పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. ఆగవే రజనీ! విభావరి! గురించి TahaTaha అభిప్రాయం:

    01/09/2012 4:13 am

    మోహన గారికీ , శ్రీనివాస్ గారికీ నమస్కారాలు.

    మోహన గారూ – గోపిక మధ్యలో ఉద్విగ్న అయినట్టుంది కొంచెం అడుగులు అటూ, ఇటూ పడ్డాయి. మట్టు గురించి, ముందు నేను ‘ఆప్ కీ నజరోన్ నె సమ్ ఝా’ (అన్ పఢ్ ) మట్టుకు రాద్దా మనుకుని ‘ఆగవే రజనీ విభావరి ఎచటికే నీ పరుగులు” అని రాశాను ముందుకెళ్ళటం చేతకాలేదు. చివరికి అచ్చులో ఇలావచ్చి పెద్దల (మీ) దృష్టి కి వచ్చింది.

    శ్రీనివాస్ గారూ – రజని ” ఓ విభావరీ” ఒక గొప్ప పాట చిన్న తనం నుంచీ ఆ పాట చెవుల్లో మోగుతునే వుంది. ఈమధ్య కూడా రజని గొంతులో యూ ట్యూబ్ లో దొరుకుతున్న ఆయన పాట చాలా సార్లు విన్నాను. రజనీని విభావరినీ కలిపి ఒక పాట రాయాలనే కోర్కె అంతర్లీనంగా ఉన్న మాట నిజం. ‘రుక్ జా రాత్… ‘ (దిల్ ఏక్ మందిర్ ) పాట సాహిత్యం, ఎత్తుగడ గూడా కొంత స్పూర్తి .

    మీ
    తః తః

  2. ఒక్క క్షణం గురించి sineevaali అభిప్రాయం:

    01/09/2012 3:33 am

    Poem is good. At the same time a feeling that some thing is missing remains after reading it. What could it be?

  3. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/09/2012 3:11 am

    ఈ విషయం మీద నేను సైతమ్ ప్రతిస్పందించి ఉన్నాను గనక పరుచూరి శ్రీనివాస్ ఎవరికి జవాబు రాసినా లేక ఎవరి తరుపున జవాబు రాసినా నేను ఆయన రాసిన వైఖరి మీద నాకున్న సందేహాలని మళ్ళి వెలిబుచ్చుతున్నాను.

    నేను నా ప్రతిస్పందనలో స్పష్టంగానే కొన్ని విషయాలని సూచించి ఉన్నాను. వాటిని పరుచూరి సరిగ్గా అర్ధం చేసుకున్నట్టు కనబడదు. బహుశా పరుచూరి కూడా ఒక పాఠకుడి గానే దీని మీద మాట్లాడుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఈ మౌఖిక/ లిఖిత సాహిత్యాల మీద పరిశోధనని వెలయించిన వారు అయి ఉండరు.

    స్త్రీల రామాయణపు పాటలు అని ఒక పుస్తకమ్ మీద అచ్చు వేసినంత మాత్రానికే వాటిని యధాతధంగా మనమ్ స్వీకరించనఖ్ఖరలేదు. అందులో స్త్రీల గొంతుకలున్నాయి. అవి స్త్రీలు రాసినవి అయి ఉండవచ్చు. ఒకానొక కవయిత్రి అని కాకుండా కాలక్రమేణా అనేకమంది స్త్రీలు ఆయా పాటలని తమ ఊహలతో విస్తరించుకుని ఉండవచ్చు. ఖచ్చితమైన కర్తృత్వం అన్నది మౌఖిక సాహిత్య లక్షణమ్గా పరిశోధకులు ఒప్పరు. ఒకటి కన్నా మించి దానికి పాఠాంతరాలు దొరికినప్పుడు కూడా అది దాని వ్యాప్తికి ముఖ్య ఉదాహరణగా పరిగణించడమ్ మౌఖిక జానపద రీతులని గుర్తు పట్టడంలో మరొక ఉదాహరణగా చెప్తారు. ఇంక ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు సాహిత్యాన్ని సృష్టించిన ఉదాహరణలు కూడా మనకి మౌఖిక సాహిత్యంలో మెండుగానే దొరుకుతాయి. అప్పుడు ఆ పాట చివరి చరణం లో ఆ రాసిన కవి పేరు సైతమ్ వస్తుంది. స్త్రీలు పాడుకునే పాటలలో ఇటువంటివి కూడా ఉండటమ్ బహుశా పరుచూరికి తెలిసి ఉండదు.

