మీరు చెప్పిన – “కథనం ద్వారానో, పాత్ర నోటినుంచో తను చెప్పదల్చుకున్న విషయం చెప్పలేకపోతే ఇక రచయితకు ఉన్న ఆఖరి మార్గం స్వయంగా వ్యాఖ్యానం చెయ్యటం. ప్రధమ పురుషలో రాసే కథల్లో ఇది సులభంగా వీలవుతుంది. వ్యాఖ్యానం కథకుడి మాటల్లోనో, లేక ఒక పాత్ర ఇలా ఆలోచిస్తుందంటూనో చెయ్యవచ్చు.” అనే పద్దతిని ఉత్తమ పురుషలో చెప్పే కధావిధానం లోకి వస్తుంది కదండీ? ఇక్కడ ప్రధమ పురుష కాదనీ నా అభిప్రాయం. ఏమంటారు?
ఇది కొంచెం సమంజసరహితంగా కనిపిస్తున్నది. నాటకంలో క్రమక్రమంగా నటి ముఖ చంద్రుడు కనిపించినట్లు ఒకే రోజున చంద్రరెఖ, అర్ధచంద్రుడు, పూర్ణ చంద్రుడు కనపడరు. సమర్ధించగలరు.
నేను చంద్రికా పరిణయం అనేకసార్లు చదివి ఆ పై వసు చరిత్ర కొన్ని సార్లు చదివాను. ఇతర పిల్ల వసు చరిత్రలు చదవలేదు కానీ నాకు సురభి మాధవ రాయుల కృతి తల్లి వసు చరిత్ర అనిపిస్తుంది. సమకాలీనులైన మాధవ రాయలు భట్టు మూర్తులలో మాధవరాయులు కవితా సౌరభంలో వినూత్న ప్రయోగాలలో పాండిత్యంలో అధికులనిపిస్తూంది. మీ విశ్లేషణ వ్యాసరూపంగా వీలైతే వెలువరించగలరు.
కామేశ్వర రావు గారూ, “క్లాసికల్” (ప్రాచీన కాదు) సాహిత్యాన్ని మీరు పరిచయం చేస్తే , తొందరగా నేస్తం కట్టెయ్యొచ్చు. ప్రాచీన సాహిత్యాన్ని సత్యనారాయణ వ్రత కథలాగానో, వినాయక వ్రత కథ లాగానో చెప్పెస్తారు సాధారణంగా. ఏదైనా ధర్మసందేహంలాటిది ధైర్యం చేసి అడిగితే, నాలుగు అక్షింతలు నెత్తి మీద వేసేసి దీవించెస్తారు కూడా. దండాలండీ.
ఈ మాట లోనే విశ్వనాధ వారి వ్యాసంలో “కాకువు” గురించి మొదటి సారిగా చదివేను. మళ్ళీ మీరూ అన్నారు. కాకువు అంటే కొంచెం వివరిస్తారూ దయచేసి.
నన్నె చోడుని కాల నిర్ణయాత్మకమైన ఈ వ్యాసం తప్పకుండా, తెలుగు సాహిత్య పరిశోధనా జగత్తుని కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఇంత లోతు పరిశోధన, నిశితమైన తార్కిక స్పూర్తి నిండీ తెలుగు సాహిత్య జగత్తు కే కొత్త వెలుగులు నింపుతుంది. తెలుగు సాహిత్య ప్రాచీనతను చాటుతూనే ఉంటుంది.
ఈమాట లాంటి వెబ్ పత్రికకి సంపాదకులయి ఉండీ మీరు, అయ్యో! గుర్తుగా పేజీ మడతపెట్టుకోవడంలో ఉన్న ఆనందం ఈ ఎలెక్ట్రానిక్ పుస్తకాలతో లేదుగదా, అని వాపోవడం వింతగా ఉంది.
ఎర్ర గుర్తు పెట్టుకున్న మీ సొంత పుస్తకాలన్నీ మీ ఇంట్లో ఉంటే, మీరు డెట్రాయిట్ వెళ్ళి సాహితీ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా అవసరమైతే ఎలా?
“Consider a future device for individual use, which is a sort of mechanized private file and library. It needs a name, and, to coin one at random, “memex” will do. A memex is a device in which an individual stores all his books, records, and communications, and which is mechanized so that it may be consulted with exceeding speed and flexibility. It is an enlarged intimate supplement to his memory.”
అని The Atlantic పత్రికలో Vannevar Bush ఓ ప్రఖ్యాత వ్యాసం, “As We May Think,” లో రాశాడు. రాసి కూడా అరవై ఏళ్ళకి పైనే అయింది. అది ఒక desk లా ఉంటుందనుకున్నాడు. అంతకన్నా సౌకర్యంగా, సంచీలో పుస్తకంలా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటే ఆనందించాల్సిన విషయమే కదా.
మీ సంపాదకీయం చదివే, NYRB లో Darnton వ్యాసమూ దానిపై జరిగిన చర్చా చదివాను. నాకర్థమైనంతవరకు గూగుల్ చేస్తున్నది మంచి పనేననిపిస్తుంది. మీరు మీ nostalgia ని కాస్త పక్కనబెట్టి, తెలుగు ప్రజలు, ప్రచురణ కర్తలు, రచయితలు, వారి వారసులు – వీళ్ళలో ఎవరికి నష్టమో ఇంకాస్త లోతుగా కాకపోయినా స్పష్టంగా వివరిస్తే బావుండేది.
మీరు రాసిన పద్యం నడక బాగుందండీ. మనముందు ప్రాచీన.. సాహిత్యం మాత్రమే ఉంది. కానీ ఆ సాహిత్యంలోని కవుల గురించి స్పష్టమైన సమాధానాలు ఇథమిథ్థంగా దొరకని సందర్భాలు ఇంకా అనేకం అలాగే ఉన్నాయి. నన్నెచోడుని గురించేనా? నాచనసోముని గురించీ చాలా విషయాలు ఇంకా తెలీవు. ఆముక్తమాల్యద కర్తృత్వమూ అలాంటిదే!! మన నమ్మకాలూ, మన ఊహలూ ఇవాళ చేసినవి మరొక ఆధారం వల్ల మళ్ళీ ఆలోచించే అవసరాన్ని కల్పించొచ్చు.కొత్త సమ స్యలు, కొత్త ప్రశ్నలూ పుడతాయి.
నిన్నా మొన్నటి విజయనగర కాలపు కవుల విషయంలోనే బోలెడన్ని సమస్యలు కాలం రీత్యా ఇంకా స్పష్టపడనివి ఉన్నాయి. అష్టదిగ్గజాలెవరో ఖచ్చితంగా ఇంకా తేలనే లేదు. 16వ శతాబ్దపు కవుల పరిస్థితే ఇలా ఉంటే అంతకు ముందు మరి ఐదు వందల ఏళ్ళ నాటి కవి నన్నెచోడుడు – అందునా ఆయన కావ్యపు ప్రతి కేవలం ఒక్కటి మాత్రమే దొరికి – ఖచ్చితమైన ఆధారం మరొహటేదీ లేని పరిస్థితి, చీకటిలో ప్రయాణం లాంటిది. ఒక్కో ఊహ ఒక్కో వెలుగుచార. కొంత ప్రయాణం ముందుకి, కొంత ప్రయాణం వెనక్కీ తప్పదు.మీ ఊహ మరో వెలుగు కాబోలు. మంచిదే!
చందస్సు ఆధారంగా మాత్రమే నిర్ణయించిన కాలాన్ని గురించి నేను ఇంకేం చెప్పను గానీ, కవిగా నన్నెచోడుడు రాజరాజే!!
సీతారామయ్య గారూ – మీరు రాసిన విధానం, మీ విశ్లేషణ బాగున్నది. అయితే రంజింపచేయటంలో కొద్దిగా వెనకపడింది అని భవదీయుడి అభిప్రాయం. మీ ఆచార్యుల వారు “కథ దేని గురించి అన్నది అనవసరం” అని అన్న మాటలు ఒక రకంగా నిజమేనేవో అనిపిస్తుంది. ఎందుకలా అనిపిస్తుంది అంటే, ఒక ఇరవైఏళ్ళ తర్వాత మనసులో నిలవకపోయినా, అప్పటికప్పుడు అంటే Instant Impulse ను కలిగించే వాటికోసం మన జనాభాలో చాలా శాతం మంది తపన పడుతూ ఉంటారు కాబట్టి…..ఉదాహరణలు బోలెడు చెప్పుకోవచ్చు. కానీ నేనన్నది మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను.
