మరొక ముచ్చట గుర్తుకొచ్చింది. చిన్నతనంలో తనను పరీక్షించడానికొచ్చిన ఒక విద్వాంసుడు తలొక్క చేత్తో తలొక కాలంలో ఆదితాళం వేసి చూపుతూ, ఆ విద్యను కుర్రవాడికి నేర్పమని బాలమురళి గురువుకు సలహా ఇచ్చాడట. అంటే ఒక వేగంతో ఒక చేత్తోనూ, దానికి రెండింతల వేగంతో మరో చేత్తోనూ వేళ్ళు కదుపుతూ ఆదితాళాన్ని సూచించడం అన్నమాట. ఇది చూసిన బాలమురళి తానుకూడా వెంటనే అలా చేసి చూపడమే కాక చేతులు మార్చి మళ్ళీ తాళం వేసి చూపాడట. మీరలా చెయ్యగలరా అని ఆ వచ్చినాయనను బాలమురళి అడిగితే ఆయన చల్లగా జారుకున్నాడట. ఈ రకమైన అవయవ నియంత్రణ ఆదిభట్ల నారాయణాదాసుగారికి ఉండేదనీ, ఆయన ఏకకాలంలో పంచముఖి అనే అయిదురకాల తాళాలను ఒకేసారి (రెండు కాళ్ళూ, రెండు చేతులూ, నోటిపాట ద్వారా) వేసి చూపేవాడనీ అంటారు.
భలే కథ. వేగంగా చదివించేలా చాలా బాగా అనువదించారు. “సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.
నాకు తెలీని చాలా విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నాను. కృతజ్ఞతలు. “1857 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది.” … ఈ వాక్యం రామమూర్తిగారి విద్యాభ్యాసాన్ని గురించి చెప్పిందేనా అని సందేహం. ఆయన జన్మించింది 1863లో అన్నారు కదా?
[అక్కడ “1875 దాకా ” అని ఉండాల్సింది. అచ్చు తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు – సం.]
బాలమురళీకృష్ణగారిని గురించిన వ్యాసం చదవడానికి బాగుంది. వారు తెలుగు సినిమాలలో పాడిన పాటలను అందరూ వినే ఉంటారు. వీరు మిగిలిన దక్షిణ భాషల సినిమాలలో కూడా పాడారు. అందులో కొన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. మలయాళంలో దక్షిణామూర్తి మాస్టారు దర్శకత్వంలో గానం అనే చిత్రంలో వీరు పాడారు. ఆ పాటలను ఇక్కడ వినగలరు –
కన్నడ సినిమాలలో వీరు చాల అందంగా పాడారు. నాకు తెలిసినవి – సంధ్యారాగ (ప్రసిద్ధ రచయిత అ.న. కృ. వారి నవలపై ఆధారం). ఇందులో వీరు మరియు భీమసేన్ జోషీగారు ఇద్దరు పాడారు. ఇందులో రెండు ఈ పరియ సొబగు (పురందరదాసు), నంబిదె నిన్న నాద దేవతె పాటలను యూట్యూబులో వినవచ్చు.
మరొకటి హంసగీతె. ఇందులో శ్యామశాస్త్రి పాటను అత్యద్భుతముగా పాడారు. అంతేకాక జయదేవుని అష్టపదులను ఎం. ఎల్. వసంతకుమారితో పాడారు. ఈ పాటలను ఇక్కడ వినవచ్చు –
కన్నడములోని మూడవ చిత్రం సుబ్బా శాస్త్రి. ఇది ఒక మస్ట్ సీ చిత్రము. దీని సంగీత దర్శకుడు వీణా దొరైస్వామి అయ్యంగారులు. ఇందులో దేవరనామములను మురళికృష్ణగారు చాల చక్కగా పాడారు. ఈ పాటలను ఇక్కడ వినగలరు –
ఈ చిత్రపు మరొక అందమైన పాట (నాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం) శ్రీరంగం గోపాలరత్నంగారు పాడిన కృష్ణన కొళలిన కరె. దీనిని నేను ఒకప్పుడు తెలుగులో అనువాదం చేసి రచ్చబండలో ప్రచురించినట్లు గుర్తు.
మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. వాడిన భాష, శైలి చదవటానికి సులభంగా ఉన్నాయి. “ఈమాట”కు పరిచయమైన కొత్తల్లోనే ఇంత చక్కగా రాసారంటే, ముందు ముందు సంచికల్లో, మీ “రాతల” కోసం ఎదురుచూడక తప్పదు.
