సమకాలీన నాటకాలన్నీ ప్రస్తావించే అవసరం ఉందా? అది వేరొక వ్యాసంలా తయారవుతుంది. సమకాలీన నాటకాల గురించి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు పుస్తకం రాసారు. నా ఈ వ్యాసం పరిధి, పరిమితి, ఉద్దేశ్యం వేరు. తెలుగు నాటకరంగంలో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం వల్ల కొత్తగా చెప్పేదేమీ ఉండదని అనిపించింది. అన్నీ అందరికీ నచ్చాలని లేదు కదండీ?
ఈ కధ చదివాక, “రచయిత ధైర్యాన్ని మెచ్చుకోవడానికీ”, “విమర్శలు చేసిన రచనా దురంధురల (దుస్) సాహసాన్ని ప్రస్తావించడానికీ” మీకెంత ‘హక్కు’ వుందో, అంతే ‘హక్కు’, ఈ కధ నచ్చని వారికి, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడానికి వుంటుంది.
ప్రతీ కధా ఒక నీతిని బోధించాలి అని ఎవరూ అనరు. అయితే రచయిత ఆ కధని చెప్పేటప్పుడు, దాని లోని విషయాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏకీభవించడమో, విమర్శించడమో చేస్తాడు. వార్తా విలేఖరి మాత్రమే ఒక విషయంలోని సత్యాసత్యాల్ని ఒక వార్తలాగా చెప్పి వూరుకుంటాడు. రచయితలు సమాజం లోని విషయాలనే తమ రచనల్లోనూ ప్రతిబింబిస్తారు. దాన్ని బట్టీ పాఠకులు తమ చైతన్యానికి అనుగుణంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు.
“పాఠకులకు బాధ్యతలే వుంటాయీ, హక్కులు వుండవూ” అని మీరు అనడం నిజంగా సాహసమే. ఈ అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తాను. ఒక రకంగా చూస్తే, పాఠకుడికి రచనకి సంబంధించి ఒక బాధ్యత అంటగట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఒక రచనకి సంబంధించి, పరిమితుల్లో, తన చైతన్యానికి అనుగుణంగా, స్పందించే హక్కు ఒక పాఠకుడికి ఎప్పుడూ వుంటుంది. విమర్శ సహేతుకంగా వుంటే, ఇతర పాఠకులు కూడా అంగీకరించొచ్చు, లేదా విభేదించొచ్చు. లేకపోతే రెండు మాటల్లో, “నచ్చలేదూ, ఈ కధ అనవసరం” అంటూ, తన అభిప్రాయం చెప్పుకోవచ్చు. రచయిత తన రచనని పబ్లిక్ లో పెట్టినప్పుడు, ఇటువంటి విమర్శలకి సిద్ధపడి వుండాలి. అభిప్రాయాలని సెన్సార్ చెయ్యడానికి ఈమాట వారు ఎప్పుడూ వున్నారు.
ఆఖరుగా చెప్పొచ్చేదేమంటే, పరిమితుల్లో, ఒక పాఠకుడికి ఒక కధ ఎంత వరకూ పనికి వస్తుందీ అని చెప్పే హక్కు వుంటుంది అని. రచయితలు రాసేదే పాఠకుల కోసం కనుక.
ఇంకో విషయం. మీరు, “లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా” అని అడిగారు.
కధలోని పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడం ఏమిటీ? అవి కధలో పాత్రలు కదా? కధ చదివే వాళ్ళు ఆ పని చేస్తారు. రచన చేసేటప్పుడు రచయిత కూడా ఆ పని చేస్తాడు. తాను సరి అనుకున్నదే తన పాత్రల చేత చెప్పిస్తాడు విమర్శ లేకుండా. పాఠకులు కూడా తాము సరి అనుకున్నవాటితో ఏకీభవిస్తారు. లేదా విమర్శిస్తారు. వారికి ఆ హక్కు లేదనే హక్కు మీకు లేదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒక పాఠకులే కదా?
సాయి బ్రహ్మానందం గారూ,
“తెరమరుగౌతున్న తెలుగు నాటకం” శీర్షికన మీరు సంస్కృత నాటకాల్ని స్పృశించి, పద్య నాటకాల్ని పరామర్శించి, ఆ తరవాత నాటకం ఎలా రాయాలి, ఎలా “డైరెక్ట్” చెయ్యలి, ఎలా నటించాలి, “మేకప్పు”, రంగాలంకరణ, నంది ఎవార్డులు ఇత్యాది అద్భుతంగా వివరించేరు.
ఈ వ్యాసంలో వుదహరించిన నాటకాలన్నీ “కాంటెంపరరీ” నాటకాలు కావు. బహుశా “నిజం” ఒక్కటే అనుకుంటాను.
గణేష్ పాత్రో “పావలా”, ధవళ కుర్రాడి “షిప్పొచ్చింది” ఇత్యాది అసలు ప్రస్తావించబడలేదు.
మధ్యలో వీధి నాటకాలొచ్చేయి: “టామీ టామీ టామీ” ఇత్యాది.
ఎ.ఆర్.కృష్ణ “కష్టం” మీ వ్యాసంలో కనబడలేదు.
రావి కొండల రావు గారు ఓ ఇరవైయ్యేళ్ళ కిందటే “తెలుగు సినిమాని కాపీ కొట్టి తెలుగు నాటక రంగం భ్రష్టు పట్టి పోతోంది” అని “ఆంధ్రజ్యోతి” లో బాధపడ్డారు.
ఇంత “సబ్జెక్ట్” వుండి ఇలాటి వ్యాసం?
మొత్తం పదకొండు పేజీలూ చదివిన తరవాత, ఆచార్య తిరుమల రామచంద్ర గారు ఈ మాట మొదటి సంచికలో రాసిన “తెలుగు వ్యాసం” మరొకసారి చదివితే గాని మనసు నిమ్మళించలేదు.
క్షమించాలి.
నిన్న పార్లమెంటులో ప్రధాని ప్రసంగంలో జ్యోతిష్యాన్ని గురించి ప్రస్తావించారు. కొందరు రాజకీయ ప్రముఖులు జ్యోతిష్కుల సలహాలని అనుసరించే తమ స్ట్రాటజీల్ని నిర్ణయించుకున్నారట. జ్యోతిష్యంలో సత్తా ఉందో లేదో తెలియదు గానీ, డబ్బుతో పాటూ ఇది కూడా భారత రాజకీయాల్ని కూడా శాసిస్తోంది. ఏదేమైనా జ్యోతిష్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వెయ్యకూడదు.
Really it is an excellent work and is highly informative. It has all the potential and need for inclusion in our text books. Please write some more articles. Keep it up. I wanted to write this in telugu but my lack of key board knowledge has prevented me.
Murthy
@వికట కవి గారూ: ఈ ఒక్క ప్రతిస్పందనలో మాత్రం మీరు చెప్పిన తీరు ఎలావుంది అంటే, న్యాయమూర్తి వాదన వినకుండ తీర్పుని ఇచ్చినట్టుగా ఉంది!
నచ్చకాపోతే దులిపేసుకోండీ అనడం ఇంకా విడ్డూరంగా వుంది. మీరు చెసిన వ్యాఖ్య “సగటు కధలని” దృష్టిలో పెట్టుకుని చేసినది అయినా, కధ చదవకుండ ఈ రచయిత ని అదే గాటకి కట్టడం ఎంతరకు సమంజసం?
@ప్రసాద్ గారూ: అన్నీ కధలూ నీతిని బోధించాలి అనిగాని ఏమైనా వుందా, లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా. పాత్రల స్వరూప స్వభవాలని విశ్లేషించడం, పాఠకునిగా మన భాద్యత కావచ్చుగాని, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడం మన హక్కుమాత్రం కాదు…
ఇటువంటి కధని ఎంచుకున్నందుకు రచయిత ధైర్యన్ని మెచ్చుకుంటూన్నాను. (వి)విమర్శలు చేసిన రచనా “దురంధురల” (దుస్)సాహసాన్ని కూడా!!!
ఇంటర్వ్యూ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. భద్రిరాజు గారితో పూర్తిగా ఏకీభవించక పోయినా, వారి తాత్పర్యం శ్రోతని ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా “అపోహ” ల విషయం. ఒక చిన్న మనవి. ఇంటర్వ్యూ నిడివీ, అందులోని ముఖ్యంశాలూ, వక్తా, పరిచయ కర్తల క్లుప్త సమాచారం పొందుపరిస్తే వీలుగా ఉంటుంది.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
07/23/2008 11:07 am
సమకాలీన నాటకాలన్నీ ప్రస్తావించే అవసరం ఉందా? అది వేరొక వ్యాసంలా తయారవుతుంది. సమకాలీన నాటకాల గురించి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు పుస్తకం రాసారు. నా ఈ వ్యాసం పరిధి, పరిమితి, ఉద్దేశ్యం వేరు. తెలుగు నాటకరంగంలో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం వల్ల కొత్తగా చెప్పేదేమీ ఉండదని అనిపించింది. అన్నీ అందరికీ నచ్చాలని లేదు కదండీ?
ఇద్దరు దుర్మార్గులు గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
07/23/2008 10:47 am
అసంఖ్య ధవళ గారూ,
ఈ కధ చదివాక, “రచయిత ధైర్యాన్ని మెచ్చుకోవడానికీ”, “విమర్శలు చేసిన రచనా దురంధురల (దుస్) సాహసాన్ని ప్రస్తావించడానికీ” మీకెంత ‘హక్కు’ వుందో, అంతే ‘హక్కు’, ఈ కధ నచ్చని వారికి, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడానికి వుంటుంది.
ప్రతీ కధా ఒక నీతిని బోధించాలి అని ఎవరూ అనరు. అయితే రచయిత ఆ కధని చెప్పేటప్పుడు, దాని లోని విషయాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏకీభవించడమో, విమర్శించడమో చేస్తాడు. వార్తా విలేఖరి మాత్రమే ఒక విషయంలోని సత్యాసత్యాల్ని ఒక వార్తలాగా చెప్పి వూరుకుంటాడు. రచయితలు సమాజం లోని విషయాలనే తమ రచనల్లోనూ ప్రతిబింబిస్తారు. దాన్ని బట్టీ పాఠకులు తమ చైతన్యానికి అనుగుణంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు.
“పాఠకులకు బాధ్యతలే వుంటాయీ, హక్కులు వుండవూ” అని మీరు అనడం నిజంగా సాహసమే. ఈ అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తాను. ఒక రకంగా చూస్తే, పాఠకుడికి రచనకి సంబంధించి ఒక బాధ్యత అంటగట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఒక రచనకి సంబంధించి, పరిమితుల్లో, తన చైతన్యానికి అనుగుణంగా, స్పందించే హక్కు ఒక పాఠకుడికి ఎప్పుడూ వుంటుంది. విమర్శ సహేతుకంగా వుంటే, ఇతర పాఠకులు కూడా అంగీకరించొచ్చు, లేదా విభేదించొచ్చు. లేకపోతే రెండు మాటల్లో, “నచ్చలేదూ, ఈ కధ అనవసరం” అంటూ, తన అభిప్రాయం చెప్పుకోవచ్చు. రచయిత తన రచనని పబ్లిక్ లో పెట్టినప్పుడు, ఇటువంటి విమర్శలకి సిద్ధపడి వుండాలి. అభిప్రాయాలని సెన్సార్ చెయ్యడానికి ఈమాట వారు ఎప్పుడూ వున్నారు.
ఆఖరుగా చెప్పొచ్చేదేమంటే, పరిమితుల్లో, ఒక పాఠకుడికి ఒక కధ ఎంత వరకూ పనికి వస్తుందీ అని చెప్పే హక్కు వుంటుంది అని. రచయితలు రాసేదే పాఠకుల కోసం కనుక.
ఇంకో విషయం. మీరు, “లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా” అని అడిగారు.
కధలోని పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడం ఏమిటీ? అవి కధలో పాత్రలు కదా? కధ చదివే వాళ్ళు ఆ పని చేస్తారు. రచన చేసేటప్పుడు రచయిత కూడా ఆ పని చేస్తాడు. తాను సరి అనుకున్నదే తన పాత్రల చేత చెప్పిస్తాడు విమర్శ లేకుండా. పాఠకులు కూడా తాము సరి అనుకున్నవాటితో ఏకీభవిస్తారు. లేదా విమర్శిస్తారు. వారికి ఆ హక్కు లేదనే హక్కు మీకు లేదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒక పాఠకులే కదా?
– ప్రసాద్
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి baabjeelu అభిప్రాయం:
07/23/2008 8:39 am
సాయి బ్రహ్మానందం గారూ,
“తెరమరుగౌతున్న తెలుగు నాటకం” శీర్షికన మీరు సంస్కృత నాటకాల్ని స్పృశించి, పద్య నాటకాల్ని పరామర్శించి, ఆ తరవాత నాటకం ఎలా రాయాలి, ఎలా “డైరెక్ట్” చెయ్యలి, ఎలా నటించాలి, “మేకప్పు”, రంగాలంకరణ, నంది ఎవార్డులు ఇత్యాది అద్భుతంగా వివరించేరు.
ఈ వ్యాసంలో వుదహరించిన నాటకాలన్నీ “కాంటెంపరరీ” నాటకాలు కావు. బహుశా “నిజం” ఒక్కటే అనుకుంటాను.
గణేష్ పాత్రో “పావలా”, ధవళ కుర్రాడి “షిప్పొచ్చింది” ఇత్యాది అసలు ప్రస్తావించబడలేదు.
మధ్యలో వీధి నాటకాలొచ్చేయి: “టామీ టామీ టామీ” ఇత్యాది.
ఎ.ఆర్.కృష్ణ “కష్టం” మీ వ్యాసంలో కనబడలేదు.
రావి కొండల రావు గారు ఓ ఇరవైయ్యేళ్ళ కిందటే “తెలుగు సినిమాని కాపీ కొట్టి తెలుగు నాటక రంగం భ్రష్టు పట్టి పోతోంది” అని “ఆంధ్రజ్యోతి” లో బాధపడ్డారు.
ఇంత “సబ్జెక్ట్” వుండి ఇలాటి వ్యాసం?
మొత్తం పదకొండు పేజీలూ చదివిన తరవాత, ఆచార్య తిరుమల రామచంద్ర గారు ఈ మాట మొదటి సంచికలో రాసిన “తెలుగు వ్యాసం” మరొకసారి చదివితే గాని మనసు నిమ్మళించలేదు.
క్షమించాలి.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి సూర్య అభిప్రాయం:
07/23/2008 6:40 am
నిన్న పార్లమెంటులో ప్రధాని ప్రసంగంలో జ్యోతిష్యాన్ని గురించి ప్రస్తావించారు. కొందరు రాజకీయ ప్రముఖులు జ్యోతిష్కుల సలహాలని అనుసరించే తమ స్ట్రాటజీల్ని నిర్ణయించుకున్నారట. జ్యోతిష్యంలో సత్తా ఉందో లేదో తెలియదు గానీ, డబ్బుతో పాటూ ఇది కూడా భారత రాజకీయాల్ని కూడా శాసిస్తోంది. ఏదేమైనా జ్యోతిష్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వెయ్యకూడదు.
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Subbu అభిప్రాయం:
07/22/2008 7:25 pm
Thanks for a great article. Well written. When you casually mentioned over the weekend that you knew Jim Grey, I did not realize the story behind.
Regards,
Subbu
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Srinivas అభిప్రాయం:
07/22/2008 10:54 am
Excellent articles. Very informative. Waiting for the next parts. Thank you.
తెలుగు భాష వయస్సెంత? గురించి Prof. C.Parameswara Murthy అభిప్రాయం:
07/22/2008 5:43 am
Really it is an excellent work and is highly informative. It has all the potential and need for inclusion in our text books. Please write some more articles. Keep it up. I wanted to write this in telugu but my lack of key board knowledge has prevented me.
Murthy
ఇద్దరు దుర్మార్గులు గురించి అసంఖ్య ధవళ అభిప్రాయం:
07/21/2008 12:27 am
@వికట కవి గారూ: ఈ ఒక్క ప్రతిస్పందనలో మాత్రం మీరు చెప్పిన తీరు ఎలావుంది అంటే, న్యాయమూర్తి వాదన వినకుండ తీర్పుని ఇచ్చినట్టుగా ఉంది!
నచ్చకాపోతే దులిపేసుకోండీ అనడం ఇంకా విడ్డూరంగా వుంది. మీరు చెసిన వ్యాఖ్య “సగటు కధలని” దృష్టిలో పెట్టుకుని చేసినది అయినా, కధ చదవకుండ ఈ రచయిత ని అదే గాటకి కట్టడం ఎంతరకు సమంజసం?
@ప్రసాద్ గారూ: అన్నీ కధలూ నీతిని బోధించాలి అనిగాని ఏమైనా వుందా, లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా. పాత్రల స్వరూప స్వభవాలని విశ్లేషించడం, పాఠకునిగా మన భాద్యత కావచ్చుగాని, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడం మన హక్కుమాత్రం కాదు…
ఇటువంటి కధని ఎంచుకున్నందుకు రచయిత ధైర్యన్ని మెచ్చుకుంటూన్నాను. (వి)విమర్శలు చేసిన రచనా “దురంధురల” (దుస్)సాహసాన్ని కూడా!!!
-అసంఖ్య ధవళ
అంతర్మథనం గురించి kumar అభిప్రాయం:
07/20/2008 10:24 am
one of the best on eemaata site
భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ గురించి చిన్నమయ్య అభిప్రాయం:
07/20/2008 10:12 am