ప్రశాంత్‌గారూ,
మీ అభిప్రాయమేమిటో నాకు తెలియదని మీరనుకోనవసరంలేదు. అదేమంత క్లిష్టమైన విషయం కాదు. దానికి మొదట్లోనే స్పందించాను.
మీ కామెంట్లలోని భాషతోనే “విభేదించవలసిన సంగతి” ఉంది. మీరు వాడే పదాలు “హైరానా పడిపోవడమ్, దారి మళ్ళించడమ్” వగైరాలన్నీ వాడేటప్పుడు మీరు కాస్త ఆలోచించాలి.
“అస్తవ్యస్తంగానూ అస్పస్టగానూ” అనిపించే ఈ గొంతుకలన్నీ ఆల్ ఇండియా రేడియోవారు సేకరించినవే. ప్రస్తుత సందర్భంలో “శ్రీనివాస్ గారి కౄషి” వాటిని మనకు అందించడమే. (ఆయనకు ఇంకా ఎన్నో శక్తిసామర్థ్యాలున్నాయి)
సంస్థల క్వాలిటీ ఇలాగే ఉంటుందనుకోవచ్చు.
ప్రభుత్వసంస్థలకూ, యూనివర్సిటీలకూ చారిత్రాత్మక విషయాలమీద వ్యక్తిగత స్థాయిలో ఆసక్తి ఏమీ ఉండదని మీకు తెలియదా? అటువంటి సంస్థలు సాలార్‌జంగ్ మ్యూజియంవంటివాటికి కారణం కాగలవా?
మన మధ్యనే జీవిస్తున్న పెద్ద రచయితల, కళాకారుల సంగతి ఏ సంస్థా పట్టించుకోనప్పుడు ఈమాటలోని కామెంట్లు చదివి ఆ సంస్థలు మేలుకుంటాయా? వ్యక్తిగతంగా మనం ఏదైనా సేకరించడం, సేకరించకపోవడం అనేదాన్ని బట్టే వాటి స్పందన ఉంటుందా? ఇదంతా నాకు తెలియదని మీరనుకుంటున్నారా?
ఎవరు ఏ కామెంట్ రాసినా అది మీతో ఏకీభవించడమో, వ్యతిరేకించడమో అనే రెండు పరిమిత పద్ధతుల్లో ఆలోచించవద్దు.
ఉల్లమును జల్లు మనిపించే పాత జ్ఞాపకాలు అతి ఉల్లాసముగా ఉన్నాయి. వాన కూడ ఒక వసంతకాలములాటిదే. అందుకే వానాకాలాన్ని నీరామని అంటారు. మీ వ్యాసం బాగుంది. నేను కూడ ఇలాటి భావాలే కొన్ని ఇక్కడ 8 నుండి 11 పద్యాలలో తెలిపి ఉన్నాను. గ్రీష్మాతపతాపాన్ని చల్లార్చే వర్షపు చినుకుల్లా మీ వాన జల్లు ఆనందపరిచింది, కృతజ్ఞతలు.
దమయంతి గారికి నమస్కారం,
మీరు మీ ఈ కథలొ ప్రతీ ఒక్కరి జీవితములోని, మరీ ముఖ్యముగా బాల్యములోని మధుర ఘట్టములను చక్కగా ఆవిష్కరించారు. ఈ కధ ద్వారా చిన్న నాటి తీపి గుర్తులు కళ్ళకి కట్టిన మీకు ధన్యవాదములు. మీరు మరిన్ని చక్కని కథలు రాస్తారని ఆశిస్తున్నాను.
నేను పరుచూరి శ్రీనివాస్ నేమీ అనలెదే?? ఆయన తరుపున మీరెందుకండీ అంత హైరానా పడిపోవడమ్? నేను మాట్లాడుతున్న విషయం ఒకటి ముఖ్యమైనదే కాగా మీరు ఆ చర్చని దారి మళ్ళించడమ్ ఎందుకూ? ఏంటో చాదస్తమ్ .