నా మటుకు నాకు, నేను పుస్తకాలు ఇష్టంగా చదవటం మొదలుపెట్టిన ఇరవయ్యేళ్ళ వయసు నుండీ మా నాన్నగారి లైబ్రరీలో ఉన్న దాదాపు అరవై, ఎనభై ఏళ్ళ క్రితం పుస్తకాలే ఇష్టం….అప్పటివాటిని ఇప్పటివారు కథల క్రింద categorize చెయ్యకపోయినా, ఆ పుస్తకాల్లోని పదార్థమే నాకు చాలా చోట్ల పిట్టకథల రూపేణా ఈనాటి కథల్లో కనపడుతూ ఉంటుంది. మరి ఆ పదార్థం అప్పటివారికి ఇంకెక్కడినుంచయినా పటికబెల్లం లాగా దొరికిందేమో అని మీరు అనవచ్చు…..:)….ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే వస్తువు ఉన్నా లేకపోయినా, ఇప్పటి కథల సరంజామా ఇప్పటి వారికి అపరంజి బొమ్మలయితే – వస్తువు లేని, కథనం లేని కథలు నాలాటి వారికి గోచీ లేని పంచెతో సమానమని, అయితే గియితే రాసే దిక్కుమాలిన వ్రాతలకి కోపం వచ్చి త్యాగరాజుల వారు తంబూరాతో తన్నగలరని, ఆ పుస్తకాలను, వ్రాతలను తగలెట్టగలరనిన్నీ……..ఇంతే సంగతులు చిత్తగించవలెను
బాబ్జీలు గారూ, కారా మేష్టారు – కొ.కు – రావిశాస్త్రి గారి స్థాయిలో కథలు రావాలి అంటే వారికున్నంత మేధ, రచనా పటిమ, సమస్యలకు స్పందించే మనసు, ఆ మనఃస్సాక్షిని అక్షరరూపంలో తీరిదిద్దే ధైర్యం ఉండాలిగా…..పైగా అందరూ “వారు” అయిపోవాలంటే “వీరు” వీరి వీరి గుమ్మడిపండులయిపోతారని మీ ఉద్దేశమా?…:)… అది అంటే , ఆ మేధ ఉంటే విరసమయినా, మురసమయినా, సరసమయినా, కరవటమయినా అడ్డుకోగలవా?
అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం. ఛందశ్శాస్త్ర పరిజ్ఞావంతో నన్నెచోడుడి కాలనిర్ణయం గావించడం అద్భుతం. ఏకభాషా పాండిత్యాలతో సాహిత్య చరిత్రలు రాయడం,తులనాత్మక పరిశీలనలు చేయడం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది,మీ పరిశోధనా ఫలితాలు చదివాక.ఇతర దాక్షిణాత్య భాషల్లో మీకున్న పట్టు మీ పరిశోధనకు ఎంతగానో ఉపకరించినట్టుంది. నాకు మీ వ్యాసం చదువుతుంటే Caldwell రచించిన Relative Antiquity of Dravidian Literature అన్న అధ్యాయం గుర్తుకొచ్చింది.అందులో,మత చరిత్ర నాధారంగా చేసుకుని తిరుక్కురళ్ కాల నిర్ణయం చేసిన వ్యాసం గుర్తుకొచ్చింది.ఉత్తరాది భాషల్లో జైన సాహిత్యం వచ్చింది నాలుగవ శతాబ్దం కాబట్టి, దక్షిణాదిన జైనం పాదుకొని స్థిరపడి రచనలు వెలువడడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టి ఉంటుంది అని సిద్ధాంతీకరించి తమిళంలో జైన యుగం (8/9 శ -12/13 శ) మధ్య వర్ధిల్లింది, అని తేల్చి, తిరుక్కురళ్ కర్త జైనుడు కాబట్టి, ఈ కాలానికి చెంది వుండాలి నిష్కర్షించి-ఇతర మతపరమైన ఆధారాల (శంకరునికి తరువాతి వాడు,శైవ/వైష్ణవ భేదాలు ముదిరి భిన్న మతాలుగా మారని కాలం..) బట్టి 10వ శతాబ్దంగా పేర్కొన్నాడు.
నన్నయ కాలాన్ని బ్రౌన్ Cyclic Tables ఆధారంగా 12 వ శతాబ్దిగా స్వీకరించాడు.(తూర్పు చాళుక్యులు శాలివాహన శకం వాడకపోవడం కొంత గందరగోళానికి దారి తీసినట్టుంది). ఐనా కూడా కొన్ని విలువైన సూచనలు చేశాడు:
” Though the Telugu literature which is now extant can not boast of a high antiquity, the language must have been cultivated and polished, and many poems that are now lost must have been written in it long prior to the twelfth century- the date of Nannaya’s translation of the Maha-bharata: for as this translation is considered ‘ the great standard of Telugu poetry ‘,it can not be supposed to have sprung into existence all at once ,without the preparation of a previous literary culture.It must have been the crowning achievement of serveral centuries of earnest work. ”
( A Comparative Grammar of the Dravidian OR South Indian family of languages ,2nd Edition Page 123. మూడవ ముద్రణలో ఈ అధ్యాయాన్ని లేపేశారు ,మన తమిళ సోదరులు, కానీ చిలుకూరి నారాయణ రావు గారి lectures పుణ్యమా అని ఈ సత్యం బయటపడింది.)
“అంతలావు మహాభారతం ఆకాశం నుండి ఊడిపడదు ,దానికి ముందు ఎన్నో శతాబ్దాల అవిరళ కృషి వుంది ;నేడు లుప్తమైనా,భారతానికి ముందు ఎన్నో కావ్యాలు వచ్చి వుండాలి” అని Caldwell అంతటివాడే సెలవిస్తుంటే ,మన వారు నన్నెచోడుని నన్నయకు తర్వాతే నిలబెట్టాలని చూస్తారు.( చూ. A History of Telugu Literature భుజంగరావు,చెంచయ్య,వీరు నన్నెచోడుడు కళావిలాసం అన్న మరో కావ్యాన్ని రచించాడని ,కానీ అది అలభ్యమని పేర్కొన్నారు,).
ఇంకో ఆసక్తికరమైన విషయం.
Indian Literature: Short Critical Surveys of 12 Major Indian Languages and Literatures By Dr. Nagendra 1959 Edn Page 70 పుస్తకం లో నన్నెచోడుని పరిచయం.
… lived about AD 940 and his Kumara Sambhava was composed long before Nannaya was born. It is beyond our comprehension …
చైనీస్ లో కూడా కన్ ఫ్యూజియస్ ముందా ,Tao Te ching రాసిన Lao Tzu ముందా అన్న గొడవ శతాబ్దాలుగా నడుస్తూనే ఉంది.ఇటీవల 168 BC నాటి సమాధిలో రెండు Tao Te Ching ప్రతులు బయటపడ్డాయి. ప్రాచీన చైనాలో ఒక వింత ఆచారం ఉంది.మరణించినచక్రవర్తుల పేర్లు కావ్యాల్లో వాడటం మీద నిషేధం ఉంది.నిషేధించిన పదాల స్థానే పర్యాయ పదాలు వాడుకోవచ్చు.దాన్ని బట్టి,కాల నిర్ణయం జరపడం పెద్ద కష్టం కాదు.ఆ రకంగా దొరికిన రెండు ప్రతుల్లో ఒక దాని కాలం 195BC గాను ,ఇంకొక ప్రతి కాలం (180-195)BC గాను తేల్చారు.
ఆర్యా! శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారూ! నమస్తే.
నవ్య కవితా సనాధుడు నాచన సోమనాధుడు అని స్పష్ఠపరచింది మీ వ్యాసం. ఈ విధమైన మీ వ్యాసాలు పద్య కావ్య పఠనాసక్తిని కలిగిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
క:-
నాచన వచో విలాసము
నే చదివితినయ్య! మీదు నేర్పును గంటిన్
జూచిన, చదివిన వారికి
మీ చరితముతోడ కవుల మెప్పును దెలియున్
కథ దేని గురించి? గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
03/09/2009 7:31 am
సీతారామయ్య గారూ,
మీరు చెప్పిన – “కథనం ద్వారానో, పాత్ర నోటినుంచో తను చెప్పదల్చుకున్న విషయం చెప్పలేకపోతే ఇక రచయితకు ఉన్న ఆఖరి మార్గం స్వయంగా వ్యాఖ్యానం చెయ్యటం. ప్రధమ పురుషలో రాసే కథల్లో ఇది సులభంగా వీలవుతుంది. వ్యాఖ్యానం కథకుడి మాటల్లోనో, లేక ఒక పాత్ర ఇలా ఆలోచిస్తుందంటూనో చెయ్యవచ్చు.” అనే పద్దతిని ఉత్తమ పురుషలో చెప్పే కధావిధానం లోకి వస్తుంది కదండీ? ఇక్కడ ప్రధమ పురుష కాదనీ నా అభిప్రాయం. ఏమంటారు?
నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి M.S.Prasad అభిప్రాయం:
03/09/2009 3:01 am
ఇది కొంచెం సమంజసరహితంగా కనిపిస్తున్నది. నాటకంలో క్రమక్రమంగా నటి ముఖ చంద్రుడు కనిపించినట్లు ఒకే రోజున చంద్రరెఖ, అర్ధచంద్రుడు, పూర్ణ చంద్రుడు కనపడరు. సమర్ధించగలరు.
నేను చంద్రికా పరిణయం అనేకసార్లు చదివి ఆ పై వసు చరిత్ర కొన్ని సార్లు చదివాను. ఇతర పిల్ల వసు చరిత్రలు చదవలేదు కానీ నాకు సురభి మాధవ రాయుల కృతి తల్లి వసు చరిత్ర అనిపిస్తుంది. సమకాలీనులైన మాధవ రాయలు భట్టు మూర్తులలో మాధవరాయులు కవితా సౌరభంలో వినూత్న ప్రయోగాలలో పాండిత్యంలో అధికులనిపిస్తూంది. మీ విశ్లేషణ వ్యాసరూపంగా వీలైతే వెలువరించగలరు.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి baabjeelu అభిప్రాయం:
03/08/2009 9:12 pm
కామేశ్వర రావు గారూ, “క్లాసికల్” (ప్రాచీన కాదు) సాహిత్యాన్ని మీరు పరిచయం చేస్తే , తొందరగా నేస్తం కట్టెయ్యొచ్చు. ప్రాచీన సాహిత్యాన్ని సత్యనారాయణ వ్రత కథలాగానో, వినాయక వ్రత కథ లాగానో చెప్పెస్తారు సాధారణంగా. ఏదైనా ధర్మసందేహంలాటిది ధైర్యం చేసి అడిగితే, నాలుగు అక్షింతలు నెత్తి మీద వేసేసి దీవించెస్తారు కూడా. దండాలండీ.
ఈ మాట లోనే విశ్వనాధ వారి వ్యాసంలో “కాకువు” గురించి మొదటి సారిగా చదివేను. మళ్ళీ మీరూ అన్నారు. కాకువు అంటే కొంచెం వివరిస్తారూ దయచేసి.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి పవన్ కుమార్ గరికపాటి అభిప్రాయం:
03/08/2009 6:29 pm
నన్నె చోడుని కాల నిర్ణయాత్మకమైన ఈ వ్యాసం తప్పకుండా, తెలుగు సాహిత్య పరిశోధనా జగత్తుని కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఇంత లోతు పరిశోధన, నిశితమైన తార్కిక స్పూర్తి నిండీ తెలుగు సాహిత్య జగత్తు కే కొత్త వెలుగులు నింపుతుంది. తెలుగు సాహిత్య ప్రాచీనతను చాటుతూనే ఉంటుంది.
పవన్ కుమార్ గరికపాటి
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/08/2009 10:55 am
వేలూరి గారికి,
ఈమాట లాంటి వెబ్ పత్రికకి సంపాదకులయి ఉండీ మీరు, అయ్యో! గుర్తుగా పేజీ మడతపెట్టుకోవడంలో ఉన్న ఆనందం ఈ ఎలెక్ట్రానిక్ పుస్తకాలతో లేదుగదా, అని వాపోవడం వింతగా ఉంది.
ఎర్ర గుర్తు పెట్టుకున్న మీ సొంత పుస్తకాలన్నీ మీ ఇంట్లో ఉంటే, మీరు డెట్రాయిట్ వెళ్ళి సాహితీ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా అవసరమైతే ఎలా?
“Consider a future device for individual use, which is a sort of mechanized private file and library. It needs a name, and, to coin one at random, “memex” will do. A memex is a device in which an individual stores all his books, records, and communications, and which is mechanized so that it may be consulted with exceeding speed and flexibility. It is an enlarged intimate supplement to his memory.”
అని The Atlantic పత్రికలో Vannevar Bush ఓ ప్రఖ్యాత వ్యాసం, “As We May Think,” లో రాశాడు. రాసి కూడా అరవై ఏళ్ళకి పైనే అయింది. అది ఒక desk లా ఉంటుందనుకున్నాడు. అంతకన్నా సౌకర్యంగా, సంచీలో పుస్తకంలా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటే ఆనందించాల్సిన విషయమే కదా.
మీ సంపాదకీయం చదివే, NYRB లో Darnton వ్యాసమూ దానిపై జరిగిన చర్చా చదివాను. నాకర్థమైనంతవరకు గూగుల్ చేస్తున్నది మంచి పనేననిపిస్తుంది. మీరు మీ nostalgia ని కాస్త పక్కనబెట్టి, తెలుగు ప్రజలు, ప్రచురణ కర్తలు, రచయితలు, వారి వారసులు – వీళ్ళలో ఎవరికి నష్టమో ఇంకాస్త లోతుగా కాకపోయినా స్పష్టంగా వివరిస్తే బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు
నన్నెచోడుని క్రౌంచపదము గురించి rama bharadwaj అభిప్రాయం:
03/08/2009 10:36 am
బెజ్జాల కృష్ణమోహన రావు గారికి,
మీరు రాసిన పద్యం నడక బాగుందండీ. మనముందు ప్రాచీన.. సాహిత్యం మాత్రమే ఉంది. కానీ ఆ సాహిత్యంలోని కవుల గురించి స్పష్టమైన సమాధానాలు ఇథమిథ్థంగా దొరకని సందర్భాలు ఇంకా అనేకం అలాగే ఉన్నాయి. నన్నెచోడుని గురించేనా? నాచనసోముని గురించీ చాలా విషయాలు ఇంకా తెలీవు. ఆముక్తమాల్యద కర్తృత్వమూ అలాంటిదే!! మన నమ్మకాలూ, మన ఊహలూ ఇవాళ చేసినవి మరొక ఆధారం వల్ల మళ్ళీ ఆలోచించే అవసరాన్ని కల్పించొచ్చు.కొత్త సమ స్యలు, కొత్త ప్రశ్నలూ పుడతాయి.
నిన్నా మొన్నటి విజయనగర కాలపు కవుల విషయంలోనే బోలెడన్ని సమస్యలు కాలం రీత్యా ఇంకా స్పష్టపడనివి ఉన్నాయి. అష్టదిగ్గజాలెవరో ఖచ్చితంగా ఇంకా తేలనే లేదు. 16వ శతాబ్దపు కవుల పరిస్థితే ఇలా ఉంటే అంతకు ముందు మరి ఐదు వందల ఏళ్ళ నాటి కవి నన్నెచోడుడు – అందునా ఆయన కావ్యపు ప్రతి కేవలం ఒక్కటి మాత్రమే దొరికి – ఖచ్చితమైన ఆధారం మరొహటేదీ లేని పరిస్థితి, చీకటిలో ప్రయాణం లాంటిది. ఒక్కో ఊహ ఒక్కో వెలుగుచార. కొంత ప్రయాణం ముందుకి, కొంత ప్రయాణం వెనక్కీ తప్పదు.మీ ఊహ మరో వెలుగు కాబోలు. మంచిదే!
చందస్సు ఆధారంగా మాత్రమే నిర్ణయించిన కాలాన్ని గురించి నేను ఇంకేం చెప్పను గానీ, కవిగా నన్నెచోడుడు రాజరాజే!!
రమ.
కథ దేని గురించి? గురించి Vamsi M Maganti అభిప్రాయం:
03/08/2009 8:03 am
సీతారామయ్య గారూ – మీరు రాసిన విధానం, మీ విశ్లేషణ బాగున్నది. అయితే రంజింపచేయటంలో కొద్దిగా వెనకపడింది అని భవదీయుడి అభిప్రాయం. మీ ఆచార్యుల వారు “కథ దేని గురించి అన్నది అనవసరం” అని అన్న మాటలు ఒక రకంగా నిజమేనేవో అనిపిస్తుంది. ఎందుకలా అనిపిస్తుంది అంటే, ఒక ఇరవైఏళ్ళ తర్వాత మనసులో నిలవకపోయినా, అప్పటికప్పుడు అంటే Instant Impulse ను కలిగించే వాటికోసం మన జనాభాలో చాలా శాతం మంది తపన పడుతూ ఉంటారు కాబట్టి…..ఉదాహరణలు బోలెడు చెప్పుకోవచ్చు. కానీ నేనన్నది మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను.
నా మటుకు నాకు, నేను పుస్తకాలు ఇష్టంగా చదవటం మొదలుపెట్టిన ఇరవయ్యేళ్ళ వయసు నుండీ మా నాన్నగారి లైబ్రరీలో ఉన్న దాదాపు అరవై, ఎనభై ఏళ్ళ క్రితం పుస్తకాలే ఇష్టం….అప్పటివాటిని ఇప్పటివారు కథల క్రింద categorize చెయ్యకపోయినా, ఆ పుస్తకాల్లోని పదార్థమే నాకు చాలా చోట్ల పిట్టకథల రూపేణా ఈనాటి కథల్లో కనపడుతూ ఉంటుంది. మరి ఆ పదార్థం అప్పటివారికి ఇంకెక్కడినుంచయినా పటికబెల్లం లాగా దొరికిందేమో అని మీరు అనవచ్చు…..:)….ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే వస్తువు ఉన్నా లేకపోయినా, ఇప్పటి కథల సరంజామా ఇప్పటి వారికి అపరంజి బొమ్మలయితే – వస్తువు లేని, కథనం లేని కథలు నాలాటి వారికి గోచీ లేని పంచెతో సమానమని, అయితే గియితే రాసే దిక్కుమాలిన వ్రాతలకి కోపం వచ్చి త్యాగరాజుల వారు తంబూరాతో తన్నగలరని, ఆ పుస్తకాలను, వ్రాతలను తగలెట్టగలరనిన్నీ……..ఇంతే సంగతులు చిత్తగించవలెను
బాబ్జీలు గారూ, కారా మేష్టారు – కొ.కు – రావిశాస్త్రి గారి స్థాయిలో కథలు రావాలి అంటే వారికున్నంత మేధ, రచనా పటిమ, సమస్యలకు స్పందించే మనసు, ఆ మనఃస్సాక్షిని అక్షరరూపంలో తీరిదిద్దే ధైర్యం ఉండాలిగా…..పైగా అందరూ “వారు” అయిపోవాలంటే “వీరు” వీరి వీరి గుమ్మడిపండులయిపోతారని మీ ఉద్దేశమా?…:)… అది అంటే , ఆ మేధ ఉంటే విరసమయినా, మురసమయినా, సరసమయినా, కరవటమయినా అడ్డుకోగలవా?
నన్నెచోడుని క్రౌంచపదము గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
03/08/2009 1:47 am
అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం. ఛందశ్శాస్త్ర పరిజ్ఞావంతో నన్నెచోడుడి కాలనిర్ణయం గావించడం అద్భుతం. ఏకభాషా పాండిత్యాలతో సాహిత్య చరిత్రలు రాయడం,తులనాత్మక పరిశీలనలు చేయడం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది,మీ పరిశోధనా ఫలితాలు చదివాక.ఇతర దాక్షిణాత్య భాషల్లో మీకున్న పట్టు మీ పరిశోధనకు ఎంతగానో ఉపకరించినట్టుంది. నాకు మీ వ్యాసం చదువుతుంటే Caldwell రచించిన Relative Antiquity of Dravidian Literature అన్న అధ్యాయం గుర్తుకొచ్చింది.అందులో,మత చరిత్ర నాధారంగా చేసుకుని తిరుక్కురళ్ కాల నిర్ణయం చేసిన వ్యాసం గుర్తుకొచ్చింది.ఉత్తరాది భాషల్లో జైన సాహిత్యం వచ్చింది నాలుగవ శతాబ్దం కాబట్టి, దక్షిణాదిన జైనం పాదుకొని స్థిరపడి రచనలు వెలువడడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టి ఉంటుంది అని సిద్ధాంతీకరించి తమిళంలో జైన యుగం (8/9 శ -12/13 శ) మధ్య వర్ధిల్లింది, అని తేల్చి, తిరుక్కురళ్ కర్త జైనుడు కాబట్టి, ఈ కాలానికి చెంది వుండాలి నిష్కర్షించి-ఇతర మతపరమైన ఆధారాల (శంకరునికి తరువాతి వాడు,శైవ/వైష్ణవ భేదాలు ముదిరి భిన్న మతాలుగా మారని కాలం..) బట్టి 10వ శతాబ్దంగా పేర్కొన్నాడు.
నన్నయ కాలాన్ని బ్రౌన్ Cyclic Tables ఆధారంగా 12 వ శతాబ్దిగా స్వీకరించాడు.(తూర్పు చాళుక్యులు శాలివాహన శకం వాడకపోవడం కొంత గందరగోళానికి దారి తీసినట్టుంది). ఐనా కూడా కొన్ని విలువైన సూచనలు చేశాడు:
” Though the Telugu literature which is now extant can not boast of a high antiquity, the language must have been cultivated and polished, and many poems that are now lost must have been written in it long prior to the twelfth century- the date of Nannaya’s translation of the Maha-bharata: for as this translation is considered ‘ the great standard of Telugu poetry ‘,it can not be supposed to have sprung into existence all at once ,without the preparation of a previous literary culture.It must have been the crowning achievement of serveral centuries of earnest work. ”
( A Comparative Grammar of the Dravidian OR South Indian family of languages ,2nd Edition Page 123. మూడవ ముద్రణలో ఈ అధ్యాయాన్ని లేపేశారు ,మన తమిళ సోదరులు, కానీ చిలుకూరి నారాయణ రావు గారి lectures పుణ్యమా అని ఈ సత్యం బయటపడింది.)
“అంతలావు మహాభారతం ఆకాశం నుండి ఊడిపడదు ,దానికి ముందు ఎన్నో శతాబ్దాల అవిరళ కృషి వుంది ;నేడు లుప్తమైనా,భారతానికి ముందు ఎన్నో కావ్యాలు వచ్చి వుండాలి” అని Caldwell అంతటివాడే సెలవిస్తుంటే ,మన వారు నన్నెచోడుని నన్నయకు తర్వాతే నిలబెట్టాలని చూస్తారు.( చూ. A History of Telugu Literature భుజంగరావు,చెంచయ్య,వీరు నన్నెచోడుడు కళావిలాసం అన్న మరో కావ్యాన్ని రచించాడని ,కానీ అది అలభ్యమని పేర్కొన్నారు,).
ఇంకో ఆసక్తికరమైన విషయం.
Indian Literature: Short Critical Surveys of 12 Major Indian Languages and Literatures By Dr. Nagendra 1959 Edn Page 70 పుస్తకం లో నన్నెచోడుని పరిచయం.
… lived about AD 940 and his Kumara Sambhava was composed long before Nannaya was born. It is beyond our comprehension …
చైనీస్ లో కూడా కన్ ఫ్యూజియస్ ముందా ,Tao Te ching రాసిన Lao Tzu ముందా అన్న గొడవ శతాబ్దాలుగా నడుస్తూనే ఉంది.ఇటీవల 168 BC నాటి సమాధిలో రెండు Tao Te Ching ప్రతులు బయటపడ్డాయి. ప్రాచీన చైనాలో ఒక వింత ఆచారం ఉంది.మరణించినచక్రవర్తుల పేర్లు కావ్యాల్లో వాడటం మీద నిషేధం ఉంది.నిషేధించిన పదాల స్థానే పర్యాయ పదాలు వాడుకోవచ్చు.దాన్ని బట్టి,కాల నిర్ణయం జరపడం పెద్ద కష్టం కాదు.ఆ రకంగా దొరికిన రెండు ప్రతుల్లో ఒక దాని కాలం 195BC గాను ,ఇంకొక ప్రతి కాలం (180-195)BC గాను తేల్చారు.
తమ్మినేని యదుకుల భూషణ్.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి chinta rama krishna rao అభిప్రాయం:
03/07/2009 8:06 pm
ఆర్యా! శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారూ! నమస్తే.
నవ్య కవితా సనాధుడు నాచన సోమనాధుడు అని స్పష్ఠపరచింది మీ వ్యాసం. ఈ విధమైన మీ వ్యాసాలు పద్య కావ్య పఠనాసక్తిని కలిగిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
క:-
నాచన వచో విలాసము
నే చదివితినయ్య! మీదు నేర్పును గంటిన్
జూచిన, చదివిన వారికి
మీ చరితముతోడ కవుల మెప్పును దెలియున్
అభినందనలు.
కొండ నుంచి కడలి దాకా గురించి Rohiniprasad అభిప్రాయం:
03/06/2009 8:40 am
ఈ ప్రోగ్రాం గురించి సందేహాలున్నవారు రజనీకాంతరావుగారి అబ్బాయి వెంకోబరావుగారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. venkobbr@yahoo.co.in