పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ప్రేమ కవితలు గురించి sravan అభిప్రాయం:

    11/17/2009 5:15 am

    చాల చక్కగా ఉంది మీ కవిత.

  2. భావుకుల రచయిత కొ.కు. గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/16/2009 1:56 pm

    అందం అన్న అంశం పూర్తిగా వ్యక్తిగతమైన అభిరుచికి సంబంధించినది.
    దానిని ఇథమిథమని నిర్నయించగలగటం చాలా కష్టం. అటువంటి దాన్ని ఒక
    చర్చని చేయబూనటం అది కధలో కొ.కు చేసినా..లేదా విమర్శలో రారా బోలెడంత రాసినా కూడా రాతినించి నార తీయటమే!!

    కాళీపట్నం మాస్టారి కధ ‘నో రూమ్ ” లాంటి వాటిలోని ఆ పల్లెపడుచు అందం ఏమిటో మాస్టారు ఏమీ చెప్పరు. ఆమె భర్త సైతం చెప్పడు. అయినా వాళ్ళిద్దరూ చక్కని వాళ్ళనే మనం అనుకుంటాం!! కొ.కు శిక్షణ ప్రధానంగా మధ్యతరగతి బ్రాహ్మణ నేపధ్యం గనక ఈ అంశాలు కధలో ముఖ్యమైనవి గా
    చర్చించబడ్డాయి. రారా విమర్శలో సైతం సాహిత్య ప్రధానమైన కధల్లోని నాయికా నాయికలు అందమైన వాళ్ళన్న సంగతిని ఎక్కువగా పరిగణించడం ఆశ్చర్యం!!అలా అనుకుంటే ఎన్నో విషయాలని పోల్చాలి.అది సరైంది కాదు.
    పైగా చలంతో అఖ్ఖరలేని పోలిక కూడా ఆ విమర్శకి ఎటువంటి అదనపు ఉపయోగాన్నీ తీసుకురాలేదు.

    ఏకపక్షంగా “మార్క్సిస్ట్ ” చూపుతో_ లేని అంశాన్ని తీసుకుని బోలెడంత
    సిధ్ధాంత..రాధ్ధాంతాలు తప్ప.
    ప్రేమించుకున్న వాళ్ళ స్పందనలు అనేకమైన విషయాలకి అతీతంగా ఉంటాయన్నది వీళ్ళకి తెలియదని ఎవరం అనుకోలేము. అయినా ఈ రచ్చలెందుకంటే..శరీరాలని దాటి “హృదయ సౌందర్యం” అన్నది ముఖ్యమైనది
    అని చెప్పాలన్న ఒక రొమాంటిక్ దృష్టి!!. ఇష్టపడటంలో అనేకమైన అంశాలుంటాయి. అందులో శరీరం కూడా ముఖ్యమైనదే!! హృదయం అంతగానూ కూడా!! ఇవన్నీ మగవారి వైపునించి ఆలోచించిన సంగతులు.
    కురూపుడైన నాయకుడు..అందమైన నాయిక కధలో ఉండి..నాయకుడు గనలోకురూపి కధలోని..
    సరస్వతి స్థానంలో రసచర్చ చేస్తే అప్పుడు ఈ కధ లోని మరోకోణం బయటికి
    వచ్చేది. కానీ ఈ ప్రశ్నలు వేసుకోగల సంయమనం కొ.కు కధ లోనీ లేదు…
    రారా విమర్శలోనీ లేదు. అందువల్ల రెండూ అసమగ్రాలే!!

    రమ.

  3. అమ్మ ఉత్తరం గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి. అభిప్రాయం:

    11/15/2009 9:51 pm

    “ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోను ఎందుకు సాగవు?” ఎందుకు సాగవు? నిజవే, సాగకపోవడానికి కారణాలేవీ లేవు. ఇది బహుశా జనరేషన్ గేప్ అనుకోవచ్చేవో. పుస్తకాన్ని చేతులో పట్టుకుని చదవటంలో మనకున్న తృప్తి, ఏ డిజిటల్ స్క్రీన్ పైన చదవటంలో రాదు కదా. నా కూతురు రెండి్‌టినీ ఒకే గాటన కట్టేస్తుంది. దానికి పుస్తకవైనా, కంప్యూటర్ మానిటర్ అయినా ఒకటే. బహుశ నా కూతురి నెక్స్ట్ జనరేషన్కి పుస్తకం పురాతనం అయిపోతుందేవో!

