పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. పడవ మునుగుతోంది గురించి viswam అభిప్రాయం:

    09/08/2008 3:21 pm

    చక్కటి కథ చదివిన అనుభూతి కాదు కాని, ఒక వాస్తవిక అంశాన్ని ఎంత బాగా చెప్పారు అని అనిపించింది. వారికి రోజు గడవటమే జీవన్మరణ సమస్య ఐతే, పాపం, ఏ పాస్పోర్ట్, వీసాలు వారిని ఆదుకొంటాయీ? ఏ మానవహక్కులు వారికి రక్షణ కల్పిస్తాయి?

  2. బాలమురళీకృష్ణ గురించి కొత్తపాళీ అభిప్రాయం:

    09/08/2008 8:19 am

    వాగ్గేయకారులు అనే మాట ఫ్యూడల్ పదం ఎలాగైందో నాకర్ధం కాలేదు!
    గేయ సాహిత్యము రాసుకుని దానికి సంగీతం సమకూర్చినంత మాత్రాన అది చేసిన ప్రతివారూ వాగ్గేయకారులైపోరని రోహిణీప్రసాదుగారు తెలియనట్టుగా మాట్లాడ్డం విడ్డురంగా ఉంది. ఇంత మాత్రానికి దానికి “పాతకాలపు tags” అని లేనిపోని రంగు అద్దడం కూడా ఆశ్చర్యంగా ఉంది.
    నచ్చడం నచ్చకపోవడం వేరే సంగతి. దాన్ని గురించి నాకు మాట్లాడ్డం ఇష్టం లేదన్నా అదో పద్ధతి. బాలమురళీ అసలు వాగ్గేయకారుడే కాదు అనడం (రోహిణీ ప్రసాదు గారు కాదు, ఇంకెవరో అన్నారు), లేక ఇలాంటి “పాతకాలపు tags” వాడ్డం ఇష్టం లేదనడం హాస్యాస్పదంగా ఉంది.

  3. బాలమురళీకృష్ణ గురించి mOhana అభిప్రాయం:

    09/08/2008 8:10 am

    వాగ్గేయకారులపైన చర్చ జరుగుతుంది కనుక ఇక్కడ
    కొన్ని విషయాలను గురించి చెప్పాలి. కాకి నలుపే,
    కోకిల నలుపే, కాని వసంతఋతువులో కాకి కాకే, కోకిల
    కోకిలే అన్నట్లు, ఒక పాట వ్రాసి దానికి ఒక వరుస
    కట్టినంత మాత్రాన ఒక వ్యక్తిని వాగ్గేయకారుడు అనలేము.
    వాగ్గేయకారునికి సాహిత్యం బాగా తెలిసి ఉండాలి. భాషలలో
    ప్రజ్ఞ ఉండాలి. ఛందస్సు, వ్యాకరణం తెలిసి ఉండాలి.
    అలంకారాల ఉపయోగం తెలిసి ఉండాలి. సంగీత శాస్త్రంలో
    గొప్ప ప్రతిభ ఉండాలి. మూడు కాలాలలో పాడే శక్తి ఉండాలి
    అతని కంఠానికి. సంగీతశాస్త్రంలోని వివరాలను చక్కగా
    ఎరిగి ఉండాలి. రాగ తాళ లయాదుల జ్ఞానం క్షుణ్ణంగా
    అవగాహన చేసికొని ఉండాలి. రసానుభూతిని కలిగి
    ఉండాలి. స్వరాల ఉపయోగాన్ని తెలిసికొని ఉండాలి.
    వివిధ విధాలైన కృతులను వ్రాసి వాటిని సంగీతంతో
    జీవంతం చేసి ఉండాలి. ఉదాహరణకు, త్యాగరాజు
    పాటలను మాత్రమే కాదు, రెండు యక్షగానాలను
    కూడా వ్రాశారు. ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్లు ఏ
    కొందరు మాత్రమే నిజంగా వాగ్గేయకారులు.
    మిగిలినవారు “నేను కూడా వాగ్గేయకారుడినే” ఆని
    అనుకొన్నవారు. విధేయుడు – మోహన

  4. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి mOhana అభిప్రాయం:

    09/08/2008 6:39 am

    ఈ వ్యాసం మిగత భాగాలకు ఎదురుచూస్తున్నాను. సాయి
    బ్రహ్మానందం గారి శ్రద్ధ, ఆసక్తి, కుతూహలం ఈ వ్యాసంలో
    ప్రతిబింబిస్తున్నాయి. ఒక వాగ్గేయకారునికి ముఖ్యంగా
    కావలసినవి – సంగీతంలో విద్వత్తు, సాహిత్యంలోని
    సుళువులు. ఈ రెంటికి ఎలా పొత్తు కుదిరిస్తే పండిత
    పామర రంజకంగా ఉంటుందనే విషయాన్ని తెలిసిన
    వారిలో త్యాగరాజు అద్వితీయుడు. ఏ మహానుభావుడైనా
    అంత గొప్పవాడు ఎలా అయ్యాడని తెలిసికోవాలంటే అతని
    జీవిత చరిత్ర దీనికి కొంతైనా సహాయకారి అవుతుంది.
    దీనికి ఈ వ్యాసం ఎంతైనా తోడ్పడుతుంది. త్యాగరాజుని
    తలచుకొంటుంటే ఒక్కొక్కప్పుడు విదేశాలలో ఉండే మన
    స్థితి గుర్తుకు వస్తుంది. తెలుగులో ఆసక్తి ఉన్న
    దేశాంతరవాసులంతా ద్వీపాలే. తమిళదేశంలో ఉండే
    త్యాగరాజు కూడ ఒక తెలుగు ద్వీపమే. అతడు ద్వీపం
    మాత్రమే కాదు, ఒక దీపం కూడా. మనలో ఒక కొందరికి
    తెలుగు భాషను అభివృద్ధి చేయాలనే ఆశ ఉన్నది.
    దీనికి కూడా ఇట్టి వ్యాసాలలో మార్గాలు దొరుకుతాయేమో?
    బ్రహ్మానందంగారి శ్రమ ప్రశంసనీయం. ఇందులో
    ఉదహరించబడిన ఒక పుస్తకం కింది లింకులో
    లభ్యము –
    tyAgarAja – Life and Lyrics – Jackson
    (Digital Library of India, IISc)

