నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకి కృతజ్ఞతలు.
నాగమురళి గారూ,
మిమ్మల్ని ఏకబిగిన చదివింప చేసిందన్నారు. సంతోషం. నా తెలుగు మూలన పడిందని నాకు భయం. రోజూ పది నిముషాలు మా ఆవిడతో తెలుగులో మాట్లాడటం మినహా, నిత్యజీవితంలో నా తెలుగు వాడకం పుస్తకాలు చదవడానికే పరిమితం.
ప్రస్తుతానికి వేరే విషయాల మీద రాసే ఆలోచన లేదు. ఆయా రంగాలలో అనుభవం ఉన్నవాళ్ళు తెలుగువాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరైనా పూనుకొని రాస్తే ఎంతో సేవ చేసిన వారవుతారు.
లక్ష్మన్న గారూ,
నేను ఇంజనీరింగులో అత్యుత్తమ స్థాయికి చెందినవాడిని కాదు. మీరన్నట్లు మన దేశంలో విజ్ఞానశాస్త్రాలలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. కాని వాటిని సామాన్యప్రజలకి పరిచయం చేసినవాళ్ళు తక్కువ. తెలుగులో మహీధర నళినీమోహన్ చెప్పుకోదగ్గవాడు. బహుముఖ ప్రతిభావంతులైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇంకా ఎక్కువ రాస్తే బావుంటుంది.
ఈ వ్యాసాలు తెలుగు దినపత్రికలలో వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయన్నది నాఆశ కూడా. ఆంధ్రజ్యోతి కి రాశాను – జవాబు లేదు!
సిలికాన్ మహత్యం మీద మీరు రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రాయండి.
సాధ్యమైనంతవరకు కవితలకు దూరంగా ఉండమని సూచన ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, నా విభేదాన్ని తెలుపుతాను. కవితయినా, మరేదయినా, అసందర్భంగా ఉటంకిస్తే తప్పుపట్టాల్సిందే. కాని సైన్సు వ్యాసాలలో కవితలుంటే నష్టం లేదు. ఆలోచనకి అడ్డురావనీ, ఆసక్తి కలిగించి అవగాహనని పెంచుతాయనీ నా విశ్వాసం. దీని మీద గతంలో నాగులపల్లి శ్రీనివాస్ గారికి సమాధానమిస్తూ పలుగురు పేర్లని వాడుకున్నాను. ఇప్పుడూ మరొకరి పేరు చెప్పి సమర్థించుకుంటాను.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జీవశాస్త్రవేత్త, తెలుగువాళ్ళకి కాస్త దగ్గ్గరయిన (మరణానంతరం ఆయన దేహాన్ని పరిశోధనలకై కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాల కిచ్చారు), జె బి యస్ హాల్డేన్ అన్న మాటలు:
“In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavor, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.” [1]
చివరిగా, నా వ్యాసాలని గడువు దాటి పంపినా, తామెంత పని వత్తిడిలో ఉన్నా, ఓపిగ్గా చదివి, ప్రశ్నలేసి, సరిదిద్ది, సాయం చేస్తున్న సంపాదకులకి, ముఖ్యంగా ఇంద్రగంటి పద్మగారికీ, కొలిచాల సురేశ్ కీ కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్: [1] “On Being the Right Size and other Essays,” by J.B.S Haldane. Edited by John Maynard Smith. Oxford University Press, 1985.
కథ చాలా బాగున్నదనిపించింది. కానీ ఆవిడ భావాలు అవసరానికంటే కూడా తీవ్రంగా వున్నాయనిపించింది. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి కథానాయకి లాగా కూడా అనిపించింది. దానివల్ల ఆ పాత్రకి సానుభూతి తగ్గినదనుకుంటున్నాను. చాలా మంచి విషయము తీసుకుని అది మధ్యలో వదిలేసినట్టుగా వుంది.
[ఫోటోలకు లింకులు సరిచేసాము. ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చిన సుగాత్రి గారికి కృతజ్ఞతలు. — పద్మ ]
ఫొటోలకు లింకులేవీ?
విజయా సంస్థకు మాతృసంస్థైన వాహినీ స్థాపకుడు విజయా బ్యానర్ పై ఒక్క సినిమా కూడా తీయలేకపోవడం విషాదం. అందుకు కారణం బి.ఎన్. సినిమా స్వర్గసీమ ద్వారా చిత్రరంగానికి పరిచయమైన చక్రపాణి అంటారు. “మల్లీశ్వరి” కథకు మూలం బుచ్చిబాబు “ఎల్లోరాలో ఏకాంతసేవ” కాదన్నమాట!
బి.ఎన్. పర్ఫెక్షన్ గురించి ఒకమాట: మల్లీశ్వరి షూటింగ్ జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చనిపోతే బి.ఎన్. బొంబాయికి వెళ్ళారట. ఆరోజు సహాయదర్శకుడు షూట్ చేశారు. ఆరోజు తీసిన ఒక సన్నివేశంలో రాణి చీరె కొంగును చేతి మీదకు తీసుకుంటుంది. రాణీవాసపు స్త్రీలు అలా చెయ్యరని, ఆ సన్నివేశాన్ని మళ్ళీ షూట్ చెయ్యాలని బి.ఎన్. పట్టుబట్టారట. ఐతే అప్పటికే సెట్టింగులు తీసేశారని, మళ్ళీ వెయ్యాలంటే చాలా ఖర్చు, సమయం పడతాయని అందరూ ఆయనకు నచ్చజెప్పారట. ఆయన తెరమీది అతిచిన్న కదలికను సైతం ఎంత పర్ఫెక్ట్ గా తీస్తారనేదానికి ఇదొక నిదర్శనం. బీనాదేవి నవల పేరు పుణ్యభూమీ కళ్ళు తెరు కదా? సినారె కర్పూరవసంతరాయలు ను సినిమాగా తీయడం కూడా ఆయన డ్రీం ప్రాజెక్టుల్లో ఒకటి. సరైన నటి దొరక్క తీయలేకపోయారట.
[వ్యావహారిక భాషా ఉద్యమం ముఖ్యంగా పాతబడిన గ్రాంథిక వాక్యనిర్మాణాన్ని(Syntax) వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమమే కానీ సంస్కృత పదజాలం (vocabulary) గురించి కాదని గమనించగలరు. — సం.]
మంచి విషయాలని ప్రస్తావించారు. నేనన్న వాటికి కాస్త వివరణ అవసరమే.
1. వ్యావహారిక భాషోద్యమ మూలాలు: నిజమే, మీరన్నట్టు బోధనాభాష విషయం ఒక ముఖ్య చోదకమే కాని మూలాలు ఇంకా ముందే కనిపిస్తాయి. తూమాటి దోణప్పగారు “వ్యావహారిక భాషోద్యమ నేపథ్యం, గిడుగువారి సారథ్యం” అన్న వ్యాసంలో దీన్ని కొంత ప్రస్తావించారు. ముందుగా ఆంగ్లేయుల హయాంలో పరిపాలనాభాషగా వ్యావహారిక భాష ప్రవేశించించడం, ఆ తర్వాత ముద్రణా యంత్ర ప్రభావం వల్ల పుస్తకాలూ, పత్రికలూ సామాన్యజనులకి దగ్గరవ్వడం మొదలైన అంశాలని అతను పేర్కొన్నారు.
2. పాఠ్యపుస్తకాలలో శృంగార ప్రధానమైన కావ్యభాగాల గురించి: వ్యావహారికభాషా వాదుల వ్యాసాలలో కూడా యీ విషయ ప్రస్తావన చదివినట్టుగా గుర్తు. కానీ మీరన్న తర్వాత తిరిగి వెతికితే ఎక్కడా కనపడలేదు. కాబట్టి నేనీ విషయంలో పొరబడినట్టే ఉన్నాను.
3. కందుకూరి మధ్యేమార్గం: “గ్రామ్యదేశ నిరసన సభ”లో జయంతి, కందుకూరి ఉపన్యాసాలని గమనిస్తే ఈ విషయం కొంత స్పష్టమవుతుంది. చిన్నయ్యసూరి రాసిన వ్యాకరణం ముఖ్యంగా పద్యకావ్యాల ఆధారంగా రాయబడిందనీ, దానిననుసరించి రాసే గద్యశైలి చాలా కఠినమైనదనీ అతను ఆనాడే గుర్తించారు. నన్నయ్య కాలమునుండీ గ్రాంధిక భాష మారలేదన్న దురభిప్రాయమూ అతనికి లేదు. అతను వ్యావహారికవాదంతో (మొదట్లో) విభేదించినది, నియమ రాహిత్యం గురించే. వ్యాకరణం లేని వాడుకభాషని రచనకి వాడకూడదని అతని అభిప్రాయం. గ్రాంధికవాదం నుంచి, వ్యావహారికవాదం వైపు అడుగువేసిన తర్వాత కూడా, రచనలో వ్యావహారికభాష వాడినా, అది వ్యాకరణ బద్ధమై ఉండాలనే అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వ్యావహారికభాషకి వ్యాకరణం రాయడానికి పూనుకున్నారు కూడా. వ్యావహారికభాషా వాదుల్లో, ఇది కనిపించదు. గిడుగువారికికూడా వ్యావహారిక రచనా భాషకి వ్యాకరణం ఉండాలా లేదా అన్న విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉన్నట్టు కనిపించదు.
4. గురజాడ “పాతకొత్తల మేలికలయిక”: “పాతకొత్తల మేలికలయిక” అంటే ఆశు, లిఖిత సంప్రదాయాలన్నది వేల్చేరువారి interpretation. అది సమంజసమైనదే కావొచ్చు. కాని, గురజాడ ఉద్దేశం కూడా అదే అనడం సరికాదేమో. గురజాడకి ఆ స్పృహే కనక ఉండి ఉంటే, ముత్యాలసరాల గురించి, రగడలూ లేదా మన జానపద పాటల వరసుంచి తీసుకున్నానని అనకుండా పారశీ గజల్ ప్రేరణ అని ఎందుకంటాడు? “ప్రక్రియ”, “భాష”కి సంబంధించే గురజాడ ఆ మాట అన్నాడని నే ఉద్దేశం. గురజాడ కవిత్వంలో, శ్రవ్య కథాకావ్యం, దృశ్య కావ్యం, జానపద గేయం వంటి పాత ప్రక్రియలూ కనిపిస్తాయి; కొత్తవైన భావగీతాలూ, ఇతర పాశ్చాత్య ప్రక్రియలూ కనిపిస్తాయి. అలాగే అతను వచనరచనలో పూర్తిగా వాడుకభాష వాడినా, కవిత్వంలో గ్రాంధిక పోకడలని గమనించవచ్చు.
5.భావ కవుల “పాతకొత్తల మేలికలయిక”: ఇంతకీ నేను గురజాడని కోట్ చెయ్యడం, అతని పాతకొత్తల మేలికలయికే భావకవులది అని చెప్పడానికి కాదు. భావకవులు వ్యావహారికభాషా వాదాన్ని నెత్తిన పెట్టుకొన్నా, వారి కవిత్వంలో ఎక్కువగా కనిపించేది పూర్వ కావ్యాలలోని భాషే, వాడుకభాష కాదు. “ఎంకిపాటలు”లాంటివి అక్కడక్కడే కనిపిస్తాయి. నేనన్న పాతకొత్తల కలయిక, యీ ఉద్దేశంతో. వీళ్ళతో పోలిస్తే, గురజాడ ఇంకా ఆధునికుడుగా కనిపిస్తాడు. కవిత్వంకూడా వాడుకభాషలో రాయవచ్చని, కాకపోతే దానికి పద్యాలు పనికి రావని అతను గుర్తించాడు. పద్యాలు కూడా వాడుకభాషలో రాయడానికి గిడుగు సీతాపతిలాంటివారు విఫల ప్రయత్నం చేసారు.
6. తిరుపతివేంకటకవులు: వ్యావహారికభాషా వాదానికి వీరు అనుకూలురు కాకపోయినా, వ్యతిరేకులు మాత్రం కాదని అనిపిస్తుంది. ముఖ్యంగా భాష మార్పు చెందే విషయమై, వ్యాకరణాల పరిమితి విషయమై, వ్యావహారికభాషా వాదులతో వీరు ఏకీభవించారు. “కాలముబట్టి దేశమును గాంచి ప్రభుత్వమునెంచి దేశభాషా లలితాంగి మారుటది సత్కవి సమ్మత”మని గుర్తించారు. వాళ్ళ పద్యాలలో లక్షణ విరుద్ధ ప్రయోగాలూ, అన్యభాషా పదాలూ వాడడం ప్రసిద్ధమే కదా. కొంత అధిక్షేపం ఉన్నా, “గిడుగా? పిడుగా?” అన్న వ్యాసంలో గిడుగు గురించి చెళ్ళపిళ్ళవారన్నదాంట్లో నిజాయితీ ఉందని నాకనిపించింది. అందులో, ఈ వాదాలగురించి వారు స్పష్టంగా చెప్పారు:
నామతం గ్రాంథికభాషలో వ్రాసేవారు గ్రాంథికభాషలోనే వ్రాసుకోవచ్చుననిన్నీ వ్యావహారికభాషలో వ్రాసేవారు వ్యావహారికభాషలోనున్నూ వ్రాసుకోవచ్చుననిన్నీ వీరికీ వారికీ వివాదపడవలసిగాని తిట్టుకోవలసికాని లేశమున్నూ ప్రసక్తి వుండకూడదనియ్యేవే. అయితే గ్రాంథిక కవుల పుస్తకాల్లో యెన్నో వ్యావహారిక ప్రయోగాలు కనపడడంచేత యీ గ్రాంథిక కవులు గ్రాంథిక కవులు కారంటూ పంతులవారు తరచు ఆక్షేపించడం కలదు. దానికి నా సమాధానం యేమిటంటే, యెక్కడో వక్కటితప్ప ఆ వ్యావహారిక పదాలు చాలా వఱకు సాధ్యాలే అవుతవి. కానిదేదేనా వుంటే అది ప్రమాదపతితంగా భావించవలసిందేగాని అంతమాత్రంచేత ఆ గ్రంథకర్త వ్యావహారిక భాషా కవి కాడనియ్యేవే.
ఇక, గురజాడ మధ్యేమార్గస్థుడెలాగో వివిరించడం మీ వంతు 🙂
ఈ వ్యాసంలో చెప్పినది కాక వృత్తిపదకోశపు సంపుటాలింకా ప్రచురించారా అకాడమీవారు?
అలాగే ఆరుద్ర గారి వ్యాసాలు మరిన్ని ప్రచురిస్తే చదవాలని అస్మదభిలాష. ఈ వ్యాసాన్ని ప్రచురించిన ఈమాట వారికి అభినందనలు, పునరభినందనలు.
It is very good interview. I want to mention here, a phenomenal contribution of Shri Nedunuri garu: He set an example to show that one can achieve commercial success in music even by adhering to the traditional values of ragas, maintaing their richness and without resorting to gimmickry. There are high levels of science and art blended and balanced in his music. More importantly his music style and content have come to be emulated by a large number of younger musicians.
ఎవరు ఊహించారు, ఎంత దూరదృష్టికలవారైనా కూడా, ప్రసార మాధ్యమాల పెను విప్లవాల ప్రభావంగా మొత్తం ప్రపంచమే ఒక గ్రామం, కాదు కుగ్రామంగా మారుపోతుందని! ఇంటర్నెట్, సెల్ఫోన్లు, కళ్ళు, వొళ్ళు ఖరాబు చేసేటన్ని టీవీ చానెళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఏది గ్రామం ఏది కాదు అని భాషాపరంగా, (వసతులు, సదుపాయాలు, జనాలు కట్టే పన్నులు వగైరా రీత్యా కాదు), చెప్పడం కష్టం అనిపిస్తుంది.
“బరంపురం, హైదరాబాదు, చిత్తూరు ఇటువంటి భాషా సంపర్కం కలచోట్ల వాళ్ళకి గ్రాంధిక భాష నిలబెట్టుకోవటమే కష్టం. అందుచేత భాష పొందే మార్పులని కూడా యెక్కడ సంబాళించుకుంటారు? దాని మూలంగా వాళ్ళకు దీనియందు సానుభూతి తక్కువగా ఉంటుంది” అని అన్నారు విశ్వనాథ గారు.
గ్రాంధికము, గ్రామ్యము అని కాదు, నెత్తి మీదున్న బతుకు బరువును మోయడానికి, నిత్యనూతన పోటీమయమైన ప్రపంచంలో నెగ్గుకురావడానికి, ఎన్నో కొత్త పోకడలు, ఆకర్షణల మధ్య తనది అనుకునే సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవడానికి, సరిపడని, సాయపడని దేనిని అయినా కూడా నిలబెట్తుకోవటం కష్టం, కష్టతరం అని కూడా అనిపిస్తుంది.
ఇక, జనాలకు సానుభూతి ఉండేది వాళ్ళు ఏ ప్రాంతం, ఏ ఊళ్ళకు దగ్గరున్నారని కాదు, ఫలానా భాషా స్వరూపం వాళ్ళకు ఎంత దగ్గరగా ఉంది అన్నదాన్ని బట్టే ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎప్పుడో రాసిన ఈ విశ్వనాథ వారి వ్యాసం, ఏ బరంపురం, హదరాబాదు, చిత్తూర్లనో కాదు, దేశాన్ని, ఖండాన్ని దాటి కూడా ఎక్కడో ‘ఈ మాట’ లో ప్రచురించి, చర్చించుకోవడం దీనికి ముంజేతి కంకణంలాగా మన ముందే ఉన్న చిన్న నిదర్శనం అని కూడా అనిపిస్తుంది.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/24/2008 11:07 pm
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకి కృతజ్ఞతలు.
నాగమురళి గారూ,
మిమ్మల్ని ఏకబిగిన చదివింప చేసిందన్నారు. సంతోషం. నా తెలుగు మూలన పడిందని నాకు భయం. రోజూ పది నిముషాలు మా ఆవిడతో తెలుగులో మాట్లాడటం మినహా, నిత్యజీవితంలో నా తెలుగు వాడకం పుస్తకాలు చదవడానికే పరిమితం.
