పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. వేణునాదం ఆగింది! గురించి TahaTaha అభిప్రాయం:

    02/12/2012 1:37 pm

    ‘తిరనా ళ్ళకు తరలొచ్చే కన్నెపిల్ల లా’ కనీసం నాలుగు సార్లు విని ఇది రాస్తున్నాను. వరస తిరనాళ్ళు అయిపోయింతర్వాత వెనక్కు చూసుకుంటూ తిరిగొచ్చే కన్నె పిల్లని తలపింప జెసింది. ముఖ్యంగా చరణాల మధ్య వచ్చిన జంత్రం. చాలా సహజంగా విషాదం పలికే గోపాల రత్నం గొంతులో ఈ వరస ఆహ్లాదాన్ని వినిపించ లేకపోయింది.

  2. మూడు వందల రామాయణాలు గురించి M R J SARMA అభిప్రాయం:

    02/12/2012 4:10 am

    జనకుని భార్య పేరు దయచేసి తెలియచేయండి.

  3. మౌనంతో ముఖాముఖి గురించి danny అభిప్రాయం:

    02/12/2012 1:31 am

    రామసీత గారు, అక్కడక్కడ అర్ధం కాకపోయినా అర్ధమైనంత వరకు అద్బుతంగ ఉందనిపించింది. ధన్యవాదాలు.

  4. వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/11/2012 10:37 pm

    హిందుస్తానీ సంగీతంలో కృషి చేస్తున్న తెలుగువారు బాగా తక్కువేకాని కొందరి పేర్లు తెలుసుకోదగినవి.
    రవిశంకర్ శిష్యుడు మిట్టా జనార్దన్ అనేక దశాబ్దాలుగా మద్రాసులోని వివిధభాషల సినీసంగీతంలో సితార్ వినిపించారు. వాటిలో మనసున మనసై, ఎవరివో నీవెవరివో, నీవురావు నిదురరాదు వగైరా పేరుపొందిన పాటలున్నాయి.
    శాస్త్రీయగాత్రం వినిపిస్తున్న సుమిత్రా గుహా తెలుగుమహిళే. ఇంకా పేర్లు తెలియవలసినవి ఉంటాయి.
    హిందుస్తానీ గాయకులుగా పేరుపొందినవారిలో ఎ. కానన్, ఎం.ఆర్. గౌతమ్, తమిళులు. వయొలిన్ వాయించే ఎన్.రాజమ్‌, సవ్యసాచిలాగా రెండుపద్ధతుల్లోనూ వయొలిన్ నైపుణ్యం కలిగిన ఎం.ఏస్. గోపాలకృష్ణన్ కూడా తమిళులే. ఇక కన్నడం సంగీతవేత్తలకు కొదవేలేదు.

  5. సారా మానను గురించి TahaTaha అభిప్రాయం:

    02/11/2012 8:07 pm

    శ్రీ మోహన – మీ గజలు జల్లు ఝల్లు!
    మిత్రుడు
    తఃతః

  6. భోగి తలంట్లు గురించి danny అభిప్రాయం:

    02/11/2012 1:38 pm

    చాలా చాలా బాగుంది. నేనైతే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాను.

  7. పొదుపు సమీకరణాలు గురించి danny అభిప్రాయం:

    02/11/2012 1:05 pm

    నేను ఈ కథతో మీకు పెద్ద అభిమానిని అయిపోయానండి.

  8. ఒక నేను, కొన్ని నువ్వులు గురించి danny అభిప్రాయం:

    02/11/2012 10:55 am

    టైటిల్ బాగుంది [ చాలా ] . కథ బాగుంది { కొంచెం }. రచయిత సుపర్ కానీ నా లాంటి వాళ్ళకి { half mind } అర్ధం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.

  9. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/10/2012 10:53 pm

    సంగీతరావుగారి గురించిన విశేషాలు ఆయన రెండవ కోడలు సుధారాణిగారి బ్లాగ్‌లో చూడవచ్చు. ఆమె సాహిత్యాభిమాని కూడా.

  10. అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/10/2012 7:07 am

    సుసర్లను గురించిన మంచి సమాచారం ఇక్కడ చూడవచ్చు. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకుని ముచ్చటించాలని నేననుకున్నానుగాని ఆయనకు మతిమరుపు ఎక్కువయిందనీ, ఆరోగ్యం బాగాలేదనీ తెలిసినవారు చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకోవలసివచ్చింది.