పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి mohan అభిప్రాయం:

    09/24/2010 6:33 am

    ఇంత మంచి వ్యాసం రాసిన వారు…. పద్యాలకు అర్థం రాయాలి కదా…

  2. ఉత్తమాయిల్లాలు గురించి Raj అభిప్రాయం:

    09/23/2010 5:18 pm

    Hi,
    I got few doubts on this story, i would really appreciate it if you can clear them
    1. Why is vedavalli’s son having trouble remembering the face of his mom? is it because of his father’s description of her?
    2. you said vedavalli is 15 years elder than gautami, how come gautami became her daughter in law?
    3. nothing mentioned about vedavalli’s eduction, I mean its kind of understandable that she might have attended college after marriage and became lecturer, but little more clarity would be appreciated.

    Thanks,
    Raj

  3. మారుపేర్ల మాయువు గురించి Dr.Tatiraju Venugopal అభిప్రాయం:

    09/23/2010 11:37 am

    ఒక ప్రక్క ఉద్యోగ ధర్మం, మరో ప్రక్క ప్రవ్రుత్తి ఉబలాటం వల్ల కొందరు మారు పేరుతో ఆ ప్రవ్రుత్తికి అంకితం అవుతారు. మరి కొందరికి సిగ్గో భయమో కానీ సొంత పేరు బయట పెట్టనే పెట్టరు. ఇక చర్చలూ, వ్యాఖ్యలూ వంటివి చేయాలనిపించినా, ఇదిగో మళ్ళీ ఈ సిగ్గూ భయమే అడ్డు. అప్పుడీ మారుపేరే శరణం. ‘ఇది నా స్వంత రచన–‘ అని ఎలా హామీ ఇస్తుంటారో అలా ‘ఇది నా స్వంత పేరు’ అని హామీ ఇవ్వడం ఒక్కటే తక్షణ కర్తవ్యం. ఇంకో రహస్యం- మారు పేరాశ గాళ్ళను ‘మీ ఫోటో ఇద్దురూ’ అంటే ఇస్తారా? -డౌటే! పేరు మారినా ఫేసు మారునా?
    -డా. తాతిరాజు వేణుగోపాల్

  4. రాగమాలిక గురించి Shrikaanth అభిప్రాయం:

    09/23/2010 11:32 am

    Rama Bharadwaj- గారు

    మీరు జులై 2009-లో వ్రాసిన అభిప్రాయమును ఇప్పుడింక నేను చూసినాను. Sorry నాకు తెలుగు సరిగా రాదు. But try చేస్తాను. మీరు చెప్పిన సుళాది వివరములు చాల కుతూహలకారిగా ఉంది. అయితే నా దగ్గర దీని సాహిత్యము లేదు. దయజేసి మీరు ఆ సుళాదిని సాహిత్యం మాత్రం ఇక్కడ రాసితే ఉపకారమౌతుంది. Can you please provide lyrics? చాల thanks.

  5. Edward Hirsch, “How to read a poem” గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/23/2010 2:15 am

    “Mere Air, These Words, but Delicious to Hear”

    మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు రామారావు గారికి కృతజ్ఞతలు. పండితులూ (అరవై పేజీల glossary ఉంది) పామరులూ కూడా చదివి ఆనందించవచ్చు. ముందుగా తెలుగు కవులని ప్రస్తావించి, వారి స్థాయి అధోలోకానికి చేరిందని వాపోయారు. ఎలాంటి ఆధారాలూ, ఉదాహరణలూ చూపకుండా చేసే ప్రకటనల వలన ఏమిటి ఉపయోగం? సౌభాగ్య, “ఈ కాలం కవులు,” [1] చూస్తే, మన కవుల స్థితి రామారావు గారన్నంత దౌర్భాగ్యంగా అనిపించలేదు. అయితే, కవితా సంపుటాలకి సంబంధించి నేను అల్ప సంతోషిని – గుర్తుంచుకోదగ్గ కవితలు రెండు మూడున్నా చాలు నాకు.

    అసలు విషయానికొస్తే, Hirsch కవితలని వివరించే తీరూ, సందర్భోచితంగా చెప్పే ఇతర విషయాలూ నాకు నచ్చాయి. Elizabeth Bishop, “One Art,” ని విశ్లేషిస్తూ, అదొక villanelle అని దాని లక్షణాలు వివరించాడు: పందొమ్మిది పాదాలతో ఆరు భాగాలుగా, అయిదు భాగాలు మూడు పాదాలతో, మిగిలినది నాలుగు పాదాలతో … అవన్నీ ఆరితేరిన పాఠకులకే గాని, నాకు ఒంటబట్టవు. ఆధునిక vilanelles అంటూ మరికొన్ని చదవదగ్గవి ఇచ్చాడు.