ప్రస్తుతానికి వేరే విషయాల మీద రాసే ఆలోచన లేదు. ఆయా రంగాలలో అనుభవం ఉన్నవాళ్ళు తెలుగువాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరైనా పూనుకొని రాస్తే ఎంతో సేవ చేసిన వారవుతారు.
లక్ష్మన్న గారూ,
నేను ఇంజనీరింగులో అత్యుత్తమ స్థాయికి చెందినవాడిని కాదు. మీరన్నట్లు మన దేశంలో విజ్ఞానశాస్త్రాలలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. కాని వాటిని సామాన్యప్రజలకి పరిచయం చేసినవాళ్ళు తక్కువ. తెలుగులో మహీధర నళినీమోహన్ చెప్పుకోదగ్గవాడు. బహుముఖ ప్రతిభావంతులైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇంకా ఎక్కువ రాస్తే బావుంటుంది.
ఈ వ్యాసాలు తెలుగు దినపత్రికలలో వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయన్నది నాఆశ కూడా. ఆంధ్రజ్యోతి కి రాశాను – జవాబు లేదు!
సిలికాన్ మహత్యం మీద మీరు రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రాయండి.
సాధ్యమైనంతవరకు కవితలకు దూరంగా ఉండమని సూచన ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, నా విభేదాన్ని తెలుపుతాను. కవితయినా, మరేదయినా, అసందర్భంగా ఉటంకిస్తే తప్పుపట్టాల్సిందే. కాని సైన్సు వ్యాసాలలో కవితలుంటే నష్టం లేదు. ఆలోచనకి అడ్డురావనీ, ఆసక్తి కలిగించి అవగాహనని పెంచుతాయనీ నా విశ్వాసం. దీని మీద గతంలో నాగులపల్లి శ్రీనివాస్ గారికి సమాధానమిస్తూ పలుగురు పేర్లని వాడుకున్నాను. ఇప్పుడూ మరొకరి పేరు చెప్పి సమర్థించుకుంటాను.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జీవశాస్త్రవేత్త, తెలుగువాళ్ళకి కాస్త దగ్గ్గరయిన (మరణానంతరం ఆయన దేహాన్ని పరిశోధనలకై కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాల కిచ్చారు), జె బి యస్ హాల్డేన్ అన్న మాటలు:
“In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavor, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.” [1]
చివరిగా, నా వ్యాసాలని గడువు దాటి పంపినా, తామెంత పని వత్తిడిలో ఉన్నా, ఓపిగ్గా చదివి, ప్రశ్నలేసి, సరిదిద్ది, సాయం చేస్తున్న సంపాదకులకి, ముఖ్యంగా ఇంద్రగంటి పద్మగారికీ, కొలిచాల సురేశ్ కీ కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “On Being the Right Size and other Essays,” by J.B.S Haldane. Edited by John Maynard Smith. Oxford University Press, 1985.
చాదస్తం గురించి SUBHA అభిప్రాయం:
06/24/2008 10:08 am
కథ చాలా బాగున్నదనిపించింది. కానీ ఆవిడ భావాలు అవసరానికంటే కూడా తీవ్రంగా వున్నాయనిపించింది. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి కథానాయకి లాగా కూడా అనిపించింది. దానివల్ల ఆ పాత్రకి సానుభూతి తగ్గినదనుకుంటున్నాను. చాలా మంచి విషయము తీసుకుని అది మధ్యలో వదిలేసినట్టుగా వుంది.
(సినీ)కళాద్రష్ట బి.ఎన్. రెడ్డి గురించి సుగాత్రి అభిప్రాయం:
06/24/2008 2:43 am
[ఫోటోలకు లింకులు సరిచేసాము. ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చిన సుగాత్రి గారికి కృతజ్ఞతలు. — పద్మ ]
ఫొటోలకు లింకులేవీ?
విజయా సంస్థకు మాతృసంస్థైన వాహినీ స్థాపకుడు విజయా బ్యానర్ పై ఒక్క సినిమా కూడా తీయలేకపోవడం విషాదం. అందుకు కారణం బి.ఎన్. సినిమా స్వర్గసీమ ద్వారా చిత్రరంగానికి పరిచయమైన చక్రపాణి అంటారు. “మల్లీశ్వరి” కథకు మూలం బుచ్చిబాబు “ఎల్లోరాలో ఏకాంతసేవ” కాదన్నమాట!
