పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి mOhana అభిప్రాయం:

    07/10/2008 11:45 am

    మీ వ్యాసం బాగుంది.
    0.04 కారిలేషన్ కొయెఫిషిఎంట్ అనంగీకృతమండీ. ఒక ప్రయోగాన్ని పరిశీలనకు తీసికోవాలంటే ఇది కనీసం 0.2 నుండి 0.3 వరకు ఉండాలి. ఈ 0.2 నుండి 0.3 వరకు గల పరిమితి సుమారు మూడు స్టాండర్ద్ డీవియేషనులకు సమానము. అప్పుడే ఫలితాలను ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రారంభిస్తాము. లేకపోతే దానిని చెత్తబుట్టలో వేయాల్సిందే. అంటే అది తప్పని కాదు. కాని అది సరి అని ఒప్పుకొని ముందంజ వేయలేము. స్టాటిస్టిక్స్ అబద్ధం కాదు. దానిని సరిగా అనలైస్ చేయకపోతే అబద్ధంలాగ కనిపిస్తుంది.
    – మోహన

  2. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి అభిప్రాయం:

    07/10/2008 11:08 am

    రామకృష్ణ గారూ, ధన్యవాదాలు. ఈ వ్యాసావళిలో తరవాత రాబోయే భాగాలు చదివితే మీకు కొంత స్పష్టత వస్తుందనే ఆశిస్తాను.

    నరేంద్ర భాస్కర్ గారూ, నమస్కారాలు.
    నా వ్యాసాలు ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు. నేను ఇదివరకే చెప్పినట్టు జ్యోతిషం గురించి తొందరగా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడమో, నిర్ణయానికి రావడమో తేలిక. కొంచం లోతుగా పరిశీలించడమే కష్టం. నేనింకా చెప్పవలసినది చాలానే ఉన్నది. మిగతా భాగాలు కూడా చదవమని కోరుతున్నాను.

    మీ ఉత్సాహాన్ని భంగపరచడం నా ఉద్దేశ్యం కాదు కానీ, నేను మిథున జాతకుణ్ణి కాను – ఏ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం చూసినా సరే. జ్యోతిషంలో అంత తేలికగా ఒక విషయాన్ని నిర్ణయించడం సాధ్యం కాదని నాకు బోధపడడానికి చాలా కాలమే పట్టింది.

    ప్రశ్నించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలే గానీ ఏ తీగ లాగినా మొత్తం డొంక అంతా కదలవలసిందే. మనకున్న ప్రశ్నల పరిధిని బట్టే మనం సమాచారాన్నిసేకరించుకుంటాం, పనికివచ్చేదో పనికిరానిదో నిర్ణయించుకుంటాం. నేను మాత్రం సమాధానాల కన్నా ప్రశ్నలే ముఖ్యమని గట్టిగా నమ్ముతాను.

    మరొక్కసారి మీకు నా ధన్యవాదాలు.
    నాగమురళి.

  3. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి abhimaani అభిప్రాయం:

    07/10/2008 10:09 am

    ఎందరో మహాను భావులు ఆసువుగా పదిమంది ముందూ పాడిన కీర్తన. సర్దుబాట్లూ, కిట్టించడాలు త్యాగరాజుల వారికి అవసరం లేదనుకుంటాను. అందులో మీకు ఎక్కడ ఏ చరణం కిట్టించినట్లు అనిపించిదో చెబితే సంతోషిస్తాము.
    త్యాగరాజు ధర్మమా అని తెలుగు సాహిత్యం తమిళ నాట కూడా ఓ వెలుగు వెలిగింది. తెలుగు మరీ నేర్చుకొని సంగీత కృతులు కట్టిన వారున్నారు. త్యాగరాజ కీర్తనల్లో కూడా సాహిత్య విలువలు ఎక్కువే! “త్యాగరాజు రచనలు intensely musical గా అనిపిస్తాయి” అని రాసారు. సాహిత్య విలువలు లేవని రాసిన మీ అభిప్రాయాన్ని పెద్దలు ఒప్పరు. పైగా ముత్తు స్వామి దీక్షితార్ కీర్తనలన్నీ సంస్కృతం లో కదా? అందులో తెలుగు సాహిత్యం ఎక్కడుంది?
    త్యాగరాజు రాసిన “గ్రహబలమేమి?” అన్న కీర్తన సాహిత్యం, మాత్రా చందస్సు లో ఉంటుంది. వ్యవహారిక పదాలని ఎక్కువ భాగం సంగీతంలో అద్భుతంగా వాడిన ఘనత త్యాగరాజుదే!

    baabjeelu గారు రాసినట్లు “మన తెలుగు వాళ్ళకి, తెలుగన్నా, తెలుగు వాళ్ళన్నా చిన్నచూపు.” అందుకే త్యాగరాజు మనవాడు అన్న ఫీలింగ్ లేదు. ఇది మాత్రం సత్యం. ఎంత సేపూ పక్కింటి వాళ్ళ గోలే తప్ప మనకి మన వాళ్ళ గొప్పతనం మెచ్చుకోవడానికి మనసు రాదు.

    -అభిమాని.

  4. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి baabjeelu అభిప్రాయం:

    07/10/2008 9:02 am

    నా ఉద్దేశం అది కాదు ప్రసాదు గారూ.

    సంగీతం కోసం సాహిత్యాన్ని కిట్టించడం చాలా ఎక్కువ.
    సాహిత్యం కోసం సంగీతాన్ని స్రుష్టించడం చాలా తక్కువ. ఇప్పుడే “స్మరవారం వారం…” వింటున్నాను. పల్లవి ఎంత సులువుగా వుందో చరణాలు అంత కష్టంగా వున్నాయి.

    దయచేసి ట్రేడిషన్ ని పక్కన పెట్టి చూడండి.

    చిట్టిబాబు చెప్పినట్టు ట్రేడిషణన్ కెన్ బి బ్రోకెన్.
    తమిళ్ సంగీతం, తెలుగు సంగీతం అంటూ వేర్వేరుగా వుందా?
    మన తెలుగు వాళ్ళకి, తెలుగన్నా, తెలుగు వాళ్ళన్నా చిన్నచూపు.
    దయచేసి ఈ చివరివాక్యం మీద చర్చ వద్దు.

  5. తుపాకి గురించి సుజాత (మనసులో మాట) అభిప్రాయం:

    07/10/2008 9:00 am

    నిషి చెప్పినట్టు ఎక్కడా ఆగకుండా చదివేసాను. చదివి చాలా సేపయింది, కానీ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను! పిల్లలకు అంత వోర్పుగా చెప్పగలిగే శంకర్ లాంటి తండ్రులు ఎంతమంది కావాలి మనకి? ప్రతి ఇంట్లో!

    పిల్లలతో డీల్ చేయడం కత్తి మీద సామే! అది మాత్రం నిజం!

    మీ కథలన్నీ ఒకే చోట దొరకడం చాలా బాగుంది. మొత్తం చదివేయాలి!

  6. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నరేంద్ర భాస్కర్ S.P అభిప్రాయం:

    07/10/2008 7:47 am

    భయ్యా నమస్కారములు.

    నేను బ్లాగు లొకానికి కొత్త; జ్యోతిషం మీద తెలుగు బ్లాగు లేదెమో, మొదలెడదాం (నేనో ఔత్సాహిక జ్యోతిష్కుణ్ణి లెండి) అనుకున్నాను. మీరు రాసిన మూడు భాగాలూ ఎంతో ప్రేమతో చదివాను, చదివింతర్వాత నోరు వెళ్ళబట్టాను. ఇంత జ్ఞానం ఉండీ విస్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఉన్నారంటే, మీరు మిధున జాతకులు కామోసు. ఏది ఏమైనా ప్రశ్న అనే తీగను పట్టుకొని లాగితే ఇంత విషయం బయటకు (పనికి వచ్చిందో , పనికి రానిదో) వచ్చిందన్నమాట!

    నెనర్లు & ధన్యవాదములు
    నరేంద్ర భాస్కర్ S.P.

  7. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/10/2008 7:29 am

    పంచరత్న కీర్తనల స్వరాల్లో ఉన్న symmetry అద్భుతం. సాహిత్యం మటుకు స్వరరచన చేసిన తరవాత ‘కిట్టించినట్టుగా’ అనిపిస్తుంది. ఎందరో మహానుభావులు మొదటి స్వరకల్పన ఒక మంచి ఉదాహరణ. జగదానందకారకా వింటే సనిపమానిపా మరిసనీరిసా సనిపసాసరీ సరిసపాపనీ సనిపరీరిసా అంటూ ఒక fantastic racy pattern వినిపిస్తుంది. సాహిత్యం దానికి adjust చేసినట్టుగా ఉంటుంది.

    వినతా సుతవాహన (జయంతసేన రాగం) మొదలైన రచనల్లో స్వరాల అందమే ప్రధానం. పెద్ద విద్వాంసులు ఇంకొన్ని ఉదాహరణలు చెప్పగలరేమో. వెంటనే గుర్తుకొచ్చినవి రాశాను. ముత్తుస్వామి దీక్షితర్ తదితరులు రాసిన నవగ్రహ కీర్తనలు వగైరాల్లో మటుకు సాహిత్య వివరాలెన్నో కనిపిస్తాయి. త్యాగరాజు రచనలు intensely musical గా అనిపిస్తాయి.

  8. తడి గురించి Jyothi అభిప్రాయం:

    07/10/2008 6:58 am

    It’s a good and inspiring story. If everyone thinks that way, there won’t be any child labor. I have read ‘reader’ comments. If we rely on government, nothing is going to happen. People like author of the story should donate to street kids organisations.

  9. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి అభిమాని అభిప్రాయం:

    07/10/2008 6:31 am

    రోహిణీ గారూ,

    మీరు ” కొన్ని త్యాగరాజ కీర్తనల్లో ట్యూన్ ముందుగా చేసి తరవాత పదాలను కూర్చినట్టుగా అనిపించే ఉదాహరణలు కనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే పెద్ద వాగ్గేయకారులు కూడా కొన్ని సందర్భాల్లో సాహిత్యానికి చిన్నపీట వేశారనిపిస్తుంది.” అని రాసారు.
    దయచేసి ఆ ఉదాహరణలు చెప్ప గలరా?

    – అభిమాని

  10. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/10/2008 6:18 am

    శశాంక్ గారూ, విశ్లేషణ నచ్చినందుకు నెనర్లు. సంక్లిష్టత భాష లోనా, భావ ప్రకటనలోనా చెబితే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను.