సంపాదకుల సమాధానం లో , రంజాను, క్రిస్మస్, హానుక్కా లకు కొత్త సంవత్సరానికి సంబంధం కనుక్కోలేక పోతున్నాను. ఆ సమాధానం కన్నా ఒక్క ముక్క శుభాకాంక్షలు చెప్పి ఉంటే బావుండేది.
చాలా చక్కటి insight. ఒక రచనను instinctive గా పాఠకుడు తనవరకు judge చేయడం తప్పు కాదని చెప్పడం బావుంది.
ఎటొచ్చీ తన judgement ను పదుగురికి చెప్పాలంటే అందుకు తనలోనికి తొంగిచూసుకోగల నిజాయితీ, నేర్పు, లోకాభిప్రాయానికి వెఱవని స్థైర్యం కావాలి. ఈ విధంగా చూస్తే సద్విమర్శ కూడా సృజనకు సరిసమానమైన ప్రక్రియ అని చెప్పక తప్పదు.
రాళ్ళపల్లి వారు రఘువంశ కావ్యం పదిహేడు సర్గలు వ్రాసిన తర్వాత ఆయన కావ్యాన్ని ఆయనే విమర్శించుకుని మొత్తం కావ్యాన్ని చించివేశారట. ఈ వ్యాసం చదువుతుంటే ఆయన గుర్తొచ్చారు.
సీత గడియ లో ‘గడియ’ కి కాలానికి సంబంధించిన అర్థం కూడా నప్పుతుందా !
‘ఆది కవి’ నన్నయ మీద రాజమండ్రి లొ చాల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సాయం సదస్సులొ – అందులొ ఆచార్య కొత్తపల్లి వీరభద్ర రావు కూడా ప్రసంగించారు -ఒక విదూషి మాట్లాడుతూ తన మాటల చివరలో ‘మనం రవిక కుట్టించుకునేటప్పుడు రవిక గుడ్డతొ పాటు ఒక ఆది రవిక ఇస్తాం చూడండి అలా నన్నయ ఆది కవి’ అని అనడం గుర్తొస్తోంది.
ప్రస్తుతం మా నాన్న రచనలన్నీ విరసంవారి సంపుటాల రూపంలో వస్తున్న సంగతి తెలిసినదే. అందులో అనువాదాలుండవు. అందుచేత ఆయన చేసిన అనువాదాలను పొద్దు డాట్ నెట్ లోనూ (మృతజీవులు నవల) ప్రజాసాహితి మాసపత్రికలోనూ (హిరొషిమా నవల) ధారావాహికంగా ప్రచురించే ఏర్పాట్లు చేశాను.
ఆయన Conan Doyle’s A Study in Scarlet అనువాదాన్ని నేరపరిశోధన అనే పేరుతో ప్రాణహిత డాట్ ఆర్గ్ లో వేశారుగాని తరవాత ఆ పత్రికే ఆగిపోయింది! యువలో చక్రపాణిగారు సరళానువాదం చేయించిన మాయావి వగైరా బెంగాలీ నవలలు కూడా నా దగ్గరున్నాయి.
చందమామలన్నిటిలోనూ ఉన్నవి ఆయన రచనలే కనక అవన్నీకూడా ఆయన సాహిత్యసంపుటాలలో చోటుచేసుకోవాలని కొందరు వాదిస్తారుగాని అది నాకే మరీ ‘అతి’గా అనిపించింది. కినిమా వ్యాసాలు కొన్నయినా ఆయన రచనలుగా పరిచయం చేస్తే బావుంటుందనే ఉద్దేశంతో ఈమాటకు పంపుతున్నాను.
పొద్దు లోనూ, ప్రాణహితలోనూ మా నాన్న వ్యక్తిగత విశేషాలు కొన్ని వ్యాసాలుగా రాశాను. ప్రజాకళ డాట్ ఆర్గ్ లో కూడా ఒకటి పడింది. రచయితకు ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ వ్యక్తిగత వివరాలు పుస్తకంలో అచ్చువేసేంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. శ్రీశ్రీ, చలంవంటివారు తమ ఆత్మకథలు రాశారు. వాటి సంగతే వేరు. మా నాన్నను ఒక సందర్భంలో ఆత్మకథ సంగతి అడిగితే తనకు చాలామంది ప్రముఖులతో చిన్నతనంనుంచీ పరిచయం ఉండేదనీ, ఆత్మకథ రాస్తే అది name-dropping లాగా ఉంటుందనీ ఆయన అన్నారు.
‘అరవయ్యేళ్ళ క్రితం ఎన్.టి.రామారావు ‘ – గురించి చదివి, చాలా ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకునే అవకాశాన్ని కలిగించారు. ధన్యవాదాలు. ఈ వ్యాస రచనలో – రచయిత కొ.కు. సంతకాన్ని మనం చూడొచ్చు. ఉదాహరణకి షోకు రామయ్య పాత్ర మనకి కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది. అలాగే విశ్వనాధ వారు అక్షింతలు జల్లడం కూడా. అలాగే అప్పట్లో రామారావ్ గారి కారెక్టరైజేషన్ కూడా ఒక దృశ్యంలా కనిపిస్తుంది. నాకెప్పుడూ ఏమనిపిస్తుందంటే – జర్నలిస్ట్ ఒక సమాచారాన్ని అందచేసేటప్పుడు అందులో జీవత్వాన్ని కూడా నింప గలిగితే పాఠకుల హృదయాలలో అది సజీవమై నిలుస్తుంది కదా అని! ఈ వ్యాసం చదివాక ఆ లోటు తీరినట్టు అయింది.
మరో విషయం – ‘పేరులేని ఎడిటర్‌గా కొడవటిగంటి కుటుంబరావుగారు చందమామతోబాటు కినిమా మాసపత్రికకు కూడా చాలా ‘చాకిరీ’ చేశారు’, అనే వాక్యం నన్ను కాసేపు మౌనంగా ఆలోచింప చేసింది.
అనేక రకాల దోపిడీలలో ఇదీ ఒకటి అని అనుకోవాల్సి రావడం నిజంగా విషాదకరమే!
రోహిణీప్రసాద్ గారూ! మీ నాన్న గారి జ్ఞాపకాలతో మీరేదైనా పుస్తకం రాసారా? అలా ఐతే, అది మార్కెట్లో దొరికే అవకాశం వుంటుందా? వీలుంటే తెలియ చేయగలరు.
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి రవి అభిప్రాయం:
03/13/2012 4:10 am
సంపాదకుల సమాధానం లో , రంజాను, క్రిస్మస్, హానుక్కా లకు కొత్త సంవత్సరానికి సంబంధం కనుక్కోలేక పోతున్నాను. ఆ సమాధానం కన్నా ఒక్క ముక్క శుభాకాంక్షలు చెప్పి ఉంటే బావుండేది.
మూడు లాంతర్లు – 10 గురించి రవి అభిప్రాయం:
03/13/2012 3:59 am
చాలా చక్కటి insight. ఒక రచనను instinctive గా పాఠకుడు తనవరకు judge చేయడం తప్పు కాదని చెప్పడం బావుంది.
ఎటొచ్చీ తన judgement ను పదుగురికి చెప్పాలంటే అందుకు తనలోనికి తొంగిచూసుకోగల నిజాయితీ, నేర్పు, లోకాభిప్రాయానికి వెఱవని స్థైర్యం కావాలి. ఈ విధంగా చూస్తే సద్విమర్శ కూడా సృజనకు సరిసమానమైన ప్రక్రియ అని చెప్పక తప్పదు.
రాళ్ళపల్లి వారు రఘువంశ కావ్యం పదిహేడు సర్గలు వ్రాసిన తర్వాత ఆయన కావ్యాన్ని ఆయనే విమర్శించుకుని మొత్తం కావ్యాన్ని చించివేశారట. ఈ వ్యాసం చదువుతుంటే ఆయన గుర్తొచ్చారు.
సీత గడియ గురించి తః తః అభిప్రాయం:
03/12/2012 4:23 pm
సీత గడియ లో ‘గడియ’ కి కాలానికి సంబంధించిన అర్థం కూడా నప్పుతుందా !
‘ఆది కవి’ నన్నయ మీద రాజమండ్రి లొ చాల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సాయం సదస్సులొ – అందులొ ఆచార్య కొత్తపల్లి వీరభద్ర రావు కూడా ప్రసంగించారు -ఒక విదూషి మాట్లాడుతూ తన మాటల చివరలో ‘మనం రవిక కుట్టించుకునేటప్పుడు రవిక గుడ్డతొ పాటు ఒక ఆది రవిక ఇస్తాం చూడండి అలా నన్నయ ఆది కవి’ అని అనడం గుర్తొస్తోంది.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Rohiniprasad అభిప్రాయం:
03/12/2012 2:01 pm
దమయంతిగారూ,
మీ స్పందనకు ధన్యవాదాలు.
ప్రస్తుతం మా నాన్న రచనలన్నీ విరసంవారి సంపుటాల రూపంలో వస్తున్న సంగతి తెలిసినదే. అందులో అనువాదాలుండవు. అందుచేత ఆయన చేసిన అనువాదాలను పొద్దు డాట్ నెట్ లోనూ (మృతజీవులు నవల) ప్రజాసాహితి మాసపత్రికలోనూ (హిరొషిమా నవల) ధారావాహికంగా ప్రచురించే ఏర్పాట్లు చేశాను.
ఆయన Conan Doyle’s A Study in Scarlet అనువాదాన్ని నేరపరిశోధన అనే పేరుతో ప్రాణహిత డాట్ ఆర్గ్ లో వేశారుగాని తరవాత ఆ పత్రికే ఆగిపోయింది! యువలో చక్రపాణిగారు సరళానువాదం చేయించిన మాయావి వగైరా బెంగాలీ నవలలు కూడా నా దగ్గరున్నాయి.
చందమామలన్నిటిలోనూ ఉన్నవి ఆయన రచనలే కనక అవన్నీకూడా ఆయన సాహిత్యసంపుటాలలో చోటుచేసుకోవాలని కొందరు వాదిస్తారుగాని అది నాకే మరీ ‘అతి’గా అనిపించింది. కినిమా వ్యాసాలు కొన్నయినా ఆయన రచనలుగా పరిచయం చేస్తే బావుంటుందనే ఉద్దేశంతో ఈమాటకు పంపుతున్నాను.
పొద్దు లోనూ, ప్రాణహితలోనూ మా నాన్న వ్యక్తిగత విశేషాలు కొన్ని వ్యాసాలుగా రాశాను. ప్రజాకళ డాట్ ఆర్గ్ లో కూడా ఒకటి పడింది. రచయితకు ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ వ్యక్తిగత వివరాలు పుస్తకంలో అచ్చువేసేంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. శ్రీశ్రీ, చలంవంటివారు తమ ఆత్మకథలు రాశారు. వాటి సంగతే వేరు. మా నాన్నను ఒక సందర్భంలో ఆత్మకథ సంగతి అడిగితే తనకు చాలామంది ప్రముఖులతో చిన్నతనంనుంచీ పరిచయం ఉండేదనీ, ఆత్మకథ రాస్తే అది name-dropping లాగా ఉంటుందనీ ఆయన అన్నారు.
శివోహం! శివోహం! గురించి Padmasree అభిప్రాయం:
03/12/2012 11:03 am
Can I download this song? If so could you please tell me how to download this song?
Thank you,
Padmasree.
బిచ్చగత్తె శిశువు గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:
03/11/2012 10:23 pm
రవి గారి కవిత మనోజ్ఞము.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
03/10/2012 11:50 pm
శ్రీ రోహిణీప్రసాద్ గారికి, నమస్తే!
‘అరవయ్యేళ్ళ క్రితం ఎన్.టి.రామారావు ‘ – గురించి చదివి, చాలా ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకునే అవకాశాన్ని కలిగించారు. ధన్యవాదాలు. ఈ వ్యాస రచనలో – రచయిత కొ.కు. సంతకాన్ని మనం చూడొచ్చు. ఉదాహరణకి షోకు రామయ్య పాత్ర మనకి కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది. అలాగే విశ్వనాధ వారు అక్షింతలు జల్లడం కూడా. అలాగే అప్పట్లో రామారావ్ గారి కారెక్టరైజేషన్ కూడా ఒక దృశ్యంలా కనిపిస్తుంది. నాకెప్పుడూ ఏమనిపిస్తుందంటే – జర్నలిస్ట్ ఒక సమాచారాన్ని అందచేసేటప్పుడు అందులో జీవత్వాన్ని కూడా నింప గలిగితే పాఠకుల హృదయాలలో అది సజీవమై నిలుస్తుంది కదా అని! ఈ వ్యాసం చదివాక ఆ లోటు తీరినట్టు అయింది.
మరో విషయం – ‘పేరులేని ఎడిటర్‌గా కొడవటిగంటి కుటుంబరావుగారు చందమామతోబాటు కినిమా మాసపత్రికకు కూడా చాలా ‘చాకిరీ’ చేశారు’, అనే వాక్యం నన్ను కాసేపు మౌనంగా ఆలోచింప చేసింది.
అనేక రకాల దోపిడీలలో ఇదీ ఒకటి అని అనుకోవాల్సి రావడం నిజంగా విషాదకరమే!
రోహిణీప్రసాద్ గారూ! మీ నాన్న గారి జ్ఞాపకాలతో మీరేదైనా పుస్తకం రాసారా? అలా ఐతే, అది మార్కెట్లో దొరికే అవకాశం వుంటుందా? వీలుంటే తెలియ చేయగలరు.
అభినందనలతో-
ఆర్.దమయంతి.
చిరునవ్వుగాది గురించి తఃతః అభిప్రాయం:
03/10/2012 10:31 am
మోహన గారూ
ధన్యవాదాలు
నమస్కారాలతొ
తఃతః
బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి Rohiniprasad అభిప్రాయం:
03/10/2012 10:10 am
రావి కొండలరావు గారికి ఈరోజు భార్యావియోగం కలిగింది. ఆయనకు సంతాపం తెలియజేశాము.
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి adviatam అభిప్రాయం:
03/09/2012 5:14 pm
చదివిన చాలా రోజుల వరకు మర్చి పోవడం కష్టం. ఏదో తృప్తి కలుగుతుంది అండి ఇలాంటి రచనలు చదివినప్పుడు.