పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. తరువాతేమిటి? గురించి TahaTaha అభిప్రాయం:

    01/07/2012 2:23 pm

    మMచి గేయM, హెచ్ ఆర్ కె. నాకు చాలా న చ్చిMది. ఒకటి చెప్పMడి ‘వ్యర్థ’ అన్నది వ్యర్థ పదమేనా కాదా?

    [దయచేసి సున్నా కోసం ‘సంఖ్య 0’ వాడకండి. ‘కేపిటల్ ఎం (M)’ వాడితే ‘అక్షరం సున్నా’ వస్తుంది. – సం.]

  2. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు గురించి రాజా పిడూరి అభిప్రాయం:

    01/07/2012 1:19 pm

    సురేశ్ గారూ,

    చాలా మంచి వ్యాసం. కృతజ్ఞతలు.
    1) బ్రౌణ్యంలో తండ్రి, తల్లి are undoubtedly connected with the root “త” (తెచ్చు , to bring) and literally mean ‘he who brings’ or ‘she who brings’ అని ఉంది. ఈ మాటలు introduction లో ఉన్నాయి. మరి ఇది బ్రౌన్ గారే వ్రాశారో లేక తరవాత రివైస్ చేసిన వారు (వెంకటరత్నం / వీరేశలింగం / కాంప్ బెల్) వ్రాసారో నాకు తెలియదు. ఇది పూర్వపక్షం అయినట్లేనా? వాదనకు నిలబడేది కాదా?

    2) అట్లానే ఈ ఇంట్రడక్షన్ లోనే ‘అల్లుడు’ signifies – one who weaves (i.e. relationships between two families) అని ఉంది. ఇది దేశ్య పదమే, తెలుగు అనే ఉంది. కానీ అల్లెము అనే పదం దగ్గర ఇచ్చిన entry ‘అల్లెము’ అనే మాటని సంస్కృతం నించి వచ్చిన తత్సమం లాగా చూపించారు. కానీ “అల్లెము (is) connected with అల్లుడు” అని ఉంది. ఇది పొరపాటు అయ్యుంటుందా?
    **

    వారానికి ఏడురోజుల విధానం గురించి ఎవరైనా రాస్తారని అనుకున్నాను. డాక్టర్ మహీధర నళీనీ మోహన్ గారు వ్రాసిన కేలండర్ కథ అనే పుస్తకం ప్రకారం: ఇది మెసపొటేమియాలో మొదలైంది. భూమి మీద మనుష్యుల జీవితాలను దిద్దేవి ఆకాశంలోని గ్రహాలేననే నమ్మకం వల్ల అప్పటికి గ్రహాలు అనుకుంటున్న ఏడింటినీ (సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని) ఒక్కొక్క రోజుకి అధిదేవతగా ఊహించి, ఆయా రోజులకు వరుసగా పేర్లు పెట్టారు. మొదట ఒక్కొక్క చాంద్రమాసంలో నాలుగేసి వారాలు ఉండేవి. 4×7=28 రోజులు పోగా మిగిలిన ఒకటి, రెండు రోజులకు వారాల పేర్లే ఉండేవి కావు. మళ్ళీ కొత్త నెల మొదటిరోజు ఆదివారంతో మొదలు అయేది. కొన్ని రోజులకు అసలు వారమే లేకపోవడం ఈనాడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. బాబిలోనియను భాషలో షబ్బతు అనే మాటకు మొదట పూర్ణిమ అనే అర్థం ఉండేది. తరవాత నెలలోని ప్రతి ఏడవ రోజునీ (7, 14, 21, 28) షబ్బతు అనడం మొదలు పెట్టేరు. దానినే యూదులు శాబత్ అన్నారు. ఆ రోజున కొన్ని పనులు (మాంసం తినడం, తెల్లని దుస్తులు ధరించడం, వైద్యులు మందు ఇవ్వడం, జోస్యాలు చెప్పడం) చేయకూడదనే నియమం బాబిలోనియనులకు ఉండేదట. అవే యూదులు కూడా అవలంబించారట, సాహచర్య దోషం వల్ల. మరికొంత కాలానికి వార రహితమైన దినాలు తీసేసారు. 7 రోజుల వార చక్రం నెలలతోనూ సంవత్సరాలతోనూ సంబంధం లేకుండా అవిచ్ఛిన్నంగా సాగిపోయేటట్లు మార్చుకున్నారు. ఆనాటి బాబిలోనియను సప్తాహ చక్రాన్నే యూదులు, అరబ్బులు, రోమనులు, క్రైస్తవులు, హిందువులు యదాతథంగా పరిగ్రహించారట. బాబిలోనియనులు పెట్టిన పేర్లే తర్జుమా చేసుకుని, అదే క్రమంలో తక్కినవారంతా వాడుకుంటున్నారట.