బి.ఎన్. పర్ఫెక్షన్ గురించి ఒకమాట: మల్లీశ్వరి షూటింగ్ జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చనిపోతే బి.ఎన్. బొంబాయికి వెళ్ళారట. ఆరోజు సహాయదర్శకుడు షూట్ చేశారు. ఆరోజు తీసిన ఒక సన్నివేశంలో రాణి చీరె కొంగును చేతి మీదకు తీసుకుంటుంది. రాణీవాసపు స్త్రీలు అలా చెయ్యరని, ఆ సన్నివేశాన్ని మళ్ళీ షూట్ చెయ్యాలని బి.ఎన్. పట్టుబట్టారట. ఐతే అప్పటికే సెట్టింగులు తీసేశారని, మళ్ళీ వెయ్యాలంటే చాలా ఖర్చు, సమయం పడతాయని అందరూ ఆయనకు నచ్చజెప్పారట. ఆయన తెరమీది అతిచిన్న కదలికను సైతం ఎంత పర్ఫెక్ట్ గా తీస్తారనేదానికి ఇదొక నిదర్శనం. బీనాదేవి నవల పేరు పుణ్యభూమీ కళ్ళు తెరు కదా? సినారె కర్పూరవసంతరాయలు ను సినిమాగా తీయడం కూడా ఆయన డ్రీం ప్రాజెక్టుల్లో ఒకటి. సరైన నటి దొరక్క తీయలేకపోయారట.
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి mOhana అభిప్రాయం:
06/23/2008 10:32 am
వ్యావహారిక భాషపై ప్రత్యేక సంచికలో నిఘంటువులో వెదుక్కోవలసిన పదాలలో అశీతి (80) ఒకటి! 🙂
– మోహన
[వ్యావహారిక భాషా ఉద్యమం ముఖ్యంగా పాతబడిన గ్రాంథిక వాక్యనిర్మాణాన్ని(Syntax) వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమమే కానీ సంస్కృత పదజాలం (vocabulary) గురించి కాదని గమనించగలరు. — సం.]
మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు 2 గురించి bollojubaba అభిప్రాయం:
06/22/2008 9:36 am
అప్సర్ గారు,
చాలా బాగున్నాయి మీరు పరిచయం చేసిన అనువాదాలు.
ధన్యవాదాలు.
బొల్లోజు బాబా
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి bollojubaba అభిప్రాయం:
06/22/2008 6:22 am
కామేశ్వరరావు గారికి
మంచి విషయాలను మీ వ్యాసంలో పొందుపరిచారు. దీని ద్వారా చాలా విషయాలు నాకు తెలిసినయ్ .
మీరన్న భాషా వైఫల్యం కేటగిరీకి, శిఖామణి వ్రాసిన “వాడే అశుద్ద మానవుడు” అనే కవిత సరిపోతుంది అని తోస్తోంది. గమనించగలరు.
మంచి విశ్లేషణ తో కూడిన విషయాలనందిచారు. ధన్యవాదములు
బొల్లోజు బాబా
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి Kameswara Rao అభిప్రాయం:
06/21/2008 1:42 am
శ్రీనివాస్ గారు,
మంచి విషయాలని ప్రస్తావించారు. నేనన్న వాటికి కాస్త వివరణ అవసరమే.
1. వ్యావహారిక భాషోద్యమ మూలాలు: నిజమే, మీరన్నట్టు బోధనాభాష విషయం ఒక ముఖ్య చోదకమే కాని మూలాలు ఇంకా ముందే కనిపిస్తాయి. తూమాటి దోణప్పగారు “వ్యావహారిక భాషోద్యమ నేపథ్యం, గిడుగువారి సారథ్యం” అన్న వ్యాసంలో దీన్ని కొంత ప్రస్తావించారు. ముందుగా ఆంగ్లేయుల హయాంలో పరిపాలనాభాషగా వ్యావహారిక భాష ప్రవేశించించడం, ఆ తర్వాత ముద్రణా యంత్ర ప్రభావం వల్ల పుస్తకాలూ, పత్రికలూ సామాన్యజనులకి దగ్గరవ్వడం మొదలైన అంశాలని అతను పేర్కొన్నారు.
2. పాఠ్యపుస్తకాలలో శృంగార ప్రధానమైన కావ్యభాగాల గురించి: వ్యావహారికభాషా వాదుల వ్యాసాలలో కూడా యీ విషయ ప్రస్తావన చదివినట్టుగా గుర్తు. కానీ మీరన్న తర్వాత తిరిగి వెతికితే ఎక్కడా కనపడలేదు. కాబట్టి నేనీ విషయంలో పొరబడినట్టే ఉన్నాను.
