పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16480

  1. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాద్ కప్పగంతు అభిప్రాయం:

    07/03/2011 1:04 am

    ప్రశాంత్ గారూ,

    మూడు మూడున్నర దశాబ్ధాల క్రితం వరకూ కూడా రికార్డ్ చెయ్యటం అనేది సామాన్యుడి చేతిలోలేదు. ఒక్క ఆకాశవాణి వారికే అది కుదిరే పని. ఎక్కడో డబ్బున్న వాళ్ళ దగ్గర స్పూల్ టేఫ్ రికార్డర్ లు ఉండి ఉంటే ;ఉండి ఉండవచ్చు. కాని వాళ్ళకు అభిరుచి కూడా ఉండాలికదా. ప్రస్తుతం సాంకేతిక అభివృధ్ది పుణ్యమా అని నాలాంటి సామాన్యులు కూడా స్వంతంగా రికార్డ్ చేసుకోగలుగుతున్నాము. ఈనాటి మహనీయులు వారి వారి గోంతులు, వీడియోలు ఎన్నెన్నో కలెక్షన్లలో తయారవుతున్నాయతంఎతోమది ఔత్సాహికులు ఎవరి పరిధిలో వారు ఈ కలెక్షన్లు తయారుచేసుకుని, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వారి వారి సేకరణను పరిపుష్టం చేసుకుటూనే ఉన్నారు.

    నా బాధ ఒక్కటే అలనాడు ఆకాశవాణి అధికారులకి కొద్దిగా ముందు చూపు ఉండి వాళ్ళు తయారు చేసిన టేపులను భధ్రపరచి ఉండి ఉంటే, ఈ రోజున మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరికేవి. అది జరుగలేదు. అదే బాధ.

  2. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    07/02/2011 7:39 pm

    పాణి!
    మీ అభిమానానికి చాలా చాలా థాంక్సండి. తప్పకుండా మంచి కధలు రాయడానికి కృషి చేస్తాను.

    మోహన గారికి, నమస్తే.
    వర్షాన్ని వసంతంగా ఎంత బాగా చెప్పారు! నేను తప్పకుండా మీ పద్యాలు చదువుతాను.

    నా అక్షరాల వాన జల్లు నచ్చినందుకు మనఃపూర్వక కృతజ్ణ తలు తెలియజేసుకుంటూ-
    ఆర్.దమయంతి.

  3. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి k.Raja Sekhara Raju అభిప్రాయం:

    07/02/2011 4:24 pm

    “ఇప్పుడున్న ఈ వివాహవ్యవస్థ గొప్ప మార్పులకు లోనయితేనే గానీ స్త్రీపురుషుల సమానత్వం సాధ్యం కాదు. ఇప్పుడు వారి మధ్యనుండే అసమానత కేవలం వ్యక్తిగతమైనది కాదు… సామాజికమైనది”
    “ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్ళుగా పుడతారు”
    ”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుడ్ని చేసుకోను… పుణ్యం లేకపోతే పీడాపాయ… ఎవరు పడతారమ్మా ఈ తిట్లూ, దెబ్బలూనూ?”
    “భారత నారీత్వం స్పెషల్‌ రబ్బరులాంటిది… ఎంతలాగినా తిరిగి యథాస్థితికి వచ్చి ఏమీ జరగనట్టుగా మసులుకుంటుంది. దాన్నే మనవాళ్ళు ఆకాశానికెత్తారు… ఇంకా ఎత్తుకున్నారు”
    ”రంకుతనాల గురించి రాద్ధాంతాలు చేస్తారెందుకూ? మగ వాళ్ళకు లేని పవిత్రత ఆడదానికెందుకు?… పురుషులకు నిజంగా పాతివ్రత్య విశ్వాసముంటే ఇతర భార్యలతోనూ, సానులతోనూ ఎందుకు పోతారు. చూడగా చూడగా నీతి అన్నది ఆడదాన్ని చిత్రహింస చేయడానికి మగాడు సృష్టించిన నరకంలాగ అన్పిస్తోంది”
    ”ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు. కానీ అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసింది వివాహవ్యవస్థ… వివాహవ్యవస్థ ననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండాచేశాయి.”

    కొకు గారు రాసిన పై వ్యాక్యాలన్నీ భూమిక వెబ్‌సైట్‌లో ప్రతిమ గారు పేర్కొన్నవి. ఆయన పుస్తకాలు నాకు తక్షణ అందుబాటులో లేకపోవటం చేత భూమిక వ్యాసాన్నే ఆధారంగా తీసుకుంటున్నాను.
    నా ఉద్దేశంలో “ఆధునిక మహిళలు భారత దేశ చరిత్రను తిరగరాస్తారు” అన్న గురజాడ భావన కంటే “ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్లుగా పుడతారు” అన్న కొకు భావనే మరింత ప్రాసంగికతను, విప్లవాత్మకతను కలిగి ఉంది. గురజాడను మించిన క్రాంతదర్శనం ఈ చిన్న వాక్యంలో కనబడుతుంది.
    రోహిణీ ప్రసాద్ గారి వ్యాసానికి వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తుల జోలి నాకు అనవసరం కాని కొకు పరిమితుల గురించి, ఆయన సిద్ధాంత పరిమితుల గురించి ఈ వ్యాఖ్యానాలలో జోడించిన వారు కొకు రచనలలో కొన్నయినా నిజాయితీగా చదివారా అని నా సందేహం. ఎవరయినా దేన్నయినా విమర్శించవచ్చు.. కొత్త కళ్లతో పాత సిద్ధాంతాలుగా కనిపిస్తున్నవాటిని అంచనా వేయవచ్చు.. తప్పేమీ లేదు. కాని ఏ సిద్ధాంతం పట్ల అయినా పూర్వ నిర్ధారిత అభిప్రాయాల ప్రాతిపదికన గుడ్డిద్వేషం, సంపూర్ణ వ్యతిరేకత ప్రకటించడం ఆ సిద్ధాంతం గొప్పతనం మాటేమో కాని మన అల్పత్వం మాత్రం నడిబజారులో ప్రదర్సితమవటం ఖాయం.

    “కొద్దిపాటి అభిప్రాయ ప్రకటనలు కాకుండా ఆయన సాహిత్య విశ్లేషణని వివరంగా చేయాల్సివుంది”
    ఇది నూటికి నూరుపాళ్ళూ సత్యం.అందరూ ముందుగా ఈ పని చేసి తర్వాత మాట్లాడితే, రాస్తే బాగుంటుంది. ఇది మినహాయింపు లేకుండా మనందరికే వర్తించే సత్యం.

  4. సన్మానానికి రెండు సీ.వీ.లు గురించి prashanth gundavarapu అభిప్రాయం:

    07/02/2011 3:06 pm

    కధ పూర్తిగా ఎవరినో వెటకారమ్ చేయడమ్ కోసమ్ రాసినట్టు స్పsTaM అవుతూనే ఉంది. ఆ ఎవరన్నది ఎవరికి ఆసక్తిగా ఉంటె వాళ్ళకి స్పస్టమ్ కావొచ్చునేమో గానీ మిగిలిన వాళ్ళకి ఇటువంటి నెగెటివ్ రచన మీద ఏం ఆసక్తి ఉంటుందో ఇటువంటి రచనలని ఈమాట ఏమి ఆసించి ప్రచురించిందో నాలాంటి వారికి మాత్రం అర్ధం కాలేదు. పైగా రాసినవారికి లింగ భేదం అన్నా స్పస్టపడని ఒక డొంక పేరుని పెట్టుకోవడమ్ లోనే కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది ..ఇది ఉడుకుమోతు రచన అని. ఇందువల్ల ఆ స్త్రీవాద రచయిత్రికి జరిగే నస్టం ఏమన్నా ఉందో లేదో నాకైతే తెలీదు గానీ స్త్రీల రచనలమీద మారుపేరు పెట్టుకుని వెక్కిరించేటంతటి పిరికితనమూ భయమూ ఇది రాసినవారిలో ఉన్నట్టుగా మాత్రం స్పస్టపడుతున్నది.

    చరిత్రలు చెప్పుకునే ఘనతలు ఎప్పుడూ మగవారి స్వంతమే అయి ఉండాలి తప్ప ఎంత సాధించినా స్త్రీలకి మాత్రమ్ ఆ హక్కు లేనట్టు ఈ రచన చేసిన వారి భావన కావొచ్చు. పొరపాటున కూడ స్త్రీలు వారి రచనల నేపధ్య వివరణ చెస్తే,.. దాన్నితిరిగీ స్త్రీలపేరుతోనే అపహాస్యమ్ చేయించే ఒక అలవాటూ ..అలాగే ఒక అహంకార ధోరణి ఈ రచనలో బాగా కన్పిస్తోంది. ఇది ప్రచురించడమ్ “ఈమాట” యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మరింతగా ప్రస్పుటం చేస్తోంది. ఎగతాళి చేయడమే లక్ష్యమ్ గా సాగిన ధోరణి ఇది. అది తెలిసిపోవడమే ఈ రచనలోని బలహీనత. కాగా… పాపం ఈ ” అనానిమస్సు” ఇలా తుస్సు.

    ప్రశాంత్

  5. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Achanta hymavathy అభిప్రాయం:

    07/02/2011 2:13 pm

    వర్షాని గురించిన మీ వర్ణన నన్ను నా బాల్యంలోకి తీసుకుపోయింది. చిన్ననాటి ఆ జ్ఞాపకాలోంచి ప్రస్తుతానికి వచ్చేసరికి బయట వాన కురుస్తోంది.వానలో సరదాగా తడవటానికి ఇప్పుడు బాలలం కాదుకదా అని మనసుని కట్టడి చేసుకోవలసి వచ్చింది. చక్కగా రచించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  6. స్వీడన్‌లో మాతృ భాష వాడకం గురించి Sowmya అభిప్రాయం:

    07/02/2011 12:49 pm

    మీరు ఎనిమిదేళ్ళ క్రితం రాసిన వ్యాసం చదువుతూ నేను ప్రతి వాక్యం దగ్గరా – అవును…అవును..అవునవును..అనుకుంటూనే ఉన్నాను.
    నేను ఈమధ్యే ఒక వారం రోజులు నార్వేలో ఉన్నాను. మీరన్నట్లే, అక్కడ అందరికీ ఆంగ్లం తెలుసు. కానీ, వాళ్ళలో వాళ్ళు నార్వేజియన్ భాషలోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. మాతో చక్కటి ఆంగ్లం కూడా మాట్లాడారు. నాకు జరిగిన అతి పెద్ద అవమానం ఏమిటీ అంటే – మా సమావేశం జరిగే చోట, దాదాపు పదిహేను దేశాల వారున్నారు. వీరిలో, నేను చూసినంత మట్టుకు, అందరూ వారి వారి అంకోపరులలో (ల్యాఫ్టాపు) వారి భాషల ఇంటర్ఫేస్ వాడుతున్నారు… నాదొక్కటే ఇంగ్లీష్ లో ఉంది! 🙁

  7. మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి prashanth gundavarapu అభిప్రాయం:

    07/02/2011 12:48 pm

    ” నేనుసైతమ” అన్నట్టు తమరు కూడా ఊరికే ” ఫిర్యాదులు” వంటి అనవసరమైన పదాలని ఉపయోగించకుండా ఉంటే బాగుండేదని సత్వరం గ్రహించగలరు. మనంవాడే భాష ఇతరులకి ఇబ్బందిని కల్గించినప్పుడే కదా….అవతలి వారి వాక్యాలు అందుకు అనుగుణంగా మారవలసి వస్తుందీ!! . తనకి ఒక సూత్రమూ మరొకరికి మరొక సూత్రమూ వర్తించవు కదా మరి. ఏదేమైనా మీకు విషయం అర్ధమైందని తెల్పినదుకు సంతోషం.

    ప్రశాంత్ .

  8. సన్మానానికి రెండు సీ.వీ.లు గురించి Sowmya అభిప్రాయం:

    07/02/2011 12:39 pm

    ఇలాంటిదొకటి ఈమాటలో చూస్తాననుకోలేదు!!!
    రెండు సీవీలూ – ఎవర్ని ఉద్దేశించి రాసారనేది ఊహించడం అంత బ్రహ్మవిద్యేమీ కాదు కానీ, అసలు ఈమాటలో ఎందుకు వచ్చింది అన్నది ఊహించడం మాత్రం కనీసం నా మట్టుకు నాకు బ్రహ్మవిద్యే. ఉన్నదానికి తోడు, కనీసం, మధ్యలో రోమన్ లిపిలో వచ్చిన అక్షరాలు తెలుగులోకి మార్చడంకూడా చూస్కోలేదంటే ఏమనుకోవాలో తెలియడం లేదు.

    (బహుశా ఈ వ్యాఖ్యని అనుమతించరనుకుంటా!!)

    [విపరీతమైన పని ఒత్తిడిలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుతున్నాము. ఎంతగా దిద్దినా ఏవో తప్పులు అక్కడక్కడా మా చేతివేళ్ళలోంచి జారిపోతూనే ఉన్నాయి. క్షమించాలి. మా పాఠకులు మాకంటే జాగరూకులనే మాకు భయమూ, ధైర్యమూనూ. ఇలాంటి కథ ఈమాటలో ఎందుకు చూస్తాననుకోలేదో చెప్పివుంటే బాగుండేది. అలానే ఈ వ్యాఖ్యని అనుమతించరని అనుకోవడం కూడా! 🙂 – సం.]

  9. స్మరణ: కథ నచ్చిన కారణం గురించి Sowmya అభిప్రాయం:

    07/02/2011 12:27 pm

    మీ వ్యాసం మా.గోఖలే పరిచయం లా ఉంది, కథ నచ్చిన కారణంకంటే కూడా! 🙂

    అయితే, సినిమాల్లో కనబడే – “కళ : గోఖలే” ఈయనే నా?

    కథ ఆపకుండా చదివించింది (ముగింపు నేను కాసేపట్లోనే ఊహించినా, అదేనా కాదా అని కనుక్కోడానికి చదివాను). భాషతో కొంచెం కష్టపడ్డాను. కానీ, పోలిక మాత్రం బాగా నచ్చింది. అలాగే,

    “మడుసుల్ని మడుసులు విరిసి సంపుక మింగి తింటుంటే, పాములూ, కప్పలూ ఏంలెక్కలోకొచ్చి బయపెడతై, ఎంకూ?” అన్న డైలాగు. అద్భుతం!

  10. మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి SeshatalpaSayee Vadapalli అభిప్రాయం:

    07/02/2011 11:49 am

    చివరి గొంతుక “రాళ్లబండి” (“రాళ్ళపల్లి” కాదు) సుబ్బారావుగారిది. (తొందరలోటైప్‌చేసినట్టున్నారు!)

    Regards,
    SeshatalpaSayee.

    [తప్పు సరిదిద్దాము. కృతజ్ఞతలు – సం.]