ఐనా మీరూ నేనే మాట్లాడుకోవడమ్ ఎందుకూ? ఇంకెవరన్నా కూడ ఇటువంటి విషయాల మీద ఆలోచించేవాళ్ళుంటారు కదా?? వాళ్ళు ఏమంటారో కూడా విందాం మనం. సంస్థలకి ఆ బాధ్యత అప్పజెప్పడమ్ అంటే అక్కడ ఉండే డబ్బుల్ని కాస్తంతైనా సద్వినియోగం చేయడం అన్నమాట. వ్యక్తిగతంగా ఓ కెమెరా చేతిలోపుచ్చుకుని తిరిగితేనే సునాయాసంగా అయిపోయే పన్లుకావివి. అలా చేస్తే ఎవరన్నా ఇదిగో ఇప్పుడు మనం వింటూన్న ఈ గొంతుకలలాగే అస్తవ్యస్తంగానూ అస్పస్టగానూ ఉంటాయి. అప్పుడెవరన్నా ఎందుకు చేయలేదన్న విషయాన్ని వదిలేసి కనీశం ఇప్పుడెందుకని ఒక ప్రణాళికాబధ్ధంగా ఇవే పన్లని మరికాస్త “జాగ్రత్త” తోనీ మరికాస్త నైపుణ్యంతోనీ డబ్బులు ఖర్చుపెట్టించి నేను పైన ఇదివరలో ప్రస్తావన చెసినట్టుగా కళాసాంస్కృతిక సంస్థలో సాహితీ సంస్థలో విద్యాసంస్థలోముందుతరాల కోసమ్ చేయొచ్చని చెస్తే మీరు ఇబ్బంది పడటం ఎందుకూ??
ఆ పని వలన రేపటి తరాలకి లాభమ్ జరుగుతుందనీ వాళ్ళు వెనకటి తరాల వాళ్లని వినడంలో /చూడడంలో ఇప్పుడు వెతుకులాడుతున్నట్టు వెతుకులాడె పని అప్పుడు ఉండదనీ కదా నేను అంటున్నాను. దీనికి సరైన స్పందన రావాలీ అంటే ఇటువంటి అవసరాన్ని సంస్థలు గుర్తించేలా చేయవలసిన ఒక బాధ్యతనీ ఒక ముందుచూపునీ ముందు ఆయా రంగాలలోని వ్యక్తులు చూపించాలి. అందుకు ఎక్కువమంది ఆలోచించాలి.
నేను వ్యక్తి స్థాయిలో ఈ విషయాలని ” సేకరించడానికి” శ్రమిస్తున్న శ్రీనివాస్ గారి కౄషిని అభినందిస్తూనే… వ్యక్తి స్థాయిలో అలాంటి ఒక కష్టం రేపటితరాలు పడకుండా ఉండటానికని సంస్థల ప్రమేయాన్ని ఆశిస్తున్నాను. డబ్బులు సంస్థల్లో ఉంటాయి గనక ఖర్చుపెట్టడానికి. వ్యక్తిగత స్థాయిలో ఎవరి ఇస్టాయిస్టాలమేరకు వారు ఎంతోకొంత చేసినా అందులో ఎప్పటికీ ఒక సమగ్రత ఉండదు. దానికి ఒక ప్రణాళికా ఉండదు. అందుకూ సంస్థల ప్రమేయం చాలా అవసరం. స్వాతంత్ర్యానికి ముందు మన దగ్గర ఇంత డబ్బులేదు ఇన్ని సంస్థలూ లేవు. ఆనాటి వారిని గురించి సరిపడా జాగ్రత్త పడటానికి ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ మనలో ఆ ముందుచూపు లేకపోయినా నిర్లక్ష్యమ్ వహించినా దానివలన నష్టమ్ ఎవరికీ?/ఇందులో విభేదించవలసిన సంగతి ఏముందో?
కొంత మంది మాత్రమే మీలా హృదయ స్పందనని తెలియచేయగలరు.
రాజేష్ గారు! ధన్యవాదాలు. మీ ఇంటి పేరు భలే నచ్చింది నాకు.
అవునూ!మీరూ మీ వాన జ్ణాపకాన్ని ఇక్కడ మా అందరితో పంచుకోవచ్చు కదా!వెనకాడకండి.రాయడానికి ప్రయత్నించండి.
కృతజ్ణతలతో-
ఆర్.దమయంతి.
ఆహ…! వాన మనలో తీసుకొచ్చే అనుభూతిని ఎంతో హృద్యంగా వర్ణించారు. ఈ మీ టపా ద్వారా నా బాల్యాన్ని గుర్తు చేసారు. ఇంచుమించు నా బాల్యం కూడా అలాగే ఉన్నా ఇంత హృద్యంగా అందరు వర్ణించలేరు. అదొక వరం. కొంతమంది చదవగలరు, కొంతమంది వ్రాయగలరు 🙂
మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/02/2011 10:08 am

జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి మోహన అభిప్రాయం:
07/02/2011 8:47 am
ఉల్లమును జల్లు మనిపించే పాత జ్ఞాపకాలు అతి ఉల్లాసముగా ఉన్నాయి. వాన కూడ ఒక వసంతకాలములాటిదే. అందుకే వానాకాలాన్ని నీరామని అంటారు. మీ వ్యాసం బాగుంది. నేను కూడ ఇలాటి భావాలే కొన్ని ఇక్కడ 8 నుండి 11 పద్యాలలో తెలిపి ఉన్నాను. గ్రీష్మాతపతాపాన్ని చల్లార్చే వర్షపు చినుకుల్లా మీ వాన జల్లు ఆనందపరిచింది, కృతజ్ఞతలు.
విధేయుడు – మోహన
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Madhurasri అభిప్రాయం:
07/02/2011 5:50 am
“తమ బూడిద రెప్పలు విప్పి
ఎర్రని కళ్ళు తెరుస్తాయి నిప్పులు
ఎండు పుల్లలు జాలిగా వింటాయి
ఊదు గొట్టం చెప్పుకునే రహస్యాలు
కాలుతున్న పిడకల మీద
చిన్ని చేతుల ముద్రలు”
వాక్యాలు భావస్ఫోరకంగా ఉన్నాయి.
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Sowmya అభిప్రాయం:
07/02/2011 4:32 am
“విసన కర్ర చెప్పినట్టల్లా
తలలాడిస్తాయి మంటలు”
“ఎండు పుల్లలు జాలిగా వింటాయి
ఊదు గొట్టం చెప్పుకునే రహస్యాలు”
-Wow!!! భలే చెప్పారు!!
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి kodanda pani అభిప్రాయం:
07/02/2011 3:50 am
దమయంతి గారికి నమస్కారం,
మీరు మీ ఈ కథలొ ప్రతీ ఒక్కరి జీవితములోని, మరీ ముఖ్యముగా బాల్యములోని మధుర ఘట్టములను చక్కగా ఆవిష్కరించారు. ఈ కధ ద్వారా చిన్న నాటి తీపి గుర్తులు కళ్ళకి కట్టిన మీకు ధన్యవాదములు. మీరు మరిన్ని చక్కని కథలు రాస్తారని ఆశిస్తున్నాను.
పాణి.
కినిగె.కాం తో నా అనుభవాలు గురించి సుజాత అభిప్రాయం:
07/02/2011 2:39 am
బాందమ్మాయ్! కినిగె లోకెళ్ళి ఇదంతా చదివే తీరిక ఈ మధ్య బొత్తిగా లేక, ఎవరన్నా చెప్తే బాగుండు అనుకుంటూ ఉన్నా! థాంక్సులు!
మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి prashanth gundavarapu అభిప్రాయం:
07/02/2011 1:23 am
నేను పరుచూరి శ్రీనివాస్ నేమీ అనలెదే?? ఆయన తరుపున మీరెందుకండీ అంత హైరానా పడిపోవడమ్? నేను మాట్లాడుతున్న విషయం ఒకటి ముఖ్యమైనదే కాగా మీరు ఆ చర్చని దారి మళ్ళించడమ్ ఎందుకూ? ఏంటో చాదస్తమ్ .
ఐనా మీరూ నేనే మాట్లాడుకోవడమ్ ఎందుకూ? ఇంకెవరన్నా కూడ ఇటువంటి విషయాల మీద ఆలోచించేవాళ్ళుంటారు కదా?? వాళ్ళు ఏమంటారో కూడా విందాం మనం. సంస్థలకి ఆ బాధ్యత అప్పజెప్పడమ్ అంటే అక్కడ ఉండే డబ్బుల్ని కాస్తంతైనా సద్వినియోగం చేయడం అన్నమాట. వ్యక్తిగతంగా ఓ కెమెరా చేతిలోపుచ్చుకుని తిరిగితేనే సునాయాసంగా అయిపోయే పన్లుకావివి. అలా చేస్తే ఎవరన్నా ఇదిగో ఇప్పుడు మనం వింటూన్న ఈ గొంతుకలలాగే అస్తవ్యస్తంగానూ అస్పస్టగానూ ఉంటాయి. అప్పుడెవరన్నా ఎందుకు చేయలేదన్న విషయాన్ని వదిలేసి కనీశం ఇప్పుడెందుకని ఒక ప్రణాళికాబధ్ధంగా ఇవే పన్లని మరికాస్త “జాగ్రత్త” తోనీ మరికాస్త నైపుణ్యంతోనీ డబ్బులు ఖర్చుపెట్టించి నేను పైన ఇదివరలో ప్రస్తావన చెసినట్టుగా కళాసాంస్కృతిక సంస్థలో సాహితీ సంస్థలో విద్యాసంస్థలోముందుతరాల కోసమ్ చేయొచ్చని చెస్తే మీరు ఇబ్బంది పడటం ఎందుకూ??
ఆ పని వలన రేపటి తరాలకి లాభమ్ జరుగుతుందనీ వాళ్ళు వెనకటి తరాల వాళ్లని వినడంలో /చూడడంలో ఇప్పుడు వెతుకులాడుతున్నట్టు వెతుకులాడె పని అప్పుడు ఉండదనీ కదా నేను అంటున్నాను. దీనికి సరైన స్పందన రావాలీ అంటే ఇటువంటి అవసరాన్ని సంస్థలు గుర్తించేలా చేయవలసిన ఒక బాధ్యతనీ ఒక ముందుచూపునీ ముందు ఆయా రంగాలలోని వ్యక్తులు చూపించాలి. అందుకు ఎక్కువమంది ఆలోచించాలి.
నేను వ్యక్తి స్థాయిలో ఈ విషయాలని ” సేకరించడానికి” శ్రమిస్తున్న శ్రీనివాస్ గారి కౄషిని అభినందిస్తూనే… వ్యక్తి స్థాయిలో అలాంటి ఒక కష్టం రేపటితరాలు పడకుండా ఉండటానికని సంస్థల ప్రమేయాన్ని ఆశిస్తున్నాను. డబ్బులు సంస్థల్లో ఉంటాయి గనక ఖర్చుపెట్టడానికి. వ్యక్తిగత స్థాయిలో ఎవరి ఇస్టాయిస్టాలమేరకు వారు ఎంతోకొంత చేసినా అందులో ఎప్పటికీ ఒక సమగ్రత ఉండదు. దానికి ఒక ప్రణాళికా ఉండదు. అందుకూ సంస్థల ప్రమేయం చాలా అవసరం. స్వాతంత్ర్యానికి ముందు మన దగ్గర ఇంత డబ్బులేదు ఇన్ని సంస్థలూ లేవు. ఆనాటి వారిని గురించి సరిపడా జాగ్రత్త పడటానికి ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ మనలో ఆ ముందుచూపు లేకపోయినా నిర్లక్ష్యమ్ వహించినా దానివలన నష్టమ్ ఎవరికీ?/ఇందులో విభేదించవలసిన సంగతి ఏముందో?
ప్రశాంత్
మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/01/2011 9:06 pm
పెద్దవారు చనిపోయే లోపల మనం చొరవ తీసుకుని వారి మాటలను రికార్డు చెయ్య ప్రయత్నించడం మచిదని నేననడం ‘గట్టిగా దెబ్బలాడటమన్నమాట.’!!
ప్రశాంత్‌గారికి జోహారు.
కొన్నేళ్ళ కిందట ఒక సంస్థ చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక చిన్న దీపం వెలిగించేందుకు ప్రయత్నించడం మంచిదని సూచించేది.
సంస్థలని తిట్టవద్దని నేను ప్రశాంత్‌గారికి చెప్పినట్టు లేదే? ఇటువంటి తిట్లకు చలించేటట్టయితే సంస్థలు ఎప్పుడో బాగుపడి ఉండేవి.
మంచి ప్రయత్నం చేస్తున్నందుకు శ్రీనివాస్‌గారికి అభినందనలు.
చెయ్యనివారిని తిట్టడం కన్నా చేసినవారిని మెచ్చుకోవడం ముఖ్యం
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/01/2011 8:42 pm
మీరూ రాయొచ్చు కదా!
*
కొంత మంది మాత్రమే మీలా హృదయ స్పందనని తెలియచేయగలరు.
రాజేష్ గారు! ధన్యవాదాలు. మీ ఇంటి పేరు భలే నచ్చింది నాకు.
అవునూ!మీరూ మీ వాన జ్ణాపకాన్ని ఇక్కడ మా అందరితో పంచుకోవచ్చు కదా!వెనకాడకండి.రాయడానికి ప్రయత్నించండి.
కృతజ్ణతలతో-
ఆర్.దమయంతి.
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Rajesh Devabhaktuni అభిప్రాయం:
07/01/2011 5:58 pm