పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. వాన-పాట గురించి C.S.Rao అభిప్రాయం:

    09/16/2007 7:56 am

    రవిశంకర్ గారి “వాన-పాట” కవితలో ఒక fluency of style ఉంది.కాబట్టి చదివిస్తుంది. చదివేప్పుడు బాగున్నట్లు అనిపిస్తుంది.అంచేత మరలా చదివిస్తుంది. అలా చదివినప్పుడు వాన,పాటలకు కవి స్పందించిన రీతి లేదా వాటికి సంబంధించి ఆయన పొందిన అనుభూతిని కవిత్వీకరించటం లో ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంది.ఈ అసంతృప్తి కి కారణమేమై ఉంటుందని ఆలోచించినప్పుడు కవితలో అంతర్గత మైన అననుసంధానానుభూతి (Ununified emotional responses ) అని నాకు అనిపించింది.అసలు కవిత ప్రారంభమే ,”వాన లో తడిసినప్పుడు/పాతగాయాలేవో సలపరించినట్లు.”ఆ పైన తన “మెత్తబడ్డ మనసుని/నిర్దయ గా మరింతగా…….” కోసే వాన అందంగా ,స్వచ్ఛంగా కురుస్తుందనటం రసవైరుధ్యానికి దారి తీసి,పాఠకుడి స్పందన లో ఒక చిన్న గందరగోళం సృష్టిస్తుంది.

    మనల బాధ పెట్టే జ్ఞాపకాలు రెండు రకాలు.
    మొదటివి: ఒకప్పుడు మనకు గొప్ప ఆనందాన్ని కలిగించిన వ్యక్తో ,లేదా పరిస్థితో ఇప్పుడు లేకపోవటం అనే వాస్తవం తాలూకు జ్ఞాపకాలు .ఈ రకమైన జ్ఞాపకాలు మరువలేనివి,మరిచిపోతే బాగుండునని అనుకోనివి, నెమరువేసుకుంటూ బాధ పడేవి,బాధ పడుతూ నెమరువేసుకుండేవి.వీనికొక శాశ్వతత్వం ఉంటుంది. ఇవి వీడనివి.
    రెండవవి: ఒకప్పుడు మనకు దారుణమైన దు:ఖాన్ని కలిగించిన వ్యక్తో ,పరిస్థితో మనకు జ్ఞాపకం వచ్చినపుడు బాధపెట్టేవి ,భయపెట్టేవి ,పీడకలలాంటివి;జ్ఞాపకం రాకుండా ఉంటే బాగుండునని అనిపించేవి.
    కవితలోని జ్ఞాపకాలు మొదటి రకమైన జ్ఞాపకాలు గా “నీ పాట” అనడం ద్వారా సూచింపబడుతున్నట్లు నేను భావిస్తున్నాను.కాబట్టి తన కంటిమీద కన్నీటి తెరలు దించే ఆ పాట ,ఒకప్పుడు తనకు గొప్ప ఆనందాన్ని కలిగించిన అనుభవమై ఇప్పుడు ఒక గాఢమైన శాశ్వతమైన శోకానుభూతిని మిగిల్చినదై ఉండాలి.
    మరి ,నీ పాట లో “తడిసినప్పుడు” అనడం,”ముగిసిన ” నీ పాటమాత్రం అనడం,”కొన్నాళ్ళ వరకు తలపుల్లో గూడు కట్టుకుని ” అనడం, కవి మీద వేదనా ప్రగాఢతను వీడని దిగులు గొలిపే బలీయమైన శాశ్వతమైన బంధాన్ని సూచించకపోవటం వల్ల పాఠకుడి మీద కవిత బలీయమైన ముద్ర వేయలేకపోతుంది.”పాట లో తడిసినప్పుడు” అనడం ,పాట లో తడవక పోవటం అనే స్థితి ఉందని,పాట లో తడవటం ఒక శాశ్వతమైన,నిరంతరమైన మానసిక స్థితి కాదని స్ఫురింప చేస్తుంది.మరలా ఇక్కడ కూడా పైన పేర్కొనబడినటువంటి రసవైరుధ్యమే ఉత్పన్నమవుతుంది.అలాకాక,పాట ముగియటం శ్రవణ సంబంధి మాత్రమే నని, మనసు ,పాట లో శాశ్వతం గా అనుక్షణం తడుస్తూనే ఉంటుందనే భావాన్ని వైరుధ్యాలు లేని విధంగా కవిత్వీకరిస్తే ,ఈ కవిత చాలా బాగుండేది.
    ఈ కవిత లో impressive imagery లేకపోలేదు. కానీ ,ఆ ఇమేజరీ వైరుధ్యాలు లేని కవి యొక్క అనుభూతుల సమూహాలను ప్రతిబింబించకపోతే, దాని నిగనిగలు మాసిపోయినట్లు కనిపిస్తవి.
    అయినా,ఈ కవిత లో ఆకర్షణ లేకపోలేదు.

    C.S.Rao

  2. అరణ్య కవితలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/16/2007 7:18 am

    డు,ము,వు,లు వంటి తెలుగు ప్రత్యయాలు లేకుండా సంస్కృత పదాలను తెలుగు వాక్యంలో రాయడం దాదాపు అసంభవం. కవిత అన్న పదాన్ని “poem” (ఒక కవితా ఖండిక) అన్న అర్థంలో ప్రయోగించడం అర్వాచీనమైనంత మాత్రాన “అరణ్యకవితలు”, “విప్లవ కవితలు”, “వచన కవితలు”- ఇవేవి దుష్టసమాసాలు అయిపోవు. ఇక సమాసం అందంగా అనిపించడంలేదన్న అభ్యంతరం మోహనరావు గారు చెప్పినట్టుగా వ్యక్తిగతం. నా మట్టుకు నాకు అంత ఎబ్బెట్టుగా లేదు. – సురేశ్.

  3. చంపకోత్పలమాలల కథ గురించి Rao Vemuri అభిప్రాయం:

    09/16/2007 7:07 am

    గ్రంధసూచిలో చూపించిన Principles of Protein Structure ఈ వ్యాసంలో ఎక్కడ, ఎలా వాడబడిందో?

  4. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి Narasimhulu అభిప్రాయం:

    09/15/2007 8:07 am

    లక్ష్మన్న గారూ,
    చాలా బాగా వ్రాసారు. చదవడానికి ఆసక్తి కరంగా ఉంది. సామాన్య మనిషికి అర్థమవ్వడానికి మీరు బ్రాకెట్లలొ ఇచ్హిన వివరణ చాలా అనుకూలంగ ఉంది.

  5. సాయము శాయరా డింభకా! గురించి sujatah Srinivas అభిప్రాయం:

    09/15/2007 7:17 am

    మన పిల్లకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు, మనకు ఆసరాగా నిలబడ్డవాళ్ళు కాకపోతే, మనోళ్ళు ఇంకెవరండీ? వాళ్ళకు సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అంతే! బావమరిది వస్తే? వుంటాడు! నవీన్ వాళ్ళు వీళ్ళకు ఎంత పెద్ద help చేశారో, చెప్పి మరీ వెళ్లాలి. నా ఉత్తమార్థభాగం సతీష్ స్థానంలో ఉంటే, airport నుండి, సరాసరి నవీన్ వాళ్ళింటికే వెళ్ళి,అక్కడ్నించి నాకు ఫోన్ చేసి, వాళ్ళ పని పూర్తి అయ్యాక ఇంటికొస్తాడు. అవసరమైతే నన్ను కూడా రమ్మంటాడు. అందుకు నేనేం అభ్యంతరం చెప్పను. నేనేదో గొప్ప చెప్తున్నాననుకోకండి! మేము USA లో ఉన్నప్పుడు, నవీన్ లాంటి అనుభవాలే మాకూ కొన్ని ఎదురయ్యాయి.కాని మేము మాత్రం, reviev గారు చెప్పినట్టు,
    సాయం చెయ్యడమే మన ధర్మం,
    మనకు అక్కరకు రావడమా, మన కర్మం..
    అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నాం! అవుతూనే ఉంటాం!

    ఎదుటి మనిషి అవసరానికో, కష్టానికో, స్పందించలేకపోతున్నామూ..అంటే, మానవత్వం నెమ్మదిగా మనలోంచి జారుకుంటోందన్నమాట! (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం)

  6. లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి poorna chand అభిప్రాయం:

    09/15/2007 5:35 am

    మంచి కథ..
    చక్కటి వర్ణన..

  7. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి #vishNubhoTla lakshmanna అభిప్రాయం:

    09/14/2007 9:06 am

    మోహన రావు కటారి గారికి:

    నా వ్యాసం నచ్చినందుకు సంతోషం! నన్ను ఈ క్రింది ఈమైల్్ ద్వారా కలవచ్చు.

    లక్ష్మన్న

    Lark_Vishnubhotla@yahoo.com

  8. ఒంటరి విహంగం గురించి Mohan Krishna అభిప్రాయం:

    09/13/2007 6:51 am

    వాస్తవమెల్లా వాంఛనీయం కాదు.
    ప్రేమ లేకుండా ఓంటరితనం పోగొట్టుకోవడం కోసం పెళ్ళి చేసుకోవడం సమంజసమంటారా? ఇదేదో యంటీఆర్, లక్ష్మీపార్వతిల విషయం గుర్తుకు తెస్తోంది.

  9. కీబోర్డ్ మీద రాగాలు గురించి Aruna Gosukonda అభిప్రాయం:

    09/13/2007 3:17 am

    Very good article anDi.
    Its very encouraging and informative.
    I went through your blog as well once.
    Hope to see few more articles from your pen.

  10. అరణ్య కవితలు గురించి Sriram అభిప్రాయం:

    09/12/2007 9:43 pm

    అరణ్యకవిత దుష్టసమాసం కాకపోవచ్చు. కానీ కవితలు అనేప్పటికి డు,ము,వు,లు ప్రధమావిభక్తి గుర్తొచ్చి తెలుగు పదం అనిపించేస్తోంది. మరి అరణ్యకవితలు కూడా దుష్టసమాసం కాదా?

    నిజానికి, అరణ్యకవిత అంటే నాకు బానే ఉంది కానీ అరణ్యకవితలు అంటే మాత్రం అందంగా అనిపించట్లేదు.