అన్నట్టు, “ఈమాట రచయితలు” లిస్టులో మీ గురించి పరిచయం చదివినట్టు గుర్తు లేదు. మీ గురించి పరిచయం “ఈమాట” కి ఇంకా పంపకపోతే, దయచేసి ఇప్పుడైనా పంపించండి.
ఆరుద్ర, బాలమురళీ మీద రాసిన వ్యాసం, తపాలా శాఖ వారి దయ వల్ల గాల్లో కలిసిపోయిందని చాలా ఏళ్ళ కిందట చదివినప్పుడు కలిగిన బాధ, ఈ వ్యాసంతో ఉపశమించింది.
బాలమురళీ ఛలోక్తులు:
బొంబాయిలో రంగ్ భవన్ కచేరీ లో, స్వాతి తిరునాళ్ కీర్తన ముందు, “ఈ హిందీ పాట, ఒక మళయాళీ రాజుగారు రాసింది. ఒక మళయాళీ సినిమా కోసం, వరస కట్టి పాడింది, తెలుగునాట పుట్టి, తమిళనాట్లో పెరిగిన కుర్రాడు. ఆ కుర్రాణ్ణి నేనే.”
ఈ కచేరీలోనే “ఒరునాళ్ పోదుమా …” మొదలెట్టి, పాట ఆపి “పోగాదు ముడిచిట్టుమా?” అనడం.
ఈ కచేరీలోనే “రబీంద్రొ షొంగీత్” మొదలెట్టినపుడు, వెనక వరసలో కూచున్న బెంగాలీ “ఖూబ్ భాలో” అన్నప్పుడు, ఆశ్చర్యం వేసింది.
ఆగష్టు 24, 2008 న రవీంద్రభారతి లోజరిగిన కార్యక్రమం లో, “ఇలా అన్నీ పాడేస్తే ఇక నన్నెవరూ కచేరీలకి పిలవరు.” రసికులిచ్చిన లిస్ట్ చూసి.
ఎస్. జానకి గారు, స్టేజి దగ్గరకెళ్ళి, “దేవీ బ్రోవ సమయమిదే” అని నాలుగైదు సార్లు గట్టిగా అడిగేరు. బాలమురళీ “ఇదేనా?”
“తుంగా తరంగే” పాడమని ఎవరో రాసి పంపితే, “అవన్నీ బాలమురళీ గా వున్నప్పుడు పాడినవి.”
కచేరీ వినడానికి వచ్చిన వాళ్ళని బట్టి కచేరీ చెయ్యడం ఈయనొక్కరే చెయ్యగలరని నా నమ్మకం.
బాలమురళీ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు కలిసి “ఎంకి పాటలు” కూడా పాడేరు. భక్తిరంజని కార్యక్రమం లాగే వుంటుంది. బహుశా అందుకే ఎవరూ వాటి ఊసు ఎత్తరేమో?
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
09/03/2008 8:30 pm
సూర్యుడు గారూ,
మీరీ ప్రశ్న అడిగారు:
కరక్టే.
కొడవళ్ళ హనుమంతరావు
బాలమురళీకృష్ణ గురించి Rohiniprasad అభిప్రాయం:
09/03/2008 7:11 pm
మరొక ముచ్చట గుర్తుకొచ్చింది. చిన్నతనంలో తనను పరీక్షించడానికొచ్చిన ఒక విద్వాంసుడు తలొక్క చేత్తో తలొక కాలంలో ఆదితాళం వేసి చూపుతూ, ఆ విద్యను కుర్రవాడికి నేర్పమని బాలమురళి గురువుకు సలహా ఇచ్చాడట. అంటే ఒక వేగంతో ఒక చేత్తోనూ, దానికి రెండింతల వేగంతో మరో చేత్తోనూ వేళ్ళు కదుపుతూ ఆదితాళాన్ని సూచించడం అన్నమాట. ఇది చూసిన బాలమురళి తానుకూడా వెంటనే అలా చేసి చూపడమే కాక చేతులు మార్చి మళ్ళీ తాళం వేసి చూపాడట. మీరలా చెయ్యగలరా అని ఆ వచ్చినాయనను బాలమురళి అడిగితే ఆయన చల్లగా జారుకున్నాడట. ఈ రకమైన అవయవ నియంత్రణ ఆదిభట్ల నారాయణాదాసుగారికి ఉండేదనీ, ఆయన ఏకకాలంలో పంచముఖి అనే అయిదురకాల తాళాలను ఒకేసారి (రెండు కాళ్ళూ, రెండు చేతులూ, నోటిపాట ద్వారా) వేసి చూపేవాడనీ అంటారు.
