పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. తెలుగు భాష వయస్సెంత? గురించి Rao Vemuri అభిప్రాయం:

    12/18/2008 8:08 am

    చాల బాగుంది. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ లో తెలుగు బోధించే ప్రయత్నాలు చేస్తూన్నప్పుడు (ఇంకా ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి) మమ్ము తరచుగా ఎదుర్కున్న ప్రశ్న “మనం తెలుగు భాషని ఎందుకు నేర్చుకోవాలి?” అన్నది. మొదట్లో విరాళం ఇవ్వకుండా తప్పించుకుందికి ఈ ఎదురు ప్రశ్న వేస్తున్నారనుకున్నాను. కాని ఈ వ్యాసం సందర్భంలో రమేష్ బాబు కూడ ఈ ప్రశ్న అడిగేరు కనుక దీనికి సాలోచనగా సమాధానం చెప్ప వలసిన అవసరం ఉన్నట్లనిపిస్తున్నాది. సురేశ్ కి ఈ సామర్ధ్యం ఉంది కనుక నేనూ అడుగుతున్నాను. తెలుగుదేశంలో ఉన్న తెలుగువారు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ప్రవాసాంధ్రులు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? అన్న ప్రశ్నలని కూలంకషంగా ఎవ్వరయినా చర్చించండి. నేను నా బ్లాగులో ప్రయత్నించేను కాని బాగా రాలేదు.
    రావు వేమూరి
    http://latebloomer-usa.blogspot.com/

  2. తెలుగు భాష వయస్సెంత? గురించి Ramesh అభిప్రాయం:

    12/17/2008 11:44 pm

    అయ్యా! బాగా ఉందండీ. తెలుగు భాష గురించిన వివరాలను తెలియజేయాలన్ని మీ ప్రయత్నానికి జోహార్లు. కానీ మీరేమి అనుకోకపోతే నాదో చిన్న విన్నపం. మీ వ్యాసంలో చాలా వరకు సాధారణ ప్రజలకు తెలియని కొన్ని పదాలు దొర్లాయి. ఇవి సాధారణ ప్రజలకే కాదు ఓ మోస్తరు చదువుకున్న వారికి కూడా తెలియదని నా భావన.

    మీరు ఒ సారి దయచేసి అలాంటి పదాలకు కూడా అర్థాన్నిస్తూ కొంత వివరించగలిగితే, మీ వ్యాసం మరింత ఎక్కువ మందికి చేరి వారికి తెలుగు పట్ల ఉన్న ధోరణిని మార్చుకునేలా చెయ్యగలదని అనుకుంటున్నాను. అటు తర్వాత మీకు వీలైతే ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి..? అన్న దానిపై కూడా మీ సమగ్ర రచనా సంపుటితో మరో వ్యాసాన్ని అందించగలరని కోరుకుంటున్నాను.

    శెలవు.
    రమేష్ బాబు

  3. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    12/17/2008 11:04 pm

    [జరిగిన పొరపాటుకు చింతిస్తూ, రచయిత కోరికపై కవితని సవరించాము. -సం]

    శ్రీనివాస్ గారు,
    మంచి పరిశీలన. చిత్తు ప్రతిలో “జోళ్ళు” అనే వ్రాసుకున్నాను.టైపుకు వచ్చేటప్పటికి యధాలాపంగా జరిగిన పొరబాటు ఇది.మీరు చెప్పకపోతే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు
    మరిన్ని చేసి ఉండేదాన్నేమో.

    కొన్ని లక్షల ధన్యవాదాలు.

    పాలపర్తి ఇంద్రాణి.

  4. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి lyla yerneni అభిప్రాయం:

    12/17/2008 10:35 am

    బృందావన రావుగారి పద్య పరిచయం జనవరి సంచికలో ఉంటుందని, కొత్త సంవత్సరం కోసం సంబరంగా ఎదురుచూస్తున్నాను.
    ఈ పద్య వివరణా వ్యాసం, వారిచ్చిన సమాధానాలు, మరోసారి చదువుకుని రాస్తున్నాను.
    నా దగ్గర నన్నెచోడుని తెలుగు పుస్తకం లేదు. కాని కోలాచల మల్లినాథ సూరి తెలుగు టీకా తాత్పర్యంతో -కాళిదాసు కుమార సంభవం ఉంది.
    ప్రధమ సర్గలో పార్వతిని పాదాల దగ్గరనుండి తలవరకు వర్ణించారు కాళిదాస కవి. దేవతలను కిందినుండి పైకి, మానవులను పైనుండి కిందకు వర్ణించడం ఆచారమట. ఆ వర్ణన ” మధ్యేన సావేదివిలగ్నమధ్యా వళి త్రయంచారు బభార బాలా..” నుండి -త్రివళులంటే నడుము మీద ఉండే మూడు మడతలని తెలిసింది. అవి నాభికి పైభాగంలో ఉంటాయనీ నాకు తెలిసింది. ( ఎందుకంటే అంతకు ముందు పద్యంలో అప్పటికి నాభి వరకూ వర్ణన ఐపోయింది కాబట్టి. అప్పుడే పార్వతి నతనాభి అని కూడా తెలిసింది. “తస్యా ప్రవిష్టా నతనాభి రంధ్రంరరాజ తన్వీ…” )
    తర్వాత పంచమ స్సర్గములో పార్వతి తపస్సు ఘట్టములో కాళిదాసు శ్లోకానికీ, మీరిచ్చిన నన్నెచోడుని పద్యమునకూ గల పొలికలు చూచాను. తేడా అల్లా కాళిదాసువి గ్రీష్మం తర్వాతి తొలి నీటి చుక్కలు. నన్నెచోడునవి నవాంబు ధారలు. కాబట్టి ఇంకా వేగంతో ప్రవహించాయి. (ఐనా కాళిదాసు ముందరి పద్యము లోనే పార్వతి అప్పటిదాకా చెట్లలాగానే వర్షపు నీరుతో మాత్రమే బ్రతికిందంటారు. మళ్ళీ అంతలోనే మరిచి, గ్రీష్మం వెళ్ళిపోయి మొదటి వానకు తడిసి పార్వతి శరీరంలోచి, భూమి లోంచి సెగలుపైకి లేచాయని రాశారు. 🙂 ఆ తర్వాత పద్యమే ఆ వాన పార్వతి మీదుగా ఎలా జారిందొ చెప్పే పద్యం. ) పద్యములు అతి చక్కనివి. కవులు బాగా రాశారు.
    కానీ వాన ( ప్రకృతి )సామాన్య విషయమూ, కవులది సుందర కళాసృష్టి అనుకోటానికి నా మనసొప్పదు. కవులు తలకిందులుగా తపస్సు చేసినా భగవంతుని సృష్టిని మేచ్ చెయ్యలేరు. ఒక సౌందర్యవతిని, ఆమె చిత్రాన్నీ చూసి ” జో బాత్ తుఝ్ మే హై, ఒ తేరీ తస్ వీర్ మే నహీ ” అన్న కవిరాజుకి నా నమస్కారము. పకృతి అందాన్ని, ప్రకృతిలో మానవ సౌందర్యాన్ని, చూసి ముందస్తుగా పరవశించని హృదయం, కవి రాసే మాటలకు ఉబ్బిపోటం ఉత్తిమాట. అసలు సౌందర్య స్పృహ, సౌందర్య కాంక్ష లేనివాడు కవే కాడు.

    ఒక కవి నుంచి ఇంకొక కవి సంగ్రహించటం, ఒకరిని ఇంకొకరు అనువదించటం , అనుకరించటం -విద్యాభిలాషతో, కళపై కాంక్షతో, చేసే పనులు. కళాకారుడు అనుకరించడం మానడు. మానలేడు. అలా చెయ్యటం అవసరము. ముందు అనుసరించినా, కొన్నాళ్ళ తర్వాత కొత్త కళా స్రష్ట అవుతాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు నాకు నచ్చాయి. ఒకరి చక్కని భావాన్ని ఇంకో భాషలో, ఇంకో సమయంలో, -తన ఆనందం కోసం, పలువురి ఆనందం కోసం- కవి వాడటం, మీరన్నట్లు కవి పాండిత్యాన్నీ, రసికతను, చెపుతుంది. పాఠకులు కూడా ఎంత ఎక్కువగా చదివి ఉన్నవారైతే, ఏ రచనలోనైనా, అన్ని ఎక్కువ మూలాలు గుర్తించగలుగుతారు.

    లైలా

  5. తెలుగు కథల పోటీ గురించి హేమ వెంపటి అభిప్రాయం:

    12/16/2008 9:43 pm

    ఏడాది చదివిన చదువుకి నిగ్గు తేల్చేది సంవత్సరాంతంలో వచ్చే పరీక్ష ఐనట్లే ఈ కథల పోటీలు కూడా అనుకోవచ్చుకదా! బహుమతి పొందిన కథ వ్రాసిన రచయిత పరీక్షలో నెగ్గిన విద్యార్ధిలా ఆనందించడం సహజం. లోగుట్టు పెరుమాళ్ళకెరుక! కానీ, బహుమతి పొందిన రచయితకి గౌరవం హెచ్చుగా ఉంటుంది లోకంలో.

    పరిస్థితులకు లొంగి సరిపెట్టుకోలేక మనం చెయ్యగల్గింది యేమిటి? వ్రాయడం మానెయ్యాలి. దానివల్ల లాభం కంటె నష్టం ఎక్కువ. దానివల్ల పత్రికలూ, రచయితలూ కూడా నష్టపోక తప్పదు.

    కానీ, ఆపని అంత తేలిక కాదు. వ్రాయకుండా ఉండలేము కదా! ఆ తరవాత?

    శంఖంలోపోస్తేగాని తీర్థం కాదు కదా. అలాగే పబ్లిష్షయితే గాని వ్రాసిన కథకు విలువలేదు. అందుకే పోటీకి పంపితే కనీసం సాధారణప్రచురణకైనా ఎంపిక కాకపోతుందా అనే ఆశతో ఉంటారు రచయితలు. ఇది వ్రాసేవాళ్లు ఎక్కువ కావడం వల్ల వచ్చిన కష్టం.

    ఇటువంటివన్నీ పరస్పరాశ్రయవిషయాలు కావడంతో అందరూ ఉదాత్తంగా ఉండడం ఉచితం.

    పైనున్న సమీక్షలను చూసాక నాకు ఇది రాయాలనిపించింది.

    వెంపటి హేమ
    కలంపేరు: కలికి

  6. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి బృందావన రావు అభిప్రాయం:

    12/16/2008 4:11 pm

    (ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి).

    లైలా గారూ:
    1. పద్యం లోంచి శ్లేషను మనం లాగవచ్చు. కానీ కవి ఉద్దేశించి వున్నట్లు అనిపించదు. (మాధవ్ అన్నట్లు ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టం).
    2. కుమార సంభవం సర్వస్వతంత్ర కావ్యం. అనువాదం కాదు. ఎంత స్వతంత్ర కావ్యమైనా, కవి అదే విషయం మీద అంతకుముందే వెలువడిన ఒక ప్రసిద్ధ మహాకవి కావ్యాన్ని చూడకుండా ఎలా ప్రారంభిస్తాడు? అందులో కన్పించిన అందమైన ఊహలను ఎలా వదిలి వేయగలడు? పై పద్యం మాత్రం కాళిదాసు శ్లోకానికి ఖచ్చితమైన అనువాదమే. ఒక మంచి భావాన్ని వదిలివేయలేని రసికతగా దీన్ని భావించవచ్చు.

    కామేశ్వర రావు గారూ:
    పద్యాన్ని విశ్లేషించేటప్పుడు తెలుగు పద్యాన్నే పరామర్శించాను కానీ దానికి మూలమైన సంస్కృత శ్లోకం నా దృష్టిలో లేదు. ఐనా, తరంగ అంటే వళి అనే అర్ధం నాకు కన్పించలేదు. అందుకని ముత్తరంగలు అంటే మూడు ధారలనే ఉద్దేశించాను. అలాగే, ‘మడుగులు వారి’ అనే పదానికి గూడా ముడుతలు పడి అనేదానికన్నా హ్రదాలై ప్రవహించి అనే అర్ధమే న్యాయంగా వుంటుందనుకుంటాను. కానీ, సంస్కృత శ్లోకం చూసింతర్వాత – నన్నెచోడుడు కూడా త్రివళులనే ఉపలక్షించి వుంటాడని అనిపిస్తున్నది. మీకు కృతజ్ఞతలు.

  7. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి prabhakar అభిప్రాయం:

    12/16/2008 10:18 am

    థ్యాంక్ యూ. ఈ వ్యాసం చదవడానికి బాగుంది.

  8. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి Vamsi M Maganti అభిప్రాయం:

    12/15/2008 6:00 am

    పోయినోళ్ళందరూ మంచోళ్ళు. పోయాక వాళ్ల విలువ “ఆలస్యం” గా నైనా తెలుస్తుంది.

    ఒక సంగతి. నేను చాలా రోజులో, ఏళ్ళ క్రితమో ఒక “ఇస్మాయిలుని” కవిత / హైకూ చదివా :

    పచ్చని పొద
    ఒకటికి
    పోయాలనిపించింది […]

    మరి ఆ ఇస్మాయిలు, ఈ ఇస్మాయిలు ఒక్కరేనో కాదో నాకు తెలియదు. మళ్ళీ ఇస్మాయిలు అని పేరు కనపడితే ఉన్న “స్మైలు” కూడా పోయి … ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

  9. రెండు తీరాలు గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    12/14/2008 9:34 am

    చాలా బాగుంది.
    మీరు ఒక కావ్యం వ్రాయరాదు ?

  10. జనరంజని: మహానటి సావిత్రి గురించి vinaykumarnadella అభిప్రాయం:

    12/13/2008 10:29 am

    నటనకే భాష్యం చెప్పిన మహా నటి సావిత్రి స్వరం వినటం ఎంతో ఆహ్లాదకరం గా ఉంది. Most expressive face movie world had ever seen! NTR, ANR, SVR సరసన సూపర్‌స్టార్‌గా వుండదగిన ఏకైక నటీమణి మన సావిత్రి. Thousand thanks to eemaaTa for bringing back her memories. Thank you. Keep going!