పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తెలుగుదనం (not in lighter vein) గురించి Pavan Kumar Hari అభిప్రాయం:

    01/19/2009 7:53 pm

    వ్యాసం చాలా బాగుంది. అసలు పెసరట్టు వేయాలనే సంకల్పమే ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఇక పిండి రుబ్బి, వేసి, తినడం అంటారా. అబ్బో, చెప్పనే అక్కర్లేదు. ఇది నా స్వానుభవం. అయ్యా వెంకటేశ్వరరావు గారూ! మరి “ఆంధ్రమాత” గురించిన వ్యాసంతో మాకెప్పుడు విందు చేస్తారు? నాకు తెలిసి ఆంధ్రులే చెయ్యగల ఇంకొక వంటకం “చిట్టింటపొట్టు కూర”.

  2. ఈ మాసపు పాట గురించి Rajesh Kumar.D అభిప్రాయం:

    01/19/2009 4:47 am

    ఉదయకళ గారు ,
    మీరు రాసిన ఈ కథ, కథ మధ్యలో వ్రాసిన కవితలు కూడా చాల అర్థవంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నా పరిస్థితులకు చాల దగ్గరగా ఈ కథ ఉంది. ఆ కథ వ్రాసిన తీరు హృదయాన్ని హత్తుకునే విధముగా ఉంది. మీరు ఇలాంటి కథలు ఇంకెన్నో వ్రాయాలని కోరుకుంటూ,

    రాజేష్ కుమార్ దేవభక్తుని.

  3. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama అభిప్రాయం:

    01/19/2009 4:39 am

    హనుమంతరావు గారూ !!

    మీరు సాహిత్యరంగం లోపలి వారు కారు గనక, మీకు “వైతాళికులు” పుస్తకం లోని కవయిత్రులని గురించి తెలియదన్నారు. బైరాగి గురించి ఎలా మాట్లాడ గలిగేరో..రేవతీదేవి గురించి ఎలా మాట్లాడ గలిగేరో….అలాగే వైతాళికులు లోని కవయిత్రులని గురించి కూడా మీరు మాట్లాడగలరు. చైతన్యం కల్గిన పాఠకులు గనక. కాకుంటే అలా మాట్లాడాలని అనుకోవాలి ముందు.

    చాలా మందికి చావలి బంగారమ్మ గారి పేరు పరిచయం కాక పోయినా..ఆమె రాసిన బహు చక్కని కవిత్వం తెలియక పోయినా…అది సాహిత్య విమర్శకుల పొరపాటే !! దేవులపల్లి వెంకట క్రిష్ణశాస్త్రి గారి తో సరిసమానమైన ధీటైన గేయాలు రాసినవారు బంగారమ్మ గారు…”వైతాళికులు” లో!! మరి ఎంతమందికి ఆవిడ రాసిన గేయాలతో పరిచయం ఉందివాళ?? ఆమె కవితల విడి సంపుటి గురించిన ఊసైనా ఎవరికి తెలుసు?? వాటిలోని అందాలని విశ్లేషించిన వారేరీ?? పురుషుల చేతి లో ఒక అస్త్రంగా పనిచేసిన “విమర్శ” ఇలా ఎందరి స్త్రీల అద్భుత కల్పనా ప్రపంచాలని చిన్న చూపు చూసిందో తెలిసినప్పుడు కదా..విమర్శనా రంగం..ఎంత సంకుచితత్వం తో ప్రవర్తించిందీ స్పష్టపడేదీ??

    మంచి కల్పనని దర్శించవచ్చు…అందుకు మన మనసు కిటికీలు తెరుచుకోవాలి …ఏ భేద భావమూ అడ్డురాకుండా !!

    రమ.

  4. ఖాళీ సీసాలు గురించి Rajesh Kumar.D అభిప్రాయం:

    01/19/2009 1:31 am

    మొట్టమొదటగా ఈ సాహిత్యపత్రికని నడుపుతున్న వారందరికీ నా కృతజ్ఞతలు. ఇది సాహిత్య పత్రిక కబట్టి కుదిరినంత వరకు అన్ని మాటలు తెలుగులో ప్రచురిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఉదాహరణకు : –

    Hospital = వైద్యశాల
    Pants = బారు నిక్కరు

    పైన చెప్పిన విధంగా నాలాగ సాహిత్య అభిలాష ఉన్నవారు అన్ని మాటలు తెలుగులో ఉంటే తెలుసుకోవాలని లేక నేర్చుకోవాలని అనుకుంటారు కదా.

    కృతజ్ఞతలు
    Rajesh Kumar.D

    [రాజేశ్ కుమార్ గారు, మీ సూచనకు ధన్యవాదాలు. మీరు ఇంగ్లీష్ లిపిలో రాసిన తెలుగుని తెలుగు లిపిలోకి మార్చి ప్రచురిస్తున్నాము. ఇది తెలుగు సాహిత్య పత్రిక కాబట్టి మీ అభిప్రాయాలను కూడా ఇకనించి తెలుగు లిపిలోనే రాయమని కోరుతున్నాము. వివరాలకు రచయితలకు సూచనలు పేజీ చూడగలరు. -సం.]

  5. ఖాళీ సీసాలు గురించి Navuluri Venkateswara Rao అభిప్రాయం:

    01/18/2009 10:16 pm

    A very long time ago I read a novel by Emile Zola in which two poor women fight over (empty bottles?) a truffle and tear off each other’s clothes. I have forgotten its name. “Smile” may have been inspired by that novel. I have not come across any reader who has pointed it out.

  6. రాగలహరి: మోహనం గురించి K. Rohiniprasad అభిప్రాయం:

    01/18/2009 10:54 am

    ఈ శ్రు అనే విషయంలో చాలా ఏళ్ళ క్రితం నేను చేసిన పొరబాటును గురించి ఈమాట సంపాదకులకు ఎప్పుడో చెప్పాను కాని వారింకా నా పాత వ్యాసం శీర్షికను సరిదిద్దలేదు.

    [రోహిణీ ప్రసాద్ గారు, మీ వ్యాసం శీర్షికను సరిదిద్దాము. ఈమాటలో మరికొన్ని చోట్ల ఉటంకించిన “శృతి” అన్నమాటను కూడా “శ్రుతి” గా సరి దిద్దాము. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. -సం.]

  7. రాగలహరి: మోహనం గురించి Pavan Kumar Hari అభిప్రాయం:

    01/18/2009 9:39 am

    లక్ష్మన్న గారూ,
    కొంత మంది పండితుల అభిప్రాయసేకరణకు సమయం పట్టింది.
    సంస్కృతంలో ” శృతి ” అన్న పదం అసలు లేదు. ” శ్రుతి ” యే సరియైన పదము.
    “శృ” మరియు “శ్రు” – ఈ రెంటికీ ఉచ్చారణ ఒకే విధంగా ఉండదు.
    ఎందుకంటే “శృ” అనే అక్షరంలో ఒక హల్లు + ఒక అచ్చు ( శ్ + ఋ ) ఉన్నాయి. ఇది ” శ ” గుణింతములో వస్తుంది.
    కాని ” శ్రు ” లో రెండు హల్లులు, ఒక అచ్చు ఉన్నాయి ( శ్ + ర్ + ఉ ). ఇది సంయుక్తాక్షరము. కనుక దీని ఉచ్చారణ వేరు.
    మూలమైన ధాతువు ” శ్రు – శ్రవణే ” అనేది. అందులో కేవలం వర్తమాన కాలంలో ప్రయోగింపబడే రూపములు ” శృణోతి ” మొదలైన వాటిలో మాత్రమే “శృ” అనేది కనిపిస్తుంది. ఇదొక విలక్షణమైన రూపము.
    ” అమరకోశం ” లో కూడా దీనిని గురించి మంచి వివరణ ఇవ్వడం జరిగినది.
    కాబట్టి ” శ్రుతి ” అన్నదే సరియైనదని పండితుల అభిప్రాయము.
    నేనూ సంగీతాభిమానినే. ఈ విషయం ఎందుకు వ్రాశానంటే, సంగీతశాస్త్రం గురించి వ్రాసేటప్పుడు సంస్కృత వ్యాకరణశాస్త్రం కూడా ప్రధానమైనదే కదా.. అందుకని.
    అన్యథా భావించవలదని మనవి.

  8. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి అరుణ పప్పు అభిప్రాయం:

    01/18/2009 3:06 am

    ‘ఈ శిల శిలేగాని,
    ….. అనురాగం తాగి మత్తెక్కి,
    మంచులో తడిసి
    వెన్నెట్లో మెరిసి
    లలితంగా స్థిర చిత్తలోలితంగా ఈ శిల!’
    స్త్రీ జీవితాన్ని అంతందంగా, అల్పాక్షరాలలో ఆవిష్కరించడం ఎవరికి సాధ్యం?
    ‘అనురాగదగ్థ సమాధి’ వంటి అద్భుతమైన కవితల్ని అందించిన విన్నకోట రేవతీదేవికి మీరన్నట్టు లౌకికంగా రావాల్సినంత పేరు రాలేదు.. కానీ రసహృదయులైన పాఠకుల మనో ప్రపంచంలో ఆవిడ దీపంలా వెలుగుతూనే ఉంటారు. ఆమె గురించి రాసినందుకు మీకు, ఈమాటకు ధన్యవాదాలు.

  9. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి taha taha అభిప్రాయం:

    01/18/2009 1:45 am

    మనము పాఠాలు చెప్పే పద్ధతిలో, నేర్చుకునే పద్ధతిలోనూ కొడవళ్ళ హనుమంత రావు [కొహరా] గారి వ్యాస రచనా పధ్ధతిని అవలంబించాలి. అప్పుడు ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు మన సొంత ఆలోచన కొంతైనా ఉండే అవకాశం ఉంటుంది. నాకు క్రితం వారం దాకా ‘ఈమాట’ గురించి తెలియక పోవటం వల్ల నాకు చాలా నష్టం జరిగిందని అను కొంటున్నాను. చీనావాళ్ళు ఈ మధ్య కాలంలో ఆధునిక శాస్త్ర అధ్యయనంలో శాస్త్ర నిర్మాణ కౌశల్యాన్ని నేర్చుకుని, చూపిస్తున్నారు మనం ముఖ్యంగా మన బుద్ధిలేనితనం వల్ల ఈ విషయంలో చాలా అనాసక్తి చూపిస్తున్నాం కొహరా వ్యాసాల వంటివి తెలుగు లో పుంఖానుపుంఖాలుగా వచ్చి మన భావి తరాన్ని నిజమైన, నిర్మాణాత్మకమైన అధ్యయనం వైపు నడిపించాలని కోరుకుంటున్నాను

    కొహరా కు నా అభినందనా పూర్వక కృతజ్ఞతలు

  10. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    01/17/2009 9:23 pm

    క్రితం ఏడాది అక్టోబర్ లో నాటక రంగ ప్రముఖ వ్యక్తి దుగ్గిరాల సోమేశ్వరరావు 77వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో రావికొండల రావు స్వీయరచన దర్శకత్వంలో “బాంబు పేలింది” అని ఓ నాటకం వేస్తే నేను చూసాను. వయసు శరీరానికి కానీ మనసుకి కాదు అని నిరూపిస్తూ ఇరవై ఏళ్ళ వ్యక్తిలా ఎంతో ఉత్సాహంతో రావి కొండల రావూ, ఆయన సతీమణి రాధా కుమారీ నటించారు. ఇద్దరికీ నటనలో, ముఖ్యంగా హాస్యం పండించడంలో బ్రహ్మాండమైన టైమింగ్ వుంది. ఈ నాటకానికి పట్టుమని పది పుంజీల జనం కూడా లేరు. వచ్చిన వారిలో దాదాపు సగానికి పైగా దుగ్గిరాల వారి అభిమానంతో వచ్చిన వారే! ఇది చూసి పక్కనే ఉన్న నాటకరంగంలో మరో ప్రముఖ వ్యక్తి చాట్ల శ్రీరాములు గార్ని మొత్తం హైద్రబాదులో తెలుగు నాటకరంగానికి చెందిన కళాకారులెంత మందని అడిగితే, దాదాపు రెండు వేల పైగా ఉన్నారని చెప్పారు. అంతమంది ఉంటే అదేమిటి పట్టుమని పదిమంది కూడా లేరేమిటని అడిగితే, ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వులో నిరాశా, నిర్వేదం కనిపించాయి. ఆ ప్రాంగణంలో ఖాళీ కుర్చీల సంఖ్యే నాటక రంగంలో ఉన్న ఐకమత్యాన్ని చెప్పకనే చెప్పింది. హైద్రాబాదు నగరంలో ఉన్న రెండు వేలమంది కళాకారులూ రావాలని ఆశించక పోయినా, కనీసం అందులో పదో వంతుకూడా రాకపోవడం విచారించదగ్గ విషయం. నాటకం పూర్తయ్యాక నటీనటుల పరిచయ కార్యక్రమంలో పరిచయమక్కరలేని రావికొండల రావు గారికి ఓ నలుగురు అతి బలవంతమ్మీద తప్పట్లు కొట్టారు. ఈ తప్పట్ల శబ్దం పాత్రల సంఖ్య పెరిగే కొద్దీ క్షీణిస్తూ వచ్చింది. ఆఖరి నటుని పరిచయమొచ్చేసరికి ఒక్కటంటే ఒక్కటి వినిపించింది. అదీ ఆ సభకు విచ్చేసిన వారి గోలలో కలిసిపోయింది. ఇదీ నేటి నాటకరంగ పరిస్థితి. ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే, అసలు కమిట్మెంట్ లేనిది నాటక రంగంవారికని ఇలాంటి సంఘటనలు మరింత బలపరుస్తాయి. ఈ విషయంపై నేను స్పందించి రాసిన వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చింది. చాట్ల వారు ఓ పది కాపీలు తెలుగు యూనివర్శిటీ ధియేటర్ ఆఫ్ ఆర్ట్స్ కి పంపానని చెప్పారు. ఇలాంటిదే జి.ఎల్.ఎన్. మూర్తిగారు ఇవాళ ఆంధ్రజ్యోతి లో రాసిన “మంచి నాటకం ఎక్కడ?” వ్యాసంలో రాసారు.