పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి swamy అభిప్రాయం:

    07/12/2011 6:50 am

    రాణి గారు.. ఇవన్నీ జూటా మాటలు. సాహిత్యమునకు ఇతరులతో పనిలేదు. ఎవరికి తోచినది వారు రాసుకోవచ్చును. కావలసిదల్లా నిజాయితీ, నిబద్ధతా, సంపాదకులతో పరిచయం, పాదరసం వంటి భాషా, మాండలికం పై పట్టూను.

  2. తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం గురించి T.v Serials అభిప్రాయం:

    07/12/2011 4:25 am

    ఇవి దేశ, రాష్ట్రాల పరంగా నడుస్తున్న వ్యవహారాలైతే, అంతర్జాతీయంగా నకిలీ కణిక వ్యవస్థకి నడ్డి విరిగే గడ్డు పరిణామాలు బాగానే ఏర్పడ్డాయి. కీలక ఏజంట్లు నిర్మూలింపబడ్డారు. బాబాల దగ్గర నుండి బిన్ లాడెన్ ల దాకా, చావు తప్పి కన్ను లొట్ట పోవటం గాక, లొట్ట పోయిన కళ్ళతో సహా చావు తప్పక పోవటం పరిశీలించ దగినవే! వాటి గురించిన వివరాలు నెమ్మదిగా వ్రాస్తాను. ప్రస్తుతం ఈ చిన్న టపాతో ముగిస్తున్నాను.

  3. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    07/10/2011 9:48 pm

    నిజమే, బాల్యం నాటి కాలం ఓ అద్భుతం. సప్త వర్ణాల ఇద్రచాపం.
    అక్ష రాలను పూలతో కలిపి వర్ణించ డం హృద్యంగా వుంది. థాంక్యూ జోగారావ్ గారూ!థాంక్యూ!!
    అభివందనలు.
    ఆర్.దమయంతి.

  4. అర్థంకాని కవిత్వం గురించి కోడీహళ్లి మురళీమోహన్ అభిప్రాయం:

    07/10/2011 1:13 pm

    “కవికీ పాఠకునికీ కూడా అన్నిటికన్నా ముఖ్యంగా, తప్పనిసరిగా ఉండాల్సింది నిజాయితీ” దురదృష్టం కొద్దీ ఇద్దరిలోనూ అదే లోపించింది. మంచి వ్యాసాన్ని అందించినారు. అభినందనలు!

  5. రీ యూనియన్ గురించి yasasvi అభిప్రాయం:

    07/09/2011 12:20 pm

    అమ్మా !! ఎర్నేనీ !! అసలే గురజాడ అప్పారావు గారి గిరీశం పుణ్యమా అని తెలుగు ఇంగ్లీషు కలిపిన పదాలతో తెలుగులో వాక్యమ్ స్థిరపడిపోయింది. మీరు మీ జోరులో చివరికి కవిత్వాన్ని సైతమ్ తెలుగులోనే మొదలుపెట్టినా ముగించే వేళకి పూర్తిగా ఇంగ్లీషులోకి మారిపోయేరు. ఇది అభిప్రాయమా? ఆవేశమా?? కవిత్వమా?? ఉభయభాషల సంపర్కమా??;) ఏదైనా వైదేహి ఊహించిన “రీయూనియన్ ” మాత్రం మీ సటైర్ కింద తునాతునకలైపోయింది. ఆ కవయిత్రి మృదుత్వాన్ని మీరు మీ భావమ్ తో చెల్లాచెదరు చెసేసేరే? పైగా భలే బాగా చేశారు. ఎంత బాగుందో? ఆ ఇంగ్లీషు కాకుండా మొత్తమే తెలుగులో రాయొద్దా?? మీరు మరీను.