    లిఖిత సాహిత్యంలో క్షేత్రయ్య పదాలు దేవదాసీల కోసం రాజాస్థానమ్లో నృత్యమ్ చేసే స్త్రీల కోసమ్ రాయబడిన పాటలే! ఇలా అన్ని సంప్రదాయాలలోనూ అందరూ చేయి చేసుకోవడం స్పష్టం గానే కనిపిస్తుంది మనకి. అందులో గొంతుకలు స్త్రీల గొంతుకలే! వాళ్ళ వాళ్ళ మనస్సులోని ఈర్ష్యా ద్వేషాలే! వాళ్ళ వాళ్ళ అంతరంగాలే! అలాగే అన్నమయ్య నాయికలలో సైతం మనకి చాలా సందర్భాలలో స్త్రీల గొంతుకలు బలంగా వినిపిస్తాయి. కేవలం సమర్తలనీ ..పురిటి నొప్పుల్నీ వేవిళ్లనీ రాసిన కారణానికే అవి స్త్రీలు రాసేరని చెప్పనఖ్ఖర లేదు. రాసి ఉండవచ్చు. కాకపోయీ ఉండవచ్చు. ఒక మూల పదం ఉండగా వాటిని పాడుకునే క్రమంలో భిన్నమైన అంశాలు వచ్చి చేరడానికి సైతమ్ ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మౌఖిక సాహిత్యపు ప్రధాన లక్షణమే! నేను ఖచ్చితంగా వ్యాసకర్త “కవయిత్రి” అంటూ ప్రస్తావన చేయడాన్ని అభ్యంతరం పెట్టడంలో ఇన్ని అంశాలూ ఇన్ని పరిశోధనలూ ఉన్నాయి. ఇక్కడే నేను వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రస్తావన తెచ్చాను. అది ఎందుకు తెచ్చానో కూడా పరుచూరికి బోధపడినట్టు లేదు. వేటూరి గారు ఒక తాళ్లపాక తిమ్మక్కని ఈ సరికే “తొలి తెలుగు కవయిత్రి”గా తయారు చేసి పెట్టారు. అందుకు సరిపడా రుజువులు ఏవీ స్పస్టమ్గా లేకుండానే! అటు తర్వాత నించీ తెలుగులో మొదటి కవయిత్రి స్టేటస్సు అలా తాళ్ళపాక తిమ్మక్క ఆక్రమించుకుంది. అసలు అలాంటి ఆమె ఒకరున్నారొ లేరో తెలియకుండానే! అందువలన పండితులన్నవారేదో పొరపాట్లు చేయరన్న భ్రమలో తెలుగు వాళ్ళు కనీసమ్ తరచి చూసుకోకుండానే ఆమెని “తొలితెలుగు కవయిత్రి” అంటూ సంభావించేస్తున్నారు. ఇలాంటివి ఆయా పండితుల ఊహలు మాత్రమే! పరిశోధనలో తెలియనివాటిని అలాగే పేర్కోవడమ్ సముచితమని అనడమ్ “వ్యంగ్యం”గా శ్రీనివాస్ కి అర్ధమ్ కావడం వింత మరి.

    నేను చాలా వరకూ నారాయణరావు వ్యాసాలని చదివినదాన్ని. ఆయన అభిప్రాయాలలో మొదటి రోజులలో కనిపించిన విలక్షణత క్రమంగా కనుమరుగవడాన్ని గమనించవచ్చు ఎవరైనా! ఆయన మాటల్లో ఇతర విమర్శకుల ప్రభావం కూడా గుర్తు పట్టవచ్చు. ఎ.కె. రామానుజన్ ప్రభావం లోంచి నారాయణరావు బయటకు రాలేకపోవడాన్ని ఆయన వ్యాస రచనలన్నీ తెలియజేస్తున్నాయి. ఇది తెలుగు సాహిత్యమ్ మీద పట్టు ఉన్న వాళ్లకి స్పస్టమ్ గానే తెలుస్తుంది. అయితే మన దగ్గర పొగడ్తలకి ఉన్న విశేషమైన విలువ.. ప్రాధాన్యమ్.. విబేధించడానికి ఉండదు. ఇది ఎక్కువగా తెలుగు వాళ్ళ లక్షణమ్ జాతి పరంగా! నారాయణరావు భావాలూ వ్యాసాలూ విమర్శకి అతీతమైనవా ఏమి??

