పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/02/2008 9:59 am

    చారిత్రాత్మకమైన సినిమా గురించిన చక్కని వ్యాసం.

    సత్యజిత్ రాయ్ 1949లో ప్రసిద్ధ ఫ్రెంచ్ సినీదర్శకుడు రెన్వార్ మన దేశానికి వచ్చినప్పుడు ఆయన వెంట తిరిగి చాలా నేర్చుకున్నాడట. ఆ విషయాల్లో మన సినిమాలకి పనికొచ్చే నేర్పులేమిటో, పనికిరానివేమిటో కూడా ఉండి ఉంటాయి. మొత్తం మీద 1955 నాటికి రాయ్ బెంగాల్ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పథేర్ పాంచాలీ తియ్యగలిగాడు. దానితో ప్రపంచంలోని అత్యుత్తమ సినీదర్శకులలో ఒకడుగా ఆయన ప్రస్థానం మొదలైంది.

    అతను మన దేశపు పేదరికాన్ని సినిమాల ద్వారా అమ్ముకుని డబ్బూ, పేరూ గడించాడన్న మన సినీప్రబుద్ధులు కూడా ఉన్నారు. అతని ప్రతి సినిమా ఒక కావ్యం అన్నవారూ ఉన్నారు.

    సంగీతం గురించిన ఒక ముచ్చట. మొదట రాయ్ పథేర్ పాంచాలీ సినిమాకి ప్రసిద్ధ సితార్ విద్వాంసుడైన విలాయత్ ఖాన్ ను సంగీత దర్శకత్వం చెయ్యమని అడిగాడట. తన బంధువు ఒకావిడ అప్పుడే చనిపోవడంతో ‘మైల’లో ఉండడం వల్ల తాను ఆ పని చేపట్టలేదని విలాయత్ ఒక ఇంటర్వ్యూలో తరవాత చెప్పాడు. (జల్సాఘర్ అనే సినిమాకు తరవాత ఆయన సంగీతం అందించాడు). ఏది ఏమైనా విలాయత్ కోల్పోయిన అవకాశం రవిశంకర్ కు దక్కింది.

    రవిశంకర్ సిగ్నేచర్ ట్యూన్ బెంగాలీ జానపదశైలికి సరిపోయే భటియాలీ ధున్ అని చెప్పాలి. అది మాండ్ రాగాన్ని పోలి ఉంటుంది. (సుజాతా, బందినీ తదితర సినిమాల్లో ఎస్ డి బర్మన్ పాడిన పాటలు అటువంటివే.)
    ఆ తరవాత రాయ్ రవిశంకర్ చేత అపరాజిత, అపూర్ సన్సార్ , పారస్ పత్థర్ అనే సినిమాలకూ, అలీఅక్బర్ చేత దేవీ అనే సినిమాకూ సంగీతరచన చేయించాడు. అయితే తనకు కావల్సినట్టుగా ఇటువంటి పెద్దవారిచేత సంగీతం తయారుచేయించడం కష్టమనిపించి తక్కిన సినిమా లన్నింటికీ తానే ఆ పని కూడా సమర్థవంతంగా చేశాడు. రాయ్ ప్రదర్శించిన బహుముఖప్రజ్ఞల్లో సంగీతం ఒకటి మాత్రమే.

  2. ఈమాట – నామాట గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/02/2008 9:31 am

    ఈ మాట సంపాదకులకి చేకూరిన అనుభవం commendable అని నా ఉద్దేశం. ఈ నేపథ్యంలో Peer Reivew చేయించడం ఎంతవరకూ అవసరమో రచయితలూ, సంపాదకులూ జాగ్రత్తగా ఆలోచించాలి. తక్కిన వెబ్ పత్రికలూ, మామూలు పత్రికలూ ఏం చేస్తున్నారు? దీనివల్ల ‘తలపండిన’ రచయితలు కొందరు వెనక్కి తగ్గుతున్నారు. Brain storming sessions జరిగి ఉంటే వాటి వివరాలు dispassionateగా నమోదు కావాలి. ఈ కామెంటుని తీసేసినా పరవాలేదు కాని వెంటనే కాకపోయినా ఈ చర్చ జరగాలి.

  3. పదేళ్ళ “ఈమాట” మాట గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/02/2008 9:07 am

    ఈమాట సంచికలన్నీ దాని ముఖ్యపాత్రకు సజీవసాక్ష్యాలే. అయితే ఇంటర్నెట్ పత్రికలకు వేటికవిగా పాఠకుల, రచయితల లాయల్టీ కొంత కనిపిస్తుంది. సంపాదకుల వేపునుంచి వీటిమధ్య కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు జరగాలేమో.
    తక్కిన వెబ్ పత్రికల అస్తిత్వం గురించిన గుర్తింపు పరస్పరం ఆరోగ్యకరంగా పరిణమిస్తుందని నా ఉద్దేశం.

    ఈమాట వికాసానికి అనుబంధంగా ఇంటర్నెట్ లో తెలుగు వాడకం గురించిన చర్చకి కూడా ప్రమేయం ఉందనుకుంటాను. దీని చరిత్రను వెంటనే నమోదు చెయ్యడం చాలా అవసరమని భావించడం వల్ల ఈ విషయం గురించి దీనికి ‘పితామహులవంటి’ విష్ణుభొట్ల సోదరులనూ, మా కజిన్ పిల్లలమర్రి రామకృష్ణనూ, పరుచూరి శ్రీనివాస్ గారినీ కొంత కదిలించాను. తెలుగు ఫాంట్ విషయంలో దేశికాచారిగారివంటి వారు గొప్ప కృషి చేశారనేది తెలిసినదే. ముందొచ్చిన చెవులవంటి వీరందరూ విడివిడిగానో, కలిసికట్టుగానో రాస్తే తప్ప ఇంటర్నెట్ లో తెలుగు చరిత్ర ‘వర్తమాన తరంగిణి’ వంటి ప్రాచీన తెలుగు పత్రికల్లాగే మరుగున పడిపోతుందని నా భయం.

  4. హిమపాతము గురించి karverababu అభిప్రాయం:

    11/02/2008 6:29 am

    తిరుమల వారి హిమపాతము కవిత చాల బాగుంది. ఉత్తర అమెరికా శీతాకాలాన్ని వర్ణించారనుకుంటున్నా. కొన్ని పద్యాలు సరళ ఛందస్సు కాకపొయినా నారికేళపాకము కాదు. ఒకప్పుడు ఉత్తర ఐర్లెండు లో ఇలాంటి వాతావరణము లో చిక్కున్నప్పుడు మనుచరిత్ర లో ప్రవరాఖ్యుడి పాట్లు-పద్యాలు నెమరేశాను.

  5. ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి Vamsi M Maganti అభిప్రాయం:

    11/02/2008 6:12 am

    Congratulations and best wishes

    Vamsi

  6. మూడు జ్ఞాపకాలు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:34 pm

    మీ జ్ఞాపకాలు చాలా బావున్నాయి. మీరు పూర్తి స్థాయి కథలు రాస్తే చదవాలని ఉంది!

  7. పదేళ్ళ “ఈమాట” మాట గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:31 pm

    వెబ్ పత్రికల్లో ఈమాట అగ్రగణ్య. సందేహం లేదు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి రచనలతో పాఠకుల దాహాన్ని తీరుస్తుందని ఆశిస్తూ…

  8. సువర్ణభూమిలో … గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:19 pm

    ఆఖరి ఖండిక బావుంది.

  9. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:16 pm

    మంచి వాతావరణ కల్పన ఉంది. పడికట్టు పదాలు లేకపోవడం మీ కవిత్వ బలం. keep writing!

  10. తరువాతేమిటి? గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:12 pm

    కొన్ని వ్యక్తీకరణలు బలంగా ఉన్నాయి.