పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు గురించి SSVSRCM SASTRY అభిప్రాయం:

    08/06/2011 4:04 am

    శ్రీ గరికిపాటి వారికి నమస్కారములు. చక్కని పద్ద్యాలతొ మంచి కార్యక్రమం చూడగలిగాము. వారి సాగరఘోష కావ్యం
    ఇప్పటికి 11 గంటలు శ్రవణం చేశాము. త్వరలొ వారికి అత్యుత్తమ పురస్కారం లభించాలని ఆ శరదా మాత ను
    ప్రార్ధిస్తున్నాను.

  2. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    08/04/2011 11:12 pm

    ‘i love rain too’..ఎన్నాళ్ళకి విన్నానూ! సింపుల్ గా సొగసుగా చెప్పారు. జీవితంలో ఒక్క సారైనా ప్రేమలో పడని వారు, వాన లో తడవని వారు వుండ(లే)రట. నా ఈ ‘రెయిన్ ఫుల్ ధాట్స్’ – మీకు మీ మాతృమూర్తి తో బాటు మాతృదేశాన్ని కూడా తలపింపచేయడం గర్వించదగిన విషయం.
    సుధ గారూ!థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్,ఐ రియల్లీ అప్రిషియేట్!
    శుభాభినందనలతో..
    ఆర్.దమయంతి.

  3. మూడు లాంతర్లు – 6 గురించి yasasvi అభిప్రాయం:

    08/04/2011 4:00 pm

    ఒక్క త్రిపురేనా పఠాభి కూడా అలాగే !! రాయాలనుకున్నది రాసేడు. రాస్తాడేమో అని అనుకున్నాకా అసలేమీ మరి రాయలేదు. ఏ ప్రశ్నకీ ఏ జవాబు లేకుండా తన మౌనంలో బతికేడు చివరిదాకా !! ఎవరిమీదా…[ అంతరంగానూ బాహ్యంగానూ].. ఏయే ప్రభావాలన్నా ఉండనివ్వండి గానీ తనదే అయిన ఒకానొక అస్తిత్వం తొణికిసలాడందే అతడు/ఆమె చెప్పే ఏ విషయానికైనా ఏం బలం ఉంటుందీ కనకప్రసాదూ??

    “ద్రవ్యం” ఎన్నిరాసి కూడబెట్టుకున్నా..ఏ లబ్ధప్రతిష్టులమెప్పు సంపాదించి ఎంత ధనవంతులే అయినా లేక కవితావంతులే అయినా అసలు ఆ ఉండాల్సినదేదో లేకపోతే ఏ లబ్ధప్రతిష్టులు ఏయే కితాబులిస్తే మాత్రం అవి నిలిచేనా?? అలా కితాబులిచ్చిన వాళ్ళ పరువు పోయేను గానీ 🙂

    మీరు రాసే దాంట్లోని యాస నాకు బాగా అర్ధమయ్యే యాస గనక నాకు సుఖంగా ఉంటుంది. ఒక నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళీ ఆ వీధులన్నీ ఆ పేటలన్నీ తిరిగినట్టే ఉంటుంది. “మట్టీసి” పదాన్ని విని ఎన్నాళ్ళైందో?? మీలో ఇంకా మరీ నాగరీకం ప్రవేసించినట్టు లేదు కాబోలు. ఇంకా ఇవన్నీ గుర్తున్నాయి. అయితే గుర్తుండన్నంతమాత్రాన ఆ భాష “జూటా” ఏమీ కాదుగానీ ..యాస దారి యాసది. మీరు రాసినవన్నీ చదువుతున్నానా అయినా సరే మీ సమస్య నాకు ఏమీ ఎక్కడం లేదు. మీకు సరిగా చెప్పడమే రావడమ్ లేదో?? లేక నాకు మిమ్మల్ని చదవడమే రావడం లేదో??

    యశస్వి.

  4. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Sudha అభిప్రాయం:

    08/03/2011 11:48 am

    Lovely one !! Yeah, and i love rain too … 🙂
    It reminds me of my mom, my childhood days, and India !!
    Thanks for such a great attempt and i totally appreciate your style of writing ..
    – Sudha

  5. వేటూరి పాట గురించి నచకి అభిప్రాయం:

    08/02/2011 2:27 am

    రామారావు గారి వ్యాసం (బహుశా స్థలాభావం వలన) కాస్త హడావుడిగా సాగినట్టు అనిపించినా చక్కని విశ్లేషణతో సాగింది. వేటూరి గారి పాటల్లో తలమానికమైన కిరాతార్జునీయం (భక్త కన్నప్ప చిత్రంలోనిది) కూడా ఆయన రచనల పైన పూర్వకవుల సాహిత్య ప్రభావాన్ని, చలనచిత్రగీతాల పరిధిలో వాటిని దాటించి తన కలాన్ని ఉఱికించల నేర్పును సాధికారంగా చూపిస్తుందని నా అభిప్రాయం.

    వేఱే రచయితలు వ్రాసిన రెండు పాటల విషయంలో వేటూరి గారివని పొరబడినట్టు కనిపిస్తుంది. రెండూ ఒకే చిత్రంలోనివి (పెళ్ళి సందడి) కావటం గమనార్హం. సౌందర్యలహరీ స్వప్నసుందరీ… అన్న పాటను శ్రీ సీతారామశాస్త్రి గారు వ్రాయగా నవమన్మథుడా, అతిసుందరుడా… అని సాగే పాట శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు రచించారు.

  6. గానభారతి గురించి yasasvi అభిప్రాయం:

    08/01/2011 3:11 pm

    తిరుమల కృష్ణదేశికాచార్యులవారూ!!

    పాపం ఇది మీ తప్పుకూడ కాదేమోలెండి…ఇది చదివిన వెంటనే మొట్టమొదట నాకళ్ళముందు ఆ వరూధినీ ఎందుకనో అలా తచ్చాడింది. ఆమె మాటల్లోంచి ఆ ప్రియుడు నాకు ప్రవరునిలాగే కన్పింఛాడు కూడా !! [ ఆయన యుధ్ధంచేసేందుకని వెళ్ళినట్టు తెలిసేదాకా కూడా:)] కవి ఆ అమ్మాయితో సంభాషించినప్పుడు కూడా నాకు ఆ గొంతుక వెనక పెద్దన గారి ప్రవరుడు ఎందుకనో విన్పించేసేడు. ఇది మీ తప్పుకాదేమో లెండి. నా మీద ఉన్న మనుచరిత్ర ప్రభావం బహుశా ఇందుకు కారణం కాబోలు.:) చివరికి ఆమెకి ఆ గానభారతి బిరుదు వచ్చిందని మీరు ఆ టీవీ లో చూసి చెప్పినదాకా కూడా నేను ఈ కధ ఏ ఐదారువందల ఏళ్ల వెనకటిదేమో అని అనుకుంటూ వచ్చేను.అలా అయితే నేనీ ఉత్తరం ఎందుకూ రాస్తానుగానీ.. ఇది మనకాలం లోనిదే నని నాకు అర్ధమ్ అయ్యేసరికి….. ఓహో!! వీణవాదన చేసిన ఆ వరూదిని కి ఆ కాలంలో” గానభారతి” దొరికి ఉండదనీనీ..అది మీకు కస్టం కలిగి ఒక పోయెటిక్ జెస్టిస్ చేయించేందుకు గానూ ఈ భారతిని సృష్టి చేసేరనీనీ గ్రహించాను. ఆ గవర్నరు గనక ఆమెకి ఆ ” గానభారతి” ని ఇచ్చిఉండకపోయి ఉంటే ..దాన్ని మీరు[ అదే మీ కవి గారు].. టీవీలో చూసినట్టు ప్రస్థావన చేసిఉండకపోయి వుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఆ రాయలవారి ఆస్థానంలో విన్పించవలసిన రచన . పొరపాటున జారిపోయి మీ ద్వారా ఇలా “ఈమాట” లో ప్రత్యక్షమైంది.

    యశస్వి.

  7. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Nilagiri Jayasankar అభిప్రాయం:

    07/30/2011 1:07 pm

    ఎన్నొ చక్కని విషయాలు తెలుసుకొనె అవకాశము దొరకినది. మీకు నా ధన్యవాదాలు.

    జయశంకర్

  8. వేటూరి పాట గురించి Jayaram అభిప్రాయం:

    07/29/2011 9:19 am

    ఏమండోయ్ వ్యాసకర్త గారు… ఇప్పుడు చెప్పండి ఆ పదానికి అర్థము ఉన్నట్టేగా?

  9. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Seetha Kumari అభిప్రాయం:

    07/29/2011 7:06 am

    మీ కవిత్వం ఎప్పుడూ మనసుకి హత్తుకుంటుంది…ఎతో సున్నితంగా వ్రాస్తారు….మీరు ఎల్లప్పుడూ మంచి కవిత్వం అందిస్తూ ఉండాలని కోరుకుంటుంన్నాను…..

  10. వేటూరి పాట గురించి పాటూరి అభిప్రాయం:

    07/28/2011 6:56 am

    స్వరసగాంధారాలు కి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చండీ.

    స్వ + రస గాంధారాలు – తమయొక్క రసవంతమైన సంగీతం. (గాంధారం అంటే ఒక స్వరమే అయినా, సంగీతం అన్న విస్తృతార్థంలో కవి వాడి ఉండొచ్చు.)

    పొలాలు సస్యశ్యామలంగా ఉండి రసవంతమైన సంగీతాన్ని తలపింపజేస్తున్నాయి.

    సు + అరస గాంధారాలు – అరసం అంటే ప్రదోష కాలం అనీ, హర్షము అనీ అర్థాలున్నాయి.
    ‘ఆ పొలాల యొక్క మంచి హర్షపూర్వకమైన సంగీతం’ అని అర్థం చెప్పుకోవచ్చు.

    సినిమా కవిత్వానిదేముందండీ, ఏమైనా రాసెయ్యొచ్చు. మన సరస హృదయ క్షేత్రాల్లో అర్థాలు పండించుకుంటూ ఉండడమే.