    విధేయుడు – మోహన

  5. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    09/08/2008 6:28 am

    రమాదేవి గారికి:

    మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం!

    చిన్న సవరణ.

    నేను “ఈమాట” కు ఒకప్పుడు సంపాదకుడుగా పని చేసాను. ఇప్పుడు నేను “ఈమాట” సంపాదక బృందంలో లేను. కాబట్టి, అబిప్రాయాలను “కత్తిరించే” వెసులు బాటు నాకు ఇప్పుడు లేదు.

    ఇక అభిప్రాయాలపై నా అభిప్రాయం:

    అభిప్రాయాలు “సహేతుకంగా” ఉండవలసిన అవసరం లేదేమో! వ్యక్తిగత దూషణలకు, అర్ధం లేని అనవసర వివాదాలకు దారి తియ్యనంత కాలం, ఎవరి అభిప్రాయాలు వారివి అని ఊరుకుంటే సరి. నేను ఈమాటలో “నా రాతలపై” వచ్చిన కొన్ని అభిప్రాయాలను చదివి ఊరుకున్నానంతే!

    నమస్సులతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి Lalitha అభిప్రాయం:

    09/08/2008 1:55 am

    అద్భుతం. గొప్ప కథలను అందిస్తున్నారు. మా కోరిక ఇలా తీరినది.

    కృతజ్ఞతలు.
    లలిత.

  7. బాలమురళీకృష్ణ గురించి rama అభిప్రాయం:

    09/08/2008 1:47 am

    rohiNiprasad garu.. asalu aamaatakoste sastreeya samgeetamantaa mothamgaa mari ” fuedal” kaaLa avutunde ??danigurinchi “prajaswamika pramaNalato” marela matladukuntam?? prateedanikee pramaNalu vuntayi kadandee !! .meeru anesukunte saripotunda?? sastram kooda oppali.. sarasulu ounanianaali. meerichhina nirvachanam prakaram asalu vaggeyakaarulu kaanivarantoo evaroovundaranukuntaanu. political slogans ki padalu andinche vaalloo.. AD films ki matalani supply chesevaritosaha antaa telugu “vaggeyakarule”

    bhavadeeya RAMA/ rama.

  8. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి ramadevi godugula అభిప్రాయం:

    09/07/2008 11:29 pm

    ఈ పాఠకుడిబాధ అర్ధం కావట్లేదు. గందరగోళం ఏమిటో వివరంగా రాస్తే బావుండేది. నిజానికి చక్కటి వ్యాసం మీద ఎందుకు ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చారు? ఈ Site లో ఎడిటింగ్ అంటూ వుండదా ? పిడకల వేట ఎక్కువైంది అనడం ఎంతవరకు సబబు? మొర్మరాల మీద వ్యాసం ఇంతకన్నా ఇంకెలా వుండాలి? సహేతుకంగా లేని ఇలాంటి అభిప్రాయలని Publish చెయ్యడం ఈమాట విష్ణుభొట్ల లక్ష్మన్న గారిలాంటి వాళ్ళు గమనించాల్సిన విషయంగా భావిస్తున్నాను.

    రమాదేవి గొడుగుల

  9. అక్కడ… గురించి bhavani devi అభిప్రాయం:

    09/08/2008 3:11 am

    ఈ కవిత చాలా బాగుంది.

  10. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    09/07/2008 4:35 pm

    Oh, How I wish this kind of book was available in Telugu when I was growing up!
    Even now, it reminds me why I liked computer science, philosophy, and linguistics. I wish I could stop slinging code (or slides) and go back to learning this stuff.
    Thanks for this series. You (we) should publish it in Telugu, perhaps after it is made a little more accessible to high school students.

    Ramarao Kanneganti
    PS: Btw, f(x) = true or false essentially depends on the “law of excluded middle”. Or, even that a statement is true or false depends on that essential principle. But, you do not have to accept it leading to two newer ways of doing math and philosophy (Intuitionism and constructionism). Both of them were popular in Europe, specifically in the Netherlands. It may appear counter intuitive, but they are very useful in computer science.
    For instance, think how you can prove a theorem: a result that shows “false”, unless it provides a counter example is not much useful, right? Or, a “true” solution can be more useful if it provides a way of constructing the evidence. In short, it is very much useful for computers.
    Incidentally, at Cornell, there was a system called “NUPRL” that is a theorem proving system in the late 80’s built on these principles. Ah, memories!