“… రామామాత్య, గోవింద దీక్షిత, వేంకటమఖి మొదలైన సంగీత లాక్షణీకులందరూ కర్ణాటక దేశానికి చెందిన వారు కావడం వల్ల, ఈ సంగీతం నేర్చుకోవడానికి పురందరదాసు తయారుచేసిన పాఠ్యప్రణాళిక (సిలబస్) ఎంతగానో ప్రసిద్ధి చెందడం వల్ల ఈ సంగీతానికి కర్ణాటక సంగీతమని పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు.”
చిన్న సవరింపు:
ఇందులో రామామాత్యులు తెలుగాయనే! వేంకటమఖి తెలుగాయనని నేను రాస్తే రమగారు కాదని కన్నడ వ్యక్తేనని అన్నారు. ఇది నాకు నేను నిర్ధారించుకోవాల్సి ఉంది. రామామాత్యులది బెజవాడ దగ్గర కొండవీడు. తండ్రి పేరు తిమ్మామాత్యులు. రాజాస్థానాల్లో సంగీత విద్వాంసులుగా ఉండడం వల్ల అమాత్యులు అన్నది చివర తగిలించారు. వీళ్ళ అసలు పేర్లు తిమ్మన్న, రామన్న.
ఇహ పురందరదాసు సంగీతమ్లో పాఠ్యప్రణాళిక (సిలబస్) చెయ్యలేదు. ప్రాచీనంగా ఉన్న సరళీ, జంట, అలంకారాల తరువాత ఏకంగా వర్ణాలూ, స్వరకల్పనల్లోకి దూకేయడం కష్టమని భావించి, చిన్న చిన్న గీతాలు కూర్చాడు. వీటినే మనం పిళ్ళారి గీతాలు అంటాం. కర్ణాటక సంగీతం అన్నది రామామాత్యుల ” స్వరమేళ కళానిధి” లో కానీ, వేంకటమఖి – “చతుర్దండి ప్రకాశికా”లో కానీ ఎక్కడా లేదు. 17వ శతాబ్దం తరువాతనే కర్ణాటక సంగీతం అన్నది వాడుకలోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. త్యాగరాజు కౄతుల్లో కానీ, దీక్షితారు కృతుల్లో కానీ కర్ణాటక సంగీతం అన్న ప్రస్తావన ఎక్కడా కానరాదు. ఇక్కడి చర్చ ధర్మమాని పాత సంగీత శాస్త్ర పుస్తకాలన్నీ తిరగేస్తున్నాను. అన్నమయ్య కీర్తనల్లో ఇంకా వెతకాలి.
సంపాదకులు ఆగ్రహించినట్టున్నారు. నేను ఉగాదిని ఒక తెలుగు తనానికి గుర్తు గా తీసుకుని , ‘ఈమాట’ -ఒక చక్కని తెలుగు పత్రిక – త్వరలో వస్తున్న మరో [తెలుగు] ఉగాదికి నోరారా స్వాగతం చెప్పినట్టయితే “అగామి కాలస్వామి గళాన వేయబోయే మాలలాగా ” ఉండి ఉండేది కదా అని అనుకుని ఆ అనుకున్నదానిని పైకి అనేశాను మీకు కోపం తెప్పిస్తే క్షమించండి. కానీ ఒక తెలుగు పత్రిక తెలుగు ఉగాదిని స్వాగతించ లేకపోవడాన్ని నేను మాత్రం క్షమించను.
4. 4వ శతాబ్దంలో కదంబ సామ్రాజ్యానికి చెందిన శాసనాలు అప్పటి రాజు శాంతివర్మను “సమగ్ర కర్ణాటదేశ బహువర్గ భర్తర” అని నుతిస్తాయి.
5. 7వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూటుల శాసనాలలో బదామి సైన్యాన్ని “కర్ణాటకబల” అని వర్ణించారు.
6. కర్ణాటక-సంగీతం అన్నది ఈ మధ్యకాలంలో కొత్తగా వాడుతున్న పదబంధమే (అర్వాచీనం). 12వ శతాబ్దం తరువాత (అంటే శార్ఙ్గదేవుని సంగీతరత్నాకరం తరువాత) ఉత్తర దక్షిణ సంగీతాలు వేరుపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే, ఆ తరువాత సంగీతశాస్త్రం పై గ్రంథాలు రాసిన విద్యారణ్య, సోమశేఖర, పుండరీక విఠ్ఠల, రామామాత్య, గోవింద దీక్షిత, వేంకటమఖి మొదలైన సంగీత లాక్షణీకులందరూ కర్ణాటక దేశానికి చెందిన వారు కావడం వల్ల, ఈ సంగీతం నేర్చుకోవడానికి పురందరదాసు తయారుచేసిన పాఠ్యప్రణాళిక (సిలబస్) ఎంతగానో ప్రసిద్ధి చెందడం వల్ల ఈ సంగీతానికి కర్ణాటక సంగీతమని పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కాదంటారా రమగారు?
I do not find any reason to doubt my father’s authorship of the Ramarao interview but for some words like వ్రాశాడు, చేరుకొన్నాడు as well as words with య such as యెంతో etc. It is possible that due to pressures of deadline someone else may have blue-pencilled his manuscript. The reference to sun-signs is in keeping with popular taste. My father never imposed his beliefs on his professional work.
మోహన రావుగారు: ఈ తరానికి అంతగా తెలియని కొక్కొండ గారి గురించి చక్కటి సమాచారాన్ని సేకరించి అందించారు. అందుకు కృతజ్ఞతలు. ఆయన సృష్టించిన కొత్త ఛందస్సులను ఆయనగాక ఆతరంలో ఇంకెవరైనా వాడారా? వెండి బంగారు పద్యములకు ధారాశుద్ధి శూన్యమని అభిప్రాయపడ్డ దొరసామి శర్మగారు ఎవరు? ఆయనగాక ఈ ఛందస్సులను ఇంకెవరైనా విశ్లేషించారా? “తెలుగు కవులకు చంద్రగణము రుచించదు,” “వాటిని సూర్యగణములతో చేర్చి వ్రాస్తే మధురత లోపిస్తుంది.” అన్నవి మీ అభిప్రాయాలా? లేక దొరసామి శర్మగారి అభిప్రాయాలా?
1952 లొనె కావచ్చు. కుటుంబ రావు గారు,రాయడం సంగతి సరె, ఈ 2 వ్యాసాలూ అచ్చు వేశారంటేనే అనుమానం. Unless a contemporary colleague endorses, the sketch on Rama Rao may not be taken as authentic. Some opinions as are referred to by Sri Jampala, run against the general grain of neutral analytical colloquial narration, characteristically unique to sri ko.ku. In some paragraphs, where you come across turns of expression involving word order incompatible to the natural syntactical flow of KO.KU you can distinctly see another hand at work.
I wish sri Rohini Prasad , or a senior journalist may throw some light, on the working style of the journal in 52, and the work division between the editor and his subs, even if its not possible to ascribe conclusively as to authenticating the author ship either in entirety or in the case of fragments.
మీరు రాసింది కూడా పత్రికకి పంపితేనూ ఈ మాట చెప్పి .. సరదాగా అనిపించింది.
ఫిడేల్ రాగాల డజన్ లో[ పంతొమ్మిదవ ముఫ్ఫై దశకంలోనే.. వసంతం అన్న కవితలో..] ఇలాంటి భావాల్ని [ ఉగాది ని గురించే] ఇదివరకే పఠాభి చెప్పి ఉన్నారు.
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
03/03/2012 4:23 pm
సురేశ్ గారూ,

-బ్రహ్మానందం
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి తః తః అభిప్రాయం:
03/03/2012 2:36 pm
సంపాదకులు ఆగ్రహించినట్టున్నారు. నేను ఉగాదిని ఒక తెలుగు తనానికి గుర్తు గా తీసుకుని , ‘ఈమాట’ -ఒక చక్కని తెలుగు పత్రిక – త్వరలో వస్తున్న మరో [తెలుగు] ఉగాదికి నోరారా స్వాగతం చెప్పినట్టయితే “అగామి కాలస్వామి గళాన వేయబోయే మాలలాగా ” ఉండి ఉండేది కదా అని అనుకుని ఆ అనుకున్నదానిని పైకి అనేశాను మీకు కోపం తెప్పిస్తే క్షమించండి. కానీ ఒక తెలుగు పత్రిక తెలుగు ఉగాదిని స్వాగతించ లేకపోవడాన్ని నేను మాత్రం క్షమించను.