    వారం అనేది కృతకంగా ఏర్పాటు చేసుకున్నదే. దీనికి ఖగోళంతో ఏ విధమైన సంబంధమూ లేదు. కృతకమైన కాల విభజన కనుకనే వారం అని అర్థం వచ్చే మాటకు 4 నించి 10 రోజుల వరకూ వివిధమైన అర్థాలు వివిధ దేశాలలో ఉండేవట. మొట్టమొదట ఇది సంత రోజుగా ప్రారంభమైంది. సరుకూ చప్పరా కొనుక్కోడానికి చుట్టుపక్కల ఊళ్ళనించి జనం అంతా రావడానికి వీలుగా ఒక కూడలి స్థలంలో ఇన్నేసి రోజులకు ఒకసారి అని నిర్దిష్ట వ్యవధులలో సంతలు జరుగుతూ ఉండేవి. ఆ వ్యవధినే వారం అన్న అర్థం వచ్చే మాటతో వ్యవహరించారు (బ్రౌణ్యం లో వారం అంటే – తడవ, ఆవృత్తి అనే అర్థాలివ్వబడ్డాయి). ఆరోజున ఎవరూ ఏ పనులూ చేయకూడదన్నారు. అది అవసరమే కదా (సంత సరిగా సాగడానికి) సంతలో గాని, ఎవరి గూడెంలో వారు గాని సంబరాలు, దేవుళ్ళకు కొలుపులూ జరుపుకునే వారు ఆరోజున. రాను రాను ఆ రోజుకి పవిత్రత ఆపాదించబడింది. ఆ రోజున కొన్ని పనులు చెయ్యకూడదు అని నిషేధాలు ఏర్పడ్డాయి. 4, 5, 6, 8, 10 రోజుల వారాల్ని వాడిన జాతులని కూడా నళినీ మోహన్ గారు ప్రస్తావించారు.

  3. కన్నెవాన గురించి krishna akkulu అభిప్రాయం:

    01/07/2012 3:03 am

    చాలా బాగుంది. పాటగ పాడుకోవడానికి వీలుగావుంది. ఈ క్రింది చరణము కూడ్ చాల బాగుంది.

    మెరుపుచీర చుట్టుకుని
    ఉరుముగజ్జె కట్టుకుని
    మొయిలుగట్లు దాటుకుని
    నీటిపూలు చల్లేవటే
    పచ్చిక పసరువై మట్టికి ఉసురిచ్చేవటే
    పంటచేను ఒంటికి చినుకు లాల పోసేవటే

  4. ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి naren అభిప్రాయం:

    01/06/2012 10:55 pm

    క్రిందటి సంచికలో ఈ కధను చదివాను. అప్పుడే ఉద్విగ్నానికి లోనయ్యాను.

    కాని, ఈ వ్యాసం చదివాక అంతకంటే ఎక్కువ అనుభూతి పొందాను.

    కధ వ్రాయడం వెనుక పురిటి నొప్పులంత జంఝాటం పడటం, వివేచన చెయ్యడం ఎంతో కదిలించాయి.

    చాగంటి తులసి గారికి, జంపాల చౌదరి గారికి, ఈమాట సంపాదక వర్గానికి, రచయితలకోసం మరొక సారి విషయాన్ని సంగ్రహంగా ఎత్తిచూపిన భవానీ గారి అభిప్రాయానికి ధన్యవాదాలు.

    నరేన్

  5. కాల్వీనో కథల నుంచి – 1 గురించి మోహన అభిప్రాయం:

    01/06/2012 3:31 pm

    చిన్న కథలు బాగున్నాయి, మూడవ కథ బలే బావుంది 🙂
    విధేయుడు – మోహన

  6. మారిన కాలం మారిన మనుషులు గురించి మోహన అభిప్రాయం:

    01/06/2012 3:29 pm

    కరుణ రసాన్ని చిందించే మంచి కథ, చక్కని అనువాదము. టరమ్ ఫీసుకోసం బంగారు గాజులు, గొలుసు బ్యాంకుకు వెళ్లిన రోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఫీసులు లేకుండా ఏ పరీక్షలైనా ఉన్నాయా అసలు? విధేయుడు – మోహన

  7. మౌనంతో ముఖాముఖి గురించి మాలతి అభిప్రాయం:

    01/06/2012 3:09 pm

    కథనం బాగుంది. మామూలుగా మనం మాటాడుతున్నప్పుడు ఎదటివారు జవాబు ఇవ్వకపోతే దాన్ని passive aggressive అంటారిక్కడ. ఏ సమస్య అయినా మాటాడుకుని పరిష్కరించుకోవచ్చు అని కూడా అంటారు. ఈకథలో మౌనం ఒక మనిషి అనుకుంటే, సంభాషణలు ఎలా ఉంటాయో చిత్రించినట్టుంది. పైన చెప్పిన రెండో సూత్రం పని చెయ్యడంలేదు ఇక్కడ. మొదటిసూత్రంవల్ల ఆ మనిషికి గెలిచిన ఆనందం కలగొచ్చు కానీ జవాబుకోసం ఎదురు చూసేవారికి కలిగే నిస్పృహ, చిరాకులాటిని ఆవిష్కరించడం జరిగింది అని నా అభిప్రాయం.