3. కందుకూరి మధ్యేమార్గం: “గ్రామ్యదేశ నిరసన సభ”లో జయంతి, కందుకూరి ఉపన్యాసాలని గమనిస్తే ఈ విషయం కొంత స్పష్టమవుతుంది. చిన్నయ్యసూరి రాసిన వ్యాకరణం ముఖ్యంగా పద్యకావ్యాల ఆధారంగా రాయబడిందనీ, దానిననుసరించి రాసే గద్యశైలి చాలా కఠినమైనదనీ అతను ఆనాడే గుర్తించారు. నన్నయ్య కాలమునుండీ గ్రాంధిక భాష మారలేదన్న దురభిప్రాయమూ అతనికి లేదు. అతను వ్యావహారికవాదంతో (మొదట్లో) విభేదించినది, నియమ రాహిత్యం గురించే. వ్యాకరణం లేని వాడుకభాషని రచనకి వాడకూడదని అతని అభిప్రాయం. గ్రాంధికవాదం నుంచి, వ్యావహారికవాదం వైపు అడుగువేసిన తర్వాత కూడా, రచనలో వ్యావహారికభాష వాడినా, అది వ్యాకరణ బద్ధమై ఉండాలనే అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వ్యావహారికభాషకి వ్యాకరణం రాయడానికి పూనుకున్నారు కూడా. వ్యావహారికభాషా వాదుల్లో, ఇది కనిపించదు. గిడుగువారికికూడా వ్యావహారిక రచనా భాషకి వ్యాకరణం ఉండాలా లేదా అన్న విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉన్నట్టు కనిపించదు.
4. గురజాడ “పాతకొత్తల మేలికలయిక”: “పాతకొత్తల మేలికలయిక” అంటే ఆశు, లిఖిత సంప్రదాయాలన్నది వేల్చేరువారి interpretation. అది సమంజసమైనదే కావొచ్చు. కాని, గురజాడ ఉద్దేశం కూడా అదే అనడం సరికాదేమో. గురజాడకి ఆ స్పృహే కనక ఉండి ఉంటే, ముత్యాలసరాల గురించి, రగడలూ లేదా మన జానపద పాటల వరసుంచి తీసుకున్నానని అనకుండా పారశీ గజల్ ప్రేరణ అని ఎందుకంటాడు? “ప్రక్రియ”, “భాష”కి సంబంధించే గురజాడ ఆ మాట అన్నాడని నే ఉద్దేశం. గురజాడ కవిత్వంలో, శ్రవ్య కథాకావ్యం, దృశ్య కావ్యం, జానపద గేయం వంటి పాత ప్రక్రియలూ కనిపిస్తాయి; కొత్తవైన భావగీతాలూ, ఇతర పాశ్చాత్య ప్రక్రియలూ కనిపిస్తాయి. అలాగే అతను వచనరచనలో పూర్తిగా వాడుకభాష వాడినా, కవిత్వంలో గ్రాంధిక పోకడలని గమనించవచ్చు.
5.భావ కవుల “పాతకొత్తల మేలికలయిక”: ఇంతకీ నేను గురజాడని కోట్ చెయ్యడం, అతని పాతకొత్తల మేలికలయికే భావకవులది అని చెప్పడానికి కాదు. భావకవులు వ్యావహారికభాషా వాదాన్ని నెత్తిన పెట్టుకొన్నా, వారి కవిత్వంలో ఎక్కువగా కనిపించేది పూర్వ కావ్యాలలోని భాషే, వాడుకభాష కాదు. “ఎంకిపాటలు”లాంటివి అక్కడక్కడే కనిపిస్తాయి. నేనన్న పాతకొత్తల కలయిక, యీ ఉద్దేశంతో. వీళ్ళతో పోలిస్తే, గురజాడ ఇంకా ఆధునికుడుగా కనిపిస్తాడు. కవిత్వంకూడా వాడుకభాషలో రాయవచ్చని, కాకపోతే దానికి పద్యాలు పనికి రావని అతను గుర్తించాడు. పద్యాలు కూడా వాడుకభాషలో రాయడానికి గిడుగు సీతాపతిలాంటివారు విఫల ప్రయత్నం చేసారు.
6. తిరుపతివేంకటకవులు: వ్యావహారికభాషా వాదానికి వీరు అనుకూలురు కాకపోయినా, వ్యతిరేకులు మాత్రం కాదని అనిపిస్తుంది. ముఖ్యంగా భాష మార్పు చెందే విషయమై, వ్యాకరణాల పరిమితి విషయమై, వ్యావహారికభాషా వాదులతో వీరు ఏకీభవించారు. “కాలముబట్టి దేశమును గాంచి ప్రభుత్వమునెంచి దేశభాషా లలితాంగి మారుటది సత్కవి సమ్మత”మని గుర్తించారు. వాళ్ళ పద్యాలలో లక్షణ విరుద్ధ ప్రయోగాలూ, అన్యభాషా పదాలూ వాడడం ప్రసిద్ధమే కదా. కొంత అధిక్షేపం ఉన్నా, “గిడుగా? పిడుగా?” అన్న వ్యాసంలో గిడుగు గురించి చెళ్ళపిళ్ళవారన్నదాంట్లో నిజాయితీ ఉందని నాకనిపించింది. అందులో, ఈ వాదాలగురించి వారు స్పష్టంగా చెప్పారు:
ఇక, గురజాడ మధ్యేమార్గస్థుడెలాగో వివిరించడం మీ వంతు 🙂
మాండలిక వృత్తి పదకోశం గురించి రాఘవ అభిప్రాయం:
06/20/2008 6:51 pm
ఈ వ్యాసంలో చెప్పినది కాక వృత్తిపదకోశపు సంపుటాలింకా ప్రచురించారా అకాడమీవారు?
అలాగే ఆరుద్ర గారి వ్యాసాలు మరిన్ని ప్రచురిస్తే చదవాలని అస్మదభిలాష. ఈ వ్యాసాన్ని ప్రచురించిన ఈమాట వారికి అభినందనలు, పునరభినందనలు.
“సంగీత కళానిధి” శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో ముఖాముఖీ గురించి P.H. Thyagaraju అభిప్రాయం:
06/20/2008 9:50 am
It is very good interview. I want to mention here, a phenomenal contribution of Shri Nedunuri garu: He set an example to show that one can achieve commercial success in music even by adhering to the traditional values of ragas, maintaing their richness and without resorting to gimmickry. There are high levels of science and art blended and balanced in his music. More importantly his music style and content have come to be emulated by a large number of younger musicians.
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
06/20/2008 7:16 am
“గ్రామీణులైన జనులు వాడుకునేది గ్రామ్యము” అన్నారు విశ్వనాథ.
ఎవరు ఊహించారు, ఎంత దూరదృష్టికలవారైనా కూడా, ప్రసార మాధ్యమాల పెను విప్లవాల ప్రభావంగా మొత్తం ప్రపంచమే ఒక గ్రామం, కాదు కుగ్రామంగా మారుపోతుందని! ఇంటర్నెట్, సెల్ఫోన్లు, కళ్ళు, వొళ్ళు ఖరాబు చేసేటన్ని టీవీ చానెళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఏది గ్రామం ఏది కాదు అని భాషాపరంగా, (వసతులు, సదుపాయాలు, జనాలు కట్టే పన్నులు వగైరా రీత్యా కాదు), చెప్పడం కష్టం అనిపిస్తుంది.
“బరంపురం, హైదరాబాదు, చిత్తూరు ఇటువంటి భాషా సంపర్కం కలచోట్ల వాళ్ళకి గ్రాంధిక భాష నిలబెట్టుకోవటమే కష్టం. అందుచేత భాష పొందే మార్పులని కూడా యెక్కడ సంబాళించుకుంటారు? దాని మూలంగా వాళ్ళకు దీనియందు సానుభూతి తక్కువగా ఉంటుంది” అని అన్నారు విశ్వనాథ గారు.
గ్రాంధికము, గ్రామ్యము అని కాదు, నెత్తి మీదున్న బతుకు బరువును మోయడానికి, నిత్యనూతన పోటీమయమైన ప్రపంచంలో నెగ్గుకురావడానికి, ఎన్నో కొత్త పోకడలు, ఆకర్షణల మధ్య తనది అనుకునే సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవడానికి, సరిపడని, సాయపడని దేనిని అయినా కూడా నిలబెట్తుకోవటం కష్టం, కష్టతరం అని కూడా అనిపిస్తుంది.
ఇక, జనాలకు సానుభూతి ఉండేది వాళ్ళు ఏ ప్రాంతం, ఏ ఊళ్ళకు దగ్గరున్నారని కాదు, ఫలానా భాషా స్వరూపం వాళ్ళకు ఎంత దగ్గరగా ఉంది అన్నదాన్ని బట్టే ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎప్పుడో రాసిన ఈ విశ్వనాథ వారి వ్యాసం, ఏ బరంపురం, హదరాబాదు, చిత్తూర్లనో కాదు, దేశాన్ని, ఖండాన్ని దాటి కూడా ఎక్కడో ‘ఈ మాట’ లో ప్రచురించి, చర్చించుకోవడం దీనికి ముంజేతి కంకణంలాగా మన ముందే ఉన్న చిన్న నిదర్శనం అని కూడా అనిపిస్తుంది.
విధేయుడు
Srinivas