నిజంగానే, శాస్త్రీయ సంగీతాభిమానులుకీ, గుడ్డిగా మతాన్ని నమ్మేవారికీ తేడా వుండదు.
చిన్న తేడా ఏవిటంటే, బాలమురళీ కి బిస్మిల్లా ఖాన్ కీ తేడా శాస్త్రీయ సంగీతాభిమానులుకి వినబడదు.
ఇలాటి విశ్లేషణల వల్లే విని ఆనందించడం ఇంకా ఎక్కువవుతుంది.
మరి “రామన్నరాముడొయ్..” లవకుశ సినిమాలో పాట, దీనిలొని తాళ వాద్యం ఏమిటి?
రాముడు, సీతమ్మతల్లితో తిరిగి వచ్చెస్తున్నాడన్న ఆనందం అంతా వినిపిస్తుంది ఆ దరువులో.
ఘంటసాలకి వేయి దండాలు. రాసిందెవరో?
ఇది చదివేరా? దయచేసి చదవండి. కవిత్వానికి కావలసిన ప్రాథమిక రిక్వైర్ మెంట్స్ తెలుస్తాయి. ఆతరవాత మీ మీ ఆలోచనాధోరణులు, మీ మీ పొలిటికల్ నమ్మకాలూనూ.
ప్రోజు లో రిథిమ్ చాలా కష్టం. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి మాత్రమే అది కుదురుతుంది.
పోయెట్రీ లో రిథిమ్ కోసం కొంచెం కష్టపడండి నాయనలారా, తరిస్తాం.
సంగీతానికి అందరూ ఒకేలా స్పందించకపోవచ్చు. ఎలా స్పందిస్తున్నాం అనేదాన్ని గురించి విశ్లేషణ కూడా అనవసరం అనిపించవచ్చు. మూడ్ ని బట్టి భక్తిసంగీతం, తిల్లానాలూ అన్నీ సందర్భానుసారం బాగున్నాయనిపించవచ్చు. ఒకే విద్వాంసుడు ఒకే కచేరీలో ఆలాపన, గమకాలు, స్వరకల్పన, తాళవిన్యాసాలూ అన్నిటిలోనూ తనకున్న ప్రతిభను కనబరిచే ప్రయత్నం చేస్తాడు. శ్రోతల attention తగ్గకుండా చూస్తాడు. ఉదాహరణకు, లయ మీద ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ మూడుగంటలు కూర్చుని కేవలం తాళవాద్య కచేరీలు విని ఆనందించేవారు తక్కువే ఉంటారు. అలాగే తీగసాగుతున్నట్టుగా నింపాదిగా సాగే ఆలాపన కూడా మితిమీరనప్పుడే బావుంటుంది. (ధ్రుపద్ శైలికి ఈనాడు ఆదరణ తగ్గడం అందుకే)
ఎక్కువమంది తెలుగువారు శాస్త్రీయసంగీతానికి మహేశ్ కుమార్ గారిలాగా రియాక్టవుతారు. ఎందుకంటే దక్షిణాది సంగీతంలో ఎక్కువగా తెలుగు కీర్తనలే వినిపిస్తాయి కనక. అదే ఏ పురందరదాసు కన్నడ రచనో, పాపనాశం శివన్ తమిళ రచనో అయితే ఏమవుతుంది? సాహిత్యం వినబడని వాద్యసంగీతం విన్నప్పుడు ఏమనిపిస్తుంది? సితార్ తదితర హిందుస్తానీ వాయిద్యాలు సాధన చేసేవారికి గత్ లు తప్ప సాహిత్యంతో అసలు సంబంధమే ఉండదు. వీరంతా విని, ఆనందించించి, ఆస్వాదించేది ప్యూర్ రాగసంగీతమే. వర్చువల్ రియాలిటీ అనడంలో నా ఉద్దేశం అదే. (‘అలౌకికానందం’ అనడం నాకు కాస్త పట్టిస్తుంది!)
Babjeelu గారు ప్రస్తావించినవి: జానపదులది (సంగీతమైనా, సాహిత్యమైనా) ‘దేశి’ మార్గం. పండితులది ‘మార్గ’ పద్ధతి. శ్రావ్యత అనేమాటని మెలొడీ అనే అర్థంలో వాడారా? (మీరు చెన్నైలో ఉంటారా? మీరు చెప్పిన బాలమురళి అహీర్ భైరవ్ తిల్లానా, చిట్టిబాబు రికార్డూ వగైరాలన్నీ బావుంటాయి.) క్లాసికల్, లలిత సంగీతం, మంచి సినిమా పాటలూ అన్నీ వేటికవిగా విని ఆనందించవచ్చు. పాతతరం సంగీతదర్శకులు తమ కాలంలో లభ్యమైన ఉత్తమ సంగీత సంస్కారాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో వ్యాపారధోరణి లేదనికాదు. ఈరోజుల్లో అటువంటి చిత్తశుద్ధి ఎక్కడా కనబడదు. ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్ల ‘డౌన్ లోడ్’ సంస్కారాన్ని అసహ్యించుకునేవారిలో మా బంధువు మాధవపెద్ది సురేశ్ కూడా ఉన్నాడు. నా కామెంట్లు ఈ ధోరణి గురించినవే.
అసలు సంగీతము గురించి తెలియక పొయినా పాట వినచ్చు.
రచయిత చక్కగా మనకి విషయములు తెలిపారు.
శ్రీ సంగీతరావు గారు ఒకప్పుడు జానపదములు శాస్త్రీయ సంగీతముకు మూలము అని అన్నారు . ఆందు వల్ల మనము సంగీతము విని ఆనందించక ఈ చర్చలు ఎందుకు? రచయితని
అభినందిద్దాము.
ఇంతకు ముందు మీ తడి వున్న వూహల్ని చదివి, ఇదీ మొదలెట్టేను
మీరూ, రవికిరణూ వగైరాలందరూ “పొలై పొలై” కవిత్వానికి బానిసలయిపోయేరు.
మంచి అనుభూతి, అనుభవం ఎదురవగానే “పొలై పొలై” అంటూ మొదలెట్టెస్తే ఎలా?
గురజాడ ముందు చందోబధ్ధంగా రాసీ కవులు ఇలాగే రాసేవారు. అందుకే ముత్యాల సరాలు వెతుక్కోవలసొచ్చింది ఆయనకి.
మీరూ, రవికిరణూ వగైరాలందరూ ఇలాగే రాయండి వచన కవిత్వం ఏవవుతుందో?
దయచేసి ఒకటి గుర్తుంచుకోండి.
లంబోదర లకుమికర వాయించడానికి సంగీత విద్వాంసుడు ఎంత కష్టపడతాడో. అందులో పది శాతం కూడా కష్టపడప్పోతే ఎలా అనుభూతిని కవిత్వంగా మలచడానికి?
సంగీతానికి స్పందన గురించి baabjeelu అభిప్రాయం:
07/18/2008 8:26 am
నిజంగానే, శాస్త్రీయ సంగీతాభిమానులుకీ, గుడ్డిగా మతాన్ని నమ్మేవారికీ తేడా వుండదు.
చిన్న తేడా ఏవిటంటే, బాలమురళీ కి బిస్మిల్లా ఖాన్ కీ తేడా శాస్త్రీయ సంగీతాభిమానులుకి వినబడదు.
తొలి వలపు గురించి baabjeelu అభిప్రాయం:
07/18/2008 7:45 am
సుబ్రహ్మణ్యం గారూ,
వాహ్ వాహ్ అనడం కన్నా ఇంకేం చేయగలం?
వాహ్ వాహ్.
సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు గురించి baabjeelu అభిప్రాయం:
07/18/2008 7:40 am
ఇలాటి విశ్లేషణల వల్లే విని ఆనందించడం ఇంకా ఎక్కువవుతుంది.
మరి “రామన్నరాముడొయ్..” లవకుశ సినిమాలో పాట, దీనిలొని తాళ వాద్యం ఏమిటి?
రాముడు, సీతమ్మతల్లితో తిరిగి వచ్చెస్తున్నాడన్న ఆనందం అంతా వినిపిస్తుంది ఆ దరువులో.
ఘంటసాలకి వేయి దండాలు. రాసిందెవరో?
నా స్మృతి పథంలో గురించి baabjeelu అభిప్రాయం:
07/18/2008 7:28 am
రవికిరణూ, మూలా సుబ్రహ్మణ్యమూ,
ఇది చదివేరా? దయచేసి చదవండి. కవిత్వానికి కావలసిన ప్రాథమిక రిక్వైర్ మెంట్స్ తెలుస్తాయి. ఆతరవాత మీ మీ ఆలోచనాధోరణులు, మీ మీ పొలిటికల్ నమ్మకాలూనూ.
ప్రోజు లో రిథిమ్ చాలా కష్టం. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి మాత్రమే అది కుదురుతుంది.
పోయెట్రీ లో రిథిమ్ కోసం కొంచెం కష్టపడండి నాయనలారా, తరిస్తాం.
పాటల్లో లయవిన్యాసాలు గురించి baabjeelu అభిప్రాయం:
07/18/2008 6:56 am
ఇప్పుడర్ధమైంది.
లలిత సంగీతం, సినిమా సంగీతాల ప్రజాదరణ సీక్రెట్ తెలిసిపోయింది.
ఈ వ్యాసంకోసమే ఎదురుచూసేను.
మీరు రాసింది అక్షరాలా నిజం, ప్రస్తుతం రిథిం పేడ్ మీద ఒకే బీటు, పాట మొదలయిన దగ్గర్నుంచీ. రెహమాను లాంటి వాళ్ళని వదిలేస్తే, అందరిదీ అదే ధోరణి.
బహుశా “చక్రవర్తి” దగ్గర్నుంచీ ఇది మొదలయినట్టుంది. ఒకే బీటు. “యమగోల” తరవాత.
కవి అనే పదానికి అర్ధం మారిపోయింది, మీరు రైటు.
స్వరకర్త అనే పదానికి అర్ధం మారిపోయింది. మీరు రైటు.
ఇప్పుడంతా “ఫిల్ ఇన్ ద బ్లేంక్స్”.
హిందీ పాటలే ఇప్పుడు కూడా బావుంటున్నాయి.
సీతారామశాస్త్రి గారు దేవీశ్రీప్రసాదుని తిట్టేరో, పొగిడేరో తెలీకుండా మంచి ముక్క అన్నారు.సక్సెస్ అనే వ్యసనానికి బానిసై పోయేడని.
విలువలు గురించి k k suseela అభిప్రాయం:
07/18/2008 4:42 am
its really heart touching
రాగాలూ స్వరాలూ గురించి Rohiniprasad అభిప్రాయం:
07/18/2008 12:05 am
సంగీతానికి అందరూ ఒకేలా స్పందించకపోవచ్చు. ఎలా స్పందిస్తున్నాం అనేదాన్ని గురించి విశ్లేషణ కూడా అనవసరం అనిపించవచ్చు. మూడ్ ని బట్టి భక్తిసంగీతం, తిల్లానాలూ అన్నీ సందర్భానుసారం బాగున్నాయనిపించవచ్చు. ఒకే విద్వాంసుడు ఒకే కచేరీలో ఆలాపన, గమకాలు, స్వరకల్పన, తాళవిన్యాసాలూ అన్నిటిలోనూ తనకున్న ప్రతిభను కనబరిచే ప్రయత్నం చేస్తాడు. శ్రోతల attention తగ్గకుండా చూస్తాడు. ఉదాహరణకు, లయ మీద ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ మూడుగంటలు కూర్చుని కేవలం తాళవాద్య కచేరీలు విని ఆనందించేవారు తక్కువే ఉంటారు. అలాగే తీగసాగుతున్నట్టుగా నింపాదిగా సాగే ఆలాపన కూడా మితిమీరనప్పుడే బావుంటుంది. (ధ్రుపద్ శైలికి ఈనాడు ఆదరణ తగ్గడం అందుకే)
