పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి సంచారి అభిప్రాయం:

    07/04/2010 8:42 am

    I am disturbed by the implication of KVS Ramarao that the reviewer is biased. This amounts to ascribing ulterior non-literary motives to the reviewer and a personal insult. One may disagree with the reviewer, but one can not start by questioning the honesty of the review, but none of the above comments seem to even acknowledge that the reviewer honestly spoke his mind. This is more unfortunate given the stature of people who posted these comments.

  2. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి JAGADEESHWAR అభిప్రాయం:

    07/04/2010 4:17 am

    very good

  3. ప్రేమ కవితలు గురించి JAGADEESHWAR అభిప్రాయం:

    07/04/2010 4:11 am

    చాల బాగున్నవి

  4. ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ గురించి V. Praveena Reddy అభిప్రాయం:

    07/04/2010 2:29 am

    Namasthe

    Vrayatam… vrasina dhanni edit cheyyadam manaku ekkuvaga alavatu leni vishayam. Amricalo rachayithalaku edtarlu untarani thelisinappudu….

    వ్రాయటం, వ్రాసిన దానిని ఎడిట్ చేయడ మనకు ఎక్కువగా అలవాటు లేని విషయం. అమెరికాలో రచయితలకు ఎడిటర్లు ఉంటారని తెలిసినప్పుడు.. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆలోచిస్తే 99శాతం రచనల్లో ఎడిటింగ్ అవసరమే అనిపించింది. ప్రఖ్యాతి రాగానే మన రచయితలు ఏమి రాసినా గొప్పే.. అనాల్సి వస్తోంది. అందువల్ల గొప్ప రచనలు రావడం అరుదైపోయింది. కానీ 100లో 1కింటికి ఎడిటర్ల వల్ల రచయిత ఆ రచనలో ప్రాణప్రతిష్ట చేసినా soul కి విఘాతం కలుగుతోంది. Any how, మీ సంపాదకీయం విషయబద్ధంగా ఉంది.

    Thank you.
    Request…
    Memu meku rachanalu ela pampalo thelupagalaru….
    V. Praveena Reddy
    ( writer, journalist)

    [మీ అభిప్రాయాలు దయచేసి తెలుగు లేదా ఇంగ్లీషులోనే వ్రాయండి. తెంగ్లీషు వాడకండి. ఈమాటకు రచనలు ఎలాపంపాలో సూచనల పేజీలో చూడగలరు – సం.]

  5. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/04/2010 2:04 am

    కెవీయస్ రామారావుగారూ!! ఆధునిక తెలుగు కవిత్వాన్ని గురించిన చర్చ ఎప్పుడు జరిగినా సరిగ్గా ఇలాంటి సందర్భాలే నడుస్తూ వచ్చాయి. అది ఒక లాంటి రక్షణ అకవులకి. ఎవరి కవిత్వానికి చెల్లుబాటు కాదని భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దబాయించి బతకాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక పుస్తకం అచ్చు అయ్యాకా ఆ రచయిత తన పుస్తకాన్ని భుజానికెత్తుకుని తిరిగే కార్యక్రమానికి దిగకూడదు. తానే పూనుకుని చర్చల్లో తలదూర్చడం చేయకూడదు. అలా ఎవరు చేసినా వాళ్ళకి వాళ్ళ రచనల మీద నమ్మకం లేదనే అర్ధం.

    ఇకపోతే ఇటీవల వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్న “ప్రాంతీయ – కుల -మత” చైతన్యాలు ఉత్తరోత్తరా పురోగతికి నిదర్శనమా?? తిరోగతికి నిదర్శనమా?? అన్నది సాహిత్య రంగంలో జరూరుగా చర్చ చేయాల్సిన విషయమే!! రచయితలుంటారు. కవులుంటారు. వారు ప్రభవించిన ప్రాంతాలు ఒక పార్శం మాత్రమే!! అది ఆ రచయితని గురించిన బయోగ్రఫీలో ముఖ్యమైన విషయం అవుతుందేగానీ వారి సాహిత్యానికి ఉద్దేశ్యించిన లక్ష్యాలకి.. ప్రయోజనాలకీ కాకూడదు. మంచి కవులు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కావలసిన వాళ్ళే కావాలి. రచయితలకి ప్రాంతీయ తత్వాలు ముఖ్యం కావడం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ రచయితకి ఆ ప్రాంతం వలన ఏదైనా ఆశించే ఒక ప్రయోజనం ఉంటేనే!! అలాంటి ఆశ ఉన్న ఉత్తర క్షణమే అతడిలోని మీరన్న “నిజాయితీ” చచ్చిందనే అర్ధం.

    రవికిరణ్ సవాలు నన్నయ్య నాటి నించీ ఐతే ఆనాటికి ఈ స్థితి లేదు గనక మీరన్న మాటలో ఇలాంటి అర్ధాలు రావనీ…. మీరు ఇటీవలి కాలాన్ని మాత్రమే లక్ష్యంగా మాత్లాడేరనీ అతనికి తెలియనంతటి నిగూఢమైన విషయమేమీ కాదు నిజానికి. రాజకీయ పరిభాష కి వీళ్ళంతా ఎంతగా అలవాటు పడిపోయేరంటే అది వీళ్లకి ఒక ఊత కర్ర లాంటిది. ఆ పరిభాష లేనిదే వీళ్ళు నడవలేరివాళ. అదుకే వీళ్ల ఆలోచనా పరిధీ..తద్వారా వీళ్ళ సాహిత్య పరిధీ విస్తరించలేకపోవడం.

    రమ.

  6. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/04/2010 1:32 am

    చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఇంగ్లీషు సాహిత్యలో కీట్సు , షెల్లీ ల కవిత్వాన్ని ప్రచురణకర్తలూ.. సమీక్షకులూ ఎలా నిర్లక్ష్యం చేసారో వారి జీవితకాలంలో ఆయా కవులు ఎలా నిరాదరించబడ్డారో.. వెంకటేశ్వరావుగారికి తెలియదని నేను అనుకోను. అలాంటి రివ్యూదారులు ఒకలాంటి వాళ్ళైతే మరొకరకం ..చెత్తకవిత్వాన్ని పైకెత్తుకునే రివ్యూదారులూ ..అనువాదకులూను. ఉత్తమ కవులని పక్కకు పెట్టి వారి వారి వ్యక్తిగత కారణాలకి గానూ నాసిరకం రచయితలని ముందువరసలో చూపించిన పనిని అన్ని కాలాల్లోనూ పత్రికలూ చేసాయి. విమర్శకులూ చేసారు. అనువాదకులూ చేసారు. చేస్తున్నారు.

    రమ.

  7. అ, న్యాయం గురించి Sowmya అభిప్రాయం:

    07/04/2010 1:14 am

    ఓహో…అమెరికాలో కూడా ఇంతే అన్నమాట!
    ఇంతకీ – నా సందేహం – లక్ష, లకారం – మన డబ్బుల లెక్కల్లో వాడతాం కానీ, డాలర్‌ లెక్కల్లో అసలు ‘లాక్‌’ అన్న కాన్సెప్ట్ లేదు కదా? ఉందా??

  8. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    07/04/2010 1:14 am

    రమ గారు అన్న “కట్టు కధలలోకెల్లా ముఖ్యమైనదీ తెలుగువారికి ప్రీతిపాత్రమైనదీ అయినది కృష్ణ్దరాయలే ఆముక్తమాల్యదని రాసినవాడని నమ్మడం. ఇది పెద్దన విరచితమనీ తనకి అమిత స్నేహపాత్రుడైన రాయని పేర ఈ కృతిని అల్లసాని పెద్దనే రచించి పెట్టాడనీ అనేకానేక రుజువులతో ఇదివరలో ఎన్నో చర్చలు జరిగాయి ” చాలా ఆశ్చర్యకరం. వారనే అనేకానేక ఋజువులు నాకు తెలియవు గాని ఆముక్తమాల్యద పెద్దన కృతం కాదని మాత్రం ఆధునికశాస్త్రీయంగా ఋజువు చెయ్యవచ్చు. ఈ విషయం తెలుగులో చెప్పటం కష్టం కనుక ఆంగ్లంలో వివరిస్తాను.

    Well-known statistical tool known as “hypothesis testing” has been successfully used to authenticate the authorship of several works, including some of the Shakesperean dramas and can be utilized to determine whether or not both Manucaritra and Amuktamalyada are authored by the same person. For this, one takes random samples of poems from each and counts the number of occurrences of different canonical word-roots, The hypothesis that both of these collections come from the same statistical distribution (which models the hypothesis that they both are by the same author) can be tested using one or more “standard” statistical approaches such as chi-square. My experiments with random samples have shown that the probability that they both are by the same author is extremely small and thus quite unlikely.

    సారాంశం ఏమంటే, ఆముక్తమాల్యదని రాయలు రాసినా రాయకపోయినా పెద్దన మాత్రం రాయలేదని సశాస్త్రీయంగా నిక్కచ్చిగా నిర్ణయించొచ్చు (మనుచరిత్ర రాసింది పెద్దనే అనేది నిజమైతే).

  9. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/04/2010 1:03 am

    మీరు మీ ఎన్ని ప్రకటిత అభిప్రాయాలకి ఆధారలనీ ఆకరాలనీ చూపిస్తూ రచనలు చేస్తున్నారూ వేంకటేశ్వర రావు గారూ?! ఇప్పుడు మీ ముందు నాకు తెలిసిన విశేషాలనీ వివరాలనీ రుజువులనీ సాక్ష్యాలుగా చూపించి నన్ను నేను నిరూపించుకోవాలా??<edited -ed> నాకు issue ఏమిటో non issue ఏమిటో స్పస్టంగా తెలుసు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం… ఆర్భాటాలు చేసి మీరు కితాబులు ఇచ్చినంత మాత్రానికే ఒక non poem అన్నది poem ఎప్పటికీ కాలేదు సుమా!! అని చెప్పడం. మీ సమయాన్ని బట్టీ.. మీ ఆసక్తిని బట్టీ ఇంగ్లీషు ప్రచురణకర్తల పూర్వాపరాలని వాళ్ళమీద ఉన్న విమర్శలనీ కావాలనుకుంటే మీకు మీరే తెలుసుకోలేకపోరు.

    రమ.

  10. ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ గురించి Sowmya అభిప్రాయం:

    07/04/2010 12:57 am

    🙂 మీరు ఎందుకు సంజాయిషీలు ఇస్తూ వరుసగా ఇన్ని వ్యాసాలు రాస్తున్నారండీ? అనే వాళ్ళ దోవ అనేవాళ్ళది, వినే వాళ్ళ దోవ వినే వాళ్ళది.
    (అఫ్కోర్సు..నేను ఎడిటర్ని కాను కనుక ఇలాగే అడ్డగోలుగా మాట్లాడతాను…మీ దృక్కోణం మీదనుకోండి…)