పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Sowmya అభిప్రాయం:

    02/05/2011 2:26 am

    మరి ఇండియా లో ఈ పుస్తకం దొరకదా??

  2. మరో విఫల యత్నం గురించి medavaram kanthikumar అభిప్రాయం:

    02/04/2011 4:46 am

    కథ కొంచెం లాగినట్టు అనిపించింది. కధ చివర్లొ బోరు అనిపించింది. కొన్ని సంభాషణలు నేచురల్ గా లేవు.

  3. తోడు గురించి Don అభిప్రాయం:

    02/04/2011 4:18 am

    వనజ రామారావు కన్నకూతురేనా? అనాధ అని చెప్తె సరిపోతుంది కదా?

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    02/03/2011 2:49 pm

    శ్రీనివాస్ గారూ,

    నా దగ్గర ఒక కాపీ వుంది. ముఖ్యంగా త్యాగరాజు కృతుల సాహిత్యంపై ఆయన అభిప్రాయం.
    ఈమెయిల్ చెయ్యండి. వీలుచూసుకుని స్కాన్ చేసి పంపుతాను.
    (gorthib@gmail.com)

  5. భారతీయ సాహిత్యంలో లేనిదేది లేదు గురించి Rambabu అభిప్రాయం:

    02/03/2011 8:31 am

    A Great poet. His description in novels is great. Great personality.

    How he has written the song “nidurimce tota lOki..? (he has written the song and kept it under the pillow in the Lodge room of Madras,Then he got one dream… that situation he explained in TYAGARAYA GANA SABHA in some function.Please try to send the speech.)

  6. పెండ్లి కల గురించి Avineni Bhaskar అభిప్రాయం:

    02/03/2011 2:01 am

    చాలా బాగుంది అనువాదం. చాలావరకు తమిళంలో చదివినపుడు కలిగిన భావాలే తెలుగు అనువాదమూ కలగజేస్తుంది. మోహన రావు గారు! మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను.

    ప్రచురించినందుకు నెనర్లు!

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    02/01/2011 11:56 pm

    సాయి బ్రహ్మానందం గారు తమ వ్యాఖ్యలో ప్రస్తావించిన “రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు 1968లో అన్నమయ్య పై రాసిన వ్యాస పరంపర…” ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

  8. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి narayana babu vedula అభిప్రాయం:

    02/01/2011 8:34 am

    నేను కొత్తగా తెలుగు ఈ విధంగా రాయడం వల్ల ఆలస్యం అవుతొంది. క్షమించ వలెను. రమ గారు ఇచ్చిన విష్లేషణ తో బోధ పడినది. ధన్యవాదాలు.బాలమురళి పాడిన కీర్తనలో కయి అని వుండగా విన్నాను, సందేహ నివృత్తి అయింది.

    Narayana babu Vedula.

  9. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి దయానంద్‌ అభిప్రాయం:

    01/31/2011 8:02 pm

    నమస్కారం.
    అమూల్యమైన విషయాలను ఒక్కచోట సంగ్రహంగా అందించినందులకు ధన్యవాదాలు.

    దయానంద్‌

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    01/31/2011 2:18 pm

    రమ గారూ

    పుస్తకం తీసుకొద్దామన్న ఆలోచనయితే వుంది. కానీ కార్యరూపం దాల్చడానికే అన్ని అవరోధాలూనూ! ఈమాటలో వచ్చిన వేంటనే కాస్త అత్యుత్సాహ పడ్డ మాట వాస్తవం. ముందుమాటకని ఇద్దరు పెద్దల్ని సంప్రదిస్తే ఒకాయన రాస్తా, రాస్తా అని ఒక్కోనెలా ఊరించారు. ఇంకోరు దీనికి రాయడానికేమీ లేదు, ఈ పుస్తకంలో వస్తువే చాలా పెద్దమాట అని చెప్పారు. మరొకరు సంగీతం గురించి మాకు తెలీదు, రాయలేమన్నారు.
    చివరగా వేటూరి సుందరామ్మూర్తి గారు ఇది నచ్చీ, రాస్తానని మాటిచ్చి ఓ ఆర్నెల్లు తోసారు. ఇలా ఏణ్ణర్థం సాగింది. ఇంతలో ఆయన హరి హరీ అన్నారు. ఈలోగా డిటిపి చేయిస్తే ఒకమ్మాయి రాళ్ళల్లో బియ్యం ఏరుకోండన్న చందంగా చేసిచ్చింది. అది కాదని వేరొకావిడకిస్తే ఆవిడ పెళ్ళి చేసుకోవాలంటూ, త్యాగరాజుని సగంలో వదిలేసింది. ప్రస్తుతం ఒక సీతమ్మ తల్లి చేతిలో రూపు దిద్దుకుంటోంది. ఈలోగా ఈమాటలో రాని కొత్త సంగతులు కొన్ని జోడించాను. బాలమురళి గారిని అడిగితే అసలు ప్రతి పంపమని చెప్పారు. పంపాను.

    ఇహ పబ్లిషర్లంటారా, విశాలాంధ్ర వారిది మరీ పచ్చగా వుందీ, ఎర్రగా లేదన్నారు. ఎమెస్కోవారు చదివి చెబుతామని అన్నారు. బహుశా వాళ్ళు ఒక్కో అక్షరం పట్టి పట్టి చదువుతున్నారేమో తెలీదు, ఎప్పుడడిగినా ఇంకా కాలేదనే అంటున్నారు. చివరికి నా సొంతఖర్చులపై చేయడానికే నిర్ణయించుకున్నాను.

    మే ఆరో తేదీన మా వూళ్ళో ఓ చిన్న సంగీత కచేరీలో ఈ పుస్తకావిష్కరణ చేద్దామన్న ప్రయత్నం. చూద్దాం! చిన్న ప్రశ్నకి చేటంత కథ.