పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. కుతంత్రం గురించి dvrao అభిప్రాయం:

    12/13/2008 1:42 am

    నాకూ మంజుల గారికి వచ్చిన సందేహం వచ్చినది.

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Venkatachalam అభిప్రాయం:

    12/12/2008 5:28 am

    మీ వ్యాసం చాలా బాగుంది. మీ పరిశోధన కు నా హృదయపూర్వక అభినందనలు.
    ఘనరాగ పంచరత్న కీర్తనలు అంటే ఏమిటి? వాటికి ఆ పేరెలా వచ్చింది? ఈ విషయాలు తెలుపగలరు.
    కృతజ్ణతలు.

  3. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి శ్రీనివాస్ అభిప్రాయం:

    12/12/2008 4:08 am

    ఊరి బయటే వూరంతా (కళాకారులంతా) కనబడిపోతే వూళ్లోకి వెళ్లాల్సిన అవసరం కలగలేదనుకుంటాను. జోళ్లు అరుగుతాయి, మేజోళ్లు (సాక్సులు లేదా స్టాకింగులు) చిరుగుతాయి అనుకుంటున్నాను. మేకలు తోలుకునే పల్లెటూరమ్మాయి, మేజోళ్లేసుకోవడం నప్పలేదేమో!

    తప్పులెన్నువారు తండోపతండమ్ములు. భవిష్యత్తులో మరిన్ని మంచి కవితలు రాస్తారనీ ఆశిస్తాను.

  4. తెలుగు కథల పోటీ గురించి శ్రీనివాస్ అభిప్రాయం:

    12/12/2008 3:43 am

    పైన వెలిబుచ్చిన పెద్దల అభిప్రాయాలతో నేను ఏమాత్రం విభేదించక పోయినప్పటికీ, పోటీల వల్ల కధా సాహిత్యానికి కొద్దో గొప్పో మేలే జరుగుతుందని నా విశ్వాసం. పోటీ ప్రేరణతో కొత్త కధకులు పుట్టుకొస్తారు. ఈ పోటీలు పూర్తి తేజం తో జరిగే రోజుల్లో, చెయ్యి తిరిగిన రచయితలు ఈ లక్ష్య సిద్ధికే పోటీల్లో పాలు పంచుకునే వారు కాదు. ప్రస్తుతం వస్తున్న కధల్లో లోతూ, వాసీ లేకపోవడం చింతింపదగ్గ విషయమే. చెయ్యి తిరిగిన రచయితలు, చెయ్యి వేసి కధ కి వూపిరులూదవలసిన అవసరం వుంది.

  5. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి chavakiran అభిప్రాయం:

    12/12/2008 12:19 am

    పొయినోళ్లంతా గొప్పోళ్లు, మంచోళ్లు. ఈ లోకం వీడి పొయిన తరువాతనే వారి విలువ ఇప్పుడే పుట్టిన కుసుమాలకు తెలుస్తుందనుకుంటాను.

    బాబ్బాబూ, ఇలా అందరూ టపా కట్టాకనే మాకు వారి వారి గొప్పతనాన్ని వివరించక, కొంతమంది ఈ లోకంలో ఉండగానే వారి గురించి ఓ ముక్క చెపితే బాగుంటుంది కదా.

  6. “చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    12/11/2008 12:34 pm

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది. -సం]

    1947 నించి వెలువడిన “చందమామ” పుస్తకాలను ఎలెక్ట్రానిక్‌గా Universal Digital Library లో దొరుకుతాయి. వాటిని సంచికలవారీగా డౌన్‌లోడ్ చేసుకోడానికి ఫణి కుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగర్) ఒక జావా ప్రోగ్రాం తయారు చేశారు. ఆ జావా ప్రోగ్రాం డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించే విధానం బ్లాగాగ్ని బ్లాగులో చదవవచ్చు.

  7. చేగోడీ కంప్యూటర్‌కంపెనీ గురించి BPhani Babu అభిప్రాయం:

    12/11/2008 10:03 am

    గురువు గారూ, ఇన్నాళ్ళకి మీరు వ్రాసిన పాత కథలు దొరికాయి. ఇంక నాకు కావలిసినంత కాలక్షేపం.

  8. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి యుగంధర్ అభిప్రాయం:

    12/11/2008 5:06 am

    అప్పుడే పోవాల్సిన వయసు కాదు. ఇంత మంచి వాళ్ళు హడావుడిగా పైకి వెళ్ళిపోయినప్పుడల్లా బహుశా దేవుడికి వాళ్ళ అవసరం మనకంటే ఎక్కువేమో అనిపిస్తుంటుంది నాకు. తన ఆప్త మిత్రుణ్ణి ఇలా వేలూరి గారు తల్చుకోవడం ఎంతైనా సమంజసంగా ఉంది. అస్సలు పరిచయం లేని కొత్తవాళ్ళని కూడా, కేవలం వాళ్ళు తెలుగు సాహిత్యాభిమానులు అన్న కారణం వల్ల, ఆత్మీయుల్లా చేరదియ్యడం స్మైల్ లాంటి స్థితప్రజ్ఞులకే చెల్లుతుంది.

  9. “చందమామ” జ్ఞాపకాలు గురించి మేడేపల్లి శేషు అభిప్రాయం:

    12/11/2008 4:27 am

    ‘చందమామ’ గురించి రోహిణీప్రసాద్ గారు చెప్పిన విషయాలు చదువుతూ ఉంటే, అలా ఎంతసేపన్నా చదువుతూ ఉండిపోవచ్చుననిపించింది. గొప్ప రచయిత అని తెలియకపోయినా, కొ.కు. గారిని చిన్నప్పుడే చదువుకున్నామంటే, ఎంతో గర్వంగా ఉంది. ఖమ్మంలో మా మేనత్త వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం దీన్ని (మేముండేది పల్లెటూరు కాబట్టి అక్కడ దొరకదు). దాన్ని ఒక్కసారి తాకితేనే చాలు అన్నట్టుగా ఉండేది మాకు మనసులో. కొ.కు. గారి శైలి ఎంతటి ఆసక్తి లేని వాడినైనా ఇట్టే చదివిస్తుంది. ఈ మధ్య, నేను కొ.కు. గారి ప్రసిద్ధ నవల ‘చదువు’ మా పదేళ్ళ అబ్బాయికి చదివి వినిపిస్తే, ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది వాడినుంచి. రోహిణీప్రసాద్ గారు చెప్పినట్టు ‘చందమామ’ పిల్లలకు ఎన్నో సద్బుద్ధులు నేర్పించింది. నేర్పిస్తున్నది.
    -మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ

  10. అక్షరం పరమం పదం గురించి venkat chitta అభిప్రాయం:

    12/10/2008 11:08 pm

    sandralu is a great philosopher of life. We have much to learn from her to be happy and contented.