  8. ఉరి: కధ నచ్చిన కారణం గురించి మాలతి అభిప్రాయం:

    01/06/2012 3:00 pm

    కథ, విశ్లేషణ కూడా నన్ను ఆకట్టుకునేలా ఉన్నాయి. నాకు మరొక కోణం కూడా కనిపిస్తోంది. ముగింపులో రచయిత మన సాంఘిక విలువలు, ధర్మాలమీద వ్యాఖ్యానిస్తున్నట్టు అనిపించింది. బతికుండగా కూడు పెట్టని మన చట్టాలు జైలులో కూడు పెడతాయి. ఆ సత్యం గ్రహించిన కథకుడు (నిందితుడు) తనపిల్లలు నేరం చెయ్యకపోయినా ఎక్కడున్నా వెతికి పట్టుకు మరీ జైల్లో పడేయమంటాడు. అలా ఏడుస్తున్నాయి మన న్యాయాలూ, ధర్మాలు అని విశ్వనాథగారు చెప్తున్నట్టు అనిపిస్తోంది. ఏమైనా మంచి కథని మరోసారి వెలికి తీసి అందించినందుకు ధన్యవాదాలు.

  9. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    01/06/2012 1:26 pm

    మంచి పద్యానికి చాలా చక్కని వ్యాఖ్యానం అందించారు! ఈ పద్యంలో ధ్వనించే అర్జునుని మనస్స్థితిని అద్భుతంగా వర్ణించారు.
    ఈ పద్యానికి ఒక చిన్న పాఠాంతరం కూడా ఉంది.
    “కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర” బదులు
    “కయ్యమున నోడి పాఱిన గౌరవేంద్ర” అని.
    అప్పుడు దాని అర్థం –
    ఓ కౌరవేంద్ర! యుద్ధంలో నువ్విలా పాఱిపోతే (పాఱిపోతూ ఉంటేనే కదా పిలిచి తూలనాడేది), ఆ అవమానభారంతో క్రుంగి కృశించడమే కాని, యింక ఏనుగులెక్కి రాజవీథులలో ఎలా ఊరేగుతావు? భూషణాలు ధరించి ఎలా కొలువుతీరగలుగుతావు? సుగంధ్రద్రవ్యాలు పూసుకొని ఎలా భోగిస్తావు? అంగనలతో ఎలా వేడుక చేసుకుంటావు? అందుకే ప్రాణత్యాగమే ఉత్తమం – అని.

    పద్యంలో చిన్న అచ్చుతప్పు పడింది. “ఎడ్డోలగంబు” కాదు “ఒడ్డోలగంబు”.

    రవీ, “ఔచిత్యం” గురించి క్షేమేంద్రునికి ముందు చాలామంది ఆలంకారికులే ఆలోచించారు. ఆనందవర్ధనుడు కావ్యానికి ఔచిత్యమనేది అవసరమైన లక్షణంగా పేర్కొన్నాడు. భాష, ఇతివృత్తము, పాత్రపోషణ విషయాలలో ఔచిత్యాన్ని గురించి చర్చించాడు. అతని స్ఫూర్తితోనే క్షేమేంద్రుడు ఔచిత్యానికి పట్టంగట్టాడు.

    [అచ్చుతప్పు సవరించాము. కృతజ్ఞతలు – సం.]

  10. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    01/06/2012 12:28 pm

    ‘కసి’ వల్ల ‘ఎడ్జ్’ రాదని, పోతుందని జీవితానుభవం, చరిత్ర.. సామాజిక-బలహీనులు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్న కీలక యుద్ధ రహస్యం.

    ఇక్కడి రెండు సందర్భాలలో పాటించిన పద్ధతి సరే, కురుక్షేత్రంలో కర్ణుడిని నిర్జించడానికి అనుసరించిన యుక్తులలో పద్ధతి (ధర్మం) ఉందా? కార్వేని చదివిన నాటి నుంచి ఉండిన సందేహం నాకు ఇప్పటికీ వుంది. పెద్దలు మీకు చెప్పిన మాటలు పంచుకున్నందుకు వినమ్ర కృతజ్ఙతలు.