పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Jagannadham Alapati అభిప్రాయం:

    08/22/2011 6:39 am

    హృద్యానికి ఈ కవిత సోదాహరణలా ఉంది!
    …జగన్నాథం ఆలపాటి

  2. ఈమాట జులై 2011 సంచికకు స్వాగతం గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    08/22/2011 2:04 am

    * శుభాకాంక్షలు *

    గౌరనీయులైన సంపాదకులకు, సంపాదక వర్గానికి, ఈమాట రైటర్స్ కి, పాఠకులకూ నా హృదయపూర్వక కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు!
    శుభాభివందనాలతో..
    ఆర్.దమయంతి.

  3. వేటూరి పాట గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    08/22/2011 8:30 am

    జీబ్రాకి algebra చిహ్నాల
    లాంకోటూ పాంకోళ్ళూ తొడిగి
    సాహిత్య పౌరోహిత్యం ఇస్తే
    వెర్రికాదు వేటూరి పాట సోదరా!

    అధివాస్తవిక రచన అంటే మనస్సంచారంలోని అసంలక్ష్యక్రమాన్ని పైకి తేవడం అని శ్రీశ్రీ నిర్వచించాడు. అప్రయత్న రచనలో ఆవిష్కృతమైతున్న చిత్రవిచిత్ర వస్తుజాలమే ఆనందానికి కొంత కారణం అంటూ “మంట, ముళ్ళడొంకలు, నెక్‌టై, టైపురైటర్, హంస ఇవి ఎందువల్లనో వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా నా మనస్సులో దొర్లుతూ క్షణంలో కనబడి, మరుక్షణం మాయమైనవి” అని తన ‘మాటల మూట’లో చెబుతాడు శ్రీశ్రీ.

    హద్దులు లేకుండాఎగిరే స్వేచ్ఛాభావాల్ని అస్పష్టమైన పద చిత్రాల ద్వారా, శబ్దం ద్వారా ఆవిష్కరించడం కూడా అధివాస్తవితకే అయితే, వేటూరి అచ్చమైన అధివాస్తవిక కవి. చేతనావస్థలోనో, సుప్తచేతనలోనో తనలో కలిగే అలోచనల అలజడిని పాఠకులలో/శ్రోతలలో కూడా కలిగించడమే కవిత్వానికి పరమావధి అయితే వేటూరి ఆ విషయంలో కృతకృత్యుడయ్యాడనేచెప్పవచ్చు. అదీకాక, ఈ అసంబద్ధ భావాల కుమ్మరింపు వల్ల ఆ పాట భావం చప్పున అర్థం కాకపోవడంలోనే కొంత ఆకర్షణ ఉందని నేనూ భావిస్తాను.

    వేటూరి పాట గురించి రామారావు గారు ప్రతిపాదించిన కొన్ని ప్రాధమిక సూత్రాలు పూర్తిగా అధివాస్తవికతా కవిత్వ లక్షణాలేనని నా అభిప్రాయం. అధివాస్తవికత ఒక మానసిక రుగ్మత అన్నవారున్నారు. ఒక భావచిత్రాన్ని గీస్తూ అర్ధాంతరంగా, పరధ్యానంతో మరో భావచిత్రపు కొమ్మ పైకి గెంతడం మానసిక రుగ్మతే అయితే, ఆ ‘శాఖాలంఘన’ లక్షణాలు వేలూరి పాటల్లో పుష్కలంగా కనిపిస్తాయి.

    అయితే, వేటూరి రాసిన అన్ని పాటల్లో ఈ రకమైన అస్పష్ట కవిత్వం ఉంటుదని చెప్పలేం. ఉదాహరణకు, రామారావు గారు ప్రస్తావించిన శంకరాభరణం సినిమాలోని ‘రాగం, తానం, పల్లవి’ తీసుకోండి. “శబ్దాలంకారాలు పుష్కలంగా ఉండి చెవికింపుగా హాయిగా వినిపించే ఈ పాట, అర్థాన్ని అడివికి తోలేసి శబ్దాన్ని చంకనెత్తుకోవటానికి ఒక మంచి ఉదాహరణ” అని రామారావుగారు అన్నారు. I beg to disagree.

    “కృష్ణాతరంగాల సారంగరాగాలు
    కృష్ణలీలాతరంగిణీ భక్తిగీతాలు

    సస్యకేదారాల స్వరసగాంధారాలు
    సరసహృదయక్షేత్ర విమలగాంధర్వాలు

    క్షీరసాగరశయన దేవగాంధారిలో
    నీపద కీర్తన సేయగా”

    ఈ చరణంలోని అర్థాన్ని వివరించడం అంతకష్టమేం కాదు. ఈ చరణానికి సాధారణ అర్థం: కృష్ణాతరంగాల ధ్వనులు, కృష్ణానది ప్రాంతం వాడైన నారాయణ తీర్థులు రాసిన కృష్ణలీలాతరంగిణి లోని భక్తిగీతాలు, పంట పొలాలు వినిపించే గాంధార స్వరం, రసజ్ఞుల హృదయక్షేత్రంలోని విమల సంగీతం, ఇవన్నీ, నీ పాదకీర్తనమే చేస్తున్నాయి, ఓ క్షీరసాగర శయన!

    అయితే, ఈ చరణంలో రామారావు గారు ప్రస్తావించని ఎన్నో సంగీత పరమైన రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ‘రాగం, తానం, పల్లవి’ ని రాగమాలికలో స్వరపరిచారు. సాధారణంగా రాగమాలిక అంటే, పాట మొత్తానికి ఒకే రాగం వాడకుండా, పల్లవి, అనుపల్లవి, చరణాలొక్కొక్కటినికి ఒక్కో రాగంలో స్వరపరచడం. ఇటువంటి రాగమాలికను ఉపయోగించిన సినిమా పాటలకు ఒక మంచి ఉదాహరణ హాయిహాయిగా ఆమని సాగె. అయితే, ‘రాగం, తానం, పల్లవి’ పాటలో ఒక్క చరణంలోని వేర్వేరు పంక్తులనే భిన్న రాగాతో స్వరపరిచాడు మామ (మామ అంటే మహదేవన్ అన్న మాట).

    మనం చర్చిస్తున్న చరణంలో మొదటి రెండు లైనులు సారంగ రాగంలో, మధ్యలో రెండు లైన్లు కేదార రాగంలో, చివరి రెండు లైన్లు దేవగాంధారిలో వినిపిస్తాయి(ట) (సంగీతంలో నాకు వినికిడి జ్ఞానమే తప్ప ఏ శిక్షణ లేదు. సంగీతం బాగా తెలిసిన వారు నన్ను సవరించవచ్చు). అంటే వేటూరి, సారంగ, కేదార, దేవగాంధారి అన్న రాగాల పేర్లను దత్తపదిలో ఇచ్చిన పదాలుగా కూర్చి రాసిన చరణమిది. అంతేగాక, కేదార రాగంలో సున్నితంగా వినబడే గాంధారం (గ స్వరం) గురించి, దేవగాంధారి రాగం అనగానే గుర్తుకువచ్చే ‘క్షీరసాగరశయన ‘ అన్న త్యాగరాజ కృతి గురించి తెలిసిన సంగీతజ్ఞులు ఈ చరణం వినగానే ఆనందంతో చప్పట్లు కొడతారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మళ్ళీ చదవండీ ఈ పాదాలను. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి!

    “కృష్ణాతరంగాల సారంగరాగాలు
    కృష్ణలీలాతరంగిణీ భక్తిగీతాలు

    సస్యకేదారాల స్వరగాంధారాలు
    స్వరసహృదయక్షేత్ర విమలగాంధర్వాలు

    క్షీరసాగరశయన దేవగాంధారిలో
    నీపద కీర్తన సేయగా”

    *

    అలాగే రామారావు గారు సిరిసిరిమువ్వ సినిమాలోని ఈ కింది పాటలో “చివరి ఏడు పాదాల్లోను ఏం రాయాలో తోచక గిలగిలలాడటం స్పష్టంగా కనిపిస్తుంది” అని నిష్కారణంగా వేటూరిని నిందించారని నా అభిప్రాయం!

    సతీ వియోగము సహియించక – దు
    ర్మతియౌ దక్షుని మదమడంచగా
    ఢమ, ఢమ, ఢమ, ఢమరుక ధ్వనుల
    నమక చమక యమ గమక లయంకర
    సకల లోక జర్జరిత భయంకర
    వికటనటస్పద విస్ఫులింగముల
    విలయ తాండవము సలిపిన నీవే
    శిలవే అయితే పగిలిపో-
    శివుడే అయితే రగిలిపో-

    కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన తైత్తరీయ సంహితలో నాలుగో కాండంలోని 5వ అధ్యాయాన్ని నమకం అని 7వ అధ్యాయాన్ని చమకం అంటారు! ఇవి రెండు మన వేదవాఙ్మయంలో రుద్రుడిని కీర్తిస్తూ రాసిన వాటిలో అతి ప్రశస్తమైనవి. స్వరాన్ని (tone) అతి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో యమ ( < యమము=control) అనిపిలిచేవారు. యమ, గమక, లయలు -- ఇవన్నీ ప్రాచీన కాలం నుండీ సంగీతానికి సంబంధించిన పదాలు (See: "Hidden faces of ancient Indian song" By Solveig McIntosh, p. 75 and also "The Ragas of Early Indian Music" by Widdess, Richard (1995), p 404).శివుని తాండవంలో నమక చమకాలలో వినిపించే యమ, గమక, లయలుంటాయి, అలాగే, లోకాలను లయం చేసే విస్ఫులింగాల వికటనటన ఉండుంది. నువ్వు శిలవో, శివుడివో నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యిందని దేవుడినే సవాలు చేస్తున్న వాక్యాలు నాకు చిన్నప్పటినుండి అద్భుతంగా అనిపించేవి. ఆయనకు మాత్రాఛందస్సులపై అంతగా పట్టు లేదన్న విషయం ఆయన రాసిన డబ్బింగ్ పాటలు చూస్తే బోధపడుతుంది. వేటూరి డబ్బింగ్ పాటలపై ఒక ఆసక్తికరమైన చర్చను మీరు తెరచాటు చందమామ అన్న బ్లాగులో చదవవచ్చు!

    ఇంకా వేటూరి పాట గురించి ఎంతో రాయాలని ఉంది కానీ, మరింకెప్పుడైనా!

    సురేశ్.

  4. మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Nithin అభిప్రాయం:

    08/21/2011 10:41 am

    గొంతుకల కంటే ‘రాతకోతల’ రగడ ఎక్కువైనట్లుంది. కాస్త కట్ చేస్తే మంచిదనుకుంటాను.

  5. భావతరంగాల సింధువు: భైరవి గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/19/2011 9:35 pm

    లిస్టులో సరైనవి ఇవి. తక్కినవి కావు.
    అందాజ్: టూటేనా దిల్ టూటేనా
    బర్సాత్: బర్సాత్ మే హంసె మిలే తుం సజన్, చోడ్ గయే బాలం, అబ్ మెరా కౌన్ సహారా, మై జిందగీమె హర్ దం రోతా హి రహా హూన్, ఓ ఓ ఓ ముఝే కిసీ సె ప్యార్ హో గయా
    ఆవారా: ఆవారా హూ, తేరే బినా ఆగయీ చాంద్ నీ, ఘర్ ఆయా మేరా పరదేశీ
    అమర్: ఇన్సాఫ్ క మందిర్ హై యె భగవాన్ క ఘర్ హై
    శ్రీ 420: మేరా జూతా హై జాపానీ, రామయ్యా వస్తావయా,

    వీటిలో కూడా కొన్ని రమారమి అనాలి. భైరవిలో 12 స్వరాలూ పలుకుతాయి కనక అలా అనుకోవచ్చునాఈ రాగానికి హిదీ పాటల్లో ఎన్ని ఉదాహరణలున్నాయంటే ఒక వ్యాసమంతా వాటితో నిండిపోతుంది!

  6. భావతరంగాల సింధువు: భైరవి గురించి mOhana అభిప్రాయం:

    08/19/2011 8:00 pm

    Here is Raju Bharatan’s article on Shanker and (sindhu)bhairavi.
    ( http://shankarjaikishan.wordpress.com/2009/01/28/shanker-he-was-the-total-musician-raju-bharatan/ ). Regards! – mOhana

  7. భావతరంగాల సింధువు: భైరవి గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:

    08/19/2011 11:36 am

    సవరింపుగా ఈ వివరాలు రాస్తున్నాను:
    “Journey Down Memory Lane”, Raju Bharatan, Hay House India, 2010
    ఈ కింద్ ఉదహరించిన పాటలన్నీ భైరవి రాగం అధారంగా కట్టారని చెప్పారు:

    అందాజ్: హం ఆజ్ కహీ దిల్ కో బైఠే, టూటేనా దిల్ టూటేనా
    బర్సాత్: (పదింట ఐదు పాటలు) – బర్సాత్ మే హంసె మిలే తుం సజన్, చోడ్ గయే బాలం, అబ్ మెరా కౌన్ సహారా, మై జిందగీమె హర్ దం రోతా హి రహా హూన్, ఓ ఓ ఓ ముఝే కిసీ సె ప్యార్ హో గయా
    ఆవారా: ఆవారా హూ, తేరే బినా ఆగయీ చాంద్ నీ, ఘర్ ఆయా మేరా పరదేశీ
    అమర్: ఇన్సాఫ్ క మందిర్ హై యె భగవాన్ క ఘర్ హై
    శ్రీ 420: మేరా జూతా హై జాపానీ, రామయ్యా వస్తావయా,

    [బర్సాత్ లో జీయా బేకారార్ హై ఈ లిస్టులో లేదు – క్షంతవ్యుణ్ణి].

  8. భావతరంగాల సింధువు: భైరవి గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/19/2011 11:25 am

    బర్‌సాత్‌ సినిమాలో బర్‌సాత్‌ మే అనే లతా, బృందం కలిసి పాడినది సింధుభైరవి రాగం లోని పాటే. జియా బేకరార్ కాదు. అందాజ్‌లో ఆ రాగం పాటేదీ ఉన్నట్టు గుర్తురావడంలేదు.
    ఒకే రాగంలోని పాటలన్నీ ఉదహరిస్తున్నప్పుడు అవన్నీ ఒకే శ్రుతిలో పాడినవై ఉంటే రాగాన్ని గుర్తుపట్టడం మరింత తేలికవుతుందేమోగాని అటువంటిది ఆశించడం కష్టమే.

  9. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి రాణి. అభిప్రాయం:

    08/19/2011 5:30 am

    శాస్త్రి గారూ,
    మీ మాట అక్షరాలా నిజం. శ్రీశ్రీ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. ఆయన దురదృష్టం అనను గానీ.., ఆయన తెలుగువాడు కావడం వల్లే తగినంత గుర్తింపు రాలేదనేది మాత్రం నిజం. సాహిత్యం వెనుక దాన్ని సృష్టించిన కవి వుండచ్చుగానీ. ఆ కవిని అంచనా వెయ్యడానికి మాత్రం వైయక్తిక జీవితాన్ని పరిగణించకూడదు. ఎందుకంటే ఏ బలహీనతా లేకుండా ఎవరైనా ఒక కవో సాహిత్యకారుడో అయితే అతనికి వున్న మొదటి బలహీనత పేరు కవిత్వం అవుతుంది. అదీ కాకుండా మనిషి బలహీనతల్తోనే సహజీవనం చేస్తాడు. అలాంటి మనిషి బలహీనతలని పదే పదే ఎత్తిచూపిస్తున్నారూ అంటే అదీ ఒకవిధమైన బలహీనతే. దానిపేరు ఓర్వలేమితనం. అదే తెలుగువాడి జాతీయలక్షణం.

  10. సువర్ణభూమిలో … గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:

    08/19/2011 4:35 am

    “కవి”కీ “పాఠకుడికీ” ఉన్న “స్థాయీభేదాన్ని” పాఠకుడే అధిగమించాలని ఇక్కడో గీతాప్రవచనం. ఏమిటా స్థాయీభేదం? అచ్చు అందుబాటులో వున్నవాడు పైస్థాయి వాడు; అది కాక వట్టి చక్షువులతో వెళ్ళదీస్తున్న వాడు క్రీస్థాయి వాడూనా? ఇక్కడున్నదల్లా అనుభవవ్యత్యాసం మాత్రమేను. తన అనుభవాన్ని పైకి అక్రోశించగలవాడు కవి, రచయితానూ. అది చెయ్యలేని వాడు చదువరి, ప్రేక్షకుడు. ఎక్కడో Random Harvest (James Hilton?) అనే నవలలో అన్నట్టు – స్టేజీ మీద సిల్కు అంగీలతో బిచ్చగాడొచ్చి పాటలు పాడి వెళితే అంతా వినోదంగా అనుభవయోగంగా వుంటుంది. కానీ నిజజీవితంలో బిచ్చగాడు పాటలు పాడడూ, కావ్యభాషలో ఆక్రోశించడూ. మౌనంగా పడుకుంటాడు. కయ్యానికీ వియ్యానికీ నెయ్యానికీ సమవుజ్జీ వుండాలని పాత లోకనీతి. కావ్యానిక్కూడా అది అంతే నిజమేమోను. వాల్ పోస్టర్ మీద లక్ష రూపాయల డైమండ్ నగ ప్రకటన వుంటుంది. కానీ అది కొనగల తాహతు ఉన్నవారినుద్దేశించినది. తక్కిన వారికవి పొల్లు మాటలు మాత్రమేను. కవిత్వం కూడా అంతేనేమోను. నా అనుభవసామగ్రి నీ దగ్గర లేందే నా కవిత్వమెవడు చదవమన్నాడు నిన్ను? అని పరోక్షంగా నిలదీస్తున్నారు ఇలాటి రసహీనమైన పద్యాన్ని గాలికి వదిలి. ఫెర్మా సిద్ధాంతంతో సామ్యం కృత్రిమం. ఫెర్మా సిద్ధాంత నిరూపణ చెప్పకుండా ఫెర్మా సిద్ధాంతాన్ని హైస్కూలు విద్యార్ధికి చెప్పొచ్చును. కానీ ఇలా పేజీల పేజీల వ్యాఖ్య లేందే ‘కవి’ చెప్పదలచిందేంటో ఆ బ్రహ్మ పదార్ధాన్ని పట్టుకోడానికి 46 వ్యాఖ్యల తరవాత కూడా తేల్చలేక పోయారు. అది కవికి గర్వకారణం కావచ్చును. కానీ జాగ్రత్తగా పరిశీలించినట్లైతే ఈ పధ్యాల భావాన్ని ఒక విధమైన వోటింగ్ పద్ధతి ద్వారా మెజారిటీ బలంతో నిర్ణయించాల్సి వచ్చింది. ఇదేనా కవి నిజంగా కోరుకుంటున్నది?