సెన్సిటివిటీ ట్రెయినింగ్ గురించి రానారె అభిప్రాయం:
09/03/2008 1:36 pm
భలే కథ. వేగంగా చదివించేలా చాలా బాగా అనువదించారు. “సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.
గిడుగు వెంకట రామమూర్తి – రేఖాచిత్రం (1863 – 1940) గురించి రానారె అభిప్రాయం:
09/03/2008 11:43 am
నాకు తెలీని చాలా విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నాను. కృతజ్ఞతలు. “1857 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది.” … ఈ వాక్యం రామమూర్తిగారి విద్యాభ్యాసాన్ని గురించి చెప్పిందేనా అని సందేహం. ఆయన జన్మించింది 1863లో అన్నారు కదా?
[అక్కడ “1875 దాకా ” అని ఉండాల్సింది. అచ్చు తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు – సం.]
బాలమురళీకృష్ణ గురించి mOhana అభిప్రాయం:
09/03/2008 9:19 am
బాలమురళీకృష్ణగారిని గురించిన వ్యాసం చదవడానికి బాగుంది. వారు తెలుగు సినిమాలలో పాడిన పాటలను అందరూ వినే ఉంటారు. వీరు మిగిలిన దక్షిణ భాషల సినిమాలలో కూడా పాడారు. అందులో కొన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. మలయాళంలో దక్షిణామూర్తి మాస్టారు దర్శకత్వంలో గానం అనే చిత్రంలో వీరు పాడారు. ఆ పాటలను ఇక్కడ వినగలరు –
గానం (మళయాళం) (devaragam.com నుండి)
ఇందులో ఒక స్వాతి తిరునాళ్ పాట బాలమురళిగారు సుశీలగారికి నేర్పినట్లు ఉంటుంది.
తమిళములో నాకు తెలిసి వీరి మూడు సినిమా పాటలు ప్రసిద్ధమైనవి. అవి –
1. కలైక్కోయిల్ అనే చిత్రంలో విశ్వనాథన్-రామమూర్తి సంగీత దర్శకత్వంలో తంగ రదం వందదు వీదియిలే అనే పాట. ఇంటర్నెట్లో నాకు ఆ పాట లభ్యము కాలేదు. మిగిలినవి –
2. బాబ్జీలుగారు చెప్పిన తిరువిళైయాడల్లోని రాగమాలిక ఒరు నాళ్ పోదుమా (సంగీతం – మహాదేవన్). దానిని ఇక్కడ వినగలరు –
ఒరు నాళ్ పోదుమా (musicindiaonline నుండి)
3. మరొకటి ఇళయరాజా దర్శకత్వములో కవిక్కుయిల్లోని చిన్న కన్నన్ అళైక్కిరాన్
చిన్న కన్నన్ అళైక్కిరాన్ (musicindiaonline నుండి)
కన్నడ సినిమాలలో వీరు చాల అందంగా పాడారు. నాకు తెలిసినవి – సంధ్యారాగ (ప్రసిద్ధ రచయిత అ.న. కృ. వారి నవలపై ఆధారం). ఇందులో వీరు మరియు భీమసేన్ జోషీగారు ఇద్దరు పాడారు. ఇందులో రెండు ఈ పరియ సొబగు (పురందరదాసు), నంబిదె నిన్న నాద దేవతె పాటలను యూట్యూబులో వినవచ్చు.
మరొకటి హంసగీతె. ఇందులో శ్యామశాస్త్రి పాటను అత్యద్భుతముగా పాడారు. అంతేకాక జయదేవుని అష్టపదులను ఎం. ఎల్. వసంతకుమారితో పాడారు. ఈ పాటలను ఇక్కడ వినవచ్చు –
హంసగీతె (కన్నడ) (musicindiaonline నుండి)
కన్నడములోని మూడవ చిత్రం సుబ్బా శాస్త్రి. ఇది ఒక మస్ట్ సీ చిత్రము. దీని సంగీత దర్శకుడు వీణా దొరైస్వామి అయ్యంగారులు. ఇందులో దేవరనామములను మురళికృష్ణగారు చాల చక్కగా పాడారు. ఈ పాటలను ఇక్కడ వినగలరు –
సుబ్బా శాస్త్రి (కన్నడ) (musicindiaonline నుండి)
ఈ చిత్రపు మరొక అందమైన పాట (నాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం) శ్రీరంగం గోపాలరత్నంగారు పాడిన కృష్ణన కొళలిన కరె. దీనిని నేను ఒకప్పుడు తెలుగులో అనువాదం చేసి రచ్చబండలో ప్రచురించినట్లు గుర్తు.