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
03/03/2012 2:10 pm
చర్చలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. నా అభిప్రాయాన్ని సమర్థించడానికి మరికొన్ని ఆధారాలు:
1. 2-3వ శతాబ్దానికి చెందినదని చెప్పబడే చిలప్పాధికారం అనే కావ్యంలోని ఈ పద్యంలో కారునాడర్లను, వడగార్లను వేరువేరు గాను ప్రస్తావించడం చూడవచ్చు:
కొంగణర్, కలింగర్, కొడుం కరునాడర్,
పంగళర్, కంగర్, పల్ వేల్గట్టియర్,
వడ ఆరియరొడు, వందమిళ్ మయక్కత్తు, ఉన్
కడమలై వేట్టం ఎన్ కణ్- పులం పిరియాదు; 3.2.156
కొంకణులు, కళింగులు, గట్టి కరునాడులు, పంగళులు, కంగలు, కట్టియర్లు, వడవార్యులను నీ తమిళసైన్యంతో వెంటాడి వేటాడటం ఇంకా నా కనులకు కట్టినట్టుగా ఉంది.
2. 12వ శతాబ్దానికి చెందిన పెరియపురాణంలో కర్నాటకకు చెందిన కళభ్రాలను ఈ పద్యంలో వడగ కరునాడర్ అని వర్ణించారు:
కానక్ కడి సూళ్ వడుగక్ కరు నాడర్ కావల్
మానప్ పడై మన్నన్ వలిందు నిలం కొళ్వానాయ్
యానైక్ కుదిరైక్ కరువిప్ పడై వీరర్ తిండేర్
సేనైక్ కడలుఙ్ గొడు తెన్ తిసై నోక్కి వందాన్ 4.1.11
3. 9వ శతాబ్దానికి చెందిందని చెప్పబడే కవిరాజమార్గ అన్న కన్నడ కావ్యంలో కావేరి నుండి గోదావరి వరకు ఉన్న నాడు కరునాడు/కన్నడ అని వచించారు:
“కావేరియిందమా గోదావరివరం ఇర్ద నాడదా కన్నడదొళ్” (కవిరాజమార్గ 1.36)
4. 4వ శతాబ్దంలో కదంబ సామ్రాజ్యానికి చెందిన శాసనాలు అప్పటి రాజు శాంతివర్మను “సమగ్ర కర్ణాటదేశ బహువర్గ భర్తర” అని నుతిస్తాయి.
5. 7వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూటుల శాసనాలలో బదామి సైన్యాన్ని “కర్ణాటకబల” అని వర్ణించారు.
6. కర్ణాటక-సంగీతం అన్నది ఈ మధ్యకాలంలో కొత్తగా వాడుతున్న పదబంధమే (అర్వాచీనం). 12వ శతాబ్దం తరువాత (అంటే శార్ఙ్గదేవుని సంగీతరత్నాకరం తరువాత) ఉత్తర దక్షిణ సంగీతాలు వేరుపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే, ఆ తరువాత సంగీతశాస్త్రం పై గ్రంథాలు రాసిన విద్యారణ్య, సోమశేఖర, పుండరీక విఠ్ఠల, రామామాత్య, గోవింద దీక్షిత, వేంకటమఖి మొదలైన సంగీత లాక్షణీకులందరూ కర్ణాటక దేశానికి చెందిన వారు కావడం వల్ల, ఈ సంగీతం నేర్చుకోవడానికి పురందరదాసు తయారుచేసిన పాఠ్యప్రణాళిక (సిలబస్) ఎంతగానో ప్రసిద్ధి చెందడం వల్ల ఈ సంగీతానికి కర్ణాటక సంగీతమని పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కాదంటారా రమగారు?
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Rohiniprasad అభిప్రాయం:
03/03/2012 12:54 pm
I do not find any reason to doubt my father’s authorship of the Ramarao interview but for some words like వ్రాశాడు, చేరుకొన్నాడు as well as words with య such as యెంతో etc. It is possible that due to pressures of deadline someone else may have blue-pencilled his manuscript. The reference to sun-signs is in keeping with popular taste. My father never imposed his beliefs on his professional work.
ఛందస్సు కొక కొండ కొక్కొండ గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
03/03/2012 12:21 pm
మోహన రావుగారు: ఈ తరానికి అంతగా తెలియని కొక్కొండ గారి గురించి చక్కటి సమాచారాన్ని సేకరించి అందించారు. అందుకు కృతజ్ఞతలు. ఆయన సృష్టించిన కొత్త ఛందస్సులను ఆయనగాక ఆతరంలో ఇంకెవరైనా వాడారా? వెండి బంగారు పద్యములకు ధారాశుద్ధి శూన్యమని అభిప్రాయపడ్డ దొరసామి శర్మగారు ఎవరు? ఆయనగాక ఈ ఛందస్సులను ఇంకెవరైనా విశ్లేషించారా? “తెలుగు కవులకు చంద్రగణము రుచించదు,” “వాటిని సూర్యగణములతో చేర్చి వ్రాస్తే మధురత లోపిస్తుంది.” అన్నవి మీ అభిప్రాయాలా? లేక దొరసామి శర్మగారి అభిప్రాయాలా?
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/03/2012 8:57 am
1952 లొనె కావచ్చు. కుటుంబ రావు గారు,రాయడం సంగతి సరె, ఈ 2 వ్యాసాలూ అచ్చు వేశారంటేనే అనుమానం. Unless a contemporary colleague endorses, the sketch on Rama Rao may not be taken as authentic. Some opinions as are referred to by Sri Jampala, run against the general grain of neutral analytical colloquial narration, characteristically unique to sri ko.ku. In some paragraphs, where you come across turns of expression involving word order incompatible to the natural syntactical flow of KO.KU you can distinctly see another hand at work.
I wish sri Rohini Prasad , or a senior journalist may throw some light, on the working style of the journal in 52, and the work division between the editor and his subs, even if its not possible to ascribe conclusively as to authenticating the author ship either in entirety or in the case of fragments.
చేపలార్బరు దినాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
03/03/2012 1:13 am
కనకప్రసాద్ తో ఎప్పటి పేచీవే నాకు! ఆయన తెలుగే రాసినట్టుంటుంది. కానీ అది తెలుగులా అర్ధం కాదు.
రమ.
చిరునవ్వుగాది గురించి rama bharadwaj అభిప్రాయం:
03/03/2012 1:05 am
“పర్వపర్వమునకు పద్యాలు పచరించి
పత్రికలకు పంపువాని విడచి ”
మీరు రాసింది కూడా పత్రికకి పంపితేనూ ఈ మాట చెప్పి .. సరదాగా అనిపించింది.
ఫిడేల్ రాగాల డజన్ లో[ పంతొమ్మిదవ ముఫ్ఫై దశకంలోనే.. వసంతం అన్న కవితలో..] ఇలాంటి భావాల్ని [ ఉగాది ని గురించే] ఇదివరకే పఠాభి చెప్పి ఉన్నారు.
రమ.
కొవ్వుపుంజి గురించి rama bharadwaj అభిప్రాయం:
03/03/2012 12:52 am
శారద గారూ !! మపాసా అన్ని కధల్లాగే ఇదీ బాగుంది. విషాదంగా మనసుని ఆవరించింది. .. మనుష్యుల స్వభావాల లోని నీచత్వాల లోతులు చూపించింది. మీ తెలుగు అనువాదం బాగుంది.
రమ.
కాల్వీనో కథల నుంచి – 2 గురించి మోహన అభిప్రాయం:
03/02/2012 8:14 pm
అన్ని కథలు బాగున్నయి, మొదటిది చాల బావుంది 🙂
విధేయుడు – మోహన