పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి vrveluri అభిప్రాయం:

    03/01/2009 8:38 am

    ఈ పుస్తక ప్రచురణ గురించి మరొక ముఖ్య విషయం మనవి చేస్తున్నాను.
    శ్రీ కొడవళ్ళ హనుమంత రావు గారు ఇచ్చిన భూరి విరాళం మూలంగానే ఈ పుస్తక ప్రచురణ సాధ్యం అయ్యింది.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  2. కథ దేని గురించి? గురించి baabjeelu అభిప్రాయం:

    03/01/2009 8:20 am

    “వస్తువు గురించి చెప్పే విధానం వ్యాసానికి ఎంత దూరంగా వుంటే అంత మంచిదని మాత్రమే నా వుద్దేశ్యం”
    మంచి వుద్దేశ్యవేఁ. అయితే ఇప్పుడెవరు కథలు రాస్తున్నారు?. వ్యాసాలే రాస్తున్నారు.
    విరసం వారి పుణ్యవాఁని, రావిశాస్త్రి గారు, కుటుంబరావు గారు మరియూ కారా మేష్టారు గారు స్థాయిలో కథలు రావడం మానీసి ముప్ఫైయేళ్ళవుతున్నయి గదా?
    మధ్యలో నామిని, వంశీ ల్లాటి వాళ్ళు ఏవో గిలికినా.

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి chavakiran అభిప్రాయం:

    03/01/2009 8:14 am

    బాగా వ్రాస్తున్నారు. నెనర్లు. మీ ఆసక్తి ప్రతి పేజీలోను ద్యోతమౌతుంది.

  4. బోడి పద్యం గురించి baabjeelu అభిప్రాయం:

    03/01/2009 8:05 am

    అఫ్సరుడు గారికి. (“వరద” లో కొట్టుకొచ్చిన ప్రయోగం ఇది)
    గురుతుల్యులు లాటి వారు తప్ప మరొహళ్ళు ఈ “బోడి పద్యానికి” టీకా టిప్పణీ ఇవ్వలేరు.
    “సగం దళితం సగం ఖండితం” అంటే?
    “సగానికి కూలిన మసీదు గోడ మీద
    పడీ పడీ ఏడుస్తున్నాను ఇవ్వళ్టికీ” అంటే? ఎందుకూ?
    “ఆ సగం ముక్కకి ఎప్పుడో మోక్షం దొరికింది కదరా” హమ్మయ్య. మిగిలిన ముక్క సంగతి?
    ఈ మాటకి ధన్యవాదాలు.

  5. నిశ్శబ్దం గురించి baabjeelu అభిప్రాయం:

    03/01/2009 7:30 am

    రవికిరణ్ గారూ,

    అద్భుతవైఁన “ఎమోషన్” నిస్సందేహంగా. నిశ్శబ్దంగా మీ “ఎమోషన్” ని చదవడం బానే వుంది.

    శిల్పం సంగతి?? (వల్లంపాటి వారు లేరు. తెలిసిన వాళ్ళు ఎందుకో విమర్శ గురించి మాటాడ్డం మానీసేరు) నా మట్టుకు నాకు “అతడు-ఆమె” వ్యవహారంలా అనిపిస్తోంది. కానీ మొదటి ఖండిక అతడుది. రెండో ఖండిక ఆమెది. మూడో ఖండిక నిస్సందేహంగా ఆతడిది. నాలుగో ఖండిక ఖచ్చితంగా ఆమెదే.

    విడివిడిగా వుంటే వున్న తక్కువేవిటి? కలిపి వొక కవితగా వేయడం వల్ల వచ్చిన ఎక్కువ ఏఁవిటీ?

    ఇలాటివి చదివినప్పుడు “పచ్చి ఎమోషన్” ని కవిత్వమని ఎటుల యననొప్పు అని క్రొశ్నించాలనిపిస్తుంది. మీరు నిరంకుశులు. చదివేవాళ్ళు?

    ఏదేవైఁనా. మీ “రౌడీ” పదప్రయోగాలు, మర్యాదస్థులికి ఇబ్బందేమో?

  6. అతడు, నేను, అతడి కథ గురించి అక్కిరాజు భట్టిప్రోలు అభిప్రాయం:

    03/01/2009 6:08 am

    భగవంతం కథ చదవటమే కాదు. ఆయనతో మాట్లాడటమూ ఓ అనుభవమే. చుట్టూ ఉండే మామూలు విషయాలు కూడా అద్భుతంగా, అందంగా, తార్కికంగా, వికారంగా, ఊహించలేనట్టుగా చూడగలడు.
    చాలామంది మన రచయితలు కోల్పోయిన మామూలుతనాన్ని కాపాడుకో గలగడమే భగవంతం గొప్పదనం.

