పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16487

  1. సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    11/06/2008 9:21 am

    I say, not just poem, but any writing starts only in writers mind and ends in reader’s. Probably with the exception of one’s shopping list.

    గణితం నేర్చుకున్న ప్రతి విద్యార్థికి Fermat Theorem’s proof అర్థం కాకపోవచ్చు. కాణి, గణితం కూడా రానివారు సైతం అది Fermat Theorem’s proof గురించి అని మాత్రం తెలుసుకోవచ్చు, సుళువుగా.

    మరి రచన అర్థం కాకపోయినా, అసలు అది దేని గురించి అన్నది కూడా స్పష్టంగా తెలియకపోతే ఆ రచన పాఠకులను చేరుతుందే కాని, తాకదు. రచన అనే అన్నాను, కవిత అని అనలేదు. ముందు రచన అర్థం అయితే, అది కవితో కాదో కూడా తెలుసుకోవచ్చు.

    చివరలో చెప్పింది “దూరమైన థాయ్ భాష నేర్చుకున్నా కూడా, దగ్గరున్న ప్రియురాలు మనసు తెలుసుకోలేకపోయాను” అన్న contrasting తో చేసిన
    వ్యక్తీకరణ బాగుంది.

    అది తప్ప మిగితాది ఏది కూడా దేన్ని గురించి చెపుతున్నారో, ఏం చెప్పదలచుకున్నారో, ఏమీ అర్థం కాని (దు)స్థితి, interpretation ఇచ్చినప్పటికినీ. Interpretation తెలిసినదానికి లోతును, వైవిధ్యాన్ని ఇవ్వగలదేమో కాని, తెలియని దానిని పరిచయం చేయలేదు అనిపిస్తుంది.

    May be better to study about Fermat Theorem’s proof, even if not totally understood _ it only widens one’s understanding.
    ====
    Regards
    Srinivas

  2. సువర్ణభూమిలో … గురించి bollojubaba అభిప్రాయం:

    11/06/2008 9:06 am

    వినీల్ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.

    బొల్లోజు బాబా

  3. కుతంత్రం గురించి నాగమురళి అభిప్రాయం:

    11/06/2008 4:30 am

    మీ కథ ఎంతో బాగుంది. కథల్ని విశ్లేషించడం నాకు చేతకాదు కానీ, ఇందులో మనసుకి హత్తుకుపోయే కథనం, కారెక్టర్లూ ఉన్నాయి. ఇంతగా నాకు నచ్చే కథలు ఇప్పటిదాకా తక్కువే చదివాను.

  4. రెండు తీరాలు గురించి chittibabu mayara అభిప్రాయం:

    11/05/2008 10:51 pm

    Excellent….

  5. సార్ గారండీ… సార్ గారండీ… గురించి ప్రతాప్ అభిప్రాయం:

    11/05/2008 9:43 pm

    అవును అంతకంటే జీవితానికి ఏం కావాలి?

  6. బాలమురళీకృష్ణ సంగీతం గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/05/2008 3:47 pm

    పెదవులతో పలకని నిరోష్ఠ అనే రాగం కూడా ఉందని నా మిత్రుడు సితార్ విద్వాంసుడు జనార్దన్ చెప్పారు. అందులో మ, ప స్వరాలుండవు.

  7. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/05/2008 3:44 pm

    వీలుంటే పాల్గొన్నవారి ఫోటోలను విడివిడిగా జత చెయ్యండి.

  8. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/05/2008 1:48 pm

    ఇది రవిశంకర్ స్వయంగా సితార్ మీద వాయించిన సిగ్నేచర్ ట్యూన్ తో మొదలవుతుంది.
    “సున్ మేరే బంధూరే” అనే బర్మన్ పాట.
    “మేరే సాజన్” అనే బర్మన్ పాట.
    అన్నీ భటియాలీ ధున్ ను పోలినవే.

  9. సువర్ణభూమిలో … గురించి vineel అభిప్రాయం:

    11/05/2008 1:39 pm

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది. — సం]

    తెలుగులో ఉండి, అన్నీ తెలిసిన పదాలే ఉన్నంత మాత్రాన ప్రతి కవిత మనకి అర్థం కావలనుకోవడం, కాస్తో కూస్తో గణితం నేర్చుకొన్న ప్రతి విద్యార్థికి, ఫెర్మాట్స్ థియరం ప్రూఫు అర్థమవ్వాలనుకోవడం లాంటిది.

    ఈ సంచికలోనే వేలూరి గారి “నేనొక సాధారణ పాఠకుణ్ణి” వ్యాసంలో ఈవాక్యాలు బాగా పనికొస్తాయి ఈ కవిత గురించి రెండు మాటలు చెప్పడానికి. “… ఇలా అనుభవ పరిథి పెరిగి, జ్ఞాపకాలు పెరగడంతో, నీవు విద్యాధికుడవవుతున్నావు. అది మంచిదే. కానీ, దీనితో ఒక చిక్కు లేకపోలేదు. నీకు సరికొత్త పదజాలం అబ్బుతుంది అన్నాం కదూ! దానితో, నీ స్నేహపరివారం తగ్గుతుంది. ఎందుకంటే, నీ పరిభాష అర్థం చేసుకొనే వాళ్ళు, సరిగ్గా నీకు మల్లే అనుభవించి, ఆనందించిన వాళ్ళే అవుతారు. మిగిలినవాళ్ళకి నీ పరిభాష పరమ అరుచి కలిగిస్తుంది…”

    భూషణ్ కవిత్వం ఇలాగే ఉంటుందనిపిస్తుంది నాకు. ఈ కవి కవితల్లో క్లుప్తత తారాస్థాయికి చేరి ఒక గణిత సమీకరణమంత క్లుప్తంగా తయారవుతాయి, కవితలు. గణితంలో ఏమో కానీ, కవిత్వంలో ఇలాంటి క్లుప్తత వల్ల కవితలు డేవిడ్ లించ్ సినిమాల్లాగా open to reader’s interepretation అవుతాయి. ఉదాహరణకు సువర్ణభూమి కవితకు నాకు తోచిన ఒక ఇంటర్ ప్రెటేషన్.

    “ముఖా ముఖి సుఖాసీనులై బుద్ధులు ( చక్కని కవిత్వం వ్రాసే కవి, అస్వాదిస్తున్నపాఠకుడు)
    వాడని కలువలు ( మంచి కవితలు)
    అలముకున్న ధూపం (పాఠకుని మదిలో ఆవరించిన కవిత్వ సౌందర్యం)

    ఎదురెండలో ఎర్రచారల పిల్లి,
    చెలగాట మాడుతుంది
    తలపాదాలమీదుంచి.
    (కొన్ని కవితలు కదళీ పాకాలైతే, కొన్ని నారికేళ పాకాలు. తమకు అర్థం కాని కవితకు అర్థమే లేదని కుప్పిగంతులు వేసే పాఠకులే ఈ ఎర్రచారల పిల్లులు)

    ఎన్నో మెట్లెక్కి/గర్భ గృహంలో/గబ్బిలాలను/అదిలిస్తున్నాడు/విహార భిక్షువు ( ఉచ్ఛస్థాయిలో ఉండే కవిత్వమనే ఆలయపు పవిత్రతను, గబ్బిలాలను పారద్రోలి కాపాడే విమర్శకుడు).

    As some wise soul once said, A poem starts in writers mind and ends in readers mind. To conclude, for some one who is used to Van Gogh’s impressionistic paintings, Picasso’s Guernica might be pointless. That does nt reduce the essence of Guernica by an ounce.
    వినీల్.

  10. బాలమురళీకృష్ణ సంగీతం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    11/05/2008 11:51 am

    మోహన గారూ,

    ఇలాంటి వాటిని వర్జిత ఔడవ రాగాలని అనచ్చని ఎక్కడో చదివినట్లు గుర్తు.
    ఔడవ రాగంలో అయిదు స్వరాలే ఉంటాయి. అందులో మరికొన్ని స్వరాలు వదిలేస్తే వచ్చేవే మీరన్న చిత్ర, విచిత్ర రాగాలు. శాస్త్రీయంగా వర్జిత ఔడవ రాగం అంటే పేరులోనే అదేమిటో తెలిసే అవకాశం ఉందని నా అభిప్రాయం. మహతి, సర్వశ్రీ ఈ కోవకే చెందుతాయి.
    నాకు సంగీతంలో అంత విజ్ఞానం లేదు.