    వైదేహి కవిత్వమ్ లో ఉపమించటం మరీ ఎక్కువైపోయింది. అద్భుతమైన రాగాలు అన్నాకా అపశృతులు చాలు కదా?? రాగం కి ప్రతిగా ‘అపశృతి” ఉండగా మళ్ళీ “కీచురాళ్ళు” ఎందుకూ అదనంగా ??కొత్తగా ఏమీ చెప్పని ఒక పదమ్ కవిత్వానికి గుదిబండలాంటిది మరి.
    అలాగే ఆ అపశృతే అప్రతిభుల్ని చేయడం కదా?? ప్రత్యేకంగా అప్రతిభుల్ని చేస్తాయి అని మళ్ళీ దాన్నేలౌడ్ గా వాచ్యం చేయడం అవసరమా? క్లుప్తత చాలా ముఖ్యమ్ కదా కవిత్వమ్ లో? వాక్యాలని అనవసరమైన అతి ఉపమానాల బరువుకి వదిలేస్తే చివరికి భావం చస్తుందే?? వైదేహి కి కొత్త పలుకు {డిక్షన్ } బహుశా అవసరం ఇంక.

    యశస్వి.

  6. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి JogaRao అభిప్రాయం:

    07/08/2011 11:40 am

    అబ్బా ఎంత హృద్యంగా వర్ణించారు వానని, చిన్ననాటి జ్ఞాపకాల్ని. నిజంగా పూల జల్లే మీ అక్షరాలు. చాలా కృతజ్ఞతలు నన్ను బాల్యంలో తీపిగురుతులకు తీసుకువెళ్ళినందుకు.

  7. ప్లీజ్! అర్ధం చేసుకోండి గురించి మోహన అభిప్రాయం:

    07/08/2011 10:54 am

    మంచి ప్రయత్నం, కాని కథ చదివినట్లు లేదు, ఒక వ్యాసం చదివినట్లు అనిపిస్తుంది. విధేయుడు – మోహన

  8. తోలుబొమ్మలాట – 02వ భాగం గురించి prasad అభిప్రాయం:

    07/08/2011 7:18 am

    Vayyaram Ekkuvayindi

  9. తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా? గురించి yasasvi అభిప్రాయం:

    07/08/2011 1:29 am

    ఈ ఆర్టికల్ చదివిన వాళ్లకెవరికీ ఈ రచయిత వేటిని గురించి మాట్లాడుతున్నాడో అర్ధం కాదు. ఎందుకంటే ఉదాహరణలు ఏవీ లేవు. అన్నీ అందరూ చదివేస్తేనూ అన్నీ అందరికీ తెలిసివుంటేనూ మాట్లాడుకున్నట్టుగా పొడిపొడిగా ఉంది రాసింది. రచయిత ఆవేదన తప్ప మిగతాదేదీ అర్ధం కాలేదు. ఆయన ఇటీవల ట్రెండ్స్ ఏమిటో ఎట్లా సాగుతున్నాయో కూడా కొంచెం ఉదాహరిస్తే పాఠకులకి కాస్త సులువయ్యేది విషయం. ఈమాట వాళ్ళు అనుభవం లేని రచయితలకి కాస్త వర్క్ షాప్ లు నిర్వహించి తమ పత్రికకి కాస్త సిస్టమాటిక్ పధ్ధతిలో రచనలని రప్పించుకోవచ్చును. ఈ విషయంలో ఈమాటలో ఏమంత దృస్టి ప్రత్యేకమైనది కన్పించదేమో??

    “క్షీణయుగం” లాంటి మాటలు చాలా పాతవి. రచయితల్లో పస ఉన్న రచయితలూ లేని రచయితలూ అన్ని కాలాల్లోనూ ఉంటారు. మంచి సాహిత్యం ఎప్పుడూ రాశి లో తక్కువే వస్తుంది. రచనల పేర మనకి కన్పించే చాలా భాగం వట్టి ఊక… పొల్లూను. ఆ సంగతి ఆ రాసేవాళ్ళకీ తెలుసు. వాటిని చదివే వాళ్ళకీ తెలుసు. కొత్త ప్రశ్నలు పుట్టుకు రావడం ఎంత సహజమో మరి కొందరిలో ఇంకా పాత చీకటి మిగిలిపోయి… వారు అందులోనే తిరుగాడటమూ అంతే సహజమ్. చాలా అభ్యుదయమైన మాటలు పైకి మాట్లాడే మగవాళ్ళు చాలా మంది తమ చేతల్లో ఎంత నిరంకుశంగా ఉంటారో ఆడవాళ్ళకెందరికో అనుభవేకవేద్యం. రచయితలు సైతం ఇందుకు భిన్నం కాదు. ఇది సమాజం లోని అభ్యుదయ రాహిత్యాన్ని పట్టిస్తుంది. అదే వారివారి రచనలలోనూ ప్రతిఫలిస్తుంది. ఆ రాతల ద్వారా వారి పరువుని వారే చేజేతులా ధ్వంసం చేసుకోదలుచు కున్నారన్నమాట. చరిత్ర అన్నది ఒకటి మన ప్రమేయమే లేకుండా సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది కదా? అప్పుడు స్త్రీలని దుర్భాషలాడిన వాళ్ళు ఏ వర్గంలో మిగలగలరో ప్రత్యేకంగా చెప్పాలా ఎవరైనా?? క్లుప్తాతిక్లుప్తంగా ఒక్కటీ ఉదాహరించకుండా ఇవాళ్టి కవిత్వపు తీరుతెన్నులని గురించి అస్పస్టంగానూ.. అతి సాధారణం గానూ తొందరతోనూ రాసేసినట్టున్న వ్యాసం[?] లా ఉంది ఇది.

    అయితే తమ వ్యక్తీకరణలకీ అనువైన వేదిక ఒక్కటీ లేదన్నది కవులలో చాలామందికి తెలుసనుకుంటాను. ఎక్కడ రాయాలో తెలియకపోవడం..ఇదివరకటి పత్రికలు కూడా ఇవాళ సాహిత్యానికి ప్రాముఖ్యతనిచ్చేవి ఏవీ తెలుగునాట లేకపోవడం అన్న కొన్ని ముఖ్యమైన కారణాలని నందివాడ ప్రస్తావన చేయడం గమనించవలసిన విషయమే!! ఇది తెలుగులో క్రమేపీ రచనల కొరతకీ.. రచయితల కొరతకీ కూడా ఉత్తరోత్తరా ఒక కారణం కావొచ్చునేమో?? ఎందుకంటే ఆదరణలేని చోట ఏదీ పుట్టి వికసించదు.ఇందుకు ఉద్యమాలు లేకపోవడమ్ ఉండటమ్ అన్నది ఒక్కటే కారణం కాదు. సమాజంలోనే కవిత్వమ్ పట్ల తెలుగు సాహిత్యం పట్ల ఒక ఉదాశీనత ప్రబలడమ్ …రాయడమ్ అన్నది వెనకబడటం సమాంతరంగానే జరుగుతాయి. ఇక మందగించడం అన్నది నిజంగా జరిగిందా లేదా వేరే వర్గపు తీరు వ్యక్తీకరణలో మారి అది పాఠక వర్గపు రుచికి భిన్నంగా ఉండి నలుగురి దృష్టినీ చేరకుండా మిగిలిందా? అన్నది కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా రచనలో సత్తా ఉంటే అది స్వతహాగానే దృస్టిని ఆకట్టుకుంటూందనీ లేనిది ఎవరెన్ని కితాబులిచ్చినా.. దానికదే జారిపోతుందనీ అనుకోగలమే గానీ మంచి రచనని మనమ్ రప్పించనూలేము. అది దానికది రావాల్సిందే!! అలాగే చెత్త రచనలని ఆపనూలేము.

    యశస్వి.

  10. భావతరంగాల సింధువు: భైరవి గురించి దక్షిణామూర్తి, Secunderabad అభిప్రాయం:

    07/07/2011 11:44 pm

    “బహుముఖ ప్రజ్ఞులైన రోహిణీప్రసాద్ గారు వ్రాసిన వ్యాసం బాగుండకుండా ఎట్లా వుంటుంది?
    భైరవి అదే సింధుభైరవి రాగాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. ఆ రాగ లక్షణములతో పాటు ఆ రాగం లో ట్యూన్ చేసిన కొన్ని సిని గీతాలు వివరించిన తీరు ప్రశంసనీయం. ఈ రాగాన్ని మన సంగీత దర్శకులు విపరీతంగా వాడుకున్నారు. దానికి కారణం ఆ రాగం లో ఏదో తెలియని మాధుర్యం ఉండటమేనేమో!

    ఇక ముందు కూడా ఇటువంటి వ్యాసాలను మా కోసం ప్రచురించాలని మనవి.”