    ఇదే మూసలో వచ్చిన చాలా కథల్లో ఇదీ ఒక కథ. ఉత్తరం అందుకుని చదవటవనేది ఒక గుర్తుగా మిగిలిన కాలంలో, ఆ గుర్తుని తిరిగి రేపే కథ. జ్నాపకాల్ని తిరిగి గుర్తుచేసే కథలేవైనా మనసుని తాకుతాయి. ఈ కథ కూడా అంతే. గడచిపోయిన వాటి మీద మిగిలిపోయిన లోభం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  4. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి mOhana అభిప్రాయం:

    11/15/2009 10:03 am

    కలఁ డుల్లోక యశః పురంధ్రి జగతిన్‌ గంధర్వ వంశంబునన్‌
    నలనాభాహ్వయుఁ డే దదీయ తనయుండన్‌ బ్రహ్మమిత్రుండు శి-
    ష్యులకున్‌ గంటను వత్తిఁ బెట్టుకొని యాయుర్వేద మోరంత ప్రొ-
    ద్దులఁ జెప్పన్‌ వినుచుండి మానసమునందుం దజ్జిఘృక్షారతిన్‌
    – మనుచరిత్రము (5.07)
    గొప్ప వంశములో జన్మించిన నలనాభుడనే పేరితో ఉండే గంధర్వుని కొడుకును నేను. ఆయుర్వేదశాస్త్రంలో విద్యానిధిలాటి వాడైన బ్రహ్మమిత్రుడు తన శిష్యులకు రేయింబవళ్ళు వైద్యవిద్యను బోధిస్తుండేవాడు. దానిని నేను వింటూ ఉండేవాడిని. నేను కూడా నేర్చుకోవాలని అనుకొని ….

    ఇది, జటిలుండు అనే వచనం మనుచరిత్రలోని పచమాశ్వాసములోనిది.

    – మోహన

  5. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    11/15/2009 1:16 am

    నాగరాజు గారూ,

    మనుచరిత్రము – పంచమాశ్వాసము – 7

    “కలడుల్లోకయశఃపురంథ్రి …”

    మనుచరిత్రము – పంచమాశ్వాసము – 19

    అని జటిలుండు హుమ్మని

    http://www.andhrabharati.com/kAvyamulu/manu/manu501.html


    శేషతల్పశాయి.

  6. అమ్మ ఉత్తరం గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/15/2009 1:05 am

    JL గారూ!!
    మీ వయసు ఎంత ఉంటుందో..నాకు తెలీదు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే..
    ఉత్తరాల అనుభవం దాటిన తరాలకి మాత్రమే వచ్చే సందేహం మీది. ఈ కధలోని అమ్మ తాలూకు పరిస్థితి నిజంగా తెలియని..అర్ధం చేసుకోలేని వాళ్ళకి
    వచ్చిన వాళ్ళ సందేహం ఇది.

    మీకు ఒక అమ్మ ఉంటే..ఆ అమ్మకి ఇవాళ్టి ఈ ఆధునిక పరికరాలు ఈ మైళ్ళూ..ఆమైళ్ళూ దాటడం రాకపోతే..ఆ అమ్మ తనలోని అనేకానేక భావాలని చెప్పుకోలేక తనలో తనే మిగిలి పోతే..అప్పుడు ఆ అమ్మ పరిస్థితిలోంచి మీరు ఈ మాటల్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేసి ఉంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నని అడగడానికి మరొక్కసారి ఆలోచించగలిగేవారు.

    అప్పుడెప్పుడో ఒకసారి పామర్తి సత్యానారాయణ గారు పుస్తకాల విషయంలో ఆధునిక్ పరిజ్నానం నేర్చుకోని రచయితలు కాలంతో వెనకబడిపోవలసిదే అన్నారు. మరి ఆధునిక పరిజ్నానం వాడటం రాని..చాతకాని..లేదా అఖ్ఖరలేని
    అమ్మలు కూడా ఆగిపోవలసిందేనని వాదన కోసమైనా ఎవరూ అనలేరు కదా!! మీరే అయినా కూడా అనలేరు కదా!!

    అందువల్ల ఈ మైళ్ళూ..టెలిఫోన్లూ..కూడా లోపల్లోపలి మనసుపొరల్లోని మమతని..ఖేదాన్నీ..చెప్పుకుందికి చాలడం లేదని గనక గమనించగలిగితే [ఇవి వాడటం తెలిసిన వారు]..ఉత్తరాలు రాసుకోడంలోని..వాటిని మనసారా
    చదువుకోవడంలోని రహస్యాన్నీ..ఆ అవసరాన్నీ కూడా గమనించగలరు.
    పాతకాలంలో చదువురాని వారు రాయడం చదవడం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని అభ్యర్ధించేవారు.[welcome to sajjanpur అన్నshyam benegal సినిమాని చూడండి వీలైతే!!] మరి ఈమైళ్ళు ఇవ్వడంరాని అమ్మలు
    ఇన్ని మనోభావాల్ని ఎవరి సహాయంతో కొడుకులకి పంపించాలీ?? అన్నది మీరు ఎందుకని ఆలోచించలేకపోయారో!! అంతా బహిరంగమే అయిన ఉమ్మడి
    కుటుంబాల కాలంనించి ఒకరూ ఇద్దరూ పిల్లల్ని పెంచి పెద్దచేసి ఒక్కళ్ళూ అయి మిగిలిన ఈ సంధి తరాల వారిని గురించీ..వారి వంటరితనాలని గురించీ ఎవరు మాట్లాడేదీ?? అలా ఆలోచించి చూడండి మీరు. ఆ అమ్మ ఆ ఉత్తరం ఎందుకని రాసిందో..ఆ ఉత్తరంలో చెప్పకనే ఏమేం చెప్పిందో మీకు మరింత స్పస్టమౌతుంది.

    రమ.

  7. ప్రశ్న గురించి Dr.M.V.V.N. Soumya అభిప్రాయం:

    11/14/2009 9:23 pm

    పెద్దవాళ్ళు సాధారణంగా పిల్లల్ని అడిగే ప్రశ్న -తెలివైన పిల్లలు అప్పుడప్పుడూ పెద్దల్ని అడిగి ఇరుకున పెట్టే ప్రశ్న. అయితె ఆ ప్రశ్నకి ఈ తండ్రి ఇచ్చిన సమాధానం గమ్మత్తుగా చాలా ఆహ్ల్లాదకరంగా ఉంది.

  8. భావుకుల రచయిత కొ.కు. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/13/2009 7:51 pm

    కొకు ప్రత్యేక సంచికలోని రచనలపై పాఠకుల అభిప్రాయాలు దాదాపు ఏమీ లేకపోటం ఆశ్చర్యంగా ఉంది. ఉదాహరణకి, ఈ వ్యాసం “రారా” విమర్శా పటిమకు నిదర్శనం. కురూపి కథను నేనూ చాలా సార్లు చదివినా, ఈ కొత్త కోణంలో కథను చూడటం కథను మళ్ళి చదివేలా చేస్తుంది. దాచి ఉంచుకోవాల్సిన వ్యాసాన్ని మళ్ళీ ప్రచురించి మంచి పని చేసారు.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  9. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి nagaraju అభిప్రాయం:

    11/13/2009 3:43 pm

    ఇందీవరాక్షుని వృత్తాంతం అని మాకు 1998 SSC లో పాఠం ఉండేది. అది మనుచరిత్ర లోనిది ఏమో? అందులో ఒక పద్యం “కలడుల్లోకయశఃపురంథ్రి …” అని.
    ఒక గద్య భాగం కూడా ఉండేది. అది “అని జటిలుండు హుమ్మని కటమ్ములదర ముకుపుటుమ్ములు నటింప గటా గటా కుటిలాత్మా యటమటమ్మున విద్య గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా యని కటకటంబడి కకపాలలోని బూదికేలంగొని యాసురి యగు మాయ మాయయెడం బ్రయోగించి వంచించి యుపహసించితివి గాన నసురవై పిసితంబును వసనంబుగా మెసవి వసుధ వసియింపుమని బసుమంబు సల్ల గుండె కల్లు వడి మునితల్లజు పదవల్లవంబులంబడి ఇట్లంటి
    నా యజ్ఞానముసైచి సంయమివరేణ్యా కావవే రాక్షసుండైయేనెట్లు భరింతువాడ….”
    అంటూ సాగుతుంది.
    అది ఏ ఆశ్వాసం లోనిదో ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలియచేయమని కోరుతున్నాను.

    ఇట్లు,
    నాగరాజు
    తప్పులు ఏమైనా ఉన్న మన్నించమని కోరిక.

  10. అమ్మ ఉత్తరం గురించి JL అభిప్రాయం:

    11/13/2009 10:02 am

    కధ చాలా బాగా రాసారు.
    “పోస్టుమేన్ చేతికి ఒక ఉత్తరం అందిస్తే ఎంత బాగుంటుందీ!”
    నిజమే!!
    కాని చివరలొ ఈ వాక్యము అవసరమా?
    ” కంప్యూటర్ యుగంలో ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య ఎంత దూరం ఏర్పడుతోందో అర్థమవుతోంది. ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోనూ, ఫోన్లలోనూ సాగవు ఎప్పటికీ. మనసు పంచి రాసుకోలేక పోతే, ఏం సంతోషంగా వుంటుందీ?”

    ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య దూరం ఎలా ఏర్పడుతోందో నాకు అర్దము కాలేదు.
    ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోను ఎందుకు సాగవు?