పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16481

  1. లోపలి పిలుపు విని గురించి Venkat Gavvala అభిప్రాయం:

    11/26/2011 7:58 pm

    మీ అందరికి మా వందనములు,
    చాలా బాగుంది. All our efforts to dive inside have become more and more stronger with the encouraging song.
    Thanks a lot for the Singer as well as all involved. Gratefull to Sri Piduri for pointing me to this site.
    కృతజ్ఞతలు

  2. కొనసాగింపు గురించి HIMAYATH అభిప్రాయం:

    11/26/2011 7:38 am

    web page is excellent.
    can i send my telugu kavithalu to this page?
    please let me know how?
    Regards

    MOHAMMED HIMAYATH

    [Please see http://www.eemaata.com/em/instructions ..Eds]

  3. పహాడీ రాగం అందాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/25/2011 10:47 pm

    Bhavanarayana garu,

    Your confusion about Pahadi/Durga is because you could not identify the shadjamam correctly.
    I try and express myself in the minimum of words. My purpose is very clear. It is simply to help the reader/listener get more familiar with the ragas that are HEARD. The idea is NOT to write a historical or literary background to music. Several others already seem to be doing it. As a web magazine eemaata has the advantage of audio and video links. An author can ‘talk or sing’ although conversation is not possible. Writing about music has tremendous risks of becoming a verbose and showy piece and I try and avoid that.

  4. ప్రేమ కవితలు గురించి subbu అభిప్రాయం:

    11/25/2011 9:19 am

    క్యా బాత్ హై!

  5. పహాడీ రాగం అందాలు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    11/25/2011 8:41 am

    రోహిణీ ప్రసాద్ గారూ,
    నమస్కారం. you are really capable of presenting us with a better written sketch, with more information. i expected a brief foray into the origins and historical background of Pahadi. I am too ignorant to know the restraints you impose on yourself in terms of length of the the essay for this journal, or in terms of the quantity and nuances of information. I earnestly request you to expand this skeleton into a full length essay, incorporating part of the wealth of information you possess on this raga. I request you to clear my doubt as I have been convinced for two decades that నిన్న లేని అందమేదో of పూజాఫలం – is based on Raga Durga. And I often have convinced my self that the song synchronizes with Sri Bismillah kahan’s rendering of Durga. Being awfully uninitiated in classical music, I have been given fresh doubts as to my conviction, held so long. I request you to remark some thing to rectify my stand.

    warm regards ,
    Yours thankfully,
    Siddineni Bhavanarayana.

  6. మూడు వందల రామాయణాలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/25/2011 12:57 am

    రమాదేవి గారు మీ ఆవేదన మీ ప్రశ్నలూ సందేహాలు నిజాయితీగా ఉన్నాయి.

    మన సమాజం అనేకానేక వర్గాలతో కూడుకున్నది. అన్ని కాలాల్లోనూ !! ఒక మూల కధ ఉండగా దాన్ని యధాతధం గా చదివే అవకాశం కూడా లేని వర్గాలు ఎందరో ఉన్న సమాజం మనది. మనకి దేముడూ కావాలి. మళ్ళీ కల్పనా కావాలి. రెండూ అంతే ముఖ్యమైనవి. రాముడికీ సీతకీ మొక్కుతూనే తమతమ కల్పనలతో కొత్త రామాయణాలని చేసుకోగల్గడమే ఇందుకు ప్రబలమైన ఉదాహరణ. మీకు తెలుసా – వాల్మీకి రామాయణం లో కరుకుగా ఉండే పాత్రల చిత్రణ కి విరుధ్ధంగా వాటిని రవ్వంత సౌమ్యంగా మార్చుకుని జనానికి ప్రియమైన రాముడిని సీతనీ ఇంకా రావణుడినీ కూడా చాలా మృదువుగా మార్చారు కవులని?? మనకి తెలిసిన మనం చదువుతున్న ఇవాళ సినిమాలలో మనం చూస్తున్న చాలా ఘట్టాలు అవాల్మీకాలన్నమాట. ఉదాహరణకి రావణాసురుడు వచ్చి … ఆశ్రమంలో ఉన్న సీతని భిక్ష అడిగి భిక్ష వేసేందుకని వచ్చిన సీతని బలవంతంగా ఎత్తుకుని పోతాడు. అయితే ఈ దృశ్యంలో వాల్మీకి రాసినది చదువుతే రావణుడి మీద కోపం అసహ్యం తారాస్థాయికి వెళుతుంది ఎవరికైనా. ఆయన సీత తొడకింద చేయివేసి, జుత్తు పట్టుకుని పైకి లేపి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినట్లు వాళ్మీకి రాయగా అది చాలా అభ్యంతరంగా ఉందని అసలు రాముడు సీతని తాకనే తాకకుండా ఆమె పడి ఉన్న భూఖండాన్ని ముక్కగా పెకిలించి తీసుకుని వెళ్ళాడని తరవాతి కవులు మార్చుకున్నారు. ఇదే అటు తర్వాత మీకు అన్ని రామాయణాలలోనూ చోటుచేసుకుంది. సినిమాలలోనూ!! అంటే రావణాసురుని స్వభావాన్ని మార్చి సీతకి జరిగిన అవమానాన్నీ మార్చి చూపించుకోవడాన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి మరి?

    దీనర్ధం ఏమంటే జనం అసలు కధ ఒకటి ఉండగా వాళ్లకి కావలసిన రీతిలో దానికి మెరుగులు దిద్దుకుంటారు. సమాజం దాన్ని ఒప్పుకుంటుంది. అసలు మనలో ఎంత మందికి వాల్మీకి రాసింది ఏమిటో తెలుసు గనకా?? అటుతరవాత మార్చింది తెలుసు గనకా??

    అయితే విశ్వవిద్యాలయాల పని ఏమంటే అనేక తరహాలలో ఉన్న రామాయణాల గురించి ఒక ప్రొఫెసరు వ్యాఖ్యానించగానే దాని గురించి భయపడిపోయి దాన్ని అనుమాన దృష్టి తో చూడటం కాదు. విశ్లేషణ కి ఎప్పుడూ ఒక అవకాశాన్ని కల్పించుకోవాలి. చర్చలు చేయాలి. జ్ఞాన సముపార్జన జరిగేది అలాగే !! నిషేధించడం వలన ఏమౌతుంది గనకా?? అనేకానేక ఆలోచనలకి అనుమతి లభించని చోట అభివృద్ధి ఏం ఉంటుందీ??
    రమ.

  7. శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి RANGAIAH అభిప్రాయం:

    11/24/2011 6:02 pm

    పరుచూరివారికి అభినందనలతో, మీరు అందించిన గాన మాదుర్యము ను పొగడడానికి నాకు భాష సరిపోవటం లేదు. 1960 ప్రాంతం లో వచ్చిన నిలువు దోపిడి లోని పాట “అయ్య లార ఓ అమ్మ లార” అంటూ పాడిన బుర్ర కధ ఎక్కడా దొరకడం లేదు. ఇటువంటి అరుదైన గీతాలు లభింపజేయ గలిగితే ఎంతో సంతోషం.
    కృతజ్ఞతలతో
    పర్వతాల రంగయ్య

  8. అనుభవం గురించి ramaadevi అభిప్రాయం:

    11/24/2011 10:43 am

    నాకు అర్ధం అయ్యింది చంద్రశేఖర్ గారు,
    కానీ రవళి ఇన్ని రోజుల తరవాత ఏమి చేయాలి లేక చేసుండచ్చు? ఇది మరీ ఇత చిన్న కధ రాసేంత చిన్న విషయమా?
    ఆ రోజు నిద్ర పట్టలేదు సరే మరునాడు ఏమి చేసాడు? దానికి ఏలా రియాక్ట్ కావాలి? అతని ఆత్మాభిమానం మాటో? విషయం చాలా గంభీరమైనది లోతయినది. ఇంత చిన్న కధలో ఇమడలేనంత. ఈ నెల చతుర లో కాలువ మల్లయ్య గారి నవల చదివారా?

  9. మూడు వందల రామాయణాలు గురించి ramaadevi అభిప్రాయం:

    11/24/2011 9:59 am

    Yes కుహనా సాంప్రదాయాలు, రాజకీయాలు may be true in case of “Such a long Journey” but not for removing this.
    In Koumudi there is a serial of Glorious India translation. People like me are really in a dilemma whether what we studied or our children studying in books is true or we are really brainwashed or kept away from the truth. There should be more/many discussion/s on such serious issues.
    It is very sad to see the intellectuals neglecting the actual serious issues like fast spreading mental, cultural pollution or social contradictions which are confusing the young minds but engaged in such petty things like an internal decision of an institute in which there is validity.
    it need not be “దుష్ప్రచారం” it can be inappropriateness in the context of syllabus in terms of students mind set to which it was a part of syllabus.

    To give an example of how it can affect : Sudha Murthy gave up her job to look after the family. But she never confined herself to four walls or just her family. During course of time she is even heading Infosys foundation. But personally I know so many educated men citing Sudha Murthy and made their wives confine to the family. Even many Women misunderstood her decision and gave up their career and confined to family. Neither the men nor the women saw to her social involvement and how she made use of her talents. I personally conducted a small quiz on Ramayana once and most people (22 to 45 years) could not answer the simplest questions. I doubt how many know Tara or Angada. Most students have little chance to get to know the basic story since we have nuclear families and the parents are busy making their wards either sent for coaching /tuition or making them watch some nonsensical cartoon or polluting and violent serials like WWF or roadies. Some intellectual parents insist on National geographic channel or such stuff but where is the chance for them to know the basic story? On top of it we get movies like Ravan/Villain where Rama is shown as a bad person. In such a situation is it appropriate to keep a literary work which doesn’t show even an iota of its glory/ What should be expected from the lecturer/professor to discuss in the class?
    I am an ordinary person from middle class. These are my views. Actually it is my agony about the indifference of the capable change makers who allow things to go wrong.
    Ramadevi

  10. మూడు వందల రామాయణాలు గురించి ramaadevi అభిప్రాయం:

    11/24/2011 9:20 am

    గౌరవనీయులైన అందరికీ
    నమస్కారము
    సురేష్ గారు మీరు రాసిన కారణాలు – ముఖ్యంగా 5వది నిజమే కదా, ఎందుకు దానికి ఇంత వ్యాఖ్యలు?
    మళ్ళీ ఇందులోని వారే (అంత వివాదాస్పదం కావాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు అన్న వారి లాటి వారు ఎడిటోరియల్ లో “కుహనా సాంప్రదాయాన్ని కొనసాగించింది” లాంటి అభిప్రాయాలని వెల్లడించిన వారే) చాలా మంది “ద్రౌపది” కి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం గురించి బాధ పడతారు.
    అసలు రామాయణమే కాదు హిందు మతధర్మ ఆచారాలలో చాలా ప్రాంతీయపరమైన భేదాలు కన్పడతాయి. సూర్యమానం చంద్రమానం కానీ సుర్యమానం ప్రకారం నడిచే అందరికీ వొకే సారి వొకే నెలలు రావు. జ్యోతిర్లింగ క్షేత్రాలు చాలా వరకు వొకటే (కొన్ని క్షేత్రాల గురించి వివాదం వుంది) కాని వాటిలో పాటించే పూజా పద్ధతులు వొకటి కాదు. ఉత్తరంలో వొకటి అయితే దక్షిణంలో ఇంకొకటి. వేదాలు ఉత్తర భారతీయులకీ దక్షిణ భారతీయులకీ వొకటే అయినప్పుడు వొకటే పద్దతి వుండాలి కదా!
    ఈమాట చదువరులందరూ కనీసం 90 శాతం అంగీకరించేది హిందూ ధర్మఔన్నత్యాన్నిఅనుకుంటే దాని గురించి వదిలేసి, ప్రతిసారి ఇలా ప్రతిసారి “కుహనా సాంప్రదాయాలు, రాజకీయాలు” అంటూ వాటికి లేని ప్రాముఖ్యత కలిగేలా ఇలాంటి చర్చలే తప్ప నిజంగా ఏమీ చెయ్యట్లేదు. వొక సినిమా చూస్తేనే హీరో లాగా తామూ చెయ్యాలని, నాయిక అంటే పాటలకే పరిమితం అనేలా చేసే దర్శక నిర్మాతలని, హీరోలని, అవి చూపించే ప్రభావాలని వదిలేసి ఎక్కడో ఢిల్లీ యూనివర్సిటీ లో జరిగిన వొక చిన్న సంఘటనకి ఇంత చర్చ అవసరమా? ఈ రోజు, సర్దార్ పటేల్ స్టాట్యూల కంటే గాంధీ కాలనీల కంటే రాజీవ్ గాంధీ స్టాట్యూలు నగర్లూ కాలనీలూ ఎక్కువ. ఎందుకంటే అలా కాకుండా చెయ్యగలిగిన చాలామంది ఇలాంటి చర్చలలో లేక తమ పనులలో బిజీ గా వున్నారు. తెలుగు అకాడెమీ నాటక పోటీలలో సీత కి రావణాసురుడి మీద ఇష్టం తో నే వెళ్లింది అన్న నాటకం చూపిస్తే నేను మా పిల్లలకి సీతారాముల గొప్ప దనం ఏ విధంగా చెప్పగలనూ? అసలు రామాయణం గొప్పదనం తెలియని చాలామంది ఆ వయసు పిల్లలు ఈ వ్యాసం చదివి రామాయణం గొప్ప సాంస్కృతిక ప్రతీక అని ఎలా అభిప్రాయ పడగలరు?
    మీరు మీ మానసిక పరిపక్వతతో కాక ప్రస్తుతపు విద్యార్థి మనస్తత్వాన్ని దృష్టి లో పెట్టుకుంటే ఈ నిర్ణయం వెనుక సమంజసత్వం అర్ధం అవుతుందేమో!