    కవితలో Bishop తాళం చెవి మొదలు ఖండాల దాకా వెళ్ళి, చివరకి ప్రేమతో ముగించే తీరు చాలా బాగా విశ్లేషించాడు. ఈ కవితలో ఉన్న ఆశ్చర్యార్థకాన్ని పట్టుకొని, William Maxwell, రచయిత ఆ సూచికని రెండు సార్లు మాత్రమే వాడవచ్చు – తన జీవిత కాలంలో, అని చెప్పాడన్నాడు. ఈ Maxwel ఎవరో మరీ నిరంకుశుడు అనుకున్నాను.

    మార్చి “The New Yorker” లో Patricia Marx, “Four Eyes,” అని కళ్ళజోళ్ళ మీద సరదా కాలమ్ రాసింది. అయుదు పేజీల చక్కని రచనలో ఒక్కసారి కూడా ఆశ్చర్యార్థకాన్ని వాడినట్లు గుర్తు లేదు. ఈవిడ ఎవరో Maxwell సూత్రాన్ని ఒంటబట్టించుకున్నదే అనుకొని, అసలీ Maxwell ఎవరా అని వెతికితే తెలిసింది: నలభై ఏళ్ళ పాటు ఆ పత్రికకి సంపాదకుడుగా పనిచేశాడని. ఇప్పుడు నేనా సూచికని వాడాలంటే భయం. Maxwell ని గుర్తుచేసుకుంటూ [2] Updike కవిత, “Stolen”:

    “The boat tilts frozen on the storm’s wild wave.
    The concert has halted between two notes.
    An interregnum, sufficiently extended,
    becomes an absence. When wise
    and kindly men die, who will restore
    disappeared excellence to its throne?”

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “ఈ కాలం కవులు,” సౌభాగ్య, 2006.
    [2] “A William Maxwell Portrait: Memories and Appreciations,” Edited by Baxter, Collier and Hirsch. WW Norton & Company, 2004.

  6. సా విరహే తవ దీనా గురించి Narayana babu vedula అభిప్రాయం:

    09/23/2010 1:18 am

    నేను ఇప్పుడు సులభంగానే రాయ గలుగుతున్న(న్నా)ను. మీరు చెప్పెకా(చెప్పేక) నా పొరపాటు గ్రహించేను. శ్రీ గొర్తి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా దగ్గరున్న సిడి ని యెలా అప్లొడు చెయ్య వచ్చునో తెలుప ప్ర(ప్రా)ర్ధన. నారాయణ్బాబు(నారాయణబాబు).

  7. రచయితలకు సూచనలు గురించి parimi sambayya అభిప్రాయం:

    09/21/2010 1:22 pm

    నేను ఈమాటను ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుంది.

  8. సా విరహే తవ దీనా గురించి Narayana babu vedula అభిప్రాయం:

    09/21/2010 5:55 am

    అయ్యా మోహన గారు, నేను మొట్ట మొదటి సారి ఈ విధంగ తెలుగులో రాయడం. అందుచే కొంచెం కష్టంగా ఉంది. ఈ పాట నా దగ్గర సిడి రూపంలొ ఉంది. దానిని ఎలా ఇంటర్నెట్టు లొ అప్లోడు చెయ్యాలొ తెలుసుకుని ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. నారాయణబాబు

  9. మిడిల్ డ్రాప్ గురించి sudha rani అభిప్రాయం:

    09/21/2010 12:01 am

    ఇటీవల ఈ కవిత కాపీ, మా నాన్నగారు రాసి పెట్టుకున్నది దొరికింది. కవిత చాలా బాగుందని నా బ్లాగులో ఓ టపా రాసి దానిని ప్రచురించాను. ఈ కవిత ఇక్కడ కూడా ప్రచురించబడిందని ఇప్పుడే చూస్తున్నాను. శ్రీ వెల్చేరు నారాయణరావుగారికి అభినందనలు

  10. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Ramakrishna అభిప్రాయం:

    09/20/2010 5:55 pm

    గుణాఢ్యుడు రచించిన బృహత్కథ కావ్యం మరియు హాలుడు రచించిన గాధా సప్తశతి ఎక్కడ దొరుతుందో దయచేసి నా ఈ మెయిల్ కు పంపగలరు. హార్డ్ కాపీ అయిన మరియు సాఫ్ట్ కాపీ అయిన పర్వాలేదు.