– మోహన
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి sUryuDu అభిప్రాయం:
09/03/2008 8:20 am
“ప్రమేయం విలువ మాత్రం అవును (True), కాదు (False) అనే రెండిట్లో ఒక విలువని మాత్రమే ఇస్తుంది”
పై ప్రవచనం కరక్టేనా?
సూర్యుడు 🙂
పడవ మునుగుతోంది గురించి psathyavathi అభిప్రాయం:
09/03/2008 8:01 am
శారదగారూ, మీరు తెలుగులో కూడా ఇంతబాగా వ్రాస్తారని ఈకధ చదివేదాకా తెలీదు. బాగా వ్రాసారు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/03/2008 6:07 am
నాగ మురళీ గారు:
మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. వాడిన భాష, శైలి చదవటానికి సులభంగా ఉన్నాయి. “ఈమాట”కు పరిచయమైన కొత్తల్లోనే ఇంత చక్కగా రాసారంటే, ముందు ముందు సంచికల్లో, మీ “రాతల” కోసం ఎదురుచూడక తప్పదు.
అన్నట్టు, “ఈమాట రచయితలు” లిస్టులో మీ గురించి పరిచయం చదివినట్టు గుర్తు లేదు. మీ గురించి పరిచయం “ఈమాట” కి ఇంకా పంపకపోతే, దయచేసి ఇప్పుడైనా పంపించండి.
అభినందనలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
బాలమురళీకృష్ణ గురించి baabjeelu అభిప్రాయం:
09/03/2008 5:23 am
ఆరుద్ర, బాలమురళీ మీద రాసిన వ్యాసం, తపాలా శాఖ వారి దయ వల్ల గాల్లో కలిసిపోయిందని చాలా ఏళ్ళ కిందట చదివినప్పుడు కలిగిన బాధ, ఈ వ్యాసంతో ఉపశమించింది.
బాలమురళీ ఛలోక్తులు:
బొంబాయిలో రంగ్ భవన్ కచేరీ లో, స్వాతి తిరునాళ్ కీర్తన ముందు, “ఈ హిందీ పాట, ఒక మళయాళీ రాజుగారు రాసింది. ఒక మళయాళీ సినిమా కోసం, వరస కట్టి పాడింది, తెలుగునాట పుట్టి, తమిళనాట్లో పెరిగిన కుర్రాడు. ఆ కుర్రాణ్ణి నేనే.”
ఈ కచేరీలోనే “ఒరునాళ్ పోదుమా …” మొదలెట్టి, పాట ఆపి “పోగాదు ముడిచిట్టుమా?” అనడం.
ఈ కచేరీలోనే “రబీంద్రొ షొంగీత్” మొదలెట్టినపుడు, వెనక వరసలో కూచున్న బెంగాలీ “ఖూబ్ భాలో” అన్నప్పుడు, ఆశ్చర్యం వేసింది.
ఆగష్టు 24, 2008 న రవీంద్రభారతి లోజరిగిన కార్యక్రమం లో, “ఇలా అన్నీ పాడేస్తే ఇక నన్నెవరూ కచేరీలకి పిలవరు.” రసికులిచ్చిన లిస్ట్ చూసి.
ఎస్. జానకి గారు, స్టేజి దగ్గరకెళ్ళి, “దేవీ బ్రోవ సమయమిదే” అని నాలుగైదు సార్లు గట్టిగా అడిగేరు. బాలమురళీ “ఇదేనా?”
“తుంగా తరంగే” పాడమని ఎవరో రాసి పంపితే, “అవన్నీ బాలమురళీ గా వున్నప్పుడు పాడినవి.”
కచేరీ వినడానికి వచ్చిన వాళ్ళని బట్టి కచేరీ చెయ్యడం ఈయనొక్కరే చెయ్యగలరని నా నమ్మకం.
బాలమురళీ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు కలిసి “ఎంకి పాటలు” కూడా పాడేరు. భక్తిరంజని కార్యక్రమం లాగే వుంటుంది. బహుశా అందుకే ఎవరూ వాటి ఊసు ఎత్తరేమో?
ధార గురించి meenakshi అభిప్రాయం:
09/03/2008 4:31 am
చాలా బా రాసారు రాజేంద్ర గారు. ఈ కథ ఎండింగ్ ఇలా ఉంటుందని నేనసలు ఊహించలేదు..బావుంది.