు నేను నారచయితమిత్రులతో సంప్రదించి మార్పులు చేసుకున్న సందర్బాలున్నాయి.
బ్రహ్మానందం గారు వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలు – రచయితలు తామేదో పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారు అనీ, ఈమాటవారు తమకి వచ్చిన విమర్శనలన్నిటినీ నిష్పక్షపాతంగా ప్రచురిస్తున్నారు అనీ.
ఈమాట వారు విమర్శలని ప్రచురిస్తారు కానీ కథలకి అలా కాదు. తమ కొలమానాలకి నప్పితేనే వేసుకుంటారు. అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.
ఇలాటికథలు రాయకండి అని రచయితలకీ, ఇలాటివి వేసుకోకండి అని సంపాదకులకీ చెప్పడం సమంజసమే అనుకునే పాఠకులు తాము పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారేమోనని అనుకోడానికి అవకాశం వుంది కదా,
హిందోళ రాగం – అనుబంధం గురించి Jayasri అభిప్రాయం:
05/18/2008 5:14 am