బాగుంది. అసలు మనం గమనించని అతి చిన్న విషయం ఒక్కో సారి ఎంత ఘాడవైన జ్ఞాపకంగా మారగలదో కవి చాలా బాగా చెప్పేడు. కానీ ఈ అందవైన జ్ఞాపకాల కవితల్లోంచి నిజవైన బతుకుని, ఆ కష్టాన్ని, సుఖాన్ని కవి కవితా వస్తువుగా మార్చగలిగేదెప్పుడో! మూలా గారు నేల మీద కాళ్ళు పెట్టగలిగితే బాగుండు.
ఇందులో అంత వివాదాస్పదం కావాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు వ్యాసం మొత్తం చదివాక.
అకాడమీ కౌన్సిల్ లో 90 శాతం మంది ఈ వ్యాసాన్ని తొలగించాలని వోటు వేస్తే పదిమంది మాత్రమే ఈ వ్యాసం ఉంచాలని వోటు వేసారంటే ఈ వ్యాసంపై జరిగిన దుష్ప్రచారాన్ని మీరూహించుకోవచ్చు. ఈ వ్యాసాన్ని వ్యతిరేకించే వారు చేసే వాదాలలో నాకర్థమైన విషయాలు కొన్ని:
1. రాముడు 100 కోట్లమంది హిందువులకు ఆరాధ్యదైవము. రామాయణం హిందువుల పవిత్ర గ్రంథం. ఆ గ్రంథాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాసం పాఠ్యపుస్తకాలలో ఉండడానికి వీల్లేదు. ఈ కుహనా వామపక్ష మేథావులు హిందూ దేవతలను కించపరిచే విధంగా రాస్తారు గానీ, అదే ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ గురించో, క్రైస్తవుల బైబిల్ గురించో ఇలా అవాకులు, చవాకులు పేలగలరా?
2. వాల్మీకిని ఆదికవిగా, రామాయణాన్ని తొలికావ్యంగా హిందువులు ఆరాధిస్తారు. రామాయణం రాసిన ప్రతి కవి వాల్మీకి రామాయణమే తమకు ఆధారమని పేర్కొన్నారు. అంటే రాముని కథకు విశ్వసనీయమైన ఆధార గ్రంథం వాల్మీకి రాసిన రామాయణమే. వాల్మీకి రాసిన రామాయణగాథ అంతగా ప్రజాదరణ పొందింది కాబట్టే, ఆ కథకు పామర కవులు, జానపదులు తమకు తోచిన విధంగా మార్పులు చేస్తూ రాసుకున్నారు. మహాకవి అయిన వాల్మీకి రాసిన రామాయణం ఎంత ప్రమాణమో మిగిలిన రామాయణాలు కూడా అంతే ప్రమాణమని పనిగట్టుకొని వాదించే ఈ వ్యాసం యొక్క అసలు ఉద్దేశ్యం వాల్మీకి గొప్పతనాన్ని, రాముని గొప్పతనాన్ని తక్కువచేయడమే!
3. రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. అంటే మన పూర్వీకులు మనకు అందించిన చరిత్ర ఇందులో ఉంది. భారతదేశ చరిత్రను క్షుణ్ణంగా వివరించే సూర్య, చంద్ర రాజుల వంశక్రమం తో సహా ఎన్నో వివరాలు ఉన్న ఈ మహాగ్రంధాలను, తక్కువచేసి మాట్లాడటం, బ్రిటిష్ వలసదారులు మనకు అంటించిన “ఆర్యుల దండయాత్ర” వంటి కాలం చెల్లిన సిద్ధాంతాలను ఇంకా వల్లెవేయడమే ఈ కుహనా చరిత్రకాలుల మేధావితనం. అయోధ్య, ద్వారక మొదలైన చోట్ల దొరుకుతున్న ఆధారాలను బట్టి రామాయణ, మహాభారతాలు ఉజ్వలమైన మనపూర్వ చరిత్రను తెలుపుతున్నాయన్న సత్యాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు.
4. ఎన్ని కష్ట, నష్టాలకోర్చైనా ధర్మాన్ని, సత్యాన్ని ఎలా ఆచరించాలో, పరిపూర్ణ మానవుడిగా ఎలా జీవించాలో బోధించే మహా గ్రంథంలో విపరీతబుద్ధి (perverted minds) గల మన కుహనా మేధావులకు కనిపించేది “అహల్య అక్రమ సంబంధ వివరాలు”, “సీతకు రావణునిపై, లక్ష్మణునిపై మోహం”, “కూతురైన సీతపై రావణుని కోర్కె” వంటి గజ్జల్లో వేడి పుట్టించే విషయాలు. ఒకవేళ అవి వాల్మీకి రామాయణంలో కనిపించకపోతే, అటువంటి విషయాలు కనిపించే రామాయణాలను వెతికి పట్టుకొని వాటిమీద వ్యాసం రాస్తారు; అటువంటి వ్యాసాన్ని మిగితా కుహనా మేధావి పాఠకవర్గం లొట్టలు వేసుకుంటూ చదివి అది రాసిన రామానుజన్ ను మహా మేధావి అని కీర్తిస్తారు. Perverted minds, they are, and perverted essay it is! Good riddance!
5. ఇది డిల్లీ విశ్వవిద్యాలయం ఆంతరంగిక విషయం. ఏ పాఠం వారి సిలబస్సులో ఉండాలో, ఏది ఉండకూడదో వారు నిర్ణయించుకుంటే ఈ కుహనా మేథావులు ఇంత రాద్ధాంతం చేయడం అనవసరం. చిన్న సిలబస్ మార్పును అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి భారతదేశ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చే మేథావులకు, ఈ దేశ ప్రతిష్టకన్నా వారి కుహనా సిద్ధాంతాలమీదే ఎక్కువ అభిమానమన్న విషయం తేటతెల్లమౌతుంది.
ఆచార్య భద్రిరాజు గారి వ్యాసమ్ చదివి నేను ‘ఒళ్ళు పులకించింది’ అని నా అభిప్రాయాన్ని తెలియ చేసాను. మీరు నా అభిప్రాయాన్ని ప్రచురించ లేదు. ఆ వ్యాసం చదివి నా ఒళ్ళు పులకించటం నిజం. సాహిత్య వ్యాసం చదివితే ఒళ్ళు పులకించ గూడదా అలా అభిప్రాయం చెప్పగూడదా?
బూదరాజు గారు చెప్పిన మొదటి భాగంతో పూర్తిగా ఏకీభవిస్తాను. ప్రపంచంలోని ఏ భాష అయినా, ఏ కాలంలోనైనా వాక్యాల సమాహారంగానే ఉంది గాని దానికి కేవల ధాతు దశ, కేవల పదదశ, కేవల వాక్యదశ ఏనాడూ లేదు. అయితే, ఆయన రెండో భాగంలో ఏం చెబుతున్నారో నాకు పూర్తిగా అర్థంకాలేదు. ఆయన ధాతునిర్ణయం కల్పితమైన శాస్త్రమని అంటున్నారా? కాదనే నేననుకుంటాను. ఆధునిక భాషాశాస్త్రం ఎరిగిన వ్యక్తిగా, ఆధునిక వ్యుత్పత్తిశాస్త్రం ఎంత శాస్త్రీయంగా అభివృద్ధి చెందిందో ఆయనకు బాగా తెలుసు. ఆయన చెబుతున్నది ప్రాచీన వ్యాకర్తలు నిర్ణయించిన ధాతుపదాలగురించి అనుకుంటాను.
వ్యుత్పత్తిశాస్త్రం కొంతమంది భాషాశాస్త్ర ఔత్సాహికుల దుర్వినియోగం వల్ల గత శతాబ్దంలో కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నది గానీ, Historical linguistics, comparative linguistics వంటి భాషాశాస్త్ర శాఖలకు పునాది వ్యుత్పత్తిశాస్త్రం. గత రెండు శతాబ్దాల్లో “ఆధునిక వ్యుత్పత్తిశాస్త్రం” ఎలాంటి మార్పులు చెందిందో తెలుసుకోవాలంటే Yakov Malkiel రాసిన Etymology అన్న పుస్తకం చూడవచ్చు.
మరెందుకోగానీ వేలూరి వేంకటేశ్వర రావు గారూ !! మీ నిర్మొహమాటమ్ కొన్ని అంశాలకే పరిమితమైపోతోంది సుమా !! వట్టి రాజకీయనాయకులేనా వారిని కాసేపు అటుంచుదాం!! సాహిత్యం పేర విమర్శకులన్న హోదాలో ఎడాపెడా ముందుమాటలూ లేదా “చివరి మాటలూ” రాసే వాళ్ళూ.. అర్హత తో సంబంధమ్ లేకుండానే అకాడమీలనించో వ్యక్తుల ద్వారానో పైరవీలు చేసుకుని చేయిచుకుని “అవార్డులు” సంపాదించుకుంటున్నవాళ్ళూ.. ..సదరు విమర్శకుల అండదండలతో రాత్రికి రాత్రే కవులుగా అవతారం ఎత్తుతున్నవాళ్ళూ..”రాజు గారూ.. దేవతా వస్త్రాలూ” కధలో లాగా అన్నీ తెలిసినా ఏమీ అనకుండా ..చోద్యం చూసేవాళ్ళూ ..పత్రికలని అడ్డు పెట్టుకుని సొంత గుంపులని తయారు చేసుకుని ..వారి చేత తమ డబ్బా వాయింపించుకునే వాళ్ళూ..పార్టీలు ఫిరాయించే వాళ్ళూ..ఇవాళ ఒకచోట చెప్పిన అభిప్రాయాల్ని మళ్ళి మరొక చోట మాత మార్చి మాయ చేసేవారూ… వీళ్ళందరూ ఈ రాజకీయ నాయకుల కన్నా ఏ రకంగా భిన్నమైన వారూ.. గొప్ప వారూ కాగలరో మరి నాకైతే అర్ధం కాలేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండీ. రాజకీయనాయకులకి ఎక్కడ ఏం మాట్లాడినా తమ దైన ఒక స్వప్రయోజనం ఉంటుంది. సాహిత్యంలోనూ ఇన్ని రాజకీయాలు చేసే ఇటువంటి వారికీ ఏవో కొన్ని ప్రయోజనాలు ఉండే ఉండాలి కదా?? ” సాంస్కౄతిక తిరోగమన రధానికి” ” గుర్రాల్లా” ఉన్న ఇటువంటి వారి వలన
కూడ అంతే నస్టమ్ జరగడమ్ లెదా?? ఇది ఎవరికీ అసలు ఇబ్బందిగానే అన్పించడమ్ లేదా?? పైగా వీరు ఆ రాజకీయనాయకులి కన్నా బాగా చదువుకున్న వారూ.. బయటికి “మర్యాదస్తులు”.
ఒకరు ఒకలాంటి సంస్కౄతీ హీనతకి నడుం కడుతూంటే..ఈ తరహా వారు మరొక పధ్ధతిలో ఆ పనే నిర్భయగా చెస్తున్నారు. మొదటి వారు బయటికి కనిపిస్తారు. వారిని విమర్శించడం తేలిక కూడాను. కానీ మన మధ్యనే ఉంటూ మనకళ్ళకే పొరలు కప్పే ఈ రెండో తరహా వ్యక్తుల రాజకీయాలు్ అంతకన్నా చికాకైనవీ ..ప్రమాదమైనవీను.
సురేష్ గారూ, మీ వ్యాసాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. బూదరాజు రాధాకృష్ణ గారి వ్యావహారిక భాషా వికాసం అన్న పుస్తకం లోని ఈ వాక్యాల గురించి కొంచెం వ్యాఖ్యానించగలరా?
“భాష అనేది అత్యంత విస్తృతార్థం లోనూ, అతి సంకుచితార్థంలోనూ వాడుకలో ఉన్న శబ్దం. అది ఎలా ఏర్పడ్డా, మొదట ధాతు దశలో ఉండి, పద దశకు వచ్చి చివరికి వాక్య దశకు పరిణమించిందనుకోవడం అపోహ.మనకు తెలిసినప్పటినుంచీ ప్రపంచంలోని ఏ భాష అయినా అనేక వాక్యాల సమాహారంగానే ఉంది గాని దానికి కేవల ధాతు దశ ఏనాడూ లేదు. భాషా స్వరూప స్వభావాలను గురించి మానవ విజ్ఞానంపెరిగిన తరవాత అర్థ స్ఫురణ లో ధ్వని సంఘటనలో ఉన్న సామీప్య సాదృశ్యాలను బట్టి వ్యాకర్తలు కొన్ని మాటల సమూహం ఏదో ఒక కల్పితమైన ధాతువు నించి ఏర్పడిందని లాఘవం కోసం నిర్ణయించుకున్నారు. మంజూష లోని ప్రకృతి ప్రత్యయ విభాగౌ కేవలం కాల్పనికౌ అన్న వాక్యానికి ఇదే అర్థం. ” (జూన్99 ముద్రణ – పుట 103).
మీరు ప్రస్తుతం రాస్తున్న విషయాలకూ దీనికి సంబంధం లేదనుకుంటే వదిలేయండి. కానీ ఈ వాక్యాల మీద మీరు వ్యాఖ్యానిస్తే ఈ వ్యాసాలని అర్థం చేసుకునే విధానం (పర్స్పెక్టివ్ లేదా ఫ్రేమ్ వర్క్) మరింత మెరుగు పడుతుందని నా ఊహ.
ఇంత శ్రమ తీసుకుని, ఎంతో చక్కటి వ్యాసాలని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. రాజా పిడూరి.
DBRగారు, మీకు ఒక వ్యాసము నచ్చితే దానిని గురించి మీ అభిప్రాయాలు పాఠకుడిగా వ్రాయడము అభినందనీయమే. అయితే మీకు ఒక(రి) వ్యాసము నచ్చకపోతే ఆ వ్యాసము ఎందుకు నచ్చలేదో, అందులో ఏ విషయాలు నిజమో, ఏవి పుక్కిటి పురాణాలో అనే సంగతి నిర్భయముగా ఆ వ్యాసము పైన అభిప్రాయముగా తెలిపితే బాగుంటుంది. మరొక వ్యాసములో ఈ వ్యాసపు రచయితను గురించి గుమ్మడికాయల హింటు ఇవ్వడము సబబు కాదు. వ్యాసపు వాసిని తూకము వేసే బాధ్యత ఈమాట సంపాదకులది, పీర్ రెవ్యూయరులది మాత్రమే కదా? వాసిలేని వ్యాసాన్ని ప్రచురించి ఈమాట వాసిని తమకు తామే తక్కువ చేసికొన్నారంటారా ఈమాట సంపాదకులు, చెప్పండి. విధేయుడు – మోహన
ఎగిరే కొబ్బరి చెట్టు గురించి ravikiran timmireddy అభిప్రాయం:
11/03/2011 12:43 pm
బాగుంది. అసలు మనం గమనించని అతి చిన్న విషయం ఒక్కో సారి ఎంత ఘాడవైన జ్ఞాపకంగా మారగలదో కవి చాలా బాగా చెప్పేడు. కానీ ఈ అందవైన జ్ఞాపకాల కవితల్లోంచి నిజవైన బతుకుని, ఆ కష్టాన్ని, సుఖాన్ని కవి కవితా వస్తువుగా మార్చగలిగేదెప్పుడో! మూలా గారు నేల మీద కాళ్ళు పెట్టగలిగితే బాగుండు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
మూడు వందల రామాయణాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
11/03/2011 7:47 am
అకాడమీ కౌన్సిల్ లో 90 శాతం మంది ఈ వ్యాసాన్ని తొలగించాలని వోటు వేస్తే పదిమంది మాత్రమే ఈ వ్యాసం ఉంచాలని వోటు వేసారంటే ఈ వ్యాసంపై జరిగిన దుష్ప్రచారాన్ని మీరూహించుకోవచ్చు. ఈ వ్యాసాన్ని వ్యతిరేకించే వారు చేసే వాదాలలో నాకర్థమైన విషయాలు కొన్ని:
1. రాముడు 100 కోట్లమంది హిందువులకు ఆరాధ్యదైవము. రామాయణం హిందువుల పవిత్ర గ్రంథం. ఆ గ్రంథాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాసం పాఠ్యపుస్తకాలలో ఉండడానికి వీల్లేదు. ఈ కుహనా వామపక్ష మేథావులు హిందూ దేవతలను కించపరిచే విధంగా రాస్తారు గానీ, అదే ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ గురించో, క్రైస్తవుల బైబిల్ గురించో ఇలా అవాకులు, చవాకులు పేలగలరా?
2. వాల్మీకిని ఆదికవిగా, రామాయణాన్ని తొలికావ్యంగా హిందువులు ఆరాధిస్తారు. రామాయణం రాసిన ప్రతి కవి వాల్మీకి రామాయణమే తమకు ఆధారమని పేర్కొన్నారు. అంటే రాముని కథకు విశ్వసనీయమైన ఆధార గ్రంథం వాల్మీకి రాసిన రామాయణమే. వాల్మీకి రాసిన రామాయణగాథ అంతగా ప్రజాదరణ పొందింది కాబట్టే, ఆ కథకు పామర కవులు, జానపదులు తమకు తోచిన విధంగా మార్పులు చేస్తూ రాసుకున్నారు. మహాకవి అయిన వాల్మీకి రాసిన రామాయణం ఎంత ప్రమాణమో మిగిలిన రామాయణాలు కూడా అంతే ప్రమాణమని పనిగట్టుకొని వాదించే ఈ వ్యాసం యొక్క అసలు ఉద్దేశ్యం వాల్మీకి గొప్పతనాన్ని, రాముని గొప్పతనాన్ని తక్కువచేయడమే!
3. రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. అంటే మన పూర్వీకులు మనకు అందించిన చరిత్ర ఇందులో ఉంది. భారతదేశ చరిత్రను క్షుణ్ణంగా వివరించే సూర్య, చంద్ర రాజుల వంశక్రమం తో సహా ఎన్నో వివరాలు ఉన్న ఈ మహాగ్రంధాలను, తక్కువచేసి మాట్లాడటం, బ్రిటిష్ వలసదారులు మనకు అంటించిన “ఆర్యుల దండయాత్ర” వంటి కాలం చెల్లిన సిద్ధాంతాలను ఇంకా వల్లెవేయడమే ఈ కుహనా చరిత్రకాలుల మేధావితనం. అయోధ్య, ద్వారక మొదలైన చోట్ల దొరుకుతున్న ఆధారాలను బట్టి రామాయణ, మహాభారతాలు ఉజ్వలమైన మనపూర్వ చరిత్రను తెలుపుతున్నాయన్న సత్యాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు.
4. ఎన్ని కష్ట, నష్టాలకోర్చైనా ధర్మాన్ని, సత్యాన్ని ఎలా ఆచరించాలో, పరిపూర్ణ మానవుడిగా ఎలా జీవించాలో బోధించే మహా గ్రంథంలో విపరీతబుద్ధి (perverted minds) గల మన కుహనా మేధావులకు కనిపించేది “అహల్య అక్రమ సంబంధ వివరాలు”, “సీతకు రావణునిపై, లక్ష్మణునిపై మోహం”, “కూతురైన సీతపై రావణుని కోర్కె” వంటి గజ్జల్లో వేడి పుట్టించే విషయాలు. ఒకవేళ అవి వాల్మీకి రామాయణంలో కనిపించకపోతే, అటువంటి విషయాలు కనిపించే రామాయణాలను వెతికి పట్టుకొని వాటిమీద వ్యాసం రాస్తారు; అటువంటి వ్యాసాన్ని మిగితా కుహనా మేధావి పాఠకవర్గం లొట్టలు వేసుకుంటూ చదివి అది రాసిన రామానుజన్ ను మహా మేధావి అని కీర్తిస్తారు. Perverted minds, they are, and perverted essay it is! Good riddance!
5. ఇది డిల్లీ విశ్వవిద్యాలయం ఆంతరంగిక విషయం. ఏ పాఠం వారి సిలబస్సులో ఉండాలో, ఏది ఉండకూడదో వారు నిర్ణయించుకుంటే ఈ కుహనా మేథావులు ఇంత రాద్ధాంతం చేయడం అనవసరం. చిన్న సిలబస్ మార్పును అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి భారతదేశ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చే మేథావులకు, ఈ దేశ ప్రతిష్టకన్నా వారి కుహనా సిద్ధాంతాలమీదే ఎక్కువ అభిమానమన్న విషయం తేటతెల్లమౌతుంది.
🙂
కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి రాణి. అభిప్రాయం:
11/03/2011 7:14 am
అద్భుతం.
కొడవటిగంటివారూ, ఎంత శ్రద్ధగా దాచివుంచారండీ. ఇది మన సాంస్కృతిక వారసత్వ సంపద. ఇలాంటివి ఎన్ని చదివినా మరిన్ని చదవాలనే దాహం మాత్రం తీరదు.
తిక్కన భారతంలో పలుకులపొందు గురించి Tahataha అభిప్రాయం:
11/03/2011 6:24 am
ఆచార్య భద్రిరాజు గారి వ్యాసమ్ చదివి నేను ‘ఒళ్ళు పులకించింది’ అని నా అభిప్రాయాన్ని తెలియ చేసాను. మీరు నా అభిప్రాయాన్ని ప్రచురించ లేదు. ఆ వ్యాసం చదివి నా ఒళ్ళు పులకించటం నిజం. సాహిత్య వ్యాసం చదివితే ఒళ్ళు పులకించ గూడదా అలా అభిప్రాయం చెప్పగూడదా?
రెండు కవితలు గురించి suvarna అభిప్రాయం:
11/03/2011 3:41 am
తూనీగ కవిత చాలా నచ్చింది.
యాపిల్ కవిత తమాషాగా అనిపించింది.
మొత్తంగా కవితల్లో కొత్తదనం ఉన్నది.
అభినందనలు.
సువర్ణ.
ఒక (అ)నాగరిక ఆనందం గురించి ramakrishna అభిప్రాయం:
11/02/2011 8:15 pm
నారాయణ్ గారు మీ కవిత బాగుంది. అభినందనలు. శీర్షిక నచ్చలేదు.
పలుకుబడి: సంఖ్యాపదాలు – 3 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
11/02/2011 3:04 pm
బూదరాజు గారు చెప్పిన మొదటి భాగంతో పూర్తిగా ఏకీభవిస్తాను. ప్రపంచంలోని ఏ భాష అయినా, ఏ కాలంలోనైనా వాక్యాల సమాహారంగానే ఉంది గాని దానికి కేవల ధాతు దశ, కేవల పదదశ, కేవల వాక్యదశ ఏనాడూ లేదు. అయితే, ఆయన రెండో భాగంలో ఏం చెబుతున్నారో నాకు పూర్తిగా అర్థంకాలేదు. ఆయన ధాతునిర్ణయం కల్పితమైన శాస్త్రమని అంటున్నారా? కాదనే నేననుకుంటాను. ఆధునిక భాషాశాస్త్రం ఎరిగిన వ్యక్తిగా, ఆధునిక వ్యుత్పత్తిశాస్త్రం ఎంత శాస్త్రీయంగా అభివృద్ధి చెందిందో ఆయనకు బాగా తెలుసు. ఆయన చెబుతున్నది ప్రాచీన వ్యాకర్తలు నిర్ణయించిన ధాతుపదాలగురించి అనుకుంటాను.
వ్యుత్పత్తిశాస్త్రం కొంతమంది భాషాశాస్త్ర ఔత్సాహికుల దుర్వినియోగం వల్ల గత శతాబ్దంలో కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నది గానీ, Historical linguistics, comparative linguistics వంటి భాషాశాస్త్ర శాఖలకు పునాది వ్యుత్పత్తిశాస్త్రం. గత రెండు శతాబ్దాల్లో “ఆధునిక వ్యుత్పత్తిశాస్త్రం” ఎలాంటి మార్పులు చెందిందో తెలుసుకోవాలంటే Yakov Malkiel రాసిన Etymology అన్న పుస్తకం చూడవచ్చు.
మన సంస్థలు – మన సంస్కృతి గురించి rama bharadwaj అభిప్రాయం:
11/02/2011 2:56 pm
మరెందుకోగానీ వేలూరి వేంకటేశ్వర రావు గారూ !! మీ నిర్మొహమాటమ్ కొన్ని అంశాలకే పరిమితమైపోతోంది సుమా !! వట్టి రాజకీయనాయకులేనా వారిని కాసేపు అటుంచుదాం!! సాహిత్యం పేర విమర్శకులన్న హోదాలో ఎడాపెడా ముందుమాటలూ లేదా “చివరి మాటలూ” రాసే వాళ్ళూ.. అర్హత తో సంబంధమ్ లేకుండానే అకాడమీలనించో వ్యక్తుల ద్వారానో పైరవీలు చేసుకుని చేయిచుకుని “అవార్డులు” సంపాదించుకుంటున్నవాళ్ళూ.. ..సదరు విమర్శకుల అండదండలతో రాత్రికి రాత్రే కవులుగా అవతారం ఎత్తుతున్నవాళ్ళూ..”రాజు గారూ.. దేవతా వస్త్రాలూ” కధలో లాగా అన్నీ తెలిసినా ఏమీ అనకుండా ..చోద్యం చూసేవాళ్ళూ ..పత్రికలని అడ్డు పెట్టుకుని సొంత గుంపులని తయారు చేసుకుని ..వారి చేత తమ డబ్బా వాయింపించుకునే వాళ్ళూ..పార్టీలు ఫిరాయించే వాళ్ళూ..ఇవాళ ఒకచోట చెప్పిన అభిప్రాయాల్ని మళ్ళి మరొక చోట మాత మార్చి మాయ చేసేవారూ… వీళ్ళందరూ ఈ రాజకీయ నాయకుల కన్నా ఏ రకంగా భిన్నమైన వారూ.. గొప్ప వారూ కాగలరో మరి నాకైతే అర్ధం కాలేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండీ. రాజకీయనాయకులకి ఎక్కడ ఏం మాట్లాడినా తమ దైన ఒక స్వప్రయోజనం ఉంటుంది. సాహిత్యంలోనూ ఇన్ని రాజకీయాలు చేసే ఇటువంటి వారికీ ఏవో కొన్ని ప్రయోజనాలు ఉండే ఉండాలి కదా?? ” సాంస్కౄతిక తిరోగమన రధానికి” ” గుర్రాల్లా” ఉన్న ఇటువంటి వారి వలన
కూడ అంతే నస్టమ్ జరగడమ్ లెదా?? ఇది ఎవరికీ అసలు ఇబ్బందిగానే అన్పించడమ్ లేదా?? పైగా వీరు ఆ రాజకీయనాయకులి కన్నా బాగా చదువుకున్న వారూ.. బయటికి “మర్యాదస్తులు”.
ఒకరు ఒకలాంటి సంస్కౄతీ హీనతకి నడుం కడుతూంటే..ఈ తరహా వారు మరొక పధ్ధతిలో ఆ పనే నిర్భయగా చెస్తున్నారు. మొదటి వారు బయటికి కనిపిస్తారు. వారిని విమర్శించడం తేలిక కూడాను. కానీ మన మధ్యనే ఉంటూ మనకళ్ళకే పొరలు కప్పే ఈ రెండో తరహా వ్యక్తుల రాజకీయాలు్ అంతకన్నా చికాకైనవీ ..ప్రమాదమైనవీను.
పలుకుబడి: సంఖ్యాపదాలు – 3 గురించి Raja Piduri అభిప్రాయం:
11/02/2011 2:25 pm
సురేష్ గారూ, మీ వ్యాసాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. బూదరాజు రాధాకృష్ణ గారి వ్యావహారిక భాషా వికాసం అన్న పుస్తకం లోని ఈ వాక్యాల గురించి కొంచెం వ్యాఖ్యానించగలరా?
“భాష అనేది అత్యంత విస్తృతార్థం లోనూ, అతి సంకుచితార్థంలోనూ వాడుకలో ఉన్న శబ్దం. అది ఎలా ఏర్పడ్డా, మొదట ధాతు దశలో ఉండి, పద దశకు వచ్చి చివరికి వాక్య దశకు పరిణమించిందనుకోవడం అపోహ.మనకు తెలిసినప్పటినుంచీ ప్రపంచంలోని ఏ భాష అయినా అనేక వాక్యాల సమాహారంగానే ఉంది గాని దానికి కేవల ధాతు దశ ఏనాడూ లేదు. భాషా స్వరూప స్వభావాలను గురించి మానవ విజ్ఞానంపెరిగిన తరవాత అర్థ స్ఫురణ లో ధ్వని సంఘటనలో ఉన్న సామీప్య సాదృశ్యాలను బట్టి వ్యాకర్తలు కొన్ని మాటల సమూహం ఏదో ఒక కల్పితమైన ధాతువు నించి ఏర్పడిందని లాఘవం కోసం నిర్ణయించుకున్నారు. మంజూష లోని ప్రకృతి ప్రత్యయ విభాగౌ కేవలం కాల్పనికౌ అన్న వాక్యానికి ఇదే అర్థం. ” (జూన్99 ముద్రణ – పుట 103).
మీరు ప్రస్తుతం రాస్తున్న విషయాలకూ దీనికి సంబంధం లేదనుకుంటే వదిలేయండి. కానీ ఈ వాక్యాల మీద మీరు వ్యాఖ్యానిస్తే ఈ వ్యాసాలని అర్థం చేసుకునే విధానం (పర్స్పెక్టివ్ లేదా ఫ్రేమ్ వర్క్) మరింత మెరుగు పడుతుందని నా ఊహ.
ఇంత శ్రమ తీసుకుని, ఎంతో చక్కటి వ్యాసాలని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. రాజా పిడూరి.
దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి మోహన అభిప్రాయం:
11/02/2011 11:03 am