    -అక్కిరాజు

  7. కథ దేని గురించి? గురించి akella ramakrishna అభిప్రాయం:

    03/01/2009 6:05 am

    ఈ రచయిత ఏమి చెప్పదలుచుకున్నది ముందు అనుకోలేదు. చదివితే అలాగే అనిపించింది. నా ఉద్దేశములో కథల్ని కొన్ని రకాలుగా విభజించడం అంత సులువైన పని కాదు. కథ ముఖ్యోద్దేశం కథ కథకూ మారుతుంది. వస్తువూ, శైలీ కంటే కూడా ఆ కథ పాఠకులకు ఎంత నచ్చిందనేది ముఖ్యం. మనస్సులను రంజింపగలిగితే అది మంచి కథే అవ్వాలి.

  8. కొండ నుంచి కడలి దాకా గురించి mOhana అభిప్రాయం:

    02/28/2009 2:50 am

    సుప్రసిద్ధ సంగీత దర్శకుడు రోషన్ దర్శకత్వంలో ఆఖరి చిత్రమైన అనోఖీరాత్ లోని పాట ఇది. తాత్వికమైన హిందీ సినిమా పాటలలో దీనికి ఒక అగ్ర స్థానం ఉంది. ఈ కాలపు వాళ్లకి మరో రోషన్ తండ్రి అని తప్ప ఈ రోషన్ గురించి ఎక్కువ తెలీదు. సంగీత స్వర్ణయుగంలోని సామ్రాట్టులలో ఇతడు కూడా ఒకడు. ఇక ముకేష్ వంటి “మంచి” గాయకుడు అందరికీ పరిచితుడే. విధేయుడు – మోహన

  9. కొండ నుంచి కడలి దాకా గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/27/2009 8:05 pm

    సంపాదకులకి,

    గోదావరి మీద సంగీత రూపకంలో..పాటలు తక్కువ గానూ .మాటలు ఎక్కువ గానూ ఉన్నాయి. నిజానికి బాపిరాజు గారి పాట తో పోలిస్తే కాశీనాధుని రాజశేఖర్ గారు పేర్కొన్న గోదావరి పాటలే ఎక్కువ బాగుంటాయి.
    కిన్నెరసాని గేయం బాణీ మొత్తం విశ్వనాధ వారిదే !! రజనీ గారు కవి గారి tune నే వాడుకున్నారు. infact సత్యన్నారాయణ గారి కంఠం లోంచే కిన్నెరసాని వ్యధ ఎక్కువ ఆర్ద్రంగా విన్పిస్తుంది.

    మనకి ఇవాళ ఇంతపాటి కూడా చేసే వాళ్ళు లేకపోబట్టి , ఇదే్ మ హ బాగుందని అనుకోవాలంతే!! ప్రళయ గోదావరి అని కృష్ణశాస్త్రి గారి గేయం చాలా బాగుంటుంది. గానీ ఆ గేయాన్ని ఈ రూపకంలో వాడలేదు. ఎందుకో మరి…మనకి పాతవన్నీ బాగున్నాయి అన్పించటం కద్దు.

    government propaganda లాగా విసుగు కల్గించే సమాచారపు భారాన్నించి ..గోపాలరత్నం గారి గొంతు ఒక్కటే relief .

    రమ.

  10. టేబుల్ పై చేతి వాచీ గురించి baabjeelu అభిప్రాయం:

    02/27/2009 10:57 am

    బాబా గారూ,
    ఇది నేను చదివిన మీ రెండో కవిత. మొదటిది చీకటి నావనెక్కి ప్రపంచం వేకువ తీరం వైపు చేసే ప్రయాణం. (ఆదివారం అనుబంధం లోనేమో?) మోనాలిసా నవ్వున్న, పెళ్ళికానుక. ఇల్లు ఖాళీ చేస్తున్నపుడు డ్రాయర్ సొరుగులో దొరకడం. వరవోఁ శాపవోఁ? బతుకు తెలిసిన వారికి కోటి దండాలు. వెధవ బతుకు. మోనాలిసా నవ్వునీ పట్టించుకోదు. పెళ్ళికానుకకీ దిక్కు లేదు. ఎప్పుడో ఓ దిక్కుమాలిన సమయంలో అడ్డెస్తుంది. ఏది వరమ్మో, ఏది శాపమో తెలిసీ తెలియక అలమటిస్తూ కొండెక్కెస్తాం.