మిగిలిన అన్ని పత్రికల్లోనూ అందరికీ అన్ని శీర్షికలూ నచ్చవు. కొన్ని పత్రిక వచ్చిన వెంటనే చదివేసి, మిగిలినవి చదివితే తరవాత చదువుతాం, లేకపోతే లేదు. ఒక్క చందమామ లోనే అన్ని కథలూ, శీర్షికలూ ఏకబిగిని చదువుతారెవరయినా. రోహిణీ ప్రసాదు గారు ముచ్చటించడం వల్ల తెలిసింది, ఏ పేజీ కా పేజీ, ఏ బొమ్మ కా బొమ్మ అద్భుతంగా వున్నా, చందమామ అద్భుతంగా వుందనిపించీది.
సీరియల్, బేతాళ కథ, రామాయణం/భారతం, తరవాత మిగిలిన కథలూ, చివరి అట్ట లోపల రెండు బొమ్మలూ, వాటికి “కేప్షన్” ఇదీ వరస. ఓ గంటలో అయిపోయేది. అయిపోయిన వెంటనే నిస్సత్తువగా అయిపోయేది, నెల ఆగాలి. అది విరహ వేదన అని అప్పట్లో తెలీదు కానీ తరవాత తెలిసింది.”.. ఓ జాబిలి, ఓ వెన్నెల ఓ మలయా నిలమా..” అని ఎప్పుడు వినిపించినా, నాకు చందమామ చదివీసి, అదొక నిస్సత్తువగా పుస్తకాన్ని మా తమ్ముడికో, చెల్లికో ఇచ్చెస్తున్న క్షణం గుర్తొస్తుంది ఇప్పటికీ.
ఇప్పటికీ గుర్తున్న ఫోటొ కేప్షన్: ట్రాఫిక్ కాన్స్టెబుల్ , బేండు మేళం, ఇవీ ఫొటోలు. కేప్షన్ రాసిన వారి పేరు గుర్తులేదు. కేప్షన్ ” సరిగపదమని, సరిగమపదని”
చందమామ ఎందుకు బావుంటుంది? నీతిని పనికట్టుకుని బోధించదు. పనికట్టుకుని మంచి కథలు చెబ్తుంది. అంత తేట తెలుగు మరో పత్రికలో కనిపించదు. హాయిగా వుంటుంది భాష.
“పాట నువు పాడు, మురళి నేనూదెద” అని కృష్ణుడి చేత పక్క వాయిద్యం వాయింపించుకున్న ( బాపు ) సినిమా సంగీత కర్త రాజేశ్వర రావు.
“ఈమాట” అదృష్టం ఏవిటంటే, మార్కెట్ బాధలు లేకపోవడం. అందుకే, ఇలాటి వ్యాసంలో, బెంగాలీ పాట, ఇంగ్లీషు పాట గురించి ప్రస్తావించగలిగేరు. ఇంకొక మంచి పాట, “హలోహలో ఓ అమ్మాయి.. “. ఒరిజినల్‌ను మించి అద్భుతంగా వుంటుంది. వే.ఆ.కృ. (V.A.K) రంగారావు గారి ఆలాపన లో రాజేశ్వర రావు గారి సేడిస్టిక్ వేషాలు గురించి ప్రస్తావన మనసుని కలుక్కుమనిపించినా, సాలూరు వారు గొప్ప పాటలు స్వరపరిచేరు, మహాత్ముడు కాదు అనుకోవాలి.
“నీ చంచల చేలాంచల విభృత స్వప్న సీమలలో/ ఏలా భయచ్చాయ జాడ/ ఏలా స్వప్నరోచిర్నీడ..”
చాలా విస్తృత పరిధిలో మీరు చేస్తున్న సమీక్ష బాగుంది. జోతిష్యం పని చెయ్యదని ఇన్ని నిరూపణలు చూపిస్తున్న మీరు మధ్యేవాదినని ఎందుకు అంటున్నారో తెలియలేదు.
మొదటి రెండు భాగాలూ అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఉన్నాయి. మూడో భాగం అంత తేలికగా లేదు. వ్యాసాల్లో కూడా పట్టు చెడకుండా కొన్ని చోట్ల హాస్యాన్ని ఉపయోగించిన తీరు చాలా బాగుంది.
సబ్జక్టు పట్ల మీకున్న ఆసక్తికి జోహార్లు. నిజాయితీగా మీ అభిప్రాయాలు పంచుకుంటున్నందుకు అభినందనలు.
