పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. రచయితలకు సూచనలు గురించి katti ramdas అభిప్రాయం:

    11/04/2008 9:22 am

    బాగుందండి. ఛాలా బాగుంది ఈ వెబ్ సైటు.

  2. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి PPRao అభిప్రాయం:

    11/04/2008 9:08 am

    వ్యాసం బాగుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకుంటే పదేళ్ళుగా ఈమాట పాఠకుడిగా నాకో సందేహం. ఇదే వ్యాసాన్ని, ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా నవతరంగం డాట్ కాం అన్న వెబ్ సైట్ లో 3రోజుల క్రితం చదివాను.ఇంతకీ మొదటిగా ఎక్కడ ప్రచురితమైనట్లు? ఎందుకడుగుతున్నానంటే గతంలో republished materials పైన కాస్త వేడి చర్చ జరిగిందిక్కడ. ఒకవేళ ఇక్కడే మొదటిగా పబ్లిష్ అయినా, అదే రోజున మరో పత్రికకు పంపడం కూడా కాస్త ఆశ్చర్యం కలిగించింది. రెండవ ప్రచురణలో కొత్త విషయాలు చేర్చ/చెప్పబడివుంటే ఈ సందేహం/ప్రశ్న నాకైతే వచ్చుండేది కాదు. ఎన్నిసార్లైనా, ఎక్కడైనా పబ్లిష్ చేసుకునే హక్కు రచయితలకుండవచ్చు గాక, కానీ ఏకకాలంలో ఆ పని చేయడం ఎంతవరకు ఆమోదకరం? లేక సమంజసం? రచయితలు అన్యదా భావించరని తలుస్తాను. ఇది legal చర్చ కాదు, its a question of ethics.

  3. అసమర్థులు గురించి Naresh V అభిప్రాయం:

    11/04/2008 8:46 am

    బాగా చెప్పారు… దీన్ని మరింత పెద్దదిగ చెసి, విశదంగ రాస్తీ చాలా బాగుంటుంది.

  4. విన్నపము గురించి bhEsghajaM agnihOtruDu అభిప్రాయం:

    11/04/2008 8:42 am

    హనుమంతరావు గారూ!
    గాంధీ గురించి కమ్మ్యూనిష్టులు ఇదివరలో చేసిన పరిహాసం, ఇప్పటికీ కరుడు గట్టిన మార్కిస్టులు చేస్తున్న పరిహాసం ( ఎ.బి.కె. ప్రసాద్ కి ఈ విషయం స్వానుభవం!), ప్రచారం తెలిసి వుంటే, హనుమంత రావు గారు నన్ను ఇంత ఆత్మీయంగా ” తూలనాడేవారు” కారు. అమర్త్య సేన్ పై గాంధీ, మార్క్స్ ల ప్రభావం ఉండటం ఆశ్చర్య పడవలసినది కాదు. అతను academician. మార్కిస్ట్ అవునో కాదో నాకు తెలియదు. సుందరయ్య గారి సంగతి నాకు తెలియదు; క్షంతవ్యుణ్ణి.

    నంబూద్రిపాద్ గాంధిపై ఒక చక్కని పుస్తకం రాసాడు. అప్పట్లో మార్కిస్టు సిద్ధాంతులు అతణ్ణి గేలి చేసి న విషయం, నాకు బాగా తెలిసిన విషయం.

    “మార్కిస్టుల” పై గాంధీ ప్రభావం పరిశీలనాంశం అని మీరన్నది ముమ్మాటికీ నిజం, కరుడు గట్టిన మార్కిస్టులు ఏమంటారో? ఈ విషయంపై చలసానినో, వరవరరావునో కదిలించి చూడాలి!

    విధేయుడు,
    భేషజం అగ్నిహోత్రుడు

  5. నాన్నా తెలుసా గురించి bollojubaba అభిప్రాయం:

    11/04/2008 7:48 am

    చాలా బాగుంది.
    ఆర్ధ్రంగా ఉన్నాయి.

  6. అసమర్థులు గురించి శివ బండారు అభిప్రాయం:

    11/04/2008 7:35 am

    బాగుంది . 🙂 మీరు చెప్పదలుచుకున్నవి కథల రూపంలో భలే చెబుతారు ..:))

  7. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి నిషిగంధ అభిప్రాయం:

    11/04/2008 6:18 am

    చాలా బావుందండీ! ముఖ్యంగా మొదలు, చివరి రెండు లైన్లు చాలా బాగా వచ్చాయి.. అభినందనలు..

  8. నాన్నా తెలుసా గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    11/04/2008 5:37 am

    చాలా బాగున్నాయండీ పద్యాలు! కళ్ళవెంట నీళ్ళు తెప్పించాయి. ఈమాటలో లంకె చూడకపోతే ఇంత మంచి కవిత్వం కంట పడిఉండేది కాదు. ” అమ్మను నవ్వుతు చూస్తే నమ్మకమే కలగలేదు…” మళ్ళీ నీళ్ళు కళ్ళలో.

  9. ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి కొల్లూరి సోమ శంకర్ అభిప్రాయం:

    11/04/2008 2:32 am

    దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈ మాటకీ, ఈ మాట సంపాదక వర్గానికీ అభినందనలు.

    కొల్లూరి సోమ శంకర్

  10. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి రవి అభిప్రాయం:

    11/04/2008 12:59 am

    చాలా బావుంది. ప్రసంగాలనూ రికార్డు చేసి, యూ ట్యూబ్ వంటి చోట ఎక్కడైనా పెడితే బావుంటుంది.

    నా బ్లాగులో ఎప్పుడూ ప్రోత్సాహం అందజేస్తూ, తగు సూచనలు అందించే పరుచూరి శ్రీనివాస్ గారి గురించి తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు.