పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. రెండు ఆకాశాలు గురించి pantula jogarao అభిప్రాయం:

    11/06/2009 12:00 pm

    మిత్రమా, నీ కథ చాలా బాగు౦ది. అభిన౦దనలు. చక్కని శైలి. ఒక మంచి కథ చదివానన్న స౦తోష౦ కలిగి౦ది.

  2. అమ్మ ఉత్తరం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    11/06/2009 10:51 am

    మా ఇంట్లో ఓ పదిహేనేళ్ళ క్రితం తారాట్లాడిన పిల్లి ఎక్కడికెళ్ళిందబ్బా అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇదిగో – మీ అనుభవంలోకో, ఊహల్లోకో వచ్చి, ఈ కథలో ప్రత్యక్ష్యమయ్యింది.
    బావుంది “అమ్మ ఉత్తరం” – ఉత్తరం చివరి అనునయ వాక్యాలు రాసేందుకేనా, ఇంత కథా రాసింది, మీరు? బావుంది.

  3. అమ్మ ఉత్తరం గురించి Harita అభిప్రాయం:

    11/05/2009 5:19 am

    అమ్మ ఉత్తరం అద్భుతంగా ఉంది. ఎంతో కదిలించేలా ఉంది. ఉత్తరాల విలువ తెలియని ఈ తరం చేత చదివించాల్సిన ఉత్తరం ఇది.

  4. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    11/04/2009 8:55 pm

    ఈ కధ చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. చదువుతున్నంత సేపూ రోమ్ లో మనమున్నామా అనిపించింది. Poetic గా అనిపించింది. ఇది చదవగానే “To rome with love” సినిమా గుర్తొచ్చింది.

  5. విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/04/2009 6:28 pm

    ఈ పుస్తకాన్నీ, జనసాహితి ప్రచురించిన నా పుస్తకం జీవశాస్త్రవిజ్ఞానం- సమాజం అనే పుస్తకాన్నీ అయిదేసి డాలర్లకు అమ్మిపెట్టమని ప్రచురణకర్తలు నాకు కొన్ని కాపీలు పంపారు. నా ఈ మెయిల్‌:
    rohiniprasadk@yahoo.com

  6. విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:

    11/04/2009 5:53 pm

    [రామకృష్ణరావు గారి ఈమెయిల్ అడ్రస్ సరిదిద్దాము. తెలియచేసినందుకు ధన్యవాదాలు. –సంపాదకులు]

    చివరిలో ఇచ్చిన ఈమైలు ఐడీ తప్పులా ఉన్నది. మైల్ బవున్సు ఐనది. సరిదిద్దవలసినదిగా ప్రార్థన.

  7. విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:

    11/04/2009 5:51 pm

    నమస్కారం. ఈ పుస్తకము అమెరికాలో దొరుకుతుందా? ఇక్కడ కొనాలంటే యెలా కొనాలి, ఎవరిని సంప్రదించవలెను?

  8. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/04/2009 10:46 am

    ఈ వ్యాసం వెనక ఒక చిన్న కథ ఉంది. 2001 సంవత్సరం జూన్ నెలలో ఈ వ్యాసకర్తలం (అప్పటి ఈమాట సంపాదకులం) ముగ్గురం ఒక ఆదివారం ఒకరి ఇంట్లో పొద్దున్నే కలుసుకుని ఈ వ్యాసాన్ని ఎలా రాస్తే బాగుంటుదనే చర్చ కోసం ఒక రెండు గంటలు నడక ప్రారంభిచాం! మా ముగ్గురికీ సినిమా పాటలంటే ఇష్టమే కాక, వాటిలోని కొన్ని అంశాల్లో పరిచయం కూడా ఉన్నాయి. ఈ రెండు గంటల నడక మా చర్చలని కొంచెం వేడెక్కించిన మాట వాస్తవం. ఇప్పటి దాకా ఎవరు చూడని దృష్టితో కొత్తగా సినిమా పాటల గురించి ఏమైనా చెప్పగలమా అన్నది మా చర్చల కేంద్రబిందువు. అంతే కాకుండా ముగ్గురు తెలుగు వాళ్ళు (అందునా ప్రవాస జీవులు) కలిసి చర్చించుకొని ఒక వ్యాసం రాస్తే ఎలా ఉంటుంది? అన్నది తేల్చుకోవాలన్న ఒక సరదా కూడా ఈ వ్యాసానికి ప్రేరకమే!

    ఇప్పుడు ఈ వ్యాసం ముగ్గురు రచయితలు, అమెరికాలో మూడు రాష్ట్రాల్లో ఉంటున్నారు. మళ్ళీ ఇలాంటి రచన ఎప్పుడు సాధ్యమో తెలియదు. మరెవరన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుది.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  9. రాగలహరి: మోహనం గురించి Ramakrishna అభిప్రాయం:

    11/04/2009 9:10 am

    చాలా బాగున్నది, సంతోషం, నాకు పాటలు వ్రాయాలని ఉన్నది, కానీ తగిన సంగీత, సాహిత్యమును ఎలా నేర్చుకోగలను? సెలవు ఇవ్వగలరు.

  10. ప్రేమ కవితలు గురించి N. Rambabu అభిప్రాయం:

    11/04/2009 6:19 am

    ఈ మాటలోని కవితలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ కవితలు నాతో పాటు మిగతా పాఠకులకు కూడా ఆకట్టుకుంటున్నాయని అనుకుంటున్నాను. మరియు ఇంకా ఇలాంటి మంచి కవితలు పంపే ప్రేమికులు స్వచ్ఛంగా వాళ్ళ ప్రేమను గెలిపించుకోవాలని ఆశిస్తూ,

    రాంబాబు,
    కొండాపురం
    శ్రీకాకుళం.