పత్రికల్లో పాఠకుల జీవిత సమస్యలకి సమాధానాలిచ్చే పెద్ద జోతిష్కులెవరైనా ఈ వ్యాసాలు చదివి చర్చ జరిపితే బాగుంటుంది.
మీ వ్యాసం చాలా బాగుంది. సైన్స్ నీ, బూల్ జీవితాన్ని ఒక దాని తరువాత ఒకటి ముడివేసి మీరు చెప్పిన తీరు బాగుంది. సాధారణం గా సైన్స్ వ్యాసాలు ఆసక్తి కలిగించేలా రాయడం కష్టం. కొన్ని సైన్స్ వ్యాసాలు రెండు పేరాలు చదవగానే ముగించేలా చేస్తాయి. కానీ మీరు రాసిన తీరు బాగుంది. వెబ్ లో అనేక సైన్స్ వ్యాసాలు చదివినా ఆసక్తి కలిగేలా ఒక్కటీ ఉండవు అనిపించిన నాకు, మీ వ్యాసాలు ఆ అభిప్రాయాన్ని మార్చాయి.
కథ మాత్రము చాలా బావుంది. చాలా మంది ఈ గజిబిజి ఆలొచనలలో కొట్టుమిట్టాడుతు ఉంటారు.
Nobody can do everything.
But everyone can do something.
దీనికి నిదర్శనము లాగా ఉంది.
“చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/15/2008 9:49 pm
మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసాలను చూడవచ్చు.
– పత్రికలను ఆధునికీకరించిన జర్నలిస్టు
– జర్నలిస్ట్ గా కుటుంబరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు గురించి Srinivasarao Dasari అభిప్రాయం:
07/15/2008 9:44 pm
మీ వ్యాసం చాలా బాగుంది. ఈ వ్యాసం చాలా మందికి
ప్రేరణ కలగాలని కోరుకొంటూ…..
అభినందనలతో –
శ్రీనివాసరావు దాసరి.
“చందమామ” జ్ఞాపకాలు గురించి baabjeelu అభిప్రాయం:
07/15/2008 7:58 pm
మిగిలిన అన్ని పత్రికల్లోనూ అందరికీ అన్ని శీర్షికలూ నచ్చవు. కొన్ని పత్రిక వచ్చిన వెంటనే చదివేసి, మిగిలినవి చదివితే తరవాత చదువుతాం, లేకపోతే లేదు. ఒక్క చందమామ లోనే అన్ని కథలూ, శీర్షికలూ ఏకబిగిని చదువుతారెవరయినా. రోహిణీ ప్రసాదు గారు ముచ్చటించడం వల్ల తెలిసింది, ఏ పేజీ కా పేజీ, ఏ బొమ్మ కా బొమ్మ అద్భుతంగా వున్నా, చందమామ అద్భుతంగా వుందనిపించీది.
సీరియల్, బేతాళ కథ, రామాయణం/భారతం, తరవాత మిగిలిన కథలూ, చివరి అట్ట లోపల రెండు బొమ్మలూ, వాటికి “కేప్షన్” ఇదీ వరస. ఓ గంటలో అయిపోయేది. అయిపోయిన వెంటనే నిస్సత్తువగా అయిపోయేది, నెల ఆగాలి. అది విరహ వేదన అని అప్పట్లో తెలీదు కానీ తరవాత తెలిసింది.”.. ఓ జాబిలి, ఓ వెన్నెల ఓ మలయా నిలమా..” అని ఎప్పుడు వినిపించినా, నాకు చందమామ చదివీసి, అదొక నిస్సత్తువగా పుస్తకాన్ని మా తమ్ముడికో, చెల్లికో ఇచ్చెస్తున్న క్షణం గుర్తొస్తుంది ఇప్పటికీ.
ఇప్పటికీ గుర్తున్న ఫోటొ కేప్షన్: ట్రాఫిక్ కాన్స్టెబుల్ , బేండు మేళం, ఇవీ ఫొటోలు. కేప్షన్ రాసిన వారి పేరు గుర్తులేదు. కేప్షన్ ” సరిగపదమని, సరిగమపదని”
చందమామ ఎందుకు బావుంటుంది? నీతిని పనికట్టుకుని బోధించదు. పనికట్టుకుని మంచి కథలు చెబ్తుంది. అంత తేట తెలుగు మరో పత్రికలో కనిపించదు. హాయిగా వుంటుంది భాష.
కొన్ని మినీ కవితలు గురించి baabjeelu అభిప్రాయం:
07/15/2008 7:07 pm
అద్భుతవయిన వూహలు.
ఎంత తడి వుందో ఈ వూహల్లో.
( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి baabjeelu అభిప్రాయం:
07/15/2008 6:58 pm
“పాట నువు పాడు, మురళి నేనూదెద” అని కృష్ణుడి చేత పక్క వాయిద్యం వాయింపించుకున్న ( బాపు ) సినిమా సంగీత కర్త రాజేశ్వర రావు.
“ఈమాట” అదృష్టం ఏవిటంటే, మార్కెట్ బాధలు లేకపోవడం. అందుకే, ఇలాటి వ్యాసంలో, బెంగాలీ పాట, ఇంగ్లీషు పాట గురించి ప్రస్తావించగలిగేరు. ఇంకొక మంచి పాట, “హలోహలో ఓ అమ్మాయి.. “. ఒరిజినల్‌ను మించి అద్భుతంగా వుంటుంది. వే.ఆ.కృ. (V.A.K) రంగారావు గారి ఆలాపన లో రాజేశ్వర రావు గారి సేడిస్టిక్ వేషాలు గురించి ప్రస్తావన మనసుని కలుక్కుమనిపించినా, సాలూరు వారు గొప్ప పాటలు స్వరపరిచేరు, మహాత్ముడు కాదు అనుకోవాలి.
“నీ చంచల చేలాంచల విభృత స్వప్న సీమలలో/ ఏలా భయచ్చాయ జాడ/ ఏలా స్వప్నరోచిర్నీడ..”
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Ravi అభిప్రాయం:
07/15/2008 1:20 am
చాలా విస్తృత పరిధిలో మీరు చేస్తున్న సమీక్ష బాగుంది. జోతిష్యం పని చెయ్యదని ఇన్ని నిరూపణలు చూపిస్తున్న మీరు మధ్యేవాదినని ఎందుకు అంటున్నారో తెలియలేదు.
మొదటి రెండు భాగాలూ అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఉన్నాయి. మూడో భాగం అంత తేలికగా లేదు. వ్యాసాల్లో కూడా పట్టు చెడకుండా కొన్ని చోట్ల హాస్యాన్ని ఉపయోగించిన తీరు చాలా బాగుంది.
సబ్జక్టు పట్ల మీకున్న ఆసక్తికి జోహార్లు. నిజాయితీగా మీ అభిప్రాయాలు పంచుకుంటున్నందుకు అభినందనలు.
పత్రికల్లో పాఠకుల జీవిత సమస్యలకి సమాధానాలిచ్చే పెద్ద జోతిష్కులెవరైనా ఈ వ్యాసాలు చదివి చర్చ జరిపితే బాగుంటుంది.
రచయితలకు సూచనలు గురించి bhaavana అభిప్రాయం:
07/14/2008 11:55 pm
నిన్నటి దాకా కూనలైనట్టి భావాలు
రెక్కలు విప్పార్చుకుని ఎగురుతూన్నట్టి నేటి పద్యాలు
“ఈ మాట”విశాల నీలి గగనంలో.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
07/14/2008 11:59 am
మీ వ్యాసం చాలా బాగుంది. సైన్స్ నీ, బూల్ జీవితాన్ని ఒక దాని తరువాత ఒకటి ముడివేసి మీరు చెప్పిన తీరు బాగుంది. సాధారణం గా సైన్స్ వ్యాసాలు ఆసక్తి కలిగించేలా రాయడం కష్టం. కొన్ని సైన్స్ వ్యాసాలు రెండు పేరాలు చదవగానే ముగించేలా చేస్తాయి. కానీ మీరు రాసిన తీరు బాగుంది. వెబ్ లో అనేక సైన్స్ వ్యాసాలు చదివినా ఆసక్తి కలిగేలా ఒక్కటీ ఉండవు అనిపించిన నాకు, మీ వ్యాసాలు ఆ అభిప్రాయాన్ని మార్చాయి.
అభినందనలతో –
సాయి బ్రహ్మానందం గొర్తి
తడి గురించి Nikhitha అభిప్రాయం:
07/14/2008 4:00 am
కథ మాత్రము చాలా బావుంది. చాలా మంది ఈ గజిబిజి ఆలొచనలలో కొట్టుమిట్టాడుతు ఉంటారు.
Nobody can do everything.
But everyone can do something.
దీనికి నిదర్శనము లాగా ఉంది.
తుపాకి గురించి Reddy అభిప్రాయం:
07/13/2008 11:10 pm
9/10