పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి sreenivas అభిప్రాయం:

    03/04/2012 10:11 pm

    Thanks a ton for writing such a good article on VADDERA CHANDIDAS. ANUKSHANIKAM IS MY OBSESSION. I read it a hundred times. Just ignore the critics.

    Best Regarfds
    Sreenivas

  2. కొక్కొండ: అనుబంధం-1 గురించి తాడేపల్లి అభిప్రాయం:

    03/04/2012 2:43 pm

    నాకు చాలా నచ్చిన వ్యాసమిది. బెజ్జాలవారికి నెనరులు.

    ఛందస్సులంటే నాకు చిన్నప్పట్నుంచీ చాలా ఆసక్తి. ఎక్కువగా సుప్రసిద్ధమైన ఆ నాలుగువృత్తాలే వ్రాస్తూంటాను. కానీ ఎప్పుడూ అవేనా ? అనే విసుగు కూడా ఓ మూలన లేకపోలేదు. అయినా వాటితోనే సరిపుచ్చుకోవడం. కారణం – వాటిని మించిన సర్వసందర్భోపయోగివృత్తాలు చాలా తక్కువ. మహా అయితే వెరైటీగా ఒక తరళమో, మత్తకోకిలో, ఉత్సాహమో ప్రయత్నించవచ్చు. అంతకంటే లేవు. కథాకథనానికీ, సంభాషణలకీ ఉత్పల, చంపకాలతో, మత్తేభ, శార్దూలాలతో సమానమైన గతి గల వృత్తాలు కావాలి. అలాంటివి (ప్రత్యామ్నాయాలు) ఇంతవఱకూ నాకెక్కడా దొఱకలేదు. ఈ వ్యాసంలో కూడా అలాంటివి మఱీ ఎక్కువ లేవు.

    అయితే ఈ వృత్తాలతో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. ఒకటి – నాలుగుపాదాలూ వ్రాసితీఱాలనడం. చెప్పడానికి మన దగ్గఱ మేటర్ అంత లేకపోతే ఏం చేయాలి ? పూర్వీకులు ఇలాంటి సందర్భాల్లో చంపూశైలిలోకి దిగేవారు. నా అభిప్రాయంలో రెండుపాదాలే చాలునన్నప్పుడు యావత్తు కథనాన్నీ పద్యాల్లోనే నడపొచ్చు. చంపూశైలి అవసరం లేదు. అందుచేత రెండుపాదాల వృత్తాలక్కూడా ఛందశ్శాస్త్రంలో వెసులుబాటుండాలి. రెండోది -యతిప్రాసలలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుందనే వెసులుబాటు కూడా రావాలి. రెండూ కావాలనే రసికులు తమ స్వసంకల్పానుసారంగా ఆ జమిలినియమాన్ని పాటిస్తారు. ఇతరుల మీద నిర్బంధం వద్దు. అందుమూలాన ఛందోబద్ధకవిత్వాన్ని యువతలో ప్రచారం చేయడం కష్టమవుతోంది.

    మూడోది – ఈ వ్యాసంలో పేకొన్న వృత్తాల్లో అధికభాగం లఘువులకే స్థానమిస్తున్నాయి. అది అచ్చతెలుక్కి నప్పుతుందేమో గానీ ఆంధ్ర-గీర్వాణ మిశ్రశైలికి తఱచుగా పనికిరాదు. గురులఘువులు రెండూ సమానసంఖ్యలో గల వృత్తాలు ఉత్పల, చంపకాదుల్లా కథాకథనానికీ, సంభాషణలకీ పనికొస్తాయనేది నా అనుభవం.

  3. మూడు వందల రామాయణాలు గురించి Phaneendra అభిప్రాయం:

    03/04/2012 11:54 am

    శ్రీనివాస్ గారూ

    నా మాట పొరపాటే. కానీ నా సర్కాజం మీకు అర్ధం కాలేదని అనుకోను. ఇస్లాం లోని కజిన్‌ల పెళ్ళిళ్ళను పోలినట్టు సీతారాముల పెళ్ళి జరిగిందన్న దశరథ జాతక కథ… వాల్మీకం కంటె ముందుదని సురేష్ గారు చెబుతుంటే… ఏమనాలో అర్ధం కాక జోకేశా. అది ఇస్లామిక్ సంప్రదాయాలపై హాస్యం కాదని గ్రహించగలరు.

  4. చేపలార్బరు దినాలు గురించి తః తః అభిప్రాయం:

    03/04/2012 8:06 am

    పడమటి గాలి పాటలని మీరు విశాఖ జాలరిపేట గొంతులో వినిపిస్తున్నా ఏదొ గొంతులోకి దూరటానికి రాని దూరపుతనమేదో మిగిలే ఉందా అని అనిపించే బాధ (వినేవాళ్ళకి) తప్పటం లేదు.

  5. పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/04/2012 2:41 am

    సురేశ్! నాకు బహుభాషలతో పరిచయం లేదు. కనీశం దక్షిణాది భాషలన్నీ నాకు సుస్టుగా తెలియవు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కరునాడు అన్నది ఔను, ప్రాంతం/ రాజ్యం పేరే కావాలి. తప్పదు. మీ ఈ ఆధారాల తరవాత నాకు కూడా మీ మాట సరైనదనే అనిపిస్తోంది. గిరీష్ కర్నాడ్ అని పేరు లోని కర్నాడ్ కూడా బహుశా ఇలాంటిదే కావొచ్చును. నాకు సమ్మతమే! ఒప్పుకుంటున్నాను.

    ఇకపోతే.. రెండు. మన సంగీత గ్రంధాలలోని యావద్వివరాలు మనకి ఇవాళ ఏకోశానా అందుబాటులో లేవు. అసలు ఆ పుస్తకాల లభ్యత ప్రశ్నార్ధకం. సంగీత రత్నాకరం, స్వరమేళ కళానిధి, చతుర్దండి ప్రకాశిక వంటివి ఇంగ్లీషు అనువాదాలుగా ఉన్నట్టున్నాయి. రాళ్లపల్లి వారన్నట్టూ మన దేశంలో సంగీత విద్య ఎంత గొప్పగా ఎదిగిందో అంతగానూ నస్టాన్ని కూడా పొందింది. ఒకటి మనకి చారిత్రక దృస్టి లేకపోవడం. రెండు వేద విద్యలాగా దాన్ని మౌఖికంగా మాత్రమే తరతరాలూ పదిల పరుచు కోవడం. అన్నిటికన్నా ఇంకా దురదృష్టమైన విషయం సంగీత రంగంలోని వారికి ఆ రంగం పూర్వాపరాల మీద. దానిని గురించి తెలుసుకోవాలన్న కోరికా శ్రధ్ధా లేకపోవడం వీటి మూలంగా మనకి భాషా చరిత్ర సాహిత్య చరిత్ర తెలిసినట్టూ దక్షిణాది సంగీత చరిత్ర అంత వివరంగా తెలియక పోవడం, ఇవన్నీ కారణాలే! అయితే ఈ “కర్ణాటక సంగీతం” అన్న మాటని అసలు ఏ కాలం నించీ వాడుతున్నారని గానీ దీనిని ప్రచారం లోకి తెచ్చిన వారెవరని గానీ, మనకి ఏమీ తెలియదు. అందు కోసం మనకి సంగీత గ్రంధాల పరిజ్ఞానం తప్పక అవసరమౌతుంది. ఇది మీరన్నట్టూ, తప్పనిసరిగా అర్వాచీనమే కావాలి. అసలు త్యాగరాజు ఈ మాట అన్నాడా? తాను పాడుతున్నది “కర్ణాటక” సంగీతమనీ? అనకపోతే అది మరీ ఇటీవలి వాడుకేనని మనం భావిస్తే అందులో తప్పేంలేదు.

    సమస్య అప్పుడే మొదలౌతోంది. ప్రాంతాల పేర్లు సరే! కానీ ఆ పేరుతో ఉన్న దేశాల ఎల్లలు అన్ని కాలాల లోనూ ఒకే తీరున లేవు. నాల్గవ శతాబ్దికి చెందిన శాంతి వర్మ అయినా పద్నాల్గవ శతాబ్ధికి చెందిన విజయనగర రాజులైనా “కన్నడ రాజ్య రమా రమణులూ” కన్నడ భూభర్తలే! కానీ వారు పాలించిన ప్రాంతాలు ఇవాళ్టి కన్నడ ప్రాంతాలే కావు. అందులో ఇవాళ్టి ఎన్నో ప్రాంతాలు అన్ని రాష్ట్రాల లోనివీ ఉన్నవి గనక మనం ఒక ఇరుకు దృక్పధంతో కర్నాటక సంగీతానికి ప్రాంతీయతని అంటగట్టలేము. అలా అంటగట్టి ఎవరు వ్యాఖ్యానం చేసినా అది కొందరికి బాగుంటుందేమో గానీ మిగిలిన వారికి ఇబ్బందిగానే ఉండొచ్చు. ఇక్కడ ప్రాంతీయాభిమానం ఒక్కటే కాదు విషయం. సంగీత వికాసానికి శాస్త్ర రీత్యా తెలుగు వారి కృషి పెద్దది. దాన్ని మనం తీసేయాలీ అంటే బృహద్దేశిని, సంగీత రత్నాకరాన్నీ, సంగీత చింతామణినీ, స్వరమేళ కళానిధినీ రాగ విబోధనీ కూడా తీసేసుకోవాలి. అందుకు సంగీత చరిత్ర అనుమతించదు. అందుకే మన పూర్వులు అందరి కృషినీ గౌరవిస్తూ కర్ణాటక అన్న పేరుని ఈ సంగీతానికి ప్రత్యేకంగా వాడి ఉండలేదు. అది కేవలం మరి ఇటీవలిది మాత్రమే కావాలి.

    ఇంక పురంధరదాసులవారు పాఠ్య ప్రణాళికని ఇచ్చారు అని మీరు చెబుతున్న మాట సైతం ఆయన తర్వాత పుట్టినదే గానీ అంతకు ముందుదైతే కాదు కదా! కన్నడిగులు పురంధర దాసులవారి దాసరనామాలని కాపాడుకున్నారు. అవి పాడే రీతులని సైతం జనం రక్షించుకున్నారు. ఆ విషయములో తెలుగున అన్నమయ్య పదాలు వెలికి రావడంలో గానీ వాటిని గురించిన పరిశీలనా, పరిశోధనా మొదలౌడంలో గానీ ఆలశ్యం అనేక కారణాల వలన జరిగింది. ఆయా కారణాలని అటుంచినా, ఇవాళ మన ముందున్న వాస్తవాల ఆధారంగా పురంధర దాసుల వారే ఒక రోజు కూచుని పాఠ్య ప్రణాళికని తయారు చేసేరంటే కాబోలని ఇదివరకులో లాగా నమ్మలేం! అన్నమయ్య గారివి వేలాది సంకీర్తనలు అనేక రాగాలలో విస్తరించి మనకి తాళపత్రాల మీద దొరికాయి. అవి కాలం రీత్యా పురందరుల వారి పదాల కన్నా ముందువి. కదా? ఆ రాగ స్వరూపం ఆనాడున్నదీ ఈనాడున్నదీ అది ఏదైనా, పురంధరుల కన్నా ముందే ఒక విస్పస్టమైన గాన సంప్రదాయం ఉన్నదీ అని అవి అయితే తెలియజేస్తున్నాయి కదా? దాన్ని ఎలా కాదంటాం? పురంధరుల పేరుమీదుగా ఆయన కన్నడిగుడు గనక దక్షిణాది శాస్త్రీయ సంగీతానికి గానూ “కర్నాటక సంగీతంగా” పేరు తెచ్చేరు అని మాత్రం అనుకోగలం. ఆ మార్పుని మనకి మహా అయితే ఒక వంద ఏళ్ల ముందటి ఎవరో కొందరు సంగీతజ్ఞులు ఈ మాటని వాడి ప్రచారం చేసేరని అనుకోగలం! కానీ దక్షిణాది శాస్త్రీయ సంగీతం పురందర దాసుల వారికన్నా పరిణితిని చెందిన దశలోనే అప్పటికే మొదలై ఉంది. దానిని కాదనడం అంతకు తొల్లి సంగీత శాస్త్రవేత్తలందరినీ కాదనడమే! అందుకనే దానికి ప్రాంతీయతా స్పూర్తినిచ్చే అర్ధాన్ని నేను కాదన్నది. అది ఇటీవలిది గనకే! దక్షిణాది శాస్త్రీయ సంగీతాన్ని “కర్ణాటక సంగీతం” అన్న పేర సంగీత వేత్తలు గానీ సంగీత సిధ్ధాంత కర్తలు గానీ ప్రతిపాదించేరని మనకి ప్రామాణికంగా లేదా తమ గ్రంధాలలో ఈ అర్ధంలో ఈ మాటని తాము రూపొందించిన సంగీత పరంగా ప్రయోగించేరని తెలిస్తే తప్ప మనం ఈ నవీన వ్యాఖ్యానాల జోలికి పోయి చేసేదేమీ లేదు. మన పూర్వులని గురించి మనకి సవివరంగా తెలియక ముందు మాట వేరు. తెలిసిన తరవాత అయినా గౌరవంతో నమస్కరించి ఈ ప్రాంతియతా స్పూర్తికి భిన్నంగా ఆలోచించడం మేలు. మీరన్న కరునాడు ప్రాంతీయమేనని ఒప్పుకుంటున్నాను. అదే సంగీత పరంగా మాత్రం నాకు “కర్నాట” అన్న పదం సమ్మతి లేదని అంతే స్పస్టంగా తెలియజేసుకుంటున్నాను.

    భవదీయ,
    రమ.

    [రమ గారూ – దయచేసి కామాలు వాడవలసిన చోట రెండు చుక్కలు వాడవద్దనీ, మీ అభిప్రాయం పంపేముందు ఒకసారి అచ్చుతప్పులను సరిదిద్దుకొమ్మనీ మా మనవి – సం.]

  6. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి sastry అభిప్రాయం:

    03/04/2012 12:37 am

    very interesting story.

    I find so many kanna babus in real life

  7. త్రిపురాంతకేశ్వరా! గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    03/04/2012 12:02 am

    ధూర్జటిని గుర్తుకు తెచ్చారు కనకప్రసాద్ గారు!

  8. శివోహం! శివోహం! గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    03/03/2012 11:59 pm

    అద్భుతం!

  9. ఛందస్సు కొక కొండ కొక్కొండ గురించి మోహన అభిప్రాయం:

    03/03/2012 11:32 pm

    1) కొక్కొండ వేంకటరత్నంపంతులుగారు సృష్టించిన రెండు పద్యములను ఇతరుల గ్రంథములలోని ఉదాహరణలుగా కవితాసాగరములో ఇవ్వబడినవి –

    కల్యాణ –
    పాపశిక్షకా నత భక్తరక్షకా పరాత్పరా వరాక్షరాకా పావశిక్షకా
    ఆపదుద్వహా జగదాదిధూర్వహాహతారిగేహకోమలదేహా మహామహా
    శ్రీపతీ సతీపతిసేవితోన్నతీ శ్రితార్తిభంజనేష్టమతీ శిష్టహృద్గతీ
    దీపికోపమాధికతేజ ఉద్గమాస్థిరోద్యమాऽగమానుగమా తే నమోనమః
    – శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి, శ్రీపాదభాగవతము

    రత్నావళి –
    అళుల లతాంత మధుర మధుపానము హాయిగఁ జేసి మదించె; లతా-
    వళి నగవరయుతమై తనరారెను స్వాధీనపతికపగిది నహా
    యిలాజాతములు కిసలయములతో నింపుగఁ గనుఁగొన నయ్యెను; గో-
    కిలములు శ్రుతిహితముగఁ బాడఁ దొడంగెను జూతకిసలములఁ దినుచున్
    – శ్రీవిక్రమదేవవర్మ, మానవతీ చరిత్రము

    2) తెలుగు లాక్షణికులకు, కవులకు నచ్చనివి రెండు – చంద్రగణములతో పద్యములను వ్రాయుట, లఘువు పైన యతి నుంచుట. నేను ఎన్నో పుస్తకాలను వెదుకగా నాకు దొరకినవి వ్రేళ్లపైన లెక్క పెట్టగలిగిన అక్కరలు మాత్రమే. అందులో ఒక రెండు క్రింద ఇస్తున్నాను. మధ్యాక్కర తప్ప మిగిలిన అక్కరల ఉపయోగము శాసనయుగముతో అంతరించింది. నవీన యుగములో విశ్వనాథ సత్యనారాయణ అక్కరలను తమ కల్పవృక్షములో వాడారు. చంద్రగణములతోడి తెలుగు షట్పదలను కూడ కవులు వాడలేదు.

    మధురాక్కర – సూ-ఇం-ఇం-ఇం-చం, యతి (1.1, 4.1)

    తనర జనకుండు, నన్నప్రదాతయును, భయత్రాత
    యును, ననగ నింతులకు మువ్వు రొగిన గురువులు, వీర
    లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
    ననఁగ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
    – నన్నయ, ఆదిపర్వము, 4.49

    కలదు దేవగుహ్యం బని కమలబాంధవుఁడు గర్ణుఁ
    బలికె నని చెప్పి తది యెద్ది, బలియుఁ దా సూరజుండు
    లలితకవచంబు మణికుండలములు నెమ్మెయిఁ బడసి
    వెలసె, నవ్విధ మింపుగ వివరింపవలయు నాకు
    – ఎఱ్ఱన, అరణ్యపర్వము, 7.309

    అల్పాక్కర – ఇం-ఇం-చం యతి (1.1, 3.1)

    మీరిందు శంబరు మెచ్చిచూడ
    నారూఢి నేనొక్క హయము నెక్క
    చూరించి పోవన దుర్గభూమి
    భారంబుగా జొచ్చె నాజి వేగ
    – మడికి సింగన, వాసిష్ఠ రామాయణము

    3) రావూరి దొరసామి శర్మ ఒక గొప్ప లాక్షణికుడు. వీరు ఎన్నో లక్షణగ్రంథాలను (ఉదా. సులక్షణసారము, కవితసాగరము) పరిష్కరించారు. ఛందస్సుపై వీరు వ్రాసిన “తెలుగు భాషలో ఛందోరీతులు” అన్న పుస్తకానికి గిడుగు సీతాపతి పుస్తకముతోబాటు ప్రథమ బహుమతి లభించినది. వీరి పలుకులను క్రింద వీరి వాక్యాలలోనే తెలుపుతున్నాను –
    “సీసమేల సువర్ణసిద్ధి గలుగ నన్నారు కొక్కొండవారు. పరుసవేది సోఁకినఁ జౌకలోహము బంగారమగును. సీసమును బంగారముగా మార్చు స్పర్శవేధి చంద్రగణము. కాని సీసపు నడకలోని గాంభీర్యము బంగారు పద్యమునఁ గుంటువడినది. పద్యము పేరు బంగారే కని యందు సువర్ణత్వము ప్రకాశింపలేదని నా యభిప్రాయము. ఈ వెండి బంగారములకు (పద్యములకు) ధారాశుద్ధి శూన్యము.”

    4) సూర్యగణము, చంద్రగణము విడివిడిగా నుండక ఒక పదము ద్వార చేరితే ఇలాగుంటుంది –

    సుమపదైక భేద మమరు నంతనె వస్తువు మఱివేఱె
    – బిల్వేశ్వరీయము – 6 తృతీయభాగము, కల్యాణరసజ్ఞ పర్వము, 83

    ఇది ఒక తేఁటిబోటి (ఆటవెలది బేసి పాదముతో చంద్రగణము) పాదము. దీనికి గణవిభజన ఇలాగుంటుంది –

    సుమప (సూ) దైక (సూ) భేద (సూ)
    మమరు నం (ఇం) తనె వస్తు (ఇం) వు మఱివేఱె (చం)

    వస్తువులోని మొదటి రెండక్షరాలు సూర్యగణములో తరువాతి వు చంద్రగణాదిలో ఉన్నవి యిక్కడ.
    నా ఉద్దేశములో దేశి ఛందస్సులో ఇలా గణాలను ఇలా వాడితే సొగసు చెడుతుంది.

    విధేయుడు – మోహన

  10. చిరునవ్వుగాది గురించి తః తః అభిప్రాయం:

    03/03/2012 9:18 pm

    ‘జ్యొతి’ లొ పఠాభి పంచాంగమూ, ఆయన పుస్తకం ఫిడేల్ రాగాల డజన్ చాలాసార్లు ఇష్టంగా చదివిన గుర్తొస్తొంది. Blurbలొ ఆయనకి గణిత శాస్త్రం హాబీ అన్నటువంటి విషయాన్ని చూసి ఆనందించినట్టున్నూ గుర్తుకొస్తోంది. పఠాభి ముద్రలే ఈ ఆటవెలదుల యాయా !

    రమ గారూ మీకు ధన్యవాదాలు.