ఎక్కువమంది తెలుగువారు శాస్త్రీయసంగీతానికి మహేశ్ కుమార్ గారిలాగా రియాక్టవుతారు. ఎందుకంటే దక్షిణాది సంగీతంలో ఎక్కువగా తెలుగు కీర్తనలే వినిపిస్తాయి కనక. అదే ఏ పురందరదాసు కన్నడ రచనో, పాపనాశం శివన్ తమిళ రచనో అయితే ఏమవుతుంది? సాహిత్యం వినబడని వాద్యసంగీతం విన్నప్పుడు ఏమనిపిస్తుంది? సితార్ తదితర హిందుస్తానీ వాయిద్యాలు సాధన చేసేవారికి గత్ లు తప్ప సాహిత్యంతో అసలు సంబంధమే ఉండదు. వీరంతా విని, ఆనందించించి, ఆస్వాదించేది ప్యూర్ రాగసంగీతమే. వర్చువల్ రియాలిటీ అనడంలో నా ఉద్దేశం అదే. (‘అలౌకికానందం’ అనడం నాకు కాస్త పట్టిస్తుంది!)
Babjeelu గారు ప్రస్తావించినవి: జానపదులది (సంగీతమైనా, సాహిత్యమైనా) ‘దేశి’ మార్గం. పండితులది ‘మార్గ’ పద్ధతి. శ్రావ్యత అనేమాటని మెలొడీ అనే అర్థంలో వాడారా? (మీరు చెన్నైలో ఉంటారా? మీరు చెప్పిన బాలమురళి అహీర్ భైరవ్ తిల్లానా, చిట్టిబాబు రికార్డూ వగైరాలన్నీ బావుంటాయి.) క్లాసికల్, లలిత సంగీతం, మంచి సినిమా పాటలూ అన్నీ వేటికవిగా విని ఆనందించవచ్చు. పాతతరం సంగీతదర్శకులు తమ కాలంలో లభ్యమైన ఉత్తమ సంగీత సంస్కారాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో వ్యాపారధోరణి లేదనికాదు. ఈరోజుల్లో అటువంటి చిత్తశుద్ధి ఎక్కడా కనబడదు. ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్ల ‘డౌన్ లోడ్’ సంస్కారాన్ని అసహ్యించుకునేవారిలో మా బంధువు మాధవపెద్ది సురేశ్ కూడా ఉన్నాడు. నా కామెంట్లు ఈ ధోరణి గురించినవే.
88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/17/2008 9:01 pm
ఆంధ్రజ్యోతి డైలీలో రజనీగారి గురించిన వ్యాసం వచ్చింది.
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/18sak2
దీనికీ, ఇంతకు మునుపు ఈనాడులో చందమామ గురించి వచ్చిన కవరేజికీ స్ఫూర్తి నిస్సందేహంగా ‘ఈమాట‘ పత్రికదే! Kudos to eemaata.com!
రాగాలూ స్వరాలూ గురించి Dwibhashyam Agasthyeswar అభిప్రాయం:
07/17/2008 1:00 pm
అసలు సంగీతము గురించి తెలియక పొయినా పాట వినచ్చు.
రచయిత చక్కగా మనకి విషయములు తెలిపారు.
శ్రీ సంగీతరావు గారు ఒకప్పుడు జానపదములు శాస్త్రీయ సంగీతముకు మూలము అని అన్నారు . ఆందు వల్ల మనము సంగీతము విని ఆనందించక ఈ చర్చలు ఎందుకు? రచయితని
అభినందిద్దాము.
గడియారపు ముల్లులు గురించి baabjeelu అభిప్రాయం:
07/17/2008 11:53 am