    మనం విమర్శని పట్టించుకోవాల్సిన స్థితి నించీ విమర్శ చేసిన వారి గొంతుకల్ని అణచివేయాలనే ధోరణి లోకి మళ్ళిపోతున్నాం . “మీరు కూడా” అంటూ పరుచూరి శ్రీనివాస్ కామేశ్వరావుగారిని ఉద్దేశ్యించి అనడం దీనికి మరొక ఉదాహరణ. ఆయన అభిప్రాయాలు రాసిన వారి మీద వివక్ష చూపడమ్ ఏమిటో?

    ఇంక ఈమాట గనక కేవలం సాహిత్యానికి ఒక చర్చా వేదిక గనక అయితే అప్పుడు అన్ని రకాల అభిప్రాయాలకీ చోటు ఇస్తుంది. ఇస్తుందన్న నమ్మకం వల్లనే ఇక్కడ రాయడం. లేకపోతే అసలు రాయవలసిన పనేముందీ? ఈమాటకే రాయవలసిన అవసరమ్ ఏముందీ ఎవరైనా? నీతిబోధలూ, ప్రవచించడాలూ ఎదటి వారికి ఏమీ తెలియదన్నట్టు మాట్లాడటమ్ చేసినప్పుడే అటువంటి వాటికి జవాబుగా చురకలు గానీ వ్యంగ్యాలు గానీ రాయడమ్ అవసరమ్ అవుతుంది. సాహిత్య అభిప్రాయాలకి ఒక చరిత్ర తప్పక అవసరమని భావించే దానిని గనక నేను ప్రతిస్పదించడమ్. ఎందుకంటే ఏ అభిప్రాయానికైనా రాసే వాళ్ళు మాత్రమే కాక ఇతర పాఠక వర్గమ్ కూడా ఉంటుందనీ తెలిసిన దానినీ! పాఠక వర్గం మీద నమ్మకమూ గౌరవమూ ఉన్నదానినీను! తెలిసిన పాఠకులని ఆలోచించనిద్దామ్!

    రమ.

  4. పొదుపు సమీకరణాలు గురించి Raj kumar అభిప్రాయం:

    01/09/2012 2:48 am

    విద్యా, చదువురాని చాకలివాడే ఇస్త్రీ చేస్తున్నప్పుడు, పిహెచ్.డి చేస్తున్న మీరు చెయ్యలేరా అని సవాలు విసిరింది.
    కొడుకుని వాళ్ళమ్మ కోడలి చేతిలో పెట్టి…
    ‘రేపటి సుఖం కోసం ఈ వేళ కాలిపొండి’
    ఆ సమయంలో కూడా నేను ఇంటిలో ఒక మూల నుంచుని ఇస్త్రీ చేసుకుంటూ నిలబడే ఉన్నాను.”
    “నేను పరిగెత్తుకు వస్తే ఇస్త్రీ ఆగిపోతుంది, పొదుపు ఆగిపోతుంది, అమ్మాయి డాక్టరీ ఆగిపోతుంది.”
    మూడవ నంబరు ప్రణయ సూచిక ఎగరవేయబడి,

    కెవ్వ్వ్వవ్వ్. గురూజీ… ఎప్పటిలాగానే… చాలా రొటీన్ గా అదిరిపోయింది పోస్టు..

  5. కన్నెవాన గురించి Vamsi Krishna K అభిప్రాయం:

    01/08/2012 10:02 pm

    దమయంతి గారు, కృష్ణ గారు
    మీ అభినందనకు ధన్యవాదాలు
    -వంశీ

  6. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    01/08/2012 7:40 pm

    క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను.

    ముఖ్యంగా మౌఖిక సాహిత్యవిశ్లేషణ కేవలం లిఖిత సాహిత్యం చదివే పద్ధతుల్లో సాధ్యం కాదు. ఈ రకమైన సాహిత్యాన్ని విశ్లేషించడానికి కొన్ని శాస్త్ర పద్ధతులున్నాయి. ఈ పరిశోధనలన్నిటి వెనకా ఎంతో విస్తారమైన ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మౌఖిక సాహిత్యం మీద విస్తారమైన పరిశోధనలు జరిగాయి కాబట్టి ఒకటీ అరా పుస్తకాల పేర్లు చెప్పడం కష్టం. తెలుగులో మొదటిగా ఈ రకమైన సాహిత్యాన్ని విశ్లేషించే పద్ధతుల గురించి నారాయణరావుగారు 1978లో “తెలుగులో కవితా విప్లవ స్వరూపాలు”లో చెప్పారు (3.ed. 2011). యూరోప్‌లోను, అమెరికాలోను మౌఖిక సాహిత్యంమీద పరిశోధనల్లో Albert Lord, Walter Ong లాంటివారి సిద్ధాంతాలు బలంగా వున్నాయి. 1970ల నుండి 80ల దాకా A.K. Ramanujan, Peter Claus, Brenda Beck, V. Narayanarao లాంటి చాలామంది భారతదేశంలో మౌఖిక సాహిత్యాల మీద పని చేశారు. పాశ్చాత్య మౌఖిక సాహిత్యానికోసం ఏర్పరుచుకున్న ఈ ప్రమాణాలు భారతీయ భాషల్లో మౌఖిక సాహిత్యాన్ని విశ్లేషించడానికి సరిపోవనీ, ఇందుకోసం కొత్త పద్ధతులు ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనలు వీరి పరిశోధనలవల్లే బలపడ్డాయి.

    ఇంత విస్తారమైన నేపథ్యం కలిగిన ఈ సాహిత్యం గురించి చర్చించబోయేముందు, ఇలాంటి వ్యాసాలను ఒక వ్యసనంగా, చులాగ్గా విమర్శించేవాళ్ళు కాకపోయినా, వీటి గురించి అర్థం చేసుకొనాలనుకునే వాళ్ళు, ముందుగా మౌఖిక సాహిత్యం మీద జరిగిన పనిని గురించి కొంచెం తెలుసుకుంటే బాగుండేది. పైన “ఊర్మిళనిద్ర” వ్యాసంలో చివరగా ఇచ్చిన రిఫరెన్సులు (రెండూ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నవే.), కనీసం #A ramayana of their own# వ్యాసం, అందులో వివరంగా ఇచ్చిన పాదసూచికలు చదివినా చాలనుకుంటాను.

    కామేశ్వరరావుగారు ప్రస్తావించిన అంశాలకు వస్తే:

    1. భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా? ముఖ్యంగా అగ్రవర్ణాలలో! మీ పెద్దవారిని అడిగి చూడండి ఒకసారి.

    2. ఈ పాటను గురించి కొందరు స్త్రీలను అడిగినట్లు వాళ్ళు అలాగే ఈ పాటను అర్థం చేసుకున్నట్లు మీరు చెప్పారు. వారి నేపథ్యం తెలియని కారణంగా వారు అర్థం చేసుకున్న తీరుని గురించి నేను చర్చించను. కానీ ఇల్లిందల సరస్వతీదేవిగారు 1951లో రాసిన “జాతి రత్నాలు – స్త్రీల పాటలు, కథా వైచిత్రి” అన్న పుస్తకంలో ఈ పాటను గురించి చర్చించారు. అందులో మీరు ప్రశ్నిస్తున్న అంశానికి సంబంధించి ఒక్క పేజీని (72పే.) ఈమాటలో ఉంచుతున్నాను. (ఈ పుస్తకం DLI లో లభ్యం అవుతుంది.) అక్కడ మీరు ప్రశ్నిస్తున్న పంక్తులు విడకొట్టి మరీ ఎలా ఇవ్వబడ్డాయో చూడండి.

    ల: శ్రీరాము తమ్ముండనే –
    ఊ: అతడనగ – నొకరు గలరా?
    ల: జనకునల్లుని గానటే –
    ఊ: భూమిలో జనకులనగా నెవ్వరు?

    2A. “చిత్తమొకదిక్కునుంచీ” అన్న పాదం దగ్గర మీరు మరొక వ్యాఖ్యానం చేసారు. “లక్ష్మణుడు ఎవరిపై మనసుపెట్టాడు? ఊర్మిళని నలుగురిలో ఎప్పుడు చిన్నబుచ్చాడు? అన్నమీద మనసుతో తనని విడిచి అడవికి వెళ్ళడం తనని చిన్నబుచ్చడమా? మరి “సమయమున” చిన్నబుచ్చడమేమిటి?” అని మీరు అడగడం మరీ అమాయకంగా వుంది. తనని చేసుకున్న లక్ష్మణుడు తనని వదిలేసి అన్నగారి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ అన్నగారు తన భార్యని తనతో రానిచ్చాడు. ఇది ఊర్మిళకి లక్ష్మణుడు తన చిత్తాన్ని అన్నగారిమీద పెట్టుకున్నట్టు, తన తోటికోడళ్ళ దగ్గర తనని చిన్నబుచ్చినట్టు అర్థమవ్వడంలో ఆశ్చర్యమేముంది.

    3. ఆకొమ్మ తమకమున వణకదొడగే

    హెచ్చయిన వంశానికీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ
    కీర్తి గల ఇంట బుట్టీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ

    వణకదొడగే , నేనేమిసేతూ, నేనేమిసేతూ అన్న మాటలలో మీకు స్త్రీ అసహాయ స్థితి కనబడలేదా?

    3A. “కథ ఒక్కసారిగా మారుతుంది. అంతవరకూ ప్రశాంతంగా వున్న వాతావరణం చెల్లాచెదురైపోతుంది. రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది.” దీనిమీద విమర్శగా “పటాపంచలమైన (sic) రామరాజ్య ధర్మమేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు! ” అన్నారు మీరు. … రామరాజ్యం గురించి యుద్ధకాండ చివరి సర్గలో వాల్మీకి వర్ణించిన “సర్వం ముదితమేవ ఆసిత్ (అందరూ ముదితులై ఉన్నారు)”, “ఆసన్ .. నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి (నిరామయులై, శోకరహితులై రామరాజ్యంలో ప్రజలు ఉన్నారు)” వంటి శ్లోకాలు చదవండి. (verse 99-105).

    4. మీరు కూడా “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” లాంటి పదాలను వాడడం శోచనీయం.

    ఇక పోతే కర్తృత్వం గురించి వచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేనెక్కువ శ్రమపడక్కర్లేదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళు ప్రచురించిన “స్త్రీల రామాయణపు పాటలు”లో (1.ed. 1955, 2.ed. 1986) “కౌసల్య వేవిళ్ళు, సీత సమర్త, సీత వసంతం”, లాంటి పాటలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా “కౌసల్య వేవిళ్ళు” అనే పాటలో కౌసల్య పురుటి నెప్పుల గురించి చాలా వివరమైన వర్ణన వుంది. A Ramayana of their own అన్న వ్యాసంలో ఈ విషయంపై వివరమైన చర్చ ఉంది. ఇవి స్త్రీలు రచించిన పాటలే అని చెప్పడానికి ఇంతకన్నా ఎక్కువ రుజువు అక్కర్లేదనుకుంటాను.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  7. పురూరవ: శ్రవ్య నాటిక గురించి రాజా పిడూరి అభిప్రాయం:

    01/08/2012 11:44 am

    చలం గారి గురించిన ఒక మంచి ఆడియో CD కావాలంటే వివరాలు.

    స్నేహ కుటి, భీమిలి 9849635847
    శ్రీ గురుప్రసాద్ గారు, వైజాగ్ 9951033415

    ఈ ఆడియో cd లో ….పురూరవ రేడియో నాటకం (క్వాలిటీ బాగానే ఉంది), ఇంకా ఈ నాటకం గురించి శారదా శ్రీనివాసన్ గారు చెప్పిన విశేషాలే కాకుండా చలం గారు స్వయంగా పాడిన చిన్న చిన్న పాటలు ఉన్నాయి. చలం చేత ‘చాటునుండే ఎంకిని సభకి రాజేశావ’ అన్న ఏక వాక్య లేఖ ని వ్రాయించిన రేడియో ఇంటర్వ్యూ (బాలాంత్రపు రజనీకాంతరావుగారు, శ్రీ గోపాల్ -శంకరాభరణం సినిమా లో బ్రో, చే, వా, రెవరు, రా? అని విరిచి పాడిన సంగీతం మాస్టారి పాత్ర వేసిన వారు) ప్రభృతుల సహాయంతో రికార్దింగ్ సామగ్రి నంతా అరుణాచలం తీసుకువచ్చి చేసినది) కూడా ఉంది.

    ఇది కాక పురూరవ నాటకం గురించి వీరలక్ష్మీ దేవి గారి వ్యాఖ్యానం కూడా..

  8. ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి lyla yerneni అభిప్రాయం:

    01/07/2012 3:51 pm

    క్రిందటి సంచికలో ఈ కధను చదివాను. అప్పుడే ఉద్విగ్నానికి లోనయ్యాను.
    కాని, ఈ వ్యాసం చదివాక అంతకంటే ఎక్కువ అనుభూతి పొందాను. – నరేన్

    I am having exactly the opposite reaction. I am downgrading it, based on added info.

    ఒక పాత తెలుగుకథ చదువుతున్నాము. కాని అంతకన్నా ఎక్కువగా ఈ శీర్షికలో- కథ, ఎవరికి, ఎందుకు నచ్చిందో చదువుతున్నాము కదా.
    పాతకధ ఎప్పుడు ఎవరికి నచ్చింది, ఎందువలన నచ్చింది? కధ ఏ కాలము నాటిది? చదివిన వారు ఏ కాలము నాటి వారు? ఏ వయసులో చదివారు? చదివేది ఆడవారా? మగవారా? ఇంతకు ముందు ఎప్పుడో చదివితే మళ్ళీ చదివినప్పుడు, అదే కారణాల వల్ల నచ్చిందా, లేక వీరి -అభిప్రాయాల్లో, అభిరుచుల్లో- మార్పు ఏమైనా వచ్చిందా? పాత చదువరి కధ చదివే విధానంలో గాని మార్పు వచ్చిందా? ఇప్పుడు మొదటిసారిగా చదివిన వారికి, ఈ కథ ఏ కారణాల వల్ల నచ్చింది? వీరి వయసు ఏమిటి? దేశ కాల పరిస్థితులు ఏమిటి? విమర్శకుల అభిప్రాయం ఊతంగా తీసుకుని వీరు కథను చదువుకున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి.

    చౌదరి – ఇక్కడ మొదటి చదువరి, ఈ కధను మనకు పరిచయం చేసిన చదువరి అనుకుందాం. 1944లో చా. సో., రాసిన ఈ కథను, 1960ల్లో, సుమారు తనకు ఇరవయ్యిల వయసులో విద్యార్ది చౌదరి చదివాడు. చదివినప్పుడు ఇదే విమర్శ, అభిప్రాయం రాసుకుని ఉంటాడా? I doubt it. మరి ఇది ఇప్పటి డాక్టర్. చౌదరి ఇప్పటి అబిప్రాయమా? అంటే అలాగూ అనిపించదు.

    ఈ విషయం ఆలొచిస్తూ ఉండగానే, ఇక ఈ కథ style ని గురించి ఇంగ్లీషులో నమ్రంగా తెలియచెప్పిన intellectual నీ, ‘మంచి కథ. సందేహం లేదు’ అని తెలుగు సర్టిఫికెట్టు ఇచ్చిన scholarని, ఇలా కొందరిని 🙂 ‘చదువుతూ’ ఉండగా, మళ్ళీ ఈ సంచిక, చా.సో., కథ గురించి మరికొన్ని విశేషాలు చెప్పింది.

    దాన్నుంచి, నా ఆలోచనలు మళ్ళీ సాగాయి.

    ఇక, ఈ కథ రాసినందుకు రచయిత తనే మురిసి మూర్ఛపోటమే కాక, ఈ కరుణా రస భరిత రచనను అలమూరు రాజగోపాలరావు చదివినట్లు, సాహిత్యంలో నిష్ణాతులైన నర్సింహాచార్యులు, రోణంకి అప్పల స్వామి, కధ చదివి గద్గదికమైన కొడవటిగంటి కుటుంబరావు, చుట్టలు మానెయ్యటం బాగా లేదనే నారాయణ బాబు, అబ్బే, అది మార్చక్కర్లేదనే జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి, ఈ కథ నీకెందుకు నచ్చింది నాన్నా? అని అడిగి వివరాలు సేకరించిన చాగంటి తులసి -ఇలా ఎందరో కథను పఠించినట్లు తెలిసింది.

    ఇంతమంది చదువరుల endorsement. అబ్బా! నేను మొన్న తెల్లారుజాము దాకా చూసిన 2012 Iowa Caucuses కన్నా బలంగా ఉంది. ఇక నా రిపబ్లిక్ ఓటు ఈ డెమోక్రటిక్ కరుణకథకెందుకివ్వను? 🙂

    ఇవ్వను. ఇవ్వను. ఎందుకంటే;

    1.”కృష్ణుడి పేరు ముందు ‘డిస్కంటిన్యూడ్’ అని రాయబోతున్నారు. ఆ అన్యాయాన్ని తలచుకుంటే కోపం రాదూ?
    ఈ కథ చదివాక గుండె బరువెక్కకుండా ఎట్లా ఉంటుంది? కళ్ళల్లో నీళ్ళు తిరిగితే ఆశ్చర్యమేముంటుంది?” – జంపాల చౌదరి అభిప్రాయం

    2. “నాకు మాటలు రావడంలేదు. ఆ కుర్రవాడు నాకు కనపడుతున్నాడు. ఆ కుర్రవాడు ఎదురుగుండా వస్తే వాడికి స్కాలర్‌షిప్పు యిస్తాను.” రాజగోపాలరావు అభిప్రాయం. (వీరు హైస్కూలు ఉపాధ్యాయుడిగా, కాలేజీ అధ్యాపకుడుగా బహు సమర్ధుడు. – అని వ్యాసంలో చెప్పబడింది)

    3. “భోజనం చేసి ఆ కథని బహుశా పది పదిహేను సార్లు నాకు నేను చదువుకుని ఉంటాను. ఎక్కడన్నా ఏ లోట్లన్నా ఉన్నాయేమోనని బహునిశితంగా విమర్శనాదృష్టితో పదం పదం వాక్యం వాక్యం పట్టిపట్టి చదువుకున్నాను.” – రచయిత చాగంటి సోమయాజులు అభిప్రాయం.

    4. “మీరు కథలో మీరు ఒకమాట వెయ్యక్కర్లేదు. ఒకమాట తియ్యక్కర్లేదు.” – రాజగోపాలరావు

    ఇట్టి పై ప్రగల్భపు, ఉబ్బేసే మాటలు ఈ కథను గురించి, చదివి, నేను (లైలా) ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యం ఎందుకంటే;

    కథ చదివి, ఈ సాహితీపరులు, రచయిత తో సహా, వీరంతా ఉద్విగ్నులైతే, ఎందుకు కృష్ణుడిని చూసే అయ్యారు? ఏడవదలిస్తే ఎందుకు ఆఖరి వాక్యం దాకా ఆగవలిసి వచ్చింది చౌదరికి? మూడో వాక్యంలోనే ఏడవలేదేం? కథను ఏ ఒక్కరూ ఎందుకు వీధిలోకి విసిరి పారెయ్యలేదు? లేకుంటే సంపాదకుడుగా ఎందుకు సవరించలేదు? మూడవ వాక్యం చులాగ్గా అలాగ్గా దాటేసి, (Is it a done deal for all of them? A matter of fact?) అఖరి వాక్యాలకు మాత్రమే అసంకల్పితంగా ఏడ్చే అసమగ్రపు చదువరులుగా తెలుగు సాహిత్యం వీరిని మార్చివేసిందా? తీర్చిదిద్దిందా?

    ఇంతోటి బోడి సన్నాసి, ముండమోపి చదువుకి కృష్ణుడు బడికి వెళ్ళక పోతేనేం? – అన్న సందేహాలు నాకు కలిగాయి గాబట్టి.

    లైలా

  9. గోమెజ్ ఎప్పుడొస్తాడో! గురించి మాలతి అభిప్రాయం:

    01/07/2012 3:31 pm

    తెల్లవాళ్లూ కాని వేరు వేరు దేశాలవాళ్ళ మధ్య తెల్లవాళ్ళదేశంలో సఖ్య బాగా చిత్రించేరు. బాగుంది కథ.

  10. కాల్వీనో కథల నుంచి – 1 గురించి TahaTaha అభిప్రాయం:

    01/07/2012 3:19 pm

    మహీధర నళినీ మోహన్ కలంలో మౌల్వీ నజీరుద్దీన్ కధలు చదివినప్పుడు, పింగళి నాగేద్ర రావు మాటలు గుర్తొచ్చినప్పుడు వచ్చే ఒక అద్భుతమూ, అనిర్వచననయమూ అయిన ఆనందం వచ్చింది. మౌల్వీ నజీరుద్దీన్ కధలకూ వీటికీ పోలికలు ఉన్నట్టనిపిస్తున్నది. ఇటాలో కాల్వీనో నాకు ఇంతకు ముందు తెలియదు ఇలా జ్ఞాన- తిక్కని చెప్పే కథలు నాకు చాలా ఇష్టం మాధవ్, వీటిని ఇంత హాయిగా పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు.

    అన్నట్టు మరిచిపోయాను,Ed McBain పోలీసు నవల చదివినప్పుడు వచ్చే ఆనందాన్ని కూడా వీటితో చేర్చాలి.