పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. మూడు వందల రామాయణాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    11/04/2011 1:41 am

    1. “హంత అన్న పదాన్ని ఏమని అనువాదం చెయ్యాలి? :-)”

    హంత! నన్నే అడిగారా? 🙂

    హంత = an exclamation or inceptive particle (expressive of an exhortation to do anything or asking attention , and often translatable by ” come on! ” ” here! ” ” look! ” ” see! ” in later language also expressive of grief , joy , pity , haste , benediction &c and translatable by ” alas! ” ” ah! ” ” oh! ” &c ; often repeated or joined with other particles

    IIT Kanpur web site లో హంత అనే మాటను “oh!” అని అనువదించారు (O! Rama, oh! I shall tell you faithfully about the hermitage, whose so ever is this hermitage which is cursed by a Mahatma (pious and magnanimous one).)

    మీరు “హంత”ని వదిలేయవచ్చు (ఉదా: http://www.sacred-texts.com/hin/rama/ry048.htm) లేదా – “శ్రుణు” తో కలిపి “సావధానంగా వినుము” అని అనువదించవచ్చునేమో!

    2. bas reliefs = శిలా ఫలకాలు – బావుంది.

    3. ” నా సంస్కృత భాషా పరిజ్ఞాన పరిమితుల్ని ఎత్తిచూపినందుకు…” – మీరు నొచ్చుకోలేదనే అనుకుంటాను. చాపల్యం/అత్యుత్సాహం కొద్దీ ఇలాంటి “అభిప్రాయాలు” రాస్తుంటాను. సంస్కృతంలో నా పరిజ్ఞానం ప్రాథమిక స్థాయిలో ఉంటుందేమో…

    చిన్న చిన్న “తప్పుల” మాటకేం కానీ – మెదడుకు కాస్త మేత వేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాల్మీకి రామాయణం నుంచీ, కంబ రామాయణపు తెలుగు సేత నుంచీ శ్లోకాలను/పద్యాలను ఉదహరించటం నాకు బాగా నచ్చింది.

  2. పహాడీ రాగం అందాలు గురించి Raja Piduri అభిప్రాయం:

    11/04/2011 12:33 am

    అడుగు జాడలు (మాస్టర్ వేణు) లో ఘంటసాల, బి.వసంత పాడిన “తూలీ సోలెను తూరుపు గాలీ” కూడా ఈ రాగం లోదే లాగుంది సర్ !

  3. వల్లకాడనలేదు గురించి buchi reddy అభిప్రాయం:

    11/04/2011 12:31 am

    excellent one
    we miss her

  4. పలుకుబడి: సంఖ్యాపదాలు – 3 గురించి Raja Piduri అభిప్రాయం:

    11/04/2011 12:11 am

    అదే సర్, కొంచెం confusing గానే ఉంది. సందర్భం కోసం ఆ భాగం లోని తరవాత వాక్యాలు కూడా ఇస్తున్నాను.

    “…మంజూష లోని ప్రకృతి ప్రత్యయ విభాగౌ కేవలం కాల్పనికౌ అన్న వాక్యానికి ఇదే అర్థం. ఇది గమనించని పండితులు ప్రాక్పశ్చిమ దేశాల్లో ఎక్కడ చూసినా ఉండేవారు; ఇప్పటికీ కొందరున్నారు. చిలుకూరి నారాయణరావు గారు తమ ఆంధ్ర భాషా చరిత్ర లో ‘భింద్’, ‘కృ’ అనే రెండు (సంస్కృత) ధాతువులు చేరినందున ‘పీ(కు’ అనే తెలుగు ధాతువు ఏర్పడిందని, అలాగే ‘ఛింద్’, ‘కృ’ ల నించి ‘చీ(కు’ ఏర్పడిందని, ఇలా తెలుగు మాటలన్నీ సంస్కృత వ్యస్త ధాతువుల రకరకాల కలయిక వల్ల ఏర్పడ్డవని విరచించారు. ఇంగ్లీషు చదువుల వారిలో కాకపోయినా ‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ అనీ, తెలుగు సంస్కృత పుత్రిక అనీ భావించే, విశ్వసించే సంప్రదాయ పండితులందరూ పై వాదానికి ఉపశృతులు పలుకుతున్నారు గాని మంజూషా వాక్యాన్ని స్మరించి కేవలం కాల్పనికాలైన రెండు ధాతువుల నించి తెలుగు మాటలు ఎలా ఏర్పడ్డాయని ప్రశ్నించుకోనేలేదు. ఇదే రకమైన దురభిప్రాయం 18, 19 శతాబ్దాల పాశ్చాత్య భాషావేత్తల్లో కూడా కొందరికి ఉంటుండేది. వ్యాకరణ పద్దతులనూ ప్రయోజనాన్నీ గుర్తించని కొందరు ఇప్పటికీ “ధాతువులు ఒకనాటి స్వతంత్ర పదాలన్న” దుర్భ్రమ లోనే ఉన్నారు. (ఇక్కడ L. Bloomfield, “Language” నుంచి ఉటంకింపు ఇచ్చారు. )
    Early students of language, who confused description with the entirely different and much harder problem of ascertaining historical origins, somehow got the notion that roots possessed mysterious qualities, especially in the way of age. Now and then one still hears the claim that roots we set up must once upon a time have been spoken as independent words. The reader need scarcely be told that this is utterly unjustified; the roots, like all bound forms, are merely units of partial resemblance between words. Our analysis guarantees nothing about earlier stages of the language which we are analyzing”

  5. మూడు వందల రామాయణాలు గురించి V R Veluri అభిప్రాయం:

    11/03/2011 5:21 pm

    హంత తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ |
    యస్య ఏతత్ ఆశ్రమ పదం శప్తం కోపాన్ మహాత్మనా |౧-౪౮-౧౫|

    ఈ శ్లోకానికి పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ప్రతిపదార్థము, తాత్పర్యమూనూ!

    ప్ర. అ. రాఘవ = రామా! మహాత్మనా = మహాత్ముడైన, (ఎవనిచేత) కోపాత్‌ = కోపమువలన, శప్తమ్‌ = శపింపబడిన, ఇదమ్‌ = ఈ, ఆశ్రమపదమ్‌ = ఆశ్రమము, యస్య = ఎవనిదో, తత్త్వేన = యథా ర్థముగా, తే = నీకు, కథ ఇష్యామి = చెప్పగలను, శృణు = వినుము, హంత =ఎంత ఆనందము .

    తా. రామా! చాలా సంతోషము! ఈ ఆశ్రమము ఎవ్వరిదో, ఏ మహాత్ముడు కోపముచే దీనిని శపించెనో యథార్థముగా, చెప్పెదను, వినుము.

  6. ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి Srinivas అభిప్రాయం:

    11/03/2011 4:37 pm

    ఇట్లాంటి ఇంకో పిల్లాడి గుండెల్ని తడిపే కథ గురించి ఇక్కడ

  7. మూడు వందల రామాయణాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    11/03/2011 3:56 pm

    1. అస్సామీ… అని మీరు మొదలెట్టిన చాంతాండంత జాబితా – అస్సామీలో రామాయణాలు ఉన్నాయన్నది నిజమే కానీ, రామానుజన్ గారి లిస్టులో మొదటి పేరు అన్నామీస్ . అన్నాం వియత్నాంకి పూర్వనామం అనుకుంటాను.

    నేనూ చూసాను, కానీ, మాధవ కండాలి రాసిన రామాయణం పేర్కొనకుండా వియత్నమీస్ భాషకు పూర్వనామమైన అన్నామీస్ అని రాసాడని అనుకోలేదు.

    2. sculpture and bas-reliefs అనే మాట కి “శిల్ప ప్రదర్శన” అనే అనువాదం నప్పలేదు. అభినయనం అనే మాట అప్పు తచ్చు కాబోలు.

    Is శిలాఫలకాలు better?

    3. “వాక్య విశారదుడైన రాఘవుడు అలా అడగగా విని, మహాతేజస్సు గల మహాముని విశ్వామిత్రుడు ఇలా సమాధానమిచ్చాడు.” – ఈ శ్లోకంలో వాక్య విశారదుడు విశ్వామిత్రుడు. మీరు పేర్కొన్న శ్లోకంలో విభక్తులను అన్వయించుకొని చూడండి.

    మీరన్నదే కరక్టు. తొందరలో చూసుకోలేదు.

    4. ‘ఈ ఆశ్రమం ఎవరిదో, ఏ మహాత్ముడు కోపంతో శాపమిచ్చాడో ఆ కథను సంతోషంగా చెబుతాను రాఘవా!” – శాపమిచ్చిన కథను “సంతోషంగా” చెప్పాడా విశ్వామిత్రుడు? 🙂

    హంత అన్న పదాన్ని ఏమని అనువాదం చెయ్యాలి? 🙂

    5. “పూర్వం దివ్య సంకాశంతో, దేవతలచే పూజింపబడిన ఈ ఆశ్రమం”? సంకాశము అంటే పోల్చదగ్గది/ సమానమైనది అని అర్థం. దివ్య సంకాశము అంటే స్వర్గ సమానము అని అర్థం.

    దివ్య అంటే స్వర్గం అన్న అర్థముందని అనుకోలేదు. You are right again! అంతకుముందు ఆశ్రమసంకాశం అంటే ‘ఆశ్రమం వలె’ అని రాసాను గాని,దివ్యసంకాశం అంటే దివ్యమైన వెలుగు అని అర్థంకూడా చెప్పుకోవచ్చని అనుకున్నాను.

    నా అనువాదాన్ని క్షుణ్ణంగా చదివి నా సంస్కృత భాషా పరిజ్ఞాన పరిమితుల్ని ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు.

  8. నాకు నచ్చిన పద్యం: రుక్మిణీ వర్తమానం గురించి మోహన అభిప్రాయం:

    11/03/2011 2:48 pm

    ఇది నాకు కూడ నచ్చిన పద్యము. తెలుగు కన్నడ భాషలలో కవులు ఎక్కువగా చంపక, ఉత్పలమాలలను, మత్తేభ, శార్దూలవిక్రీడితాలను ఆ క్రమములో వాడారు. పోతన మాత్రము మత్తేభవిక్రీడితాన్ని ఎక్కువగా వాడాడు. తెలుగులో ఈ వృత్తములో ఇంత చక్కగా వ్రాయగలిగిన కవి పోతన మాత్రమే. ఈ రుక్మిణీకల్యాణము ఎన్ని కావ్యాలకు దారితీసిందో? సంస్కృతములో మాఘుని శిశుపాలవధ (మొదటి చంపకమాల ఈ కవియే ధృతశ్రీ అనే పేరుతో వ్రాసాడు), వాదిరాజయతి రుక్మిణీశవిజయము ఈ సంఘటనపైన ఆధారపడినదే. రుక్మిణీకల్యాణము ఒక గొప్ప ప్రేమకథ. బృందావనరావుగారన్నట్లు గౌరీదేవి హృదయము కరుణామృతభరితము. అందుకే రజ్జువును కాపాడమని ఇప్పుడు కూడా స్త్రీలు మంగళగౌరిని పూజిస్తారు. వినాయకచవితి సమయములో మొట్టమొదట పసుపు గౌరిని పూజించిన తరువాతే ఆమె ముద్దుల తనయుని పూజిస్తారు. అందుకే కర్ణాటకములో వినాయకచవితిని గౌరి-గణేశ హబ్బ అంటారు. బృందావనరావుగారు, మీ సాహితీసేవ ఇలాగే నిరంతరముగా కొనసాగనీయమని భగవంతుని ప్రార్థిస్తున్నాను. విధేయుడు – మోహన

  9. మూడు వందల రామాయణాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    11/03/2011 2:48 pm

    సురేశ్ గారికి
    ఓ గంటన్నరగా మీ అనువాదాన్ని చదువుతూ ఉన్నాను. మొత్తం చదివాక మళ్ళీ ఇంకో “వ్యాఖ్య” రాస్తాను. ఈలోపు…

    1. అస్సామీ… అని మీరు మొదలెట్టిన చాంతాండంత జాబితా – అస్సామీలో రామాయణాలు ఉన్నాయన్నది నిజమే కానీ, రామానుజన్ గారి లిస్టులో మొదటి పేరు అన్నామీస్ . అన్నాం వియత్నాంకి పూర్వనామం అనుకుంటాను.

    (ఆంగ్ల వ్యాసంలో ఈ భాషల చిట్టా ఆంగ్ల వర్ణమాలాక్రమంలో ఉంటుంది సరే… మీరు అకార క్రమంలో రాసి ఉండాల్సిందేమో. 🙂

    2. sculpture and bas-reliefs అనే మాట కి “శిల్ప ప్రదర్శన” అనే అనువాదం నప్పలేదు. అభినయనం అనే మాట అప్పు తచ్చు కాబోలు.

    3. “వాక్య విశారదుడైన రాఘవుడు అలా అడగగా విని, మహాతేజస్సు గల మహాముని విశ్వామిత్రుడు ఇలా సమాధానమిచ్చాడు.” – ఈ శ్లోకంలో వాక్య విశారదుడు విశ్వామిత్రుడు. మీరు పేర్కొన్న శ్లోకంలో విభక్తులను అన్వయించుకొని చూడండి. రామానుజన్ గారి అనువాదంలో ఇలా ఉంది:
    “Hearing Raghava’s words, the great sage
    Visvamitra, man of fire,
    expert in words answered,…”

    4. ‘ఈ ఆశ్రమం ఎవరిదో, ఏ మహాత్ముడు కోపంతో శాపమిచ్చాడో ఆ కథను సంతోషంగా చెబుతాను రాఘవా!” – శాపమిచ్చిన కథను “సంతోషంగా” చెప్పాడా విశ్వామిత్రుడు? 🙂

    5. “పూర్వం దివ్య సంకాశంతో, దేవతలచే పూజింపబడిన ఈ ఆశ్రమం”? సంకాశము అంటే పోల్చదగ్గది/ సమానమైనది అని అర్థం. దివ్య సంకాశము అంటే స్వర్గ సమానము అని అర్థం. మాతృకలో ఇచ్చిన ఆంగ్లానువాదం: this ashram that reminds you of heaven, worshipped even by the gods.

    మీరు పూర్తిగా అనువదించని కొన్ని మాటలకి అర్థాలు ఇక్కడ రాస్తాను:

    1) “దుర్మేధస్సు” అంటే మూర్ఖత్వమని అర్థం కాబోలు మోనియర్ విలియమ్స్ ప్రకారం. చెడ్డ కోరికలు – evil intentions అనే అనువాదాన్నీ చూసాను నేను
    2) వృత్త సంపన్నుడు = సుగుణ సంపన్నుడు
    3) దుర్ధర్షుడు = అజేయుడు
    4) దుర్వృత్తి = నేరము

  10. ఎగిరే కొబ్బరి చెట్టు గురించి k.venkata rama krishna అభిప్రాయం:

    11/03/2011 2:00